Aranya Kanda Sarga 60 In Telugu – అరణ్యకాండ షష్టితమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ షష్టితమః సర్గం రామాయణంలోని అరణ్యకాండలో 60వ అధ్యాయం. ఈ సర్గలో రాముడు, సీత, లక్ష్మణులు పంచవటిలో ఉంటారు. రావణుడు మారీచుడి సహాయంతో సీతను అపహరించడానికి కుట్ర పన్నుతాడు. మారీచుడు మాయామృగం రూపంలో వచ్చి, సీతను ఆకర్షిస్తాడు. సీత ఆ మృగాన్ని పట్టుకోవాలనడంతో, రాముడు దాన్ని వెంబడించడానికి వెళ్ళిపోతాడు. రాముడు వెళ్ళిపోయిన తర్వాత, రావణుడు బ్రాహ్మణుడి వేషంలో వచ్చి సీతను అపహరిస్తాడు.

రామోన్మాదః

భృశమావ్రజమానస్య తస్యాధోవామలోచనమ్ |
ప్రాస్ఫురచ్చాస్ఖలద్రామో వేపథుశ్చాప్యజాయత ||

1

ఉపాలక్ష్య నిమిత్తాని సోఽశుభాని ముహుర్ముహుః |
అపి క్షేమం ను సీతాయా ఇతి వై వ్యాజహార చ ||

2

త్వరమాణో జగామాథ సీతాదర్శనలాలసః |
శూన్యమావసథం దృష్ట్వా బభూవోద్విగ్నమానసః ||

3

ఉద్భ్రమన్నివ వేగేన విక్షిపన్ రఘునందనః |
తత్ర తత్రోటజస్థానమభివీక్ష్య సమంతతః ||

4

దదర్శ పర్ణశాలాం చ రహితాం సీతయా తదా |
శ్రియా విరహితాం ధ్వస్తాం హేమంతే పద్మినీమీవ ||

5

రుదంతమివ వృక్షైశ్చ మ్లానపుష్పమృగద్విజమ్ |
శ్రియా విహీనం విధ్వస్తం సంత్యక్తవనదేవతమ్ ||

6

విప్రకీర్ణాజినకుశం విప్రవిద్ధబృసీకటమ్ |
దృష్ట్వా శూన్యం నిజస్థానం విలలాప పునః పునః ||

7

హృతా మృతా వా నష్టా వా భక్షితా వా భవిష్యతి |
నిలీనాప్యథవా భీరురథవా వనమాశ్రితా ||

8

గతా విచేతుం పుష్పాణి ఫలాన్యపి చ వా పునః |
అథవా పద్మినీం యాతా జలార్థం వా నదీం గతా ||

9

యత్నాన్మృగయమాణస్తు నాససాద వనే ప్రియామ్ |
శోకరక్తేక్షణః శోకాదున్మత్త ఇవ లక్ష్యతే ||

10

వృక్షాద్వృక్షం ప్రధావన్ స గిరేశ్చాద్రిం నదాన్నదీమ్ |
బభూవ విలపన్ రామః శోకపంకార్ణవాప్లుతః ||

11

అపి కచ్చిత్త్వయా దృష్టా సా కదంబప్రియా ప్రియా |
కదంబ యది జానీషే శంస సీతాం శుభాననామ్ ||

12

స్నిగ్ధపల్లవసంకాశా పీతకౌశేయవాసినీ |
శంసస్వ యది వా దృష్టా బిల్వ బిల్వోపమస్తనీ ||

13

అథవాఽర్జున శంస త్వం ప్రియాం తామర్జునప్రియామ్ |
జనకస్య సుతా భీరుర్యది జీవతి వా న వా ||

14

కకుభః కకుభోరూం తాం వ్యక్తం జానాతి మైథిలీమ్ |
యథా పల్లవపుష్పాఢ్యో భాతి హ్యేష వనస్పతిః ||

15

భ్రమరైరుపగీతశ్చ యథా ద్రుమవరో హ్యయమ్ |
ఏష వ్యక్తం విజానాతి తిలకస్తిలకప్రియామ్ ||

16

అశోక శోకాపనుద శోకోపహతచేతసమ్ |
త్వన్నామానం కురు క్షిప్రం ప్రియాసందర్శనేన మామ్ ||

17

యది తాల త్వయా దృష్టా పక్వతాలఫలస్తనీ |
కథయస్వ వరారోహాం కారుణ్యం యది తే మయి ||

18

యది దృష్టా త్వయా సీతా జంబు జంబూనదప్రభా | [-ఫలోపమామ్]
ప్రియాం యది విజానీషే నిఃశంకం కథయస్వ మే ||

19

అహో త్వం కర్ణికారాద్య సుపుష్పైః శోభసే భృశమ్ |
కర్ణికారప్రియా సాధ్వీ శంస దృష్టా ప్రియా యది ||

20

చూతనీపమహాసాలాన్ పనసాన్ కురవాన్ ధవాన్ |
దాడిమానసనాన్ గత్వా దృష్ట్వా రామో మహాయశాః ||

21

మల్లికా మాధవీశ్చైవ చంపకాన్ కేతకీస్తథా |
పృచ్ఛన్ రామో వనే భ్రాంత ఉన్మత్త ఇవ లక్ష్యతే ||

22

అథవా మృగశాబాక్షీం మృగ జానాసి మైథిలీమ్ |
మృగవిప్రేక్షణీ కాంతా మృగీభిః సహితా భవేత్ ||

23

గజ సా గజనాసోరూర్యది దృష్టా త్వయా భవేత్ |
తాం మన్యే విదితాం తుభ్యమాఖ్యాహి వరవారణ ||

24

శార్దూల యది సా దృష్టా ప్రియా చంద్రనిభాననా |
మైథిలీ మమ విస్రబ్ధం కథయస్వ న తే భయమ్ ||

25

కిం ధావసి ప్రియే దూరం దృష్టాఽసి కమలేక్షణే |
వృక్షైరాచ్ఛాద్య చాత్మానం కిం మాం న ప్రతిభాషసే ||

26

తిష్ఠ తిష్ఠ వరారోహే న తేఽస్తి కరుణా మయి |
నాత్యర్థం హాస్యశీలాఽసి కిమర్థం మాముపేక్షసే ||

27

పీతకౌశేయకేనాసి సూచితా వరవర్ణిని |
ధావంత్యపి మయా దృష్టా తిష్ఠ యద్యస్తి సౌహృదమ్ ||

28

నైవ సా నూనమథవా హింసితా చారుహాసినీ |
కృచ్ఛ్రం ప్రాప్తం న మాం నూనం యథోపేక్షితుమర్హతి ||

29

వ్యక్తం సా భక్షితా బాలా రాక్షసైః పిశితాశనైః |
విభజ్యాంగాని సర్వాణి మయా విరహితా ప్రియా ||

30

నూనం తచ్ఛుభదంతోష్ఠం సునాసం చారుకుండలమ్ |
పూర్ణచంద్రమివ గ్రస్తం ముఖం నిష్ప్రభతాం గతమ్ ||

31

సా హి చంపకవర్ణాభా గ్రీవా గ్రైవేయశోభితా |
కోమలా విలపంత్యాస్తు కాంతాయా భక్షితా శుభా ||

32

నూనం విక్షిప్యమాణౌ తౌ బాహూ పల్లవకోమలౌ |
భక్షితౌ వేపమానాగ్రౌ సహస్తాభరణాంగదౌ ||

33

మయా విరహితా బాలా రక్షసాం భక్షణాయ వై |
సార్థేనేవ పరిత్యక్తా భక్షితా బహుబాంధవా ||

34

హా లక్ష్మణ మహాబాహో పశ్యసి త్వం ప్రియాం క్వచిత్ |
హా ప్రియే క్వ గతా భద్రే హా సీతేతి పునః పునః ||

35

ఇత్యేవం విలపన్రామః పరిధావన్వనాద్వనమ్ |
క్వచిదుద్భ్రమతే వేగాత్ క్వచిద్విభ్రమతే బలాత్ ||

36

క్వచిన్మత్త ఇవాభాతి కాంతాన్వేషణతత్పరః |
స వనాని నదీః శైలాన్ గిరిప్రస్రవణాని చ |
కాననాని చ వేగేన భ్రమత్యపరిసంస్థితః ||

37

తథా స గత్వా విపులం మహద్వనం
పరీత్య సర్వం త్వథ మైథిలీం ప్రతి |
అనిష్ఠితాశః స చకార మార్గణే
పునః ప్రియాయాః పరమం పరిశ్రమమ్ ||

38

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే షష్టితమః సర్గః ||

Aranya Kanda Sarga 60 Meaning In Telugu PDF

రాముడు సీత కోసం పిచ్చిగా పర్ణశాల అంతా తిరుగు తున్నాడు పరిసరాలు వెతికిన చోటనే వెతుకుతున్నాడు. సీత ఎక్కడన్నా దొరక్కపోతుందా అనే కొన ఆశతో వెదుకుతున్నాడు. సీత నిలబడ్డ చోటు, సీత కూర్చున్న చోటు, సీత వాడిన దర్భాసనము, వీటిని చూచి భోరున విలపిస్తున్నాడు.

“నాసీతను రాక్షసులు పీక్కుతిని ఉంటారు. లేదా రాక్షసులను చూచి సీత మరణించి ఉంటుంది. లేక సీతను ఎవరైనా అపహరించి ఉంటారు. లేక సీత నన్ను వెదుక్కుంటూ అరణ్యంలో దారి తప్పిపోయి ఉంటుంది. లేక సీత నన్ను ఆట పట్టించడానికి ఎక్కడైనా దాక్కుని ఉంటుంది. లేదా పుష్పములు ఫలములు తీసుకురావడానికి ఆడవిలోకి వెళ్లి ఉంటుందేమో! సీతకు తామర పూలుఅంటే ఇష్టం. వాటిని కోయడానికి సరస్సు వద్దకు వెళ్ళిందేమో, లేక సీత నీరు తీసుకురావడానికి గోదావరి తీరాననికివెళ్లి ఉంటుందా!” ఇలా పరి పరి విధములుగా ఆలోచిస్తూ ఆ ప్రాంతం అంటా కలయ తిరుగుతున్నాడు రాముడు.

ఒక చెట్టు దగ్గర నుండి మరొక చెట్టు వద్దకు, ఒక కొండ నుండి మరొక కొండవద్దకు, ఒక కాలువనుండి మరొక కాలువ వద్దకు తిరుగుతున్నాడు. పొదలు, పుట్టలు గుట్టలు వెదుకుతున్నాడు. చెట్లను అడుగుతున్నాడు. సీతకు ఇష్టమైనపూలమొక్కలను అడుగుతున్నాడు. పూలను అడుగుతున్నాడు. పిచ్చివాడి వలె వాటితో మాట్లాడుతున్నాడు. ఏడుస్తున్నాడు.

చెట్లు, పుట్టలు, మొక్కలు అయిపోయిన తరువాత అక్కడ ఉన్న సీత పెంపుడు జంతువులను అడుగుతున్నాడు. జింకలను, ఏనుగులను అడుగుతున్నాడు. తరువాత సీత తనకళ్ల ఎదురుగాఉన్నట్టు ఊహించు కుంటూ తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. సీత పరుగెత్తుతున్నట్టు ఊహించుకుంటూ ఆమెను ఆగమని అరుస్తున్నాడు. అంతలోనే నిరాశ. సీతను ఎవరో చంపేసి ఉంటారు అని కుమిలిపోతున్నాడు. రాక్షసులు ఆమెను చంపేటప్పుడు, గొంతునులిమే టప్పుడు సీత ఎలా బాధపడి ఉంటుందో తలచుకుంటూ ఏడుస్తున్నాడు. “సీతను నేను రాక్షసులకు ఆహారంగా వదిలి వెళ్లినట్టున్నాను.” అని అనుకుంటూ కుమిలి పోతున్నాడు.

లక్ష్మణునిపట్టుకొని “లక్ష్మణా! సీతనీకు ఎక్కడైనా కనిపించిందా” అని నిలదీసి అడుగుతున్నాడు. దాదాపు ఉన్నత్త స్థితిలో ఉన్నాడు. రాముడు.

(రాముడు ఇలా అధైర్యంగా, బేలగా, ఏడవడం గురించిన ఈ సర్గ ప్రాచ్యప్రతిలో లేదు అని పండితుల అభిప్రాయము).

శ్రీమద్రామాయణము.
అరణ్యకాండము అరువదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓంతత్సత్

అరణ్యకాండ ఏకషష్టితమః సర్గః (61) >>

Leave a Comment