అయోధ్యాకాండ త్ర్యుత్తరశతతమః సర్గః
ఈ సర్గలో, రాముడు సుమంతుని ద్వారా తన తండ్రి మరణవార్త తెలుసుకుంటాడు. ఆయన విషాదంలో మునిగి తండ్రి, జననీ కౌసల్యా గురించి భావోద్వేగంతో మాట్లాడతాడు. భరతుడు ఆయన్ని తిరిగి రావాలని ప్రార్థించినా, రాముడు తన వాగ్దానాన్ని పాటించాల్సిన కర్తవ్యం ఉందని అంటాడు. రాముడు తన తల్లి కౌసల్యా, సుమిత్రా, కైకేయి లకు దాస్యభక్తితో వీడా వడులు చెప్పి, తన ధర్మాన్ని పరిరక్షించాలని నిర్ణయిస్తాడు. రాముడు, సీత, లక్ష్మణులు తమ వనవాసాన్ని కొనసాగించడానికి దండకారణ్యంలోకి వెళ్లి, పుణ్యాశ్రమాలలో నివసిస్తారు. ఈ సర్గ రాముడి ధర్మబద్ధతను, కుటుంబానుభవాలను, దైవిక కర్తవ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
మాతృదర్శనమ్
వసిష్ఠః పురతః కృత్వా దారాన్ దశరథస్య చ |
అభిచక్రామ తం దేశం రామదర్శనతర్షితః || ౧ ||
రాజపత్న్యశ్చ గచ్ఛంత్యో మందం మందాకినీం ప్రతి |
దదృశుస్తత్ర తత్తీర్థం రామలక్ష్మణసేవితమ్ || ౨ ||
కౌసల్యా బాష్పపూర్ణేన ముఖేన పరిశుష్యతా |
సుమిత్రామబ్రవీద్దీనా యాశ్చాన్యా రాజయోషితః || ౩ ||
ఇదం తేషామనాథానాం క్లిష్టమక్లిష్టకర్మణామ్ |
వనే ప్రాక్కేవలం తీర్థం యే తే నిర్విషయీకృతాః || ౪ ||
ఇతః సుమిత్రే పుత్రస్తే సదా జలమతంద్రితః |
స్వయం హరతి సౌమిత్రిర్మమ పుత్రస్య కారణాత్ || ౫ ||
జఘన్యమపి తే పుత్రః కృతవాన్న తు గర్హితః |
భ్రాతుర్యదర్థసహితం సర్వం తద్విహితం గుణైః || ౬ ||
అద్యాయమపి తే పుత్రః క్లేశానామతథోచితః |
నీచానర్థసమాచారం సజ్జం కర్మ ప్రముంచతు || ౭ ||
దక్షిణాగ్రేషు దర్భేషు సా దదర్శ మహీతలే |
పితురింగుదిపిణ్యాకం న్యస్తమాయతలోచనా || ౮ ||
తం భూమౌ పితురార్తేన న్యస్తం రామేణ వీక్ష్య సా |
ఉవాచ దేవీ కౌసల్యా సర్వా దశరథస్త్రియః || ౯ ||
ఇదమిక్ష్వాకునాథస్య రాఘవస్య మహాత్మనః |
రాఘవేణ పితుర్దత్తం పశ్యతైతద్యథావిధి || ౧౦ ||
తస్య దేవసమానస్య పార్థివస్య మహాత్మనః |
నైతదౌపయికం మన్యే భుక్తభోగస్య భోజనమ్ || ౧౧ ||
చతురంతాం మహీం భుక్త్వా మహేంద్రసదృశో విభుః |
కథమింగుదిపిణ్యాకం స భుంక్తే వసుధాఽధిపః || ౧౨ ||
అతో దుఃఖతరం లోకే న కించిత్ ప్రతిభాతి మా |
యత్ర రామః పితుర్దద్యాదింగుదీక్షోదమృద్ధిమాన్ || ౧౩ ||
రామేణేంగుదిపిణ్యాకం పితుర్దత్తం సమీక్ష్య మే |
కథం దుఃఖేన హృదయం న స్ఫోటతి సహస్రధా || ౧౪ ||
శ్రుతిస్తు ఖల్వియం సత్యా లౌకికీ ప్రతిభాతి మా |
యదన్నః పురుషో భవతి తదన్నాస్తస్య దేవతాః || ౧౫ ||
ఏవమార్తాం సపత్న్యస్తాః జగ్మురాశ్వాస్య తాం తదా |
దదృశుశ్చాశ్రమే రామం స్వర్గచ్యుతమివామరమ్ || ౧౬ ||
సర్వభోగైః పరిత్యక్తం రామం సంప్రేక్ష్య మాతరః |
ఆర్తా ముముచురశ్రూణి సస్వరం శోకకర్శితాః || ౧౭ ||
తాసాం రామః సముత్థాయ జగ్రాహ చరణాన్ శుభాన్ |
మాతౄఽణాం మనుజవ్యాఘ్రః సర్వాసాం సత్యసంగరః || ౧౮ ||
తాః పాణిభిః సుఖస్పర్శైర్మృద్వంగుళితలైః శుభైః |
ప్రమమార్జూ రజః పృష్ఠాద్రామస్యాయతలోచనాః || ౧౯ ||
సౌమిత్రిరపి తాః సర్వాః మాతౄఽస్సంప్రేక్ష్య దుఃఖితః |
అభ్యవాదయతాసక్తం శనై రామాదనంతరమ్ || ౨౦ ||
యథా రామే తథా తస్మిన్ సర్వా వవృతిరే స్త్రియః |
వృత్తిం దశరథాజ్జాతే లక్ష్మణే శుభలక్షణే || ౨౧ ||
సీతాఽపి చరణాంస్తాసాముపసంగృహ్య దుఃఖితా |
శ్వశ్రూణామశ్రుపూర్ణాక్షీ సా బభూవాగ్రతః స్థితా || ౨౨ ||
తాం పరిష్వజ్య దుఃఖార్తాం మాతా దుహితరం యథా |
వనవాసకృశాం దీనాం కౌసల్యా వాక్యమబ్రవీత్ || ౨౩ ||
విదేహరాజస్య సుతా స్నుషా దశరథస్య చ |
రామపత్నీ కథం దుఃఖం సంప్రాప్తా నిర్జనే వనే || ౨౪ ||
పద్మమాతపసంతప్తం పరిక్లిష్టమివోత్పలమ్ |
కాంచనం రజసా ధ్వస్తం క్లిష్టం చంద్రమివాంబుదైః || ౨౫ ||
ముఖం తే ప్రేక్ష్య మాం శోకో దహత్యగ్నిరివాశ్రయం
భృశం మనసి వైదేహి వ్యసనారణిసంభవః || ౨౬ ||
బ్రువంత్యామేవమార్తాయాం జనన్యాం భరతాగ్రజః |
పాదావాసాద్య జగ్రాహ వసిష్ఠస్య చ రాఘవః || ౨౭ ||
పురోహితస్యాగ్నిసమస్య వై తదా
బృహస్పతేరింద్ర ఇవామరాధిపః |
ప్రగృహ్య పాదౌ సుసమృద్ధతేజసః
సహైవ తేనోపవివేశ రాఘవః || ౨౮ ||
తతో జఘన్యం సహితైః సమంత్రిభిః
పురప్రధానైశ్చ సహైవ సైనికైః |
జనేన ధర్మజ్ఞతమేన ధర్మవాన్
ఉపోపవిష్టో భరతస్తదాగ్రజమ్ || ౨౯ ||
ఉపోపవిష్టస్తు తథా స వీర్యవాన్
తపస్వివేషేణ సమీక్ష్య రాఘవమ్ |
శ్రియా జ్వలంతం భరతః కృతాంజలిః
యథా మహేంద్రః ప్రయతః ప్రజాపతిమ్ || ౩౦ ||
కిమేష వాక్యం భరతోఽద్య రాఘవం
ప్రణమ్య సత్కృత్య చ సాధు వక్ష్యతి |
ఇతీవ తస్యార్యజనస్య తత్త్వతో
బభూవ కౌతూహలముత్తమం తదా || ౩౧ ||
స రాఘవః సత్యధృతిశ్చ లక్ష్మణో
మహానుభావో భరతశ్చ ధార్మికః |
వృతాః సుహృద్భిశ్చ విరేజురధ్వరే
యథా సదస్యైః సహితాస్త్రయోఽగ్నయః || ౩౨ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్ర్యుత్తరశతతమః సర్గః || ౧౦౩ ||
Ayodhya Kanda Sarga 103 Meaning In Telugu
భరతుడు చెప్పిన తండ్రి మరణ వార్తను వినగానే రాముడు కిందపడి మూర్ఛపోయాడు.
(ఇక్కడ మీకు ఒక సందేహము రావచ్చు. 101వ సర్గలో భరతుడు రామునికి దశరథుని మరణ వార్త చెప్పాడు. “గతః స్వర్గం మహాబాహు: పుత్రశోకాభిపీడిత:” పుత్రశోకంతో స్వర్గస్థుడయ్యూడు అని చెప్పాడు. 101వ సర్గ ఆఖరులో రాముడు “ఏవంకృత్వా మహారాజో విభాగం లోకసన్నిధౌ వ్యాదిశ్య చ మాహాతేజ దివం దశరథో గత:” ఈ విధంగా రాజ్యవిభాగము చేసి దశరథుడు దివంగతుడయ్యాడు అని రాముడు కూడా అన్నాడు. కాని 103 వ సర్గ మొదటి భాగంలో తండ్రి మరణ వార్త విని రాముడు మూర్ఛపోయాడు అని ఉంది. ఈ మూర్ఛపోవడం మొదట భరతుడు తండ్రి మరణ వార్త చెప్పినపుడే జరిగి ఉండాల్సింది. ముందు ముందు ఇలాంటి పరస్పర వ్యతిరేక సన్నివేశాలు వస్తుంటాయి. గమనించండి.) మొదలు నరికిన చెట్టులా కిందపడిపోయిన రాముని చూచి సీత ఏడుస్తూ అతని దగ్గరగా వచ్చింది. రాముని మీద నీళ్లు చల్లి అతనికి సేదతీర్చింది. రాముడు మూర్ఛనుండి తేరుకున్నాడు. దీనంగా కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తున్నాడు. రాముడు తన తండ్రి మరణ వార్త విని భరతునితో ఇలా అన్నాడు.
“భరతా! నా తండ్రే లేనపుడు నాకు అయోధ్యతో ఏమి పని! దశరథుడులేని అయోధ్యను నేను మాత్రము ఎలా పరిపాలింపగలను. నా మీద దు:ఖముతో మరణించిన నా తండ్రికి నేను అంతిమ సంస్కారములు చేయడానికి కూడా నోచుకోలేదు కదా! నేను ఆయనకు చెడ పుట్టాను. నేను పెద్దకొడుకుగా ఉండి ఆయనకు ఏమి చేయగలిగాను. పెద్దకొడుకుగా కనీసం నా విధులను కూడా నేను నిర్వర్తించలేకపోయాను.
ఓ భరతా! శత్రుఘ్నా! మీరు ఇద్దరూ పుణ్యాత్ములు. తండ్రి గారికి అంతిమ సంస్కారములు చేయగలిగారు. భరతా! ఇప్పుడే చెబుతున్నాను. ఇప్పుడే కాదు, ఈ పధ్నాలుగు సంవత్సరముల వనవాసము తరువాత కూడా, దశరథుడు లేని అయోధ్యలో నేను అడుగుపెట్టను. దశరథుడులేని అయోధ్యను ఊహించలేను. ఎందుకంటే, వనవాసానంతరము నేను రాజ్యాధికారము చేపడితే నాకు దిశానిర్దేశము ఎవరు చేస్తారు. నాకు మంచీ చెడూ ఎవరు చెబుతారు. నేను అయోధ్యలో ఉన్నప్పుడు నేను చేసిన మంచి పనులను మెచ్చుకుంటూ తండ్రిగారు నాకు ఎన్నో మంచి మాటలు చెప్పేవారు. ఇప్పుడు నాకు అలా ఎవరు చెబుతారు.” అని శోకిస్తున్నాడు రాముడు.
సీతను చూచి రాముడు ఇలా అన్నాడు. “సీతా! నీకు పితృసమానులు, నీ మామగారు మరణించారు. లక్ష్మణుడు పితృహీనుడయ్యాడు. ఇంక మనకు దిక్కు ఎవ్వరు?’ అని విలపిస్తున్నాడు రాముడు. రాముడు ఇలా ఏడుస్తుంటే మిగిలిన తమ్ముళ్లు కూడా ఏడుస్తున్నారు.
కొంచెం సేపటికి లక్ష్మణుడు తేరుకొని అన్నరాముని చూచి “అన్నయ్యా! మనప్రస్తుత కర్తవ్యము తండ్రి గారికి జలతర్పణములు ఇవ్వాలి.” అని గుర్తుచేసాడు.
పితృసమానుడైన మామగారు పరమపదించారు అన్నవార్త విన్న సీత దు:ఖంతో కుమిలిపోయింది. కళ్లనిండా నీళ్లుకమ్ముకున్నాయి. ఏడుస్తున్న సీతను చూచాడు రాముడు. ఆమెను ఓదార్చాడు. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.
“లక్ష్మణా!మనము తండ్రిగారికి పిండప్రదానముచేయవలెను. నీవుపోయి పిండి, బదరీఫలములు సిద్ధ చేయి.” అని అన్నాడు. ముందు సీత నడుస్తుంటే వెనక లక్ష్మణుడు నడుస్తుంటే రాముడు వారి వెనక మందాకినీ నదీ తీరానికి వెళ్లాడు. వారి వెంట సుమంత్రుడు వెళ్లాడు. అందరూ మందాకినీ నదీ తీరానికి చేరుకున్నారు. సుమంత్రుడు తాను ముందుగా నదిలోకిదిగి, తరువాత రామలక్ష్మణులను, సీతను వారి చేతులుపట్టుకొని నదిలోకి దింపాడు. అందరూ స్నానములు చేసారు. రాముడు దోసిలి నిండా నీళ్లు తీసుకొని దక్షిణము వైపుతిరిగి “ఓ తండ్రీ! నీకు జలమును విడుస్తున్నాము. పితృలోకములో ఉన్న నీకు ఈజలము అక్షయంగా ఉపతిష్ఠమగును గాక!”అని ఆ జలమును నదిలో విడిచి పెట్టాడు.
తరువాత రామలక్ష్మణులు మందాకినీ నది ఒడ్డున దశరథునకు పిండితో పిండప్రదానము చేసారు. నేల మీద దరలు పరిచారు. ఆ దర్భల మీద బదరీఫలములతో కూడిన పిండిని పిండములుగాచేసి పెట్టారు. “ఓ తండ్రీ! మేమే ప్రతిదినమూ తినే ఆహారమునే నీకు పిండములుగా సమర్పించుకుంటున్నాము. స్వీకరించు. ఈ లోకంలో పురుషులు దేనిని తింటారో దానినే పితృలోకంలో ఉన్నపితృదేవతలు కూడా తింటారుకదా!” అని పలికాడు రాముడు.
పిండప్రదాన కార్యక్రమము ముగిసినతరువాత అందరూ పర్ణశాలకు చేరుకున్నారు. తరువాత కూడా అన్నదమ్ములు తండ్రిమరణానికి బాధపడుతూనే ఉన్నారు. అన్నదమ్ములు చేస్తున్న రోదన ధ్వనులు దూరంగా ఉన్న సైనికులకు వినబడ్డాయి. ‘భరతుడు రాముని చేరుకున్నాడు, అందరూ దశరథుని మరణానికి దు:ఖిస్తున్నారు’ అని వారు తెలుసుకున్నారు. వారంతా ఎప్పుడెప్పుడు రాముని చూద్దామా అని ఆతురతగా ఉన్నారు. అందరూ రాముని పర్ణశాల వైపుకు ప్రయాణం అయ్యారు.
అందరూ రాముని పర్ణశాలకు చేరుకున్నారు. పర్ణశాల ముందు నేలమీదకూర్చొని ఉన్న రాముని చూచారు. రామునికి ఆ గతి పట్టించిన కైకను, మంధరను నోటికొచ్చినట్టు తిడుతూ ఏడుస్తున్నారు. ఆ పరిస్థితిలో ఉన్న రాముని చూచి వారికి కన్నీళ్లు ఆగలేదు. రాముడు అందరినీ చూచాడు. పురుషులను, స్త్రీలను తన కన్న తల్లి తండ్రులవలె కౌగలించుకొని వారి ఓదార్పువచనములను విన్నాడు. కొంతమంది రామునికి నమస్కరించారు. కొంత మంది రాముని పరామర్శించారు. రాముడు అందరినీ వారి వారి అర్హతలను బట్టి గౌరవించాడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్