Aranya Kanda Sarga 62 In Telugu – అరణ్యకాండ ద్విషష్టితమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ద్విషష్టితమః సర్గం అంటే రామాయణంలోని అరణ్యకాండ యొక్క 62వ అధ్యాయం. ఈ సర్గలో, రాముడు, సీతా, లక్ష్మణులు దండకారణ్యంలో అనేక కష్టాలను ఎదుర్కొంటారు. ప్రధాన సంఘటన సీత హరణం. రాక్షసుడు రావణుడు, సీతను అపహరించడానికి వచ్చి, ఆమెను బలవంతంగా తన రథంలో ఎక్కించుకొని, లంకకు తీసుకువెళ్తాడు. సీత విడిపించబడటానికి ఆర్తనాదం చేస్తుంది, కానీ ఆమెను రక్షించడానికి ఎవ్వరూ ఉండరు.

రాఘవవిలాపః

సీతామపశ్యన్ ధర్మాత్మా కామోపహతచేతనః |
విలలాప మహాబాహూ రామః కమలలోచనః ||

1

పశ్యన్నివ స తాం సీతామపశ్యన్మదనార్దితః |
ఉవాచ రాఘవో వాక్యం విలాపాశ్రయదుర్వచమ్ ||

2

త్వమశోకస్య శాఖాభిః పుష్పప్రియతయా ప్రియే |
ఆవృణోషి శరీరం తే మమ శోకవివర్ధనీ ||

3

కదలీకాండసదృశౌ కదల్యా సంవృతావుభౌ |
ఊరూ పశ్యామి తే దేవి నాసి శక్తా నిగూహితుమ్ ||

4

కర్ణికారవనం భద్రే హసంతీ దేవి సేవసే |
అలం తే పరిహాసేన మమ బాధావహేన వై ||

5

పరిహాసేన కిం సీతే పరిశ్రాంతస్య మే ప్రియే |
అయం స పరిహాసోఽపి సాధు దేవి న రోచతే ||

6

విశేషేణాశ్రమస్థానే హాసోఽయం న ప్రశస్యతే |
అవగచ్ఛామి తే శీలం పరిహాసప్రియం ప్రియే ||

7

ఆగచ్ఛ త్వం విశాలాక్షి శూన్యోఽయముటజస్తవ |
సువ్యక్తం రాక్షసైః సీతా భక్షితా వా హృతాఽపి వా ||

8

న హి సా విలపంతం మాముపసంప్రైతి లక్ష్మణ |
ఏతాని మృగయూథాని సాశ్రునేత్రాణి లక్ష్మణ ||

9

శంసంతీవ హి వైదేహీం భక్షితాం రజనీచరైః |
హా మమార్యే క్వ యాతాసి హా సాధ్వి వరవర్ణిని ||

10

హా సకామా త్వయా దేవీ కైకేయీ సా భవిష్యతి |
సీతయా సహ నిర్యాతో వినా సీతాముపాగతః ||

11

కథం నామ ప్రవేక్ష్యామి శూన్యమంతఃపురం పునః |
నిర్వీర్య ఇతి లోకో మాం నిర్దయశ్చేతి వక్ష్యతి ||

12

కాతరత్వం ప్రకాశం హి సీతాపనయనేన మే |
నివృత్తవనవాసశ్చ జనకం మిథిలాధిపమ్ ||

13

కుశలం పరిపృచ్ఛంతం కథం శక్ష్యే నిరీక్షితుమ్ |
విదేహరాజో నూనం మాం దృష్ట్వా విరహితం తయా ||

14

సుతాస్నేహేన సంతప్తో మోహస్య వశమేష్యతి |
అథవా న గమిష్యామి పురీం భరతపాలితామ్ ||

15

స్వర్గోఽపి సీతయా హీనః శూన్య ఏవ మతో మమ |
మామిహోత్సృజ్య హి వనే గచ్ఛాయోధ్యాం పురీం శుభామ్ ||

16

న త్వహం తాం వినా సీతాం జీవేయం హి కథంచన |
గాఢమాశ్లిష్య భరతో వాచ్యో మద్వచనాత్త్వయా ||

17

అనుజ్ఞాతోఽసి రామేణ పాలయేతి వసుంధరామ్ |
అంబా చ మమ కైకేయీ సుమిత్రా చ త్వయా విభో ||

18

కౌసల్యా చ యథాన్యాయమభివాద్యా మమాజ్ఞయా |
రక్షణీయా ప్రయత్నేన భవతా సూక్తకారిణా ||

19

సీతాయాశ్చ వినాశోఽయం మమ చామిత్రకర్శన |
విస్తరేణ జనన్యా మే వినివేద్యస్త్వయా భవేత్ ||

20

ఇతి విలపతి రాఘవే సుదీనే
వనముపగమ్య తయా వినా సుకేశ్యా |
భయవికలముఖస్తు లక్ష్మణోఽపి
వ్యథితమనా భృశమాతురో బభూవ ||

21

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ద్విషష్టితమః సర్గః ||

Aranya Kanda Sarga 62 Meaning In Telugu

వివాహం అయినప్పటి నుండి తనను క్షణం కూడా ఎడ బాయని సీత ఒక్కసారిగా తనను విడిచి పోవడం చూచి రాముడు హతాశుడయ్యాడు. రాముడికి కన్ను మూసినా తెరిచినా సీత రూపమే కనిపిస్తూ ఉంది. సీత చెట్ల నుండి పూలు కోస్తున్నట్టు, పూపొదలలో తిరుగుతున్నట్టు ఊహించుకుంటున్నాడు. ఆమెను తన దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు. తన దగ్గరకు రాలేదేమా అని అలుగుతున్నాడు. సీత తనను ఆట పట్టించడానికి తనకు దూరంగా తనకు కనపడకుండా ఉందని ఆమెను రా రమ్మని పిలుస్తున్నాడు. నీవు లేకపోతే పర్ణశాల శూన్యంగా ఉందని నిష్టూరం ఆడుతున్నాడు. ఎంతకూ సీ కనపడలేదు.

మరలా లక్ష్మణుడి వంక చూచాడు. “లక్ష్మణా! నేను ఇంతగా పిలుస్తుంటే, ఇంతగా పరితపిస్తుంటే సీత ఎందుకు రావడం లేదు. సీతను రాక్షసులు చంపి తిని ఉంటారంటావా!” అని తన సందేహాన్ని వెలిబుచ్చాడు.

మరలా తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. “ఓ సీతా! నీకు ఎంత ఆపద సంభవించినది. ఇది తెలిస్తే పాపం కైక ఎంత సంతోషిస్తుందో! ఆమె కోరిక తీరినట్టయింది కదా! సీతా! నీతో కలిసి అయోధ్యనుండి బయటకు కాలు పెట్టాను. వనవాసానంతరము నీవు లేకుండా అయోధ్యలో ఎలా కాలు పెట్టను? సీతను ఎవరికో అప్పగించి వచ్చాను అని తలిస్తే జనం నన్ను పిరికి వాడనీ, పరాక్రమం లేని వాడనీ నిందించరా!

నిజమే! నేను పిరికివాడినే! లేకపోతే చేతిలో ధనుర్బాణములు ఉండగా నిన్ను పోగొట్టుకున్నానే! నేను నిజంగా పిరికివాడినే! మీ తండ్రి జనక మహారాజు వచ్చి ‘నాకుమార్తె సీత ఎక్కడ?” అంటే నేను ఏమి సమాధానం చెప్పాలి. ఆయనకు నా మొహం ఎలా చూపించాలి? అసలు నీవు నా పక్కన లేకుండా చూచి మీ తండ్రి జనకుడు మూర్ఛ చెందడా! అందుకే నేను మరలా అయోధ్యకు వెళ్లను? సీతలేని అయోధ్యలో నేను ఉండలేను.” అని సీత తన ఎదురుగా ఉన్నట్టు ఊహించుకొనని మాట్లాడుతున్నాడు.

ఇంతలో లక్ష్మణుని వంక తిరిగాడు. “లక్ష్మణా! నీవు అయోధ్యకు వెళ్లు. నా కోసరం నువ్వుకూడా ఎందుకు ఈ అడవులలో బాధలుపడతావు. భరతుని శాశ్వతంగా రాజ్యం ఏలుకోమని నామాటగా చెప్పు. నాకు బదులు నా తల్లి కౌసల్యకు నీ తల్లి సుమిత్రకు అభివాదము చెయ్యి నా తల్లిని జాగ్రత్తగా చూసుకో! ఆమె చెప్పిన పనులు చేస్తూ ఉండు. లక్ష్మణా! నా తల్లికి నీవు ఇక్కడ జరిగిన విషయాలు సవిస్తరంగా వివరించు. మాయలేడి రావడం, సీత ఆ లేడి కావాలని కోరడం, నేను దాని కోసరం వెళ్లడం, దానిని కొట్టడం, ఆ లేడి రాక్షసుడుగా మారి అరవడం. నువ్వు రావడం, సీత కనపడకపోవడం, సీత కోసరం నేను విలపించడం, అన్నీ వివరించు.” అని అప్పగింతలు పెడుతున్న రాముని చూచి లక్ష్మణుడు భయంతో వణికిపోయాడు. సీతావియోగదుఃఖం తట్టుకోలేక రాముడు ఎటువంటి దుస్థితికి లోనవుతాడో అని భయపడ్డాడు లక్ష్మణుడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము అరువది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ త్రిషష్టితమః సర్గః (63) >>

Leave a Comment