Aranya Kanda Sarga 61 In Telugu – అరణ్యకాండ ఏకషష్టితమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ఏకషష్టితమః సర్గం రామాయణంలోని అరణ్యకాండలో 61వ అధ్యాయం. ఈ సర్గలో రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకెళ్లడానికి యత్నాలు ప్రారంభిస్తాడు. సీత అపహరణ సమయంలో జటాయువు రావణుని అడ్డుకుంటాడు. జటాయువు సీతను కాపాడేందుకు రావణుడితో యుద్ధం చేస్తాడు, కానీ రావణుడు జటాయువును గాయపరచి సీతను లంకకు తీసుకెళ్తాడు. రాముడు, లక్ష్మణుడు తిరిగి వచ్చినప్పుడు సీత కనిపించకపోవడంతో, జటాయువుతో జరిగిన సంఘటన గురించి తెలుసుకుంటారు.

సీతాన్వేషణమ్

దృష్ట్వాఽఽశ్రమపదం శూన్యం రామో దశరథాత్మజః |
రహితాం పర్ణశాలాం చ విధ్వస్తాన్యాసనాని చ ||

1

అదృష్ట్వా తత్ర వైదేహీం సన్నిరీక్ష్య చ సర్వశః |
ఉవాచ రామః ప్రాక్రుశ్య ప్రగృహ్య రుచిరౌ భుజౌ ||

2

క్వ ను లక్ష్మణ వైదేహీ కం వా దేశమితో గతా |
కేనాహృతా వా సౌమిత్రే భక్షితా కేన వా ప్రియా ||

3

వృక్షేణాచ్ఛాద్య యది మాం సీతే హసితుమిచ్ఛసి |
అలం తే హసితేనాద్య మాం భజస్వ సుదుఃఖితమ్ ||

4

యైః సహ క్రీడసే సీతే విశ్వస్తైర్మృగపోతకైః |
ఏతే హీనాస్త్వాయా సౌమ్యే ధ్యాయంత్యాస్రావిలేక్షణాః ||

5

సీతయా రహితోఽహం వై న హి జీవామి లక్ష్మణ |
మృతం శోకేన మహతా సీతాహరణజేన మామ్ ||

6

పరలోకే మహారాజో నూనం ద్రక్ష్యతి మే పితా |
కథం ప్రతిజ్ఞాం సంశ్రుత్య మయా త్వమభియోజితః ||

7

అపూరయిత్వా తం కాలం మత్సకాశమిహాగతః |
కామవృత్తమనార్యం మాం మృషావాదినమేవ చ ||

8

ధిక్త్వామితి పరే లోకే వ్యక్తం వక్ష్యతి మే పితా |
వివశం శోకసంతప్తం దీనం భగ్నమనోరథమ్ ||

9

మామిహోత్సృజ్య కరుణం కీర్తిర్నరమివానృజుమ్ |
క్వ గచ్ఛసి వరారోహే మాం నోత్సృజ సుమధ్యమే ||

10

త్వయా విరహితశ్చాహం మోక్ష్యే జీవితమాత్మనః |
ఇతీవ విలపన్ రామః సీతాదర్శనలాలసః ||

11

న దదర్శ సుదుఃఖార్తో రాఘవో జనకాత్మజామ్ |
అనాసాదయమానం తం సీతాం దశరాథాత్మజమ్ ||

12

పంకమాసాద్య విపులం సీదంతమివ కుంజరమ్ |
లక్ష్మణో రామమత్యర్థమువాచ హితకామ్యయా ||

13

మా విషాదం మహాబాహో కురు యత్నం మయా సహ |
ఇదం చ హి వనం శూర బహుకందరశోభితమ్ ||

14

ప్రియకాననసంచారా వనోన్మత్తా చ మైథిలీ |
సా వనం వా ప్రవిష్టా స్యాన్నలినీం వా సుపుష్పితామ్ ||

15

సరితం వాఽపి సంప్రాప్తాః మీనవంజులసేవితామ్ |
స్నాతుకామా నిలీనా స్యాద్ధాసకామా వనే క్వచిత్ ||

16

విత్రాసయితుకామా వా లీనా స్యాత్కాననే క్వచిత్ |
జిజ్ఞాసమానా వైదేహీ త్వాం మాం చ పురుషర్షభ ||

17

తస్యా హ్యన్వేషణే శ్రీమన్ క్షిప్రమేవ యతావహై |
వనం సర్వం విచినువో యత్ర సా జనకాత్మజా ||

18

మన్యసే యది కాకుత్స్థ మా స్మ శోకే మనః కృథాః |
ఏవముక్తస్తు సౌహార్దాల్లక్ష్మణేన సమాహితః ||

19

సహ సౌమిత్రిణా రామో విచేతుముపచక్రమే |
తౌ వనాని గిరీంశ్చైవ సరితశ్చ సరాంసి చ ||

20

నిఖిలేన విచిన్వానౌ సీతాం దశరథాత్మజౌ |
తస్య శైలస్య సానూని గుహాశ్చ శిఖరాణి చ ||

21

నిఖిలేన విచిన్వానౌ నైవ తామభిజగ్మతుః |
విచిత్య సర్వతః శైలం రామో లక్ష్మణమబ్రవీత్ ||

22

నేహ పశ్యామి సౌమిత్రే వైదేహీం పర్వతే శుభామ్ |
తతో దుఃఖాభిసంతప్తో లక్ష్మణో వాక్యమబ్రవీత్ ||

23

విచరన్ దండకారణ్యం భ్రాతరం దీప్తతేజసమ్ |
ప్రాప్స్యసి త్వం మహాప్రాజ్ఞ మైథిలీం జనకాత్మజామ్ ||

24

యథా విష్ణుర్మహాబాహుర్బలిం బధ్వా మహీమిమామ్ |
ఏవముక్తస్తు సౌహార్దాల్లక్ష్మణేన స రాఘవః ||

25

ఉవాచ దీనయా వాచా దుఃఖాభిహతచేతనః |
వనం సర్వం సువిచితం పద్మిన్యః ఫుల్లపంకజాః ||

26

గిరిశ్చాయం మహాప్రాజ్ఞ బహుకందరనిర్ఝరః |
న హి పశ్యామి వైదేహీం ప్రాణేభ్యోఽపి గరీయసీమ్ ||

27

ఏవం స విలపన్ రామః సీతాహరణకర్శితః |
దీనః శోకసమావిష్టో ముహూర్తం విహ్వలోఽభవత్ ||

28

సంతప్తో హ్యవసన్నాంగో గతబుద్ధిర్విచేతనః |
నిషసాదాతురో దీనో నిఃశ్వస్యాయతమాయతమ్ ||

29

బహులం స తు నిఃశ్వస్య రామో రాజీవలోచనః |
హా ప్రియేతి విచుక్రోశ బహులో బాష్పగద్గదః ||

30

తం తతః సాంత్వయామాస లక్ష్మణః ప్రియబాంధవః |
బహుప్రకారం ధర్మజ్ఞః ప్రశ్రితం ప్రశ్రితాంజలిః ||

31

అనాదృత్య తు తద్వాక్యం లక్ష్మణోష్ఠపుటాచ్చ్యుతమ్ |
అపశ్యంస్తాం ప్రియాం సీతాం ప్రాక్రోశత్ స పునః పునః ||

32

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ఏకషష్టితమః సర్గః ||

Aranya Kanda Sarga 61 Meaning In Telugu PDF

ప్రాణాధికంగా ప్రేమించిన భార్య సీత హటాత్తుగా కనపడక పోయేసరికి రాముడికి దుఃఖము, కోపము ముంచుకొచ్చాయి. దానికి కారణం లక్ష్మణుడు అని రాముని అభిప్రాయము. అడగాలంటే లక్ష్మణుని అడగాలి. అందుకే పదే పదే లక్ష్మణుని అడుగుతున్నాడు.

“లక్ష్మణా! చెప్పు. నా భార్య సీత ఎక్కడ ఉంది. నీకు అప్పగించి వెళ్లాను కదా. నా భార్యను ఏమి చేసావు? ఆమె ఎక్కడకు వెళ్లి ఉంటుంది. నా భార్యను ఎవరు బలవంతంగా తీసుకొని వెళ్లారు? నా భార్యను ఎవరు చంపి తిన్నారు? చెప్పు” అంటూ నిలదీస్తున్నాడు.

లక్ష్మణుడికి సీత గురించి తెలియదు అని రామునికి తెలుసు. కాని మనసు నిలవడం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. కాబట్టి చేస్తున్నాడు. లక్ష్మణుని విడిచి పెట్టాడు.

చెట్ల దగ్గరకుపోయి “సీతా సీతా రా! ఎక్కడ దాక్కుని ఉ న్నావు” అని బిగ్గరగా పిలుస్తున్నాడు.

“ఓ సీతా! నీవు ఎక్కడన్నా ఆడుకుంటున్నావా! ఇందాక లేడిపిల్ల కావాలి అని అడిగావు కదా. నీకు ఏదైనా లేడి దొరికిందా. దానితో ఆడుతున్నావా. త్వరగా రా” అని ఎలుగెత్తి పిలుస్తున్నాడు.

మరలా రాముడు లక్ష్మణుని వద్దకు వచ్చాడు. “లక్ష్మణా! సీత లేకుండా నేను బతకలేను లక్ష్మణా! సీతా వియోగంతో కృంగి కృశించి చచ్చిపోతాను. నా తండ్రి దశరథుని పరలోకంలో కలుసుకుంటాను. కాని నాకు ఒకటే భయం. నా తండ్రి నన్ను చూచి “నిన్ను 14 ఏళ్లు వనవాసము చెయ్యమన్నాను కదా. వనవాస కాలము పూర్తి కాకుండా అప్పుడే వచ్చావేమిటి” అని అడిగితే ఏమి చెప్పాలి? నా తండ్రి నన్ను “నువ్వు మాట మీద నిలబడే వాడివి కాదు. నీవు అన్నీ అబద్ధాలు చెబుతావు” అని నిందిస్తే ఎలా భరించాలి. ” అని లక్ష్మణునితో వాపోయాడు.

మరలాసీత గుర్తుకు వచ్చింది. “సీతా! సీతా! ఎక్కడున్నావు సీతా! నన్ను విడిచి పెట్టి ఎక్కడకుపోయావు సీతా! నన్ను విడువకు సీతా. నీవులేనిదే నాకు జీవితం లేదుసీతా!” అని బిగ్గరగా ఏడుస్తున్నాడు.

రాముడు ఎంత ఏడ్చినా సీత తిరిగి రాలేదు. ఇదంతా మౌనంగా చూస్తున్నాడు లక్ష్మణుడు. ఇదంతా తన వల్లే కదా అని మనసులో బాధపడుతున్నాడు. కాసేపు సీత అన్న మాటలను భరిస్తే, కాసేపు సీతకు కనపడకుండా మొహం తప్పిస్తే, ఇంత ఆపద వచ్చి ఉ డేది కాదు కదా అని వాపోతున్నాడు. కాని తన బాధను బయటకు కనపడనీయకుండా రామునికి ధైర్యం చెబుతున్నాడు లక్ష్మణుడు.

“అన్నయ్యా! ఏమిటీ వెర్రి. నీవంటి ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు, ఇంత విషాదము చెందవలెనా! సీత ఎక్కడకూ వెళ్లదు. నీళ్లు తీసుకురావడానికి సరస్సుకు వెళ్లి ఉంటుంది. లేక ఈ అరణ్యములో ఎన్నో కొండగుహలు ఉన్నాయి కదా! ఏ గుహలోనో దాని అందాలు చూస్తూ ఉండి ఉంటుంది. లేక స్నానము చేయడానికి నదికి వెళ్లిందేమో! లేక నిన్ను ఆట పట్టించడానికి ఎక్కడైనా దాక్కుని ఉందేమో! తను కాసేపు కనపడకపోతే మనము ఏమి చేస్తామో అని చూడటానికి ఎక్కడన్నా దాగిఉండవచ్చును.

కాబట్టి ఓ రామా! మనము ఆమెను వెదకడానికి ప్రయత్నం చేద్దాము. అంతేకానీ ఇలా దుఃఖించడం వలన ప్రయోజనము లేదు కదా! నీవు దుఃఖము మాని నాకు అనుజ్ఞ ఇస్తే నేను అడవి అంతా గాలించి సీత జాడ తెలుసుకొనివస్తాను.” అని అన్నాడు లక్ష్మణుడు.

లక్ష్మణుడి మాటలకు ఎంతోసంతోషించాడు రాముడు. “లక్ష్మణా! నువ్వు ఒక్కడివే ఎందుకు. మనం ఇద్దరం కలిసి వెదుకుదాము.” అని అన్నాడు.

తరువాత రాముడు లక్ష్మణుడు కలిసి సీతను వెదకడం మొదలెట్టారు. అడవి అంతా గాలించారు. పక్కనున్న పర్వతములు అన్నీ కలయతిరిగారు. నదీతీరములు వెదికారు. సరస్సులవద్ద వెతికారు. ఎంత వెదికినా సీత కనపడలేదు.

“లక్ష్మణా! ఎంతవెదికినా సీత కపపడటం లేదు. ఏం చేద్దాము.” అని నిరాశగా అన్నాడు రాముడు.

“రామా! అంతలోనే నిరాశచెందకుము. సీత మనకు తప్పకుండా కనపడుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. సీత బతికేఉంది. అందులో సందేహము లేదు.” అని అన్నాడు లక్ష్మణుడు.

“ఏం దొరకడమో ఏమో! మనం ఇద్దరం ఈ అడవి అంతా గాలించాము కదా! సీత సాధారణంగా వెళ్లే ప్రదేశాలు, సరస్సులు, నదీతీరము, పర్వతములు అన్నీ వెదికాము కదా! కాని సీత కనిపించలేదు. ఏం చెయ్యాలో తోచడంలేదు.” అని దుఃఖిస్తున్నాడు.

రాముడు. “సీతాసీతా!” అని మాటి మాటికీ సీతను తలుచుకుంటున్నాడు.

లక్ష్మణుడు రాముని శాయశక్తులా ఓదారుస్తున్నాడు. కాని రాముని దుఃఖము ఉపశమించడం లేదు. అలా సీత కోసం దుఃఖిస్తూనే ఉన్నాడు రాముడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము అరువది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ ద్విషష్టితమః సర్గః (62) >>

Leave a Comment