Aranya Kanda Sarga 57 In Telugu – అరణ్యకాండ సప్తపంచాశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ సప్తపంచాశః సర్గః (57వ సర్గ), సీతను కనిపెట్టలేక రాముడు లక్ష్మణుడితో కలిసి అరణ్యాన్ని మరింత విస్తృతంగా పరిశీలిస్తాడు. సీత కోసం ఈ ఇద్దరూ నిరంతరంగా అన్వేషణ చేస్తారు. రాముడు తన వ్యాకులతతో, సీత లేకుండా జీవించడం అసాధ్యమని భావిస్తాడు. లక్ష్మణుడు రాముని ధైర్యం చెప్పి, సీతను కనుగొనడం కోసం మరింత కృషి చేస్తాడు. అరణ్యంలో అనేక రాక్షసులను ఎదుర్కొంటారు, కానీ సీతను కనుగొనలేరు.

రామప్రత్యాగమనమ్

రాక్షసం మృగరూపేణ చరంతం కామరూపిణమ్ |
నిహత్య రామో మారీచం తూర్ణం పథి నివర్తతే ||

1

తస్య సంత్వరమాణస్య ద్రష్టుకామస్య మైథిలీమ్ |
క్రూరస్వనోఽథ గోమాయుర్విననాదాస్య పృష్ఠతః ||

2

స తస్య స్వరమాజ్ఞాయ దారుణం రోమహర్షణమ్ |
చింతయామాస గోమాయోః స్వరేణ పరిశంకితః ||

3

అశుభం బత మన్యేఽహం గోమాయుర్వాశ్యతే యథా |
స్వస్తి స్యాదపి వైదేహ్యా రాక్షసైర్భక్షణం వినా ||

4

మారీచేన తు విజ్ఞాయ స్వరమాలంబ్య మామకమ్ |
విక్రుష్టం మృగరుపేణ లక్ష్మణః శృణుయాద్యది ||

5

స సౌమిత్రిః స్వరం శ్రుత్వా తాం చ హిత్వా చ మైథిలీమ్ |
తయైవ ప్రహితః క్షిప్రం మత్సకాశమిహైష్యతి ||

6

రాక్షసైః సహితైర్నూనం సీతాయా ఈప్సితో వధః |
కాంచనశ్చ మృగో భూత్వా వ్యపనీయాశ్రమాత్తు మామ్ ||

7

దూరం నీత్వా తు మారీచో రాక్షసోఽభూచ్ఛరాహతః |
హా లక్ష్మణ హతోఽస్మీతి యద్వాక్యం వ్యాజహార చ ||

8

అపి స్వస్తి భవేత్తాభ్యాం రహితాభ్యాం మహావనే |
జనస్థాననిమిత్తం హి కృతవైరోఽస్మి రాక్షసైః ||

9

నిమిత్తాని చ ఘోరాణి దృశ్యంతేఽద్య బహూని చ |
ఇత్యేవం చింతయన్ రామః శ్రుత్వా గోమాయునిఃస్వనమ్ ||

10

ఆత్మనశ్చాపనయనాన్ మృగరూపేణ రక్షసా |
ఆజగమ జనస్థానం రాఘవః పరిశంకితః ||

11

తం దీనమనసో దీనమాసేదుర్మృగపక్షిణః |
సవ్యం కృత్వా మహాత్మానం ఘోరాంశ్చ ససృజుః స్వరాన్ ||

12

తాని దృష్ట్వా నిమిత్తాని మహాఘోరాణి రాఘవః |
న్యవర్తతాథ త్వరితో జవేనాశ్రమమాత్మనః ||

13

స తు సీతాం వరారోహాం లక్ష్మణం చ మహాబలమ్ |
ఆజగామ జనస్థానం చింతయన్నేవ రాఘవః ||

14

తతో లక్ష్మణమాయాంతం దదర్శ విగతప్రభమ్ |
తతోఽవిదూరే రామేణ సమీయాయ స లక్ష్మణః ||

15

విషణ్ణః సువిషణ్ణేన దుఃఖితో దుఃఖభాగినా |
సంజగర్హేఽథ తం భ్రాతా జ్యేష్ఠో లక్ష్మణమాగతమ్ ||

16

విహాయ సీతాం విజనే వనే రాక్షససేవితే |
గృహీత్వా చ కరం సవ్యం లక్ష్మణం రఘునందనః ||

17

ఉవాచ మధురోదర్కమిదం పరుషమార్తిమత్ |
అహో లక్ష్మణ గర్హ్యం తే కృతం యస్త్వం విహాయ తామ్ ||

18

సీతామిహాగతః సౌమ్య కంచిత్ స్వస్తి భవేదిహ |
న మేఽస్తి సంశయో వీర సర్వథా జనకాత్మజా ||

19

వినష్టా భక్షితా వాపి రాక్షసైర్వనచారిభిః |
అశుభాన్యేవ భూయిష్ఠం యథా ప్రాదుర్భవంతి మే ||

20

అపి లక్ష్మణ సీతాయాః సామగ్ర్యం ప్రాప్నుయావహే |
జీవంత్యాః పురుషవ్యాఘ్ర సుతాయా జనకస్య వై ||

21

యథా వై మృగసంఘాశ్చ గోమాయుశ్చైవ భైరవమ్ |
వాశ్యంతే శకునాశ్చాపి ప్రదీప్తామభితో దిశమ్ |
అపి స్వస్తి భవేత్తస్యా రాజపుత్ర్యా మహాబల ||

22

ఇదం హి రక్షో మృగసన్నికాశం
ప్రలోభ్య మాం దూరమనుప్రయాతమ్ |
హతం కథంచిన్మహతా శ్రమేణ
స రాక్షసోఽభూన్మ్రియమాణ ఏవ ||

23

మనశ్చ మే దీనమిహాప్రహృష్టం
చక్షుశ్చ సవ్యం కురుతే వికారమ్ |
అసంశయం లక్ష్మణ నాస్తి సీతా
హృతా మృతా వా పథి వర్తతే వా ||

24

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే సప్తపంచాశః సర్గః ||

Aranya Kanda Sarga 57 Meaning In Telugu PDF

లంకలో సీత పరిస్థితి ఇలాఉంటే, అక్కడ అరణ్యములో మారీచుని చంపిన రాముడు, వెనక్కు తిరిగి పర్ణశాలకు వస్తున్నాడు. అప్పుడు రామునికి నక్కకూత వికృతంగా వినిపించింది. అపశకున సూచకమైన ఆ నక్కకూత విని రాముడు మనసులో కీడు శంకించాడు. సీతకు లక్ష్మణునికి ఏదైనా ఆపద కలిగిందేమో అని భయపడ్డాడు. అప్పుడు మారీచుడు తన గొంతును అనుకరిస్తూ సీతా లక్ష్మణా అని అరిచిన అరుపులు గుర్తుకు వచ్చాయి రామునికి.

“అయ్యో! ఆ అరుపులు నావి అనుకొని, నాకేమైనా ఆపద కలిగిందని శంకించి, సీత లక్ష్మణుని నా రక్షణ కొరకు పంపలేదు కదా! ఆ సమయంలో రాక్షసులు సీతకు ఏమైనా అపాయము తలపెట్టారో ఏమో! అవును ఇప్పుడు అంతా అర్థం అయింది. ఇది రాక్షసులు మాయోపాయమే. మారీచుడు మాయలేడి రూపం ధరించి నన్ను ఆశ్రమానికి దూరంగా తీసుకొని వెళ్లాడు. నేను మారీచుని కొట్టినపుడు హా సీతా! హా లక్ష్మణా! అని అరిచాడు. సీత తప్పకుండా లక్ష్మణుని నా రక్షణ కోసం పంపి ఉంటుంది.

నేను, లక్ష్మణుడు, దగ్గర లేని సమయంలో సీత క్షేమంగా ఉంటుందా! అసలే ఈ జనస్థానములో ఉన్న రాక్షసులతో నాకు విరోధము ఉంది. ఆ విరోధమును మనసులో పెట్టుకొని రాక్షసులు సీతకు ఏమైనా అపాయం తలపెట్టారో ఏమో!దానికి తోడు అప శకునములు కూడా కనపడుతున్నాయి.” ఈ విధంగా ఆలోచిస్తూ రాముడు ఆశ్రమం వైపు వడి వడిగా వస్తున్నాడు.

ఎంత కాదనుకున్నా రాముని మనస్సు సీత గురించి లక్ష్మణుని గురించి వారి క్షేమం గురించి ఆలోచిస్తూ ఉంది. ఇంతలో తనను వెదుక్కుంటూ వస్తున్న లక్ష్మణుడు కనిపించాడు. లక్ష్మణుని చూడగానే రాముడికి కోపం వచ్చింది. దానితో పాటు దుఃఖం కూడా వచ్చింది. లక్ష్మణుని చేతులుపట్టుకొని ఇలా అన్నాడు.

“నేను నిన్ను సీతకు రక్షణగా ఆశ్రమంలో ఉండమన్నాను. కానీ నీవు సీతను ఒంటరిగా ఆశ్రమంలో విడిచి వచ్చావు. అలా ఎందుకు చేసావు. ఇంకా సీత క్షేమంగా ఉందంటావా? లక్ష్మణా! నాకు అన్నీ అపశకునములు కనపడుతున్నాయి. సీత గురించి నా మనసంతా ఆందోళన చెందుతూ ఉంది. వీటిని బట్టి చూస్తే సీతకు ఏదో ఆపద కలిగి ఉంటుంది. లేదా సీత సంహరింపబడి ఉంటుంది. రాక్షసులు ఆమెను భక్షించి ఉంటారు. ఇందులో సందేహం ఉండటానికి వీలు లేదు.

లక్ష్మణా! మనము మరలా సీతను ప్రాణాలతో చూడగలము అంటావా! ఆ మృగాల అరుపులు, నక్కల కూతలు వింటుంటే సీత క్షేమం మీద అనుమానం కలుగుతూ ఉంది.

అసలు జరిగిందేమిటంటే, సీత ఆ మృగము కావాలని కోరిన తరువాత నేను ఆ మృగమును వెంబడించాను. ఆ మృగాన్ని నా బాణంతో కొట్టాను. నా బాణం తగిలిన ఆ మృగం పెద్దరాక్షసునిగా మారిపోయింది. అప్పుడు అర్థం అయింది అది రాక్షస మాయ అని. అందుకే అంటున్నాను.

ఆశ్రమంలో సీత క్షేమంగా ఉండదు. ఆమెను ఎవరన్నా అపహరించి ఉండాలి. లేక ఆమెను రాక్షసులు చంపి ఉండాలి. ఒక వేళ ఆమెను ఏ రాక్షసుడైనా అపహరించి ఉంటే, ఎంతో దూరం వెళ్లి ఉ డరు. మార్గ మధ్యంలోనే ఉంటారు.” అని రాముడు తనలో తాను అనుకుంటూ వడి వడిగా పర్ణశాల వంక వస్తున్నాడు. అక్ష్మణుడు రాముని అనుసరించి వస్తున్నాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ అష్టపంచాశః సర్గః (58) >>

Leave a Comment