కబంధశాపాఖ్యానమ్
పురా రామ మహాబాహో మహాబలపరాక్రమమ్ |
రూపమాసీన్మమాచింత్యం త్రిషు లోకేషు విశ్రుతమ్ ||
1
యథా సోమస్య శక్రస్య సూర్యస్య చ యథా వపుః |
సోఽహం రూపమిదం కృత్వా లోకవిత్రాసనం మహత్ ||
2
ఋషీన్వనగతాన్ రామ త్రాసయామి తతస్తతః |
తతః స్థూలశిరా నామ మహర్షిః కోపితో మయా ||
3
సంచిన్వన్ వివిధం వన్యం రూపేణానేన ధర్షితః |
తేనాహముక్తః ప్రేక్ష్యైవం ఘోరశాపాభిధాయినా ||
4
ఏతదేవ నృశంసం తే రూపమస్తు విగర్హితమ్ |
స మయా యాచితః క్రుద్ధః శాపస్యాంతో భవేదితి ||
5
అభిశాపకృతస్యేతి తేనేదం భాషితం వచః |
యదా ఛిత్త్వా భుజౌ రామస్త్వాం దహేద్విజనే వనే ||
6
తదా త్వం ప్రాప్స్యసే రూపం స్వమేవ విపులం శుభమ్ |
శ్రియా విరాజితం పుత్రం దనోస్త్వం విద్ధి లక్ష్మణ ||
7
ఇంద్రకోపాదిదం రూపం ప్రాప్తమేవం రణాజిరే |
అహం హి తపసోగ్రేణ పితామహమతోషయమ్ ||
8
దీర్ఘమాయుః స మే ప్రాదాత్తతో మాం విభ్రమోఽస్పృశత్ |
దీర్ఘమాయుర్మయా ప్రాప్తం కిం మే శక్రః కరిష్యతి ||
9
ఇత్యేవం బుద్ధిమాస్థాయ రణే శక్రమధర్షయమ్ |
తస్య బాహుప్రముక్తేన వజ్రేణ శతపర్వణా ||
10
సక్థినీ చైవ మూర్ధా చ శరీరే సంప్రవేశితమ్ |
స మయా యాచ్యమానః సన్నానయద్యమసాదనమ్ ||
11
పితామహవచః సత్యం తదస్త్వితి మమాబ్రవీత్ |
అనాహారః కథం శక్తో భగ్నసక్థిశిరోముఖః ||
12
వజ్రేణాభిహతః కాలం సుదీర్ఘమపి జీవితుమ్ |
ఏవముక్తస్తు మే శక్రో బాహూ యోజనమాయతౌ ||
13
ప్రాదాదాస్యం చ మే కుక్షౌ తీక్ష్ణదంష్ట్రమకల్పయత్ |
సోఽహం భుజాభ్యాం దీర్ఘాభ్యాం సంకృష్యాస్మిన్వనేచరాన్ ||
14
సింహద్విపమృగవ్యాఘ్రాన్ భక్షయామి సమంతతః |
స తు మామబ్రవీదింద్రో యదా రామః సలక్ష్మణః ||
15
ఛేత్స్యతే సమరే బాహూ తదా స్వర్గం గమిష్యతి |
అనేన వపుషా రామ వనేఽస్మిన్ రాజసత్తమ ||
16
యద్యత్పశ్యామి సర్వస్య గ్రహణం సాధు రోచయే |
అవశ్యం గ్రహణం రామో మన్యేఽహం సముపైష్యతి ||
17
ఇమాం బుద్ధిం పురస్కృత్య దేహన్యాసకృతశ్రమః |
స త్వం రామోఽసి భద్రం తే నాహమన్యేన రాఘవ ||
18
శక్యో హంతుం యథాతత్త్వమేవముక్తం మహర్షిణా |
అహం హి మతిసాచివ్యం కరిష్యామి నరర్షభ ||
19
మిత్రం చైవోపదేక్ష్యామి యువాభ్యాం సంస్కృతోఽగ్నినా |
ఏవముక్తస్తు ధర్మాత్మా దనునా తేన రాఘవః ||
20
ఇదం జగాద వచనం లక్ష్మణస్యోపశృణ్వతః |
రావణేన హృతా భార్యా మమ సీతా యశస్వినీ ||
21
నిష్క్రాంతస్య జనస్థానాత్సహ భ్రాత్రా యథాసుఖమ్ |
నామమాత్రం తు జానామి న రూపం తస్య రక్షసః ||
22
నివాసం వా ప్రభావం వా వయం తస్య న విద్మహే |
శోకార్తానామనాథానామేవం విపరిధావతామ్ ||
23
కారుణ్యం సదృశం కర్తుముపకారే చ వర్తతామ్ |
కాష్ఠాన్యాదాయ శుష్కాణి కాలే భగ్నాని కుంజరైః ||
24
ధక్ష్యామస్త్వాం వయం వీర శ్వభ్రే మహతి కల్పితే |
స త్వం సీతాం సమాచక్ష్వ యేన వా యత్ర వా హృతా ||
25
కురు కల్యాణమత్యర్థం యది జానాసి తత్త్వతః |
ఏవముక్తస్తు రామేణ వాక్యం దనురనుత్తమమ్ ||
26
ప్రోవాచ కుశలో వక్తుం వక్తారమపి రాఘవమ్ |
దివ్యమస్తి న మే జ్ఞానం నాభిజానామి మైథిలీమ్ ||
27
యస్తాం జ్ఞాస్యతి తం వక్ష్యే దగ్ధః స్వం రూపమాస్థితః |
అదగ్ధస్య తు విజ్ఞాతుం శక్తిరస్తి న మే ప్రభో ||
28
రాక్షసం తం మహావీర్యం సీతా యేన హృతా తవ |
విజ్ఞానం హి మమ భ్రష్టం శాపదోషేణ రాఘవ ||
29
స్వకృతేన మయా ప్రాప్తం రూపం లోకవిగర్హితమ్ |
కింతు యావన్న యాత్యస్తం సవితా శ్రాంతవాహనః ||
30
తావన్మామవటే క్షిప్త్వా దహ రామ యథావిధి |
దగ్ధస్త్వయాహమవటే న్యాయేన రఘునందన ||
31
వక్ష్యామి తమహం వీర యస్తం జ్ఞాస్యతి రాక్షసమ్ |
తేన సఖ్యం చ కర్తవ్యం న్యాయవృత్తేన రాఘవ ||
32
కల్పయిష్యతి తే ప్రీతః సాహాయ్యం లఘువిక్రమః |
న హి తస్యాస్త్యవిజ్ఞాతం త్రిషు లోకేషు రాఘవ |
సర్వాన్ పరిసృతో లోకాన్ పురాఽసౌ కారణాంతరే ||
33
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ఏకసప్తతితమః సర్గః ||
Aranya Kanda Sarga 71 Meaning In Telugu
“ఓ రామా! నేను దనువు కుమారుడను. దానవుడను. నేను బ్రహ్మను గూర్చి తపస్సు చేసాను. నా తపస్సుకు మెచ్చి బ్రహ్మ నాకు దీర్ఘాయుష్షు ప్రసాదించాడు. ఆ వర గర్వముతో నేను నా ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడిని. నా పూర్వ రూపము చాలా అందంగా ఉండేది. నేను దేవేంద్రునితో సమానంగా ప్రకాశిస్తూ ఉండేవాడిని. నేను కామరూపుడను కోరిన రూపము ధరించగలవాడను. నేను అప్పుడప్పుడు భయంకరమైన రూపములను ధరించి అరణ్యములో తపస్సుచేసుకొనుచున్న మునులను ఋషులను భయపెట్టేవాడిని.
ఒక సారి నేను ప్రస్తుతము ఉన్న కబంధ రూపములో స్థూలశిరుడు అనే పేరుగల ఋషిని భయపెట్టాను. అప్పుడు నాకు అవయవములు అన్నీ సక్రమంగానే ఉండేవి. కాని వికృతముగా ఉండే విధంగా ఆయనను భయపెట్టాను. ఆయనకు కోపం వచ్చింది. “నీవు ఇదే రూపంలోనే శాశ్వతంగా ఉండుదువుగాక!” అని శపించాడు. నాకు భయం వేసింది. ఆ ముని కాళ్ల మీద పడి శరణు వేడుకున్నాను. శాపమునకు విమోచనము ప్రసాదించమని అడిగాను. అప్పుడు ఆ ముని “రాముడు నీ దగ్గరకు వచ్చి నీ భుజములను ఖండించిన రోజు నీకు నీ స్వస్వరూపము వస్తుంది.” అని శాపవిమోచనము ప్రసాదించాడు. తరువాత నాకు ఈ వికృత రూపము వచ్చింది.
ఒక సారి నేను ఇంద్రుని ఎదిరించాను. ఇంద్రుడు తన వజ్రాయుధముతో నా తలమీద బుజాల మీద కొట్టాడు. దానితో నా తల పొట్టలోకి దూరిపోయింది. నా బాహువులు, నా కాళ్లు, తొడలు శరీరంలోకి చొచ్చుకుపోయాయి. మరీ వికృతంగా తయారయ్యాను. నడవలేను. “ఇంద్రా! నన్ను ఈ విధంగా చేసావు. నేను ఆహారం ఎలా సంపాదించుకోవాలి? ఎలా జీవించాలి ?” అని అడిగాను. అప్పుడు ఇంద్రుడు నాకు ఒక యోజనము పొడవు ఉండే చేతులు, పొట్టలోనే ఒక నోరు ప్రసాదించాడు.
“రామలక్ష్మణులు ఎప్పుడు నీచేతులు ఖండిస్తారో అప్పుడు నీకు పూర్వరూపము వస్తుంది.” అని చెప్పాడు. అప్పటినుండి నేను నా చేతులు చాచి యోజనము లోపల ఉన్న జంతువులను నా చేతులతో పట్టి తింటూ మీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు మీరు నా బాహువులు ఖండించి నాకు శాప విమోచన కలిగించారు.. మీరు నాకు దహన సంస్కారములు చేయండి. అప్పుడు నాకు పూర్వ రూపము వస్తుంది. ఇంతకూ మీకు వచ్చిన కష్టం ఏమిటో చెప్పండి. నేను మీకు తగిన సాయం చేస్తాను.” అని అన్నాడు కబంధుడు.
రాముడు ఇలా చెప్పాడు. “నేను, నా సోదరుడు లక్ష్మణుడు ఆశ్రమములో లేని సమయములో రావణుడు అనే రాక్షసుడు నా భార్య సీతను అపహరించాడు. మాకు అతని పేరు రావణుడు అనీ, అతను రాక్షస రాజు అనీ తెలుసు. అతను ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో తెలియదు. మేము దారీ తెన్నూ లేకుండా సీత కోసరము వెతుకుతున్నాము. నీకు తెలిసినట్టయితే, మాకు ఆ రాక్షసుని గురించి తెలియచెయ్యి. మేము నీకు శాపవిమోచనము కావించాము కాబట్టి నీవు కూడా మాకు తగిన సాయం చెయ్యి. నీవు కోరినట్టు నీకు దహన సంస్కారములు చేస్తాము.” అని అన్నాడు రాముడు.
“రామా! నాకు ఎలాంటి దివ్యదృష్టి లేదు. అందుకని నేను ఆ రాక్షసుని గురించి చెప్పలేను. కాని మీకు సీత జాడ గురించి చెప్పగల వారిని గురించిన సమాచారము ఇవ్వగలను. అతనికి ఈ మూడు లోకములలో ఎవరు ఎక్కడ ఉన్నదీ బాగా తెలుసు. కొన్ని కారణాంతరాల వల్ల అతడు ముల్లోకములూ తిరిగాడు. నీవు అతనితో స్నేహం చేసి సీత జాడతెలుసుకో! రామా! సూర్యుడు అస్తమించ బోతున్నాడు. మీరు సూర్యాస్తమయమునకు ముందు నన్ను దహనం చేసి నాకు పూర్వరూపము వచ్చేట్టు చెయ్యండి.” అని చెప్పాడు కబంధుడు.
శ్రీమద్రామాయణము
అరణ్య కాండము డెబ్బది ఒకటవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
అరణ్యకాండ ద్విసప్తతితమః సర్గః (72) >>