Aranya Kanda Sarga 70 In Telugu – అరణ్యకాండ సప్తతితమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ సప్తతితమః సర్గ (70వ సర్గ) రామాయణంలో కీలకమైన భాగం. ఈ సర్గలో, శూర్పణఖ రాముడు, లక్ష్మణుల చేతిలో అవమానానికి గురై తన సోదరుడు రావణుని దగ్గరకు వెళ్లి తన ఆవేదనను తెలియజేస్తుంది. సోదరి అవమానానికి రావణుడు ఆగ్రహంతో రగిలిపోతాడు. శూర్పణఖ వర్ణనలో సీత సౌందర్యాన్ని తెలుసుకొని, సీతను అపహరించాలని సంకల్పిస్తాడు. ఈ సర్గ రామాయణ కథలో కీలక మలుపు, రాముడు, సీతల జీవితాల్లో అనేక మార్పులను తీసుకురావడం, రాక్షసులపై రాముడు, లక్ష్మణులు ఎదుర్కొనే సవాళ్లను మరింత సంక్లిష్టతరం చేయడం జరుగుతుంది.

కబంధబాహుచ్ఛేదః

తౌ తు తత్ర స్థితౌ దృష్ట్వా భ్రాతరౌ రామలక్ష్మణౌ |
బాహుపాశపరిక్షిప్తౌ కబంధో వాక్యమబ్రవీత్ ||

1

తిష్ఠతః కిం ను మాం దృష్ట్వా క్షుధార్తం క్షత్రియర్షభౌ |
ఆహారార్థం తు సందిష్టౌ దైవేన గతచేతసౌ ||

2

తచ్ఛ్రుత్వా లక్ష్మణో వాక్యం ప్రాప్తకాలం హితం తదా |
ఉవాచార్తిం సమాపన్నో విక్రమే కృతనిశ్చయః ||

3

త్వాం చ మాం చ పురా తూర్ణమాదత్తే రాక్షసాధమః |
తస్మాదసిభ్యామస్యాశు బాహూ ఛిందావహై గురూ ||

4

భీషణోఽయం మహాకాయో రాక్షసో భుజవిక్రమః |
లోకం హ్యతిజితం కృత్వా హ్యావాం హంతుమిహేచ్ఛతి ||

5

నిశ్చేష్టానాం వధో రాజన్ కుత్సితో జగతీపతేః |
క్రతుమధ్యోపనీతానాం పశూనామివ రాఘవ ||

6

ఏతత్సంజల్పితం శ్రుత్వా తయోః క్రుద్ధస్తు రాక్షసః |
విదార్యాస్యం తదా రౌద్రస్తౌ భక్షయితుమారభత్ ||

7

తతస్తౌ దేశకాలజ్ఞౌ ఖడ్గాభ్యామేవ రాఘవౌ |
అచ్ఛిందతాం సుసంహృష్టౌ బాహూ తస్యాంసదేశతః ||

8

దక్షిణో దక్షిణం బాహుమసక్తమసినా తతః |
చిచ్ఛేద రామో వేగేన సవ్యం వీరస్తు లక్ష్మణః ||

9

స పపాత మహాబాహుశ్ఛిన్నబాహుర్మహాస్వనః |
ఖం చ గాం చ దిశశ్చైవ నాదయన్ జలదో యథా ||

10

స నికృత్తౌ భూజౌ దృష్ట్వా శోణితౌఘపరిప్లుతః |
దీనః పప్రచ్ఛ తౌ వీరౌ కౌ యువామితి దానవః ||

11

ఇతి తస్య బ్రువాణస్య లక్ష్మణః శుభలక్షణః |
శశంస రాఘవం తస్య కబంధస్య మహాత్మనః ||

12

అయమిక్ష్వాకుదాయాదో రామో నామ జనైః శ్రుతః |
అస్యైవావరజం విద్ధి భ్రాతరం మాం చ లక్ష్మణమ్ ||

13

మాత్రా ప్రతిహృతే రాజ్యే రామః ప్రవ్రాజితో వనమ్ |
మయా సహ చరత్యేష భార్యయా చ మహద్వనమ్ ||

14

అస్య దేవప్రభావస్య వసతో విజనే వనే |
రక్షసాఽపహృతా పత్నీ యామిచ్ఛంతావిహాగతౌ ||

15

త్వం తు కో వా కిమర్థం వా కబంధసదృశో వనే |
ఆస్యేనోరసి దీప్తేన భగ్నజంఘో వివేష్టసే ||

16

ఏవముక్తః కబంధస్తు లక్ష్మణేనోత్తరం వచః |
ఉవాచ పరమప్రీతస్తదింద్రవచనం స్మరన్ ||

17

స్వాగతం వాం నరవ్యాఘ్రౌ దిష్ట్యా పశ్యామి చాప్యహమ్ |
దిష్ట్యా చేమౌ నికృత్తౌ మే యువాభ్యాం బాహుబంధనౌ ||

18

విరూపం యచ్చ మే రూపం ప్రాప్తం హ్యవినయాద్యథా |
తన్మే శృణు నరవ్యాఘ్ర తత్త్వతః శంసతస్తవ ||

19

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే సప్తతితమః సర్గః ||

Aranya Kanda Sarga 70 Meaning In Telugu

తన బాహుబంధములలో చిక్కిన రామలక్ష్మణులను చూచి కబంధుడు ఇలా అన్నాడు. “ఏంటి అలా చూస్తున్నారు. ఈరోజు మీ ఇద్దరినీ నాకు దేవుడు ఆహారంగా పంపాడు. మీరు ఎంత ప్రయత్నించినా నా నుండి తప్పించుకోలేరు. (అందుకే కబంధ హస్తాలు అనే సామెత వచ్చింది.) ఈ రోజు మీ ఇద్దరూ నాకు ఆహారం కాక తప్పదు.” అని అన్నాడు.

రాముడు ఆలోచించే పరిస్థితిలో లేదు. సీత పోయిన దుఃఖములో ఉన్న తాను కబంధుని హస్తాలలో చిక్కుకోడంతో రాముడు ఆలోచించే శక్తి కోల్పోయాడు. అప్పుడు లక్ష్మణుడు రాముని తో ఇలా అన్నాడు.

“రామా! ధైర్యం కోల్పోవద్దు. మనం ఇద్దరం వీడి హస్తాలలో బందీలుగా ఉన్నాము. ఈ పరిస్థితులను మనకు అనుకూలంగా మలచుకోవాలి. నీవు నీ శక్తిని అంతా కూడగట్టుకొని నీ చేతిలో ఉన్న ఖడ్గంతో నీ పక్కఉన్న చెయ్యినరుకు. నేను ఈ పక్క ఉన్న చెయ్యి నరుకుతాను. ఇందాకటి నుండి వీడిని పరిశీలిస్తున్నాను. వీడి శక్తి అంతా వీడి బాహువులలో ఉంది. వీడి బాహువులను ఖండిస్తే వీడు మనలను ఏమీ చెయ్యలేడు.” అని అన్నాడు లక్ష్మణుడు.

(ఇక్కడ ఒకటి గమనించండి. ఈ సూత్రం మనకు అందరికీ వర్తిస్తుంది. మనకు ఆపదలు వచ్చినపుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు రాముని వలె మనం ఆలోచించే శక్తి కోల్పోతాము. కాని మనం లక్ష్మణుని వలె ఆలోచించాలి. మనకు ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలచుకోవాలి. తగిన ఉపాయం ఆలోచించాలి. ఆపదల నుండి బయట పడాలి. అంతేకాని, ఆపదలు వచ్చినప్పుడు మనలను మనం తిట్టుకుంటూ ఎదుటి వారిని తిట్టడం వలన ఏమీ ప్రయోజనం లేదు. రామాయణం నుండి దీనిని మనం గ్రహించి ఆచరణలో పెట్టి మన జీవితాలను సఫలం చేసుకోవాలి.)

లక్ష్మణుని మాటలు విన్నాడు కబంధుడు. రామలక్ష్మణులను తినబోయాడు. రాముడు, లక్ష్మణుడు వెంటనే స్పందించారు. క్షణం ఆలస్యం చేయకుండా కబంధుడి రెండు బాహువులను ఖడ్గములతో ఖండించారు. ఎప్పుడైతే చేతులు ఖండింపబడ్డాయో కబంధుడు పెద్దగా అరిచాడు కేకలు పెట్టాడు. వెనక్కు విరుచుకు పడ్డాడు.

ఖండింపబడిన తన బాహువులను చూచుకున్నాడు. కబంధుడు. రామలక్ష్మణుల వంక చూచి “ఎవరు మీరు?” అని అడిగాడు.

అప్పుడు లక్ష్మణుడు కబంధునితో “ఇతడు ఇక్ష్వాకు వంశములో జన్మించిన దశరథుని కుమారుడు రాముడు. నేను అతని తమ్ముడు లక్ష్మణుడను. కారణాంతరముల చేత మేము వనవాసము చేస్తున్నాము. మేము ఇంట లేని సమయమున ఎవడో రావణుడు అనే రాక్షసుడు రాముడి భార్య సీతను అపహరించాడు. మేము సీతను వెదుకుతూ నీకు చిక్కాము. ప్రాణాపాయ పరిస్థితులలో, మా ప్రాణాలు కాపాడుకోడానికి నీ చేతులు ఖండించాము. ఇంతకూ నీవు ఎవరవు? ఈ వికృత రూపం ఎందుకు వచ్చింది. ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు ఉన్నావు?” అని అడిగాడు లక్ష్మణుడు.

కబంధుడికి ఒక్కసారిగా ఇంద్రుడు చెప్పినమాటలు గుర్తుకు వచ్చాయి. “ఓ పుణ్యపురుషులారా! మీకు శుభం కలుగుగాక! నా అదృష్టం కొద్దీ నాకు మీ దర్శనభాగ్యం కలిగింది. నాకు మేలు చేయడానికే మీరు నా బాహువులను ఖండించారు. నాకు ఈ వికృతరూపము ఎలా వచ్చిందో మీకు సవిస్తరంగా తెలియజేస్తాను.” అని కబంధుడు తన పూర్వ వృత్తాంతమును రామలక్షణులకు ఈ విధంగా చెప్పాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము డెబ్బదియవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ ఏకసప్తతితమః సర్గః (71) >>

Leave a Comment