Ayodhya Kanda Sarga 113 In Telugu – అయోధ్యాకాండ త్రయోదశోత్తరశతతమః సర్గః

అయోధ్యాకాండలోని 113వ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణులు తమ వనవాసం కొనసాగిస్తూ అరణ్యమార్గంలో ప్రయాణిస్తారు. ఈ సర్గలో వారు అరణ్యంలోని భయానక ప్రాణుల నుంచి, దుర్గమ మార్గాల నుంచి రక్షణ కోసం కష్టపడతారు. సీత తన భర్త రాముని ధైర్యాన్ని ప్రోత్సహిస్తూ, లక్ష్మణుడి సేవను ప్రశంసిస్తుంది. రాముడు తన సీతను రక్షించేందుకు ప్రతిన బద్ధుడై ఉంటాడు, లక్ష్మణుడు తన అన్నకు మద్దతు అందిస్తూ భక్తి పూర్వకంగా ఉంటాడు. ఈ సర్గలోని సంఘటనలు వారి బలాన్ని, ధైర్యాన్ని, మరియు పరస్పర ప్రేమను ప్రతిబింబిస్తాయి. అరణ్యవాసం వారిని శారీరకంగా, మానసికంగా పరీక్షిస్తుంది, కానీ వారు ధైర్యంగా ముందుకు సాగుతారు.

పాదుకాగ్రహణమ్

తతః శిరసి కృత్వా తు పాదుకే భరతస్తదా |
ఆరురోహ రథం హృష్టః శత్రుఘ్నేన సమన్వితః || ౧ ||

వసిష్ఠో వామదేవశ్చ జాబాలిశ్చ దృఢవ్రతః |
అగ్రతః ప్రయయుః సర్వే మంత్రిణో మంత్రపూజితాః || ౨ ||

మందాకినీం నదీం రమ్యాం ప్రాఙ్గ్ముఖాస్తే యయుస్తదా |
ప్రదక్షిణం చ కుర్వాణాశ్చిత్రకూటం మహాగిరిమ్ || ౩ ||

పశ్యన్ ధాతుసహస్రాణి రమ్యాణి వివిధాని చ |
ప్రయయౌ తస్య పార్శ్వేన ససైన్యో భరతస్తదా || ౪ ||

అదూరాచ్చిత్రకూటస్య దదర్శ భరతస్తదా |
ఆశ్రమం యత్ర స మునిర్భరద్వాజః కృతాలయః || ౫ ||

స తమాశ్రమమాగమ్య భరద్వాజస్య బుద్ధిమాన్ |
అవతీర్య రథాత్ పాదౌ వవందే భరతస్తదా || ౬ ||

తతో హృష్టో భరద్వాజో భరతం వాక్యమబ్రవీత్ |
అపి కృత్యం కృతం తాత రామేణ చ సమాగతమ్ || ౭ ||

ఏవముక్తః స తు తతో భరద్వాజేన ధీమతా |
ప్రత్యువాచ భరద్వాజం భరతో భ్రాతృవత్సలః || ౮ ||

స యాచ్యమానో గురుణా మయా చ దృఢవిక్రమః |
రాఘవః పరమప్రీతో వసిష్ఠం వాక్యమబ్రవీత్ || ౯ ||

పితుః ప్రతిజ్ఞాం తామేవ పాలయిష్యామి తత్త్వతః |
చతుర్దశ హి వర్షాణి యా ప్రతిజ్ఞా పితుర్మమ || ౧౦ ||

ఏవముక్తో మహాప్రాజ్ఞో వసిష్ఠః ప్రత్యువాచ హ |
వాక్యజ్ఞో వాక్యకుశలం రాఘవం వచనం మహత్ || ౧౧ ||

ఏతే ప్రయచ్ఛ సంహృష్టః పాదుకే హేమభూషితే |
అయోధ్యాయాం మహాప్రాజ్ఞ యోగక్షేమకరే తవ || ౧౨ ||

ఏవముక్తో వసిష్ఠేన రాఘవః ప్రాఙ్ముఖః స్థితః |
పాదుకే అధిరుహ్యైతే మమ రాజ్యాయ వై దదౌ || ౧౩ ||

నివృత్తోఽహమనుజ్ఞాతో రామేణ సుమహాత్మనా |
అయోధ్యామేవ గచ్ఛామి గృహీత్వా పాదుకే శుభే || ౧౪ ||

ఏతచ్ఛ్రుత్వా శుభం వాక్యం భరతస్య మహాత్మనః |
భరద్వాజః శుభతరం మునిర్వాక్యమువాచ తమ్ || ౧౫ ||

నైతచ్చిత్రం నరవ్యాఘ్ర శీలవృత్తవతాం వర |
యదార్యం త్వయి తిష్ఠేత్తు నిమ్నే సృష్టమివోదకమ్ || ౧౬ ||

అమృతః స మహాబాహుః పితా దశరథస్తవ |
యస్య త్వమీదృశః పుత్రో ధర్మజ్ఞో ధర్మవత్సలః || ౧౭ ||

తమృషిం తు మహాత్మానముక్తవాక్యం కృతాంజలిః |
ఆమంత్రయితుమారేభే చరణావుపగృహ్య చ || ౧౮ ||

తతః ప్రదక్షిణం కృత్వా భరద్వాజం పునఃపునః |
భరతస్తు యయౌ శ్రీమానయోధ్యాం సహ మంత్రిభిః || ౧౯ ||

యానైశ్చ శకటైశ్చైవ హయైర్నాగైశ్చ సా చమూః |
పునర్నివృత్తా విస్తీర్ణా భరతస్యానుయాయినీ || ౨౦ ||

తతస్తే యమునాం దివ్యాం నదీం తీర్త్వోర్మిమాలినీమ్ |
దదృశుస్తాం పునః సర్వే గంగాం శుభజలాం నదీమ్ || ౨౧ ||

తాం రమ్యజలసంపూర్ణాం సంతీర్య సహబాంధవః |
శృంగిబేరపురం రమ్యం ప్రవివేశ ససైనికః || ౨౨ ||

శృంగిబేరపురాద్భూయస్త్వయోధ్యాం సందదర్శ హ |
అయోధ్యాం చ తతో దృష్ట్వా పిత్రా భ్రాత్రా వివర్జితామ్ || ౨౩ ||

భరతో దుఃఖసంతప్తః సారథిం చేదమబ్రవీత్ |
సారథే పశ్య విధ్వస్తా సాఽయోధ్యా న ప్రకాశతే |
నిరాకారా నిరానందా దీనా ప్రతిహతస్వరా || ౨౪ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రయోదశోత్తరశతతమః సర్గః || ౧౧౩ ||

Ayodhya Kanda Sarga 113 Meaning In Telugu

భరతుడు, శత్రుఘ్నుడు, తల్లులు, మంత్రులు, వసిష్ఠుని తో సహా అందరూ అయోధ్యకు తిరుగు ప్రయాణం అయ్యారు. భరతుడు రాముని పాదుకలను గౌరవ పురస్సరంగా తన శిరస్సుమీద ధరించాడు. వారందరూ చిత్రకూటపర్వతమును దాటి మందాకినీ నది వైపుకు ప్రయాణం చేసారు. భరద్వాజ ఆశ్రమమునకు చేరుకున్నారు.

భరతుడు, వసిష్ఠుడు వెంటరాగా భరద్వాజుని దర్శనార్థము వెళ్లాడు. భరతుని చూచి భరద్వాజుడు కుశల ప్రశ్నలు వేసాడు. వెళ్లిన కార్యము సఫలము అయిందా అని అడిగాడు. భరతుడు భరద్వాజునితో ఇలా అన్నాడు.

“మహాత్మా! నేను రాముని అయోధ్యకురమ్మని పలువిధముల ప్రార్థించాను. రాముడు అంగీకరించలేదు. “నా తండ్రి ఆజ్ఞ ప్రకారము నేను పదునాలుగు సంవత్సరములు అరణ్యములలో ఉండెదను” అని తన నిర్ణయాన్ని తెలియజేసాడు.

అప్పుడు కులగురువు వసిష్ఠుడు రాముని తో ఇలా అన్నాడు. “రామా! ఇవిగో బంగారముతో చేసిన పాదుకలు. వీటిని నీవు తొడుగుకొని వాటిని మాకు ఇమ్ము. ఇవి నీ ప్రతినిధిగా మనసులో తలంచి, భరతుడు అయోధ్యను పాలిస్తాడు.” అని అన్నాడు. రాముడు సంతోషంతో అంగీకరించాడు. రాముడు తూర్పు వైపుకు తిరిగి ఆ బంగారు పాదుకలను తొడుగుకొన్నాడు. వాటిని నాకు ఇచ్చాడు. నేను ఆ పాదుకలను రామునికి బదులుగా స్వీకరించాను. రాముని అనుజ్ఞ తీసుకొని నేను ఈ రామ పాదుకలను తీసుకొని అయోధ్యకు వెళు తున్నాను.” అని అన్నాడు భరతుడు.

“భరతా! నీవు సుగుణ శీలుడవు. పుణ్యాత్ముడవు. నీ వంటివాడు దశరథునికి కుమారుడిగా జన్మించడం ఆయన అదృష్టం. నీవలన నీ తండ్రి కీర్తిని పొందాడు.” అని అన్నాడు భరద్వాజుడు. తరువాత భరతుడు భరద్వాజునకు నమస్కరించి తన పరివారముతో సహా అయోధ్యకు ప్రయాణము అయ్యాడు. వారందరూ గంగానదిని దాటి శృంగిబేరపురము ప్రవేశించారు. అక్కడ గుహుని కలుసుకొని, అయోధ్యకు ప్రయాణం అయ్యారు. భరతుడు అయోధ్యకు చేరుకున్నాడు. రాముడు లేని అయోధ్య కళావిహీనంగా ఉండటం చూచాడు భరతుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట పదమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ చతుర్దశోత్తరశతతమః సర్గః (114) >>

Leave a Comment