Kishkindha Kanda Sarga 13 In Telugu – కిష్కింధాకాండ త్రయోదశః సర్గః

కిష్కింధాకాండ త్రయోదశః సర్గలో, సుగ్రీవుడు వానర సైన్యాలను నాలుగు దిక్కులుగా పంపి సీతా దేవిని వెతకమని ఆజ్ఞాపిస్తాడు. దిక్పాలకులైన హనుమంతుడు, జాంబవంతుడు, ఆంగదుడు, ఇతర ప్రముఖ వానరులు తమ సేనలతో ప్రయాణం ప్రారంభిస్తారు. సీతను కనుగొనడానికి వారి శోధనలో అడవులు, పర్వతాలు, నదులు, సముద్రతీరాలను అడ్డుగా పరిగణించకుండా దాటి వెళ్తారు. సీతా దేవి ఉన్న చోటును కనుగొనడం కోసం, వానరులు తమ శక్తి, తెలివి, ధైర్యాన్ని ఉపయోగిస్తారు. సుగ్రీవుడు ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తూ, రాముని నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సంకల్పిస్తారు.

సప్తజనాశ్రమప్రణామః

ఋశ్యమూకాత్ స ధర్మాత్మా కిష్కింధాం లక్ష్మణాగ్రజః |
జగామ సహసుగ్రీవో వాలివిక్రమపాలితామ్ || ౧ ||

సముద్యమ్య మహచ్చాపం రామః కాంచనభూషితమ్ |
శరాంశ్చాదిత్యసంకాశాన్ గృహీత్వా రణసాధకాన్ || ౨ ||

అగ్రతస్తు యయౌ తస్య రాఘవస్య మహాత్మనః |
సుగ్రీవః సంహతగ్రీవో లక్ష్మణశ్చ మహాబలః || ౩ ||

పృష్ఠతో హనుమాన్ వీరో నలో నీలశ్చ వానరః |
తారశ్చైవ మహాతేజా హరియూథపయూథపః || ౪ ||

తే వీక్షమాణా వృక్షాంశ్చ పుష్పభారావలంబినః |
ప్రసన్నాంబువహాశ్చైవ సరితః సాగరంగమాః || ౫ ||

కందరాణి చ శైలాంశ్చ నిర్దరాణి గుహాస్తథా |
శిఖరాణి చ ముఖ్యాని దరీశ్చ ప్రియదర్శనాః || ౬ ||

వైడూర్యవిమలైః పర్ణైః పద్మైశ్చాకోశకుడ్మలైః |
శోభితాన్ సజలాన్ మార్గే తటాకాంశ్చ వ్యలోకయన్ || ౭ ||

కారండైః సారసైర్హంసైర్వంజులైర్జలకుక్కుటైః |
చక్రవాకైస్తథా చాన్యైః శకునైరుపనాదితాన్ || ౮ ||

మృదుశష్పాంకురాహారాన్నిర్భయాన్ వనగోచరాన్ |
చరతః సర్వతోఽపశ్యన్ స్థలీషు హరిణాన్ స్థితాన్ || ౯ ||

తటాకవైరిణశ్చాపి శుక్లదంతవిభూషితాన్ |
ఘోరానేకచరాన్ వన్యాన్ ద్విరదాన్ కూలఘాతినః || ౧౦ ||

మత్తాన్ గిరితటోత్కృష్టాన్ జంగమానివ పర్వతాన్ |
వారణాన్ వారిదప్రఖ్యాన్ మహీరేణుసముక్షితాన్ || ౧౧ ||

వనే వనచరాంశ్చాన్యాన్ ఖేచరాంశ్చ విహంగమాన్ |
పశ్యంతస్త్వరితా జగ్ముః సుగ్రీవవశవర్తినః || ౧౨ ||

తేషాం తు గచ్ఛతాం తత్ర త్వరితం రఘునందనః |
ద్రుమషండ వనం దృష్ట్వా రామః సుగ్రీవమబ్రవీత్ || ౧౩ ||

ఏష మేఘ ఇవాకాశే వృక్షషండః ప్రకాశతే |
మేఘసంఘాతవిపులః పర్యంతకదలీవృతః || ౧౪ ||

కిమేతజ్జ్ఞాతుమిచ్ఛామి సఖే కౌతూహలం హి మే |
కౌతూహలాపనయనం కర్తుమిచ్ఛామ్యహం త్వయా || ౧౫ ||

తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః |
గచ్ఛన్నేవాచచక్షేఽథ సుగ్రీవస్తన్మహద్వనమ్ || ౧౬ ||

ఏతద్రాఘవ విస్తీర్ణమాశ్రమం శ్రమనాశనమ్ |
ఉద్యానవనసంపన్నం స్వాదుమూలఫలోదకమ్ || ౧౭ ||

అత్ర సప్తజనా నామ మునయః సంశితవ్రతాః |
సప్తైవాసన్నధః శీర్షా నియతం జలశాయినః || ౧౮ ||

సప్తరాత్రకృతాహారా వాయునా వనవాసినః |
దివం వర్షశతైర్యాతాః సప్తభిః సకలేవరాః || ౧౯ ||

తేషామేవంప్రభావానాం ద్రుమప్రాకారసంవృతమ్ |
ఆశ్రమం సుదురాధర్షమపి సేంద్రైః సురాసురైః || ౨౦ ||

పక్షిణో వర్జయంత్యేతత్తథాన్యే వనచారిణః |
విశంతి మోహాద్యే తత్ర నివర్తంతే న తే పునః || ౨౧ ||

విభూషణరవాశ్చాత్ర శ్రూయంతే సకలాక్షరాః |
తూర్యగీతస్వనాశ్చాత్ర గంధో దివ్యశ్చ రాఘవ || ౨౨ ||

త్రేతాగ్నయోఽపి దీప్యంతే ధూమో హ్యత్ర ప్రకాశతే |
వేష్టయన్నివ వృక్షాగ్రాన్ కపోతాంగారుణో ఘనః || ౨౩ ||

ఏతే వృక్షాః ప్రకాశంతే ధూమసంసక్తమస్తకాః |
మేఘజాలప్రతిచ్ఛన్నా వైడూర్యగిరయో యథా || ౨౪ ||

కురు ప్రణామం ధర్మాత్మంస్తాన్ సముద్దిశ్య రాఘవ |
లక్ష్మణేన సహ భ్రాత్రా ప్రయతః సంయతాంజలిః || ౨౫ ||

ప్రణమంతి హి యే తేషాం మునీనాం భావితాత్మనామ్ |
న తేషామశుభం కించిచ్ఛరీరే రామ దృశ్యతే || ౨౬ ||

తతో రామః సహ భ్రాత్రా లక్ష్మణేన కృతాంజలిః |
సముద్దిశ్య మహాత్మానస్తానృషీనభ్యవాదయత్ || ౨౭ ||

అభివాద్య తు ధర్మాత్మా రామో భ్రాతా చ లక్ష్మణః |
సుగ్రీవో వానరాశ్చైవ జగ్ముః సంహృష్టమానసాః || ౨౮ ||

తే గత్వా దూరమధ్వానం తస్మాత్ సప్తజనాశ్రమాత్ |
దదృశుస్తాం దురాధర్షాం కిష్కింధాం వాలిపాలితామ్ || ౨౯ ||

తతస్తు రామానుజరామవానరాః
ప్రగృహ్య శస్త్రాణ్యుదితార్కతేజసః |
పురీం సురేశాత్మజవీర్యపాలితాం
వధాయ శత్రోః పునరాగతాః సహ || ౩౦ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే త్రయోదశః సర్గః || ౧౩ ||

Kishkindha Kanda Sarga 13 Meaning In Telugu

అందరూ కిష్కింధకు వెళుతున్నారు. ముందు లక్ష్మణుడు నడుస్తున్నాడు. తరువాత ధనుర్ధారియై రాముడు నడుస్తున్నాడు. రాముని వెనక సుగ్రీవుడు, హనుమంతుడు, నలుడు, నీలుడు, తారుడు నడుస్తున్నారు. వారుకొండలను గుహలను, సరస్సులను దాటుకుంటూ వెళుతున్నారు. మార్గమధ్యంలో రాముడు ఒక వనమును చూచాడు. దాని గురించి సుగ్రీవుని అడిగాడు. సుగ్రీవుడు ఆ వనము గురించి ఇలా చెప్పసాగాడు.

“ఓ రామా! ఇక్కడ సప్తజనులు అనే మునులు ఉండేవారు. వారు జలములో తలకిందులుగా తపస్సు చేస్తూ ఉండేవారు. వారు ఆహారము తీసుకొనేవారు కాదు. ఏడురోజులకొక సారి గాలి మాత్రం పీల్చుకొనే వారు. ఆ ప్రకారంగా వారు ఏడు వందల సంవత్సరములు తపస్సుచేసి శరీరంతో స్వర్గమును చేరుకున్నారు. ఆ మునుల తపస్సు ప్రభావంతో ఈ వనములోకి దేవతలు గానీ, మనుషులు గానీ, జంతువులు గానీ ప్రవేశించలేవు. ఒకవేళ ప్రవేశిస్తే తిరిగి వెళ్లలేవు. ఈ వనములో నిత్యమూ మూడు అగ్నిహోత్రములు అనగా దక్షిణాగ్ని, గార్హపత్యము, ఆహవనీయము మండుతూ ఉంటాయి. వాటినుండి వెలవడే పొగ అదుగో అలా కనపడుతూ ఉంటుంది. రామా! మీరు ఆ మునులకు నమస్కారం చేయండి. మీకు మేలు జరుగుతుంది.” అని అన్నాడు సుగ్రీవుడు. రాముడు, లక్ష్మణుడు ఆ మునులకు భక్తితో నమస్కరించారు. తరువాత వారందరూ కిష్కింధకు చేరుకున్నారు.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము పదమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

కిష్కింధాకాండ చతుర్దశః సర్గః (14)>>

Leave a Comment