అయోధ్యాకాండ పంచోత్తరశతతమః సర్గః, వాల్మీకి రామాయణంలోని ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, శ్రీరాముడు, సీతాదేవిని దుఃఖంతో విడిచిపెట్టి, లక్ష్మణునితో కలిసి అయోధ్యకు తిరిగి వెళ్ళతాడు. సీతాదేవి, అగ్ని పరీక్ష ద్వారా తన పవిత్రతను నిరూపించుకుంటుంది. ఈ ఘటనలో రాముడు ధర్మాన్ని పాటిస్తూ, ప్రజల సమక్షంలో సీతా దేవిని అంగీకరిస్తాడు. ఈ సర్గ, ధర్మానికి, నిష్కపటతకు, మరియు రాజనీతికి సంబంధించిన అంశాలను స్పృశిస్తుంది. వాల్మీకి రామాయణంలో ఈ సర్గ ప్రత్యేకంగా రాముని జీవన పద్ధతిని, అతని ధైర్యం, ధర్మనిష్టలను ఉద్దీపింపచేస్తుంది.
రామవాక్యమ్
తతః పురుషసింహానాం వృతానాం తైః సుహృద్గణైః |
శోచతామేవ రజనీ దుఃఖేన వ్యత్యవర్తత || ౧ ||
రజన్యాం సుప్రభాతాయాం భ్రాతరస్తే సుహృద్వృతాః |
మందాకిన్యాం హుతం జప్యం కృత్వా రామముపాగమన్ || ౨ ||
తూష్ణీం తే సముపాసీనాః న కశ్చిత్కించిదబ్రవీత్ |
భరతస్తు సుహృన్మధ్యే రామం వచనమబ్రవీత్ || ౩ ||
సాంత్వితా మామికా మాతా దత్తం రాజ్యమిదం మమ |
తద్దదామి తవైవాహం భుంక్ష్వ రాజ్యమకణ్టకమ్ || ౪ ||
మహతేవాంబువేగేన భిన్నః సేతుర్జలాగమే |
దురావారం త్వదన్యేన రాజ్యఖండమిదం మహత్ || ౫ ||
గతిం ఖర ఇవాశ్వస్య తార్క్ష్యస్యేవ పతత్రిణః |
అనుగంతుం న శక్తిర్మే గతిం తవ మహీపతే || ౬ ||
సుజీవం నిత్యశస్తస్య యః పరైరుపజీవ్యతే |
రామ తేన తు దుర్జీవం యః పరానుపజీవతి || ౭ ||
యథా తు రోపితో వృక్షః పురుషేణ వివర్ధితః |
హ్రస్వకేన దురారోహో రూఢస్కంధో మహాద్రుమః || ౮ ||
స యథా పుష్పితో భూత్వా ఫలాని న విదర్శయేత్ |
స తాం నానుభవేత్ప్రీతిం యస్య హేతోః ప్రరోపితః || ౯ ||
ఏషోపమా మహాబాహో తమర్థం వేత్తుమర్హసి |
యది త్వమస్మాన్ వృషభో భర్తా భృత్యాన్న శాధి హి || ౧౦ ||
శ్రేణయస్త్వాం మహారాజ పశ్యంత్వగ్ర్యాశ్చ సర్వశః |
ప్రతపంతమివాదిత్యం రాజ్యే స్థితమరిందమమ్ || ౧౧ ||
తవానుయానే కాకుత్స్థ మత్తా నర్దంతు కుంజరాః |
అంతఃపురగతా నార్యో నందంతు సుసమాహితాః || ౧౨ ||
తస్య సాధ్విత్యమన్యంత నాగరా వివిధా జనాః |
భరతస్య వచః శ్రుత్వా రామం ప్రత్యనుయాచతః || ౧౩ ||
తమేవం దుఃఖితం ప్రేక్ష్య విలపంతం యశస్వినమ్ |
రామః కృతాత్మా భరతం సమాశ్వాసయ దాత్మవాన్ || ౧౪ ||
నాత్మనః కామకారోఽస్తి పురుషోఽయమనీశ్వరః |
ఇతశ్చేతరతశ్చైనం కృతాంతః పరికర్షతి || ౧౫ ||
సర్వే క్షయాంతా నిచయాః పతనాంతాః సముచ్ఛ్రయాః |
సంయోగా విప్రయోగాంతా మరణాంతం చ జీవితమ్ || ౧౬ ||
యథా ఫలానాం పక్వానాం నాన్యత్ర పతనాద్భయమ్ |
ఏవం నరస్య జాతస్య నాన్యత్ర మరణాద్భయమ్ || ౧౭ ||
యథాఽగారం దృఢస్థూణం జీర్ణం భూత్వాఽవసీదతి |
తథైవ సీదంతి నరాః జరామృత్యువశంగతాః || ౧౮ ||
అత్యేతి రజనీ యా తు సా న ప్రతినివర్తతే |
యాత్యేవ యమునా పూర్ణా సముద్రముదకాకులమ్ || ౧౯ ||
అహోరాత్రాణి గచ్ఛంతి సర్వేషాం ప్రాణినామిహ |
ఆయూంషి క్షపయంత్యాశు గ్రీష్మే జలమివాంశవః || ౨౦ ||
ఆత్మానమనుశోచ త్వం కిమన్యమనుశోచసి |
ఆయుస్తే హీయతే యస్య స్థితస్య చ గతస్య చ || ౨౧ ||
సహైవ మృత్యుర్వ్రజతి సహ మృత్యుర్నిషీదతి |
గత్వా సుదీర్ఘమధ్వానం సహమృత్యుర్నివర్తతే || ౨౨ ||
గాత్రేషు వలయః ప్రాప్తాః శ్వేతాశ్చైవ శిరోరుహాః |
జరయా పురుషో జీర్ణః కిం హి కృత్వా ప్రభావయేత్ || ౨౩ ||
నందంత్యుదితాదిత్యే నందంత్యస్తమితే రవౌ |
ఆత్మనో నావబుధ్యంతే మనుష్యా జీవితక్షయమ్ || ౨౪ ||
హృష్యంత్యృతుమఖం దృష్ట్వా నవం నవమిహాగతమ్ |
ఋతూనాం పరివర్తేన ప్రాణినాం ప్రాణసంక్షయః || ౨౫ ||
యథా కాష్ఠం చ కాష్ఠం చ సమేయాతాం మహార్ణవే |
సమేత్య చ వ్యపేయాతాం కాలమాసాద్య కంచన || ౨౬ ||
ఏవం భార్యాశ్చ పుత్రాశ్చ జ్ఞాతయశ్చ ధనాని చ |
సమేత్య వ్యవధావంతి ధ్రువో హ్యేషాం వినాభవః || ౨౭ ||
నాత్ర కశ్చిద్యథాభావం ప్రాణీ సమభివర్తతే |
తేన తస్మిన్న సామర్థ్యం ప్రేతస్యాస్త్యనుశోచతః || ౨౮ ||
యథా హి సార్థం గచ్ఛంతం బ్రూయాత్ కశ్చిత్ పథి స్థితః |
అహమప్యాగమిష్యామి పృష్ఠతో భవతామితి || ౨౯ ||
ఏవం పూర్వైర్గతో మార్గః పితృపైతామహో ధ్రువః |
తమాపన్నః కథం శోచేద్యస్య నాస్తి వ్యతిక్రమః || ౩౦ ||
వయసః పతమానస్య స్రోతసో వాఽనివర్తినః |
ఆత్మా సుఖే నియోక్తవ్యః సుఖభాజః ప్రజాః స్మృతాః || ౩౧ ||
ధర్మాత్మా స శుభైః కృత్స్నైః క్రతుభిశ్చాప్తదక్షిణైః |
ధూతపాపో గతః స్వర్గం పితా నః పృథివీపతిః || ౩౨ ||
భృత్యానాం భరణాత్ సమ్యక్ ప్రజానాం పరిపాలనాత్ |
అర్థాదానాచ్చ ధర్మేణ పితా నస్త్రిదివం గతః || ౩౩ ||
కర్మభిస్తు శుభైరిష్టైః క్రతుభిశ్చాప్తదక్షిణైః |
స్వర్గం దశరథః ప్రాప్తః పితా నః పృథివీపతిః || ౩౪ ||
ఇష్ట్వా బహువిధైర్యజ్ఞైర్భోగాంశ్చావాప్య పుష్కలాన్ |
ఉత్తమం చాయురాసాద్య స్వర్గతః పృథివీపతిః || ౩౫ ||
ఆయురుత్తమమాసాద్య భోగానపి చ రాఘవః |
స న శోచ్యః పితా తాతః స్వర్గతః సత్కృతః సతామ్ || ౩౬ ||
స జీర్ణం మానుషం దేహం పరిత్యజ్య పితా హి నః |
దైవీమృద్ధిమనుప్రాప్తో బ్రహ్మలోకవిహారిణీమ్ || ౩౭ ||
తం తు నైవంవిధః కశ్చిత్ ప్రాజ్ఞః శోచితుమర్హతి |
తద్విధో యద్విధశ్చాపి శ్రుతవాన్ బుద్ధిమత్తరః || ౩౮ ||
ఏతే బహువిధాః శోకా విలాపరుదితే తథా |
వర్జనీయా హి ధీరేణ సర్వావస్థాసు ధీమతా || ౩౯ ||
స స్వస్థో భవ మాశోచీర్యాత్వా చావస తాం పురీమ్ |
తథా పిత్రా నియుక్తోఽసి వశినా వదతాం వర || ౪౦ ||
యత్రాహమపి తేనైవ నియుక్తః పుణ్యకర్మణా |
తత్రైవాహం కరిష్యామి పితురార్య్యస్య శాసనమ్ || ౪౧ ||
న మయా శాసనం తస్య త్యక్తుం న్యాయ్యమరిందమ |
తత్ త్వయాఽపి సదా మాన్యం స వై బంధుస్స నః పితా || ౪౨ ||
తద్వచః పితురేవాహం సమ్మతం ధర్మచారిణః |
కర్మణా పాలయిష్యామి వనవాసేన రాఘవ || ౪౩ ||
ధార్మికేణానృశంసేన నరేణ గురువర్తినా |
భవితవ్యం నరవ్యాఘ్ర పరలోకం జిగీషతా || ౪౪ ||
ఆత్మానమనుతిష్ఠ త్వం స్వభావేన నరర్షభ |
నిశామ్య తు శుభం వృత్తం పితుర్దశరథస్య నః || ౪౫ ||
ఇత్యేవముక్త్వా వచనం మహాత్మా
పితుర్నిదేశప్రతిపాలనార్థమ్ |
యవీయసం భ్రాతరమర్థవచ్చ
ప్రభుర్ముహూర్తాద్విరరామ రామః || ౪౬ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచోత్తరశతతమః సర్గః || ౧౦౫ ||
Ayodhya Kanda Sarga 105 Meaning In Telugu
అంతా మౌనంగా కూర్చుని ఉన్నారు. ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ భరతుడు లేచాడు. రాముని వంక చూచి ఇలా అన్నాడు.
“రామా! నా తల్లి కైక మాటను మన్నించి నాకు రాజ్యమును వదిలి, నీవు అరణ్యములకు వచ్చావు. ఇప్పుడు అయోధ్యా రాజ్యము నాది. నా రాజ్యమును నా ఇష్టమువచ్చిన వారికి ఇచ్చే అధికారము నాకు ఉంది. నాది అయిన ఈ రాజ్యమును తిరిగి నీకు ఇస్తున్నాను. దీనిని స్వీకరించి అయోధ్యను పాలించు. ఎందుకంటే దశరథుని తరువాత ఈ రాజ్యమును పాలించే శక్తి, అర్హత నీకు మాత్రమే ఉన్నాయి. నాకు ఆ అర్హత ఎంత మాత్రము లేదు. ఎందుకంటే గాడిద గుర్రము ఒకటి కావు కదా!
ఎవని మీద అందరూ ఆధారపడి బతుకుతారో, అతని జీవనము చాలా గొప్పది. కాని ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి జీవిస్తాడో అతని జీవితము దుర్భరము. ఈ అయోధ్య ప్రజలు, మేము అంతా నీ మీద ఆధారపడి ఉన్నాము. నీ పాలనకొరకు ఎదురు చూస్తున్నాము. అలాంటిది నీవు ఈ అరణ్యములో ఒకరి మీద ఆధారపడి బతకడం దుర్భరంకాదా! ఒకడు ఒక వృక్షమును నాటి, పెంచి పోషించాడు. అది పెద్ద మాను అయింది కానీ ఫలములు ఇవ్వడం లేదు. ఆ చెట్టుఎందుకూ ఉపయోగపడదు కదా! అలాగే తండ్రి దశరథుడు నిన్ను ఈ అయోధ్యకు మహారాజుగా తీర్చిదిద్దాడు. సకల విద్యలు నేర్పించాడు. వేదాలు, ధర్మశాస్త్రములు చదివించాడు. కాని ఈనాడు నువ్వు రాజ్యమును పాలించను అంటున్నావు. నీవు నేర్చుకున్న విద్యలు అన్నీ ఫలితం లేకుండా పోవలసిందేనా! దశరథుని శ్రమ అంతా వృధా కావలసిందేనా!
నీవు అయోధ్యను పాలిస్తుంటే ఆనందించని వారు ఉండరు. రాజ్యములో ప్రజలు కానీ అంతఃపురములోని జనులు కానీ అంతా సుఖసంతోషాలలో ఓలలాడుతారు. అందరికీ ఆమోద యోగ్యుడవైన నీవు రాజ్యమును పాలించకుండా అడవులలో తిరగడం ధర్మమా! కాబట్టి నీవు వెంటనే అయోధ్యకుతిరిగి వచ్చి పట్టాభిషిక్తుడవు కావాలని సకలజనులకోరిక.” అని ముగించాడు భరతుడు.
రాముడు లేచి భరతుని వీపు తట్టి ఇలా పలికాడు. “ భరతా! ఈ చరాచర జగత్తులో తాను అనుకున్న పని అనుకున్నట్టు చేసే స్వాతంత్య్రము ఎవరికీ లేదు. అంతా విధిచేతిలో కీలుబొమ్మలమే. విధి ఎలా ఆడిస్తే అలా ఆడవలసినదే! ప్రతివానికీ ఉత్థానపతనాలు తప్పవు.
ఎంత ధనము సంపాదించినా ఆధనము తుదకు అతనిని వదిలి పోతుంది. అలాగే ఎంత ఉన్నత స్థితికి చేరినా, చివరకు పతనం తప్పదు. (సత్యం రామలింగరాజు, సన్ టివి అధినేతలు, గాలి జనార్దనరెడ్డి లాగా).
పుట్టినవాడు గిట్టడం ఎలాగో, పుట్టుకతో వచ్చిన మానవ సంబంధాలు చావుతో సమసిపోతాయి. ఏవీ శాశ్వతము కాదు. పండిన పండు రాలడం ఎంత నిజమో, పుట్టిన మనిషి చావడం అంతే నిజం. కాని అంతా శాశ్వతం అనుకోవడం అవివేకము. మనం గృహములు ఎంత ధృడంగా కట్టుకున్నా, కాలక్రమేణా అవి కూలిపోవడం తథ్యం. అలాగే ఈ శరీరాన్ని ఎంత ప్రేమగా పెంచి పోషించినా, తుదకు అది భూగర్భంలో కలిసిపోవలసిందే!
నిన్నటి దినం మరలా రాదు. సముద్రంలో కలిసిన నదీజలములు తిరిగి వెనక్కురావు కదా! ఒక్కొక్క రోజు గడుస్తుంటే, మానవుల జీవితంలో ఒక్కొక్క రోజు తరిగిపోతుంటుంది. చావుకు దగ్గర అవుతుంటాడు.
మానవుడు భూమి మీద ఉన్న అంతరిక్షంలో ఉన్నా, మృత్యువు అతని వెన్నంటి ఉంటుంది. కాలం తీరగానే కబళిస్తుంది. కాబట్టి మానవుడు సదా మృత్యువును వెంటబెట్టుకొని తిరుగుతుంటాడు. కాబట్టి భరతా! నీగురించి ఆలోచించుకో. నాగురించి ఎందుకు ఆలోచిస్తావు. ఎందుకంటే మన మానవ సంబంధాలు క్షణికములు. ఒక నదిలో రెండు దుంగలు కొట్టుకొని వస్తుంటాయి., అవి కలిసి కొంతదూరం ప్రయాణం చేస్తాయి. మరలా అవి విడిపోయి దేని దారిన అవి వెళతాయి. అలాగే భార్యలు, పుత్రులు, బంధువులు, ధనము, అన్నీ కొంతకాలము కలిసి ఉంటాయి. తరువాత విడిపోతుంటాయి. దాని కోసరం ఇప్పుడు బాధపడటం ఎందుకు?
లోకములో ఏ ప్రాణికూడా తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించలేదు. జనన మరణములు వారి చేతిలో లేవు. వాటి గురించి చింతించడం నిష్ప్రయోజనము.
నేను ఇంతకు ముందు చెప్పినట్టు, మన జీవితము మన చేతిలో లేదు. ఏది ప్రాప్తమో అది అనుభవించవలసిందే. ఇప్పుడు నీకు రాజ్యాధికారము సంక్రమించింది. దానిని అనుభవించడమే నీ బాధ్యత. మన పూర్వులు అదే చేసారు. నువ్వుకూడా అదే చెయ్యి. మన పితృపితామహులు పోయిన మార్గముననే మనమూ నడుద్దాము. నిన్నటి రోజు మరలా రాదు. ప్రవహించిన నీరు తిరిగి రాదు. వయస్సు కూడా అంతే.
కాబట్టి నీ జీవితమును ధర్మమార్గములో నడిపించు. ప్రజలను పాలించి వారికి సుఖమైన పాలనను అందించు. దానికి మన తండ్రి దశరథుడే నిదర్శనము. ఆయన ఎన్నో యజ్ఞములు, యాగములు చేసి, ప్రజలను చక్కగా పాలించి, దానధర్మములు చేసి, చివరకు స్వర్గము చేరుకున్నాడు.
మనము మన తండ్రి గారి గురించి చింతించవలసిన అవసరము లేదు. ఆయన పరిపూర్ణజీవితము అనుభవించి స్వర్గము చేరుకున్నాడు. ఆయనను గురించి దుఃఖించడం మాను. కర్తవ్యమును విస్మరించకు.
అయోధ్యను పాలించమని దశరథుడు నిన్ను ఆదేశించాడు. ఆయన ఆదేశములను పాటించు. అయోధ్యను పాలించు. ఎందుకుంటే, తండ్రిగారు నన్ను వనములకు వెళ్లమని ఆదేశించారు. ఆయన ఆదేశానుసారము నేను అడవులకు వచ్చానుకదా! అలాగే నీవు కూడా తండ్రి గారి ఆదేశమును పాటించి రాజ్యమును పాలించు. అదే నీ కర్తవ్యము.
ఇప్పుడు నేను నీ మాట విని అయోధ్యకు వస్తే తండ్రిగారి ఆదేశమును ధిక్కరించిన వాడిని అవుతాను. అది అధర్మము. అలాగే నీవు రాజ్యపాలన చెయ్యపోతే నీవుకూడా తండ్రిగారి ఆజ్ఞను ధిక్కరించినట్టే. అది కూడా అధర్మమే.
కాబట్టి నీవు అధర్మము చెయ్యకు. నన్ను అధర్మము వైపుకు లాగకు. తండ్రి గారి ఆదేశము ప్రకారము నీవు అయోధ్యనుపాలించు. నేను అరణ్యమునుపాలించెదను. అదే మన ధర్మము. అప్పుడే మనకు ఇహములో కానీ పరములో కానీసుఖము లభిస్తుంది. కాబట్టి మనము ఇద్దరమూ మన తండ్రి గారి ఆజ్ఞను పాటించి ఆయన పేరు నిలబెడదాము. ఆయన ఆత్మకు శాంతి చేకూరుద్దాము.” అని పలికాడు రాముడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్