Ayodhya Kanda Sarga 33 In Telugu – అయోధ్యాకాండ త్రయస్త్రింశః సర్గః

అయోధ్యాకాండము త్రయస్త్రింశః సర్గము (32వ సర్గ) రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. ఈ సర్గలో, లక్ష్మణుడు రాముని మాటలు విని బాధపడతాడు. రాముని అనుసరించాలని నిర్ణయిస్తాడు. సీత కూడా అరణ్యవాసానికి రాముడితో పాటు వెళ్లాలని కోరుతుంది. చివరికి రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యానికి వెళ్ళడానికి సిద్ధమవుతారు. అటు, ప్రజలు రాముని వెనక వెళ్లాలని నిర్ణయిస్తారు. ఈ సర్గ రాముని త్యాగం, సీత లక్ష్మణుల భక్తిని మరియు ప్రజల ప్రేమను చూపిస్తుంది. అరణ్యవాసానికి బయలుదేరిన రాముడు, సీత, లక్ష్మణుల ప్రయాణం ఈ సర్గలో ప్రధానాంశంగా ఉంటుంది.

పౌరవాక్యమ్

దత్త్వా తు సహ వైదేహ్యా బ్రాహ్మణేభ్యో ధనం బహు |
జగ్మతుః పితరం ద్రష్టుం సీతయా సహ రాఘవౌ || ౧ ||

తతో గృహీతే దుష్ప్రేక్షే త్వశోభేతాం తదాయుధే |
మాలాదామభిరాబద్ధే సీతయా సమలంకృతే || ౨ ||

తతః ప్రాసాదహర్మ్యాణి విమానశిఖరాణి చ |
అధిరుహ్య జనః శ్రీమానుదాసీనో వ్యలోకయత్ || ౩ ||

న హి రథ్యాః స్మ శక్యంతే గంతుం బహుజనాకులాః |
ఆరుహ్య తస్మాత్ప్రాసాదాన్దీనాః పశ్యంతి రాఘవమ్ || ౪ ||

పదాతిం వర్జితచ్ఛత్రం రామం దృష్ట్వా తదా జనాః |
ఊచుర్బహువిధా వాచః శోకోపహతచేతసః || ౫ ||

యం యాంతమనుయాతి స్మ చతురంగబలం మహత్ |
తమేకం సీతయా సార్ధమనుయాతి స్మ లక్ష్మణః || ౬ ||

ఐశ్వర్యస్య రసజ్ఞః సన్కామినాం చైవ కామదః |
నేచ్ఛత్యేవానృతం కర్తుం పితరం ధర్మగౌరవాత్ || ౭ ||

యా న శక్యా పురా ద్రష్టుం భూతైరాకాశగైరపి |
తామద్య సీతాం పశ్యంతి రాజమార్గగతా జనాః || ౮ ||

అంగరాగోచితాం సీతాం రక్తచందనసేవినీమ్ |
వర్షముష్ణం చ శీతం చ నేష్యంత్యాశు వివర్ణతామ్ || ౯ ||

అద్య నూనం దశరథః సత్త్వమావిశ్య భాషతే |
న హి రాజా ప్రియం పుత్రం వివాసయితుమిచ్ఛతి || ౧౦ ||

నిర్గుణస్యాపి పుత్రస్య కథం స్యాద్విప్రవాసనమ్ |
కిం పునర్యస్య లోకోఽయం జితో వృత్తేన కేవలమ్ || ౧౧ ||

ఆనృశంస్యమనుక్రోశః శ్రుతం శీలం దమః శమః |
రాఘవం శోభయంత్యేతే షడ్గుణాః పురుషర్షభమ్ || ౧౨ ||

తస్మాత్తస్యోపఘాతేన ప్రజాః పరమపీడితాః |
ఔదకానీవ సత్త్వాని గ్రీష్మే సలిలసంక్షయాత్ || ౧౩ ||

పీడయా పీడితం సర్వం జగదస్య జగత్పతేః |
మూలస్యేవోపఘాతేన వృక్షః పుష్పఫలోపగః || ౧౪ ||

మూలం హ్యేష మనుష్యాణాం ధర్మసారో మహాద్యుతిః |
పుష్పం ఫలం చ పత్రం చ శాఖాశ్చాస్యేతరే జనాః || ౧౫ ||

తే లక్ష్మణ ఇవ క్షిప్రం సపత్న్యస్సహబాంధవాః |
గచ్ఛంతమనుగచ్ఛామో యేన గచ్ఛతి రాఘవః || ౧౬ ||

ఉద్యానాని పరిత్యజ్య క్షేత్రాణి చ గృహాణి చ |
ఏకదుఃఖసుఖా రామమనుగచ్ఛామ ధార్మికమ్ || ౧౭ ||

సముద్ధృతనిధానాని పరిధ్వస్తాజిరాణి చ |
ఉపాత్తధనధాన్యాని హృతసారాణి సర్వశః || ౧౮ ||

రజసాఽభ్యవకీర్ణాని పరిత్యక్తాని దైవతైః |
మూషకైః పరిధావద్భిరుద్బిలైరావృతాని చ || ౧౯ ||

అపేతోదకధూమాని హీనసమ్మార్జనాని చ |
ప్రణష్టబలికర్మేజ్యామంత్రహోమజపాని చ || ౨౦ ||

దుష్కాలేనేవ భగ్నాని భిన్నభాజనవంతి చ |
అస్మత్త్యక్తాని వేశ్మాని కైకేయీ ప్రతిపద్యతామ్ || ౨౧ ||

వనం నగరమేవాస్తు యేన గచ్ఛతి రాఘవః |
అస్మాభిశ్చ పరిత్యక్తం పురం సంపద్యతాం వనమ్ || ౨౨ ||

బిలాని దంష్ట్రిణః సర్వే సానూని మృగపక్షిణః |
త్యజంత్యస్మద్భయాద్భీతాః గజాః సింహా వనాన్యపి || ౨౩ ||

అస్మత్త్యక్తం ప్రపద్యంతాం సేవ్యమానం త్యజంతు చ |
తృణమాంసఫలాదానాం దేశం వ్యాలమృగద్విజమ్ || ౨౪ ||

ప్రపద్యతాం హి కైకేయీ సపుత్రా సహబాంధవైః |
రాఘవేణ వనే సర్వే సహవత్స్యామ నిర్వృతాః || ౨౫ ||

ఇత్యేవం వివిధా వాచో నానాజనసమీరితాః |
శుశ్రావ రామః శ్రుత్వా చ న విచక్రేఽస్య మానసమ్ || ౨౬ ||

స తు వేశ్మ పితుర్దూరాత్కైలాసశిఖరప్రభమ్ |
అభిచక్రామ ధర్మాత్మా మత్తమాతంగవిక్రమః || ౨౭ ||

వినీతవీరపురుషం ప్రవిశ్య తు నృపాలయమ్ |
దదర్శావస్థితం దీనం సుమంత్రమవిదూరతః || ౨౮ ||

ప్రతీక్షమాణోఽపి జనం తదాఽఽర్త-
-మనార్తరూపః ప్రహసన్నివాథ |
జగామ రామః పితరం దిదృక్షుః
పితుర్నిదేశం విధివచ్చికీర్షుః || ౨౯ ||

తత్పూర్వమైక్ష్వాకసుతో మహాత్మా
రామో గమిష్యన్వనమార్తరూపమ్ |
వ్యతిష్ఠత ప్రేక్ష్య తదా సుమంత్రం
పితుర్మహాత్మా ప్రతిహారణార్థమ్ || ౩౦ ||

పితుర్నిదేశేన తు ధర్మవత్సలో
వనప్రవేశే కృతబుద్ధినిశ్చయః |
స రాఘవః ప్రేక్ష్య సుమంత్రమబ్రవీ-
-న్నివేదయస్వాగమనం నృపాయ మే || ౩౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రయస్త్రింశః సర్గః || ౩౩ ||

Ayodhya Kanda Sarga 33 Meaning In Telugu

రాముడు, లక్ష్మణుడు, సీత తమకు ఉన్నదంతా బ్రాహ్మణు లకు దానము చేసిన తరువాత, వారు ముగ్గురూ దశరథుని వద్ద సెలవు తీసుకొనడానికి ఆయన మందిరమునకు వెళ్లారు. అప్పటికే రామపట్టాభిషేకము నిలిచి పోయినది అను వార్త దావానలము మాదిరి అయోధ్య అంతా పాకిపోయింది. దశరథుని మందిరమునకు వెళ్లు సీతారామలక్ష్మణులను చూచుటకు జనము వీధులలో బారులు తీరి నిలబడ్డారు. అందరి ముఖాలలో దైన్యము కనబడుతూ ఉంది. రాజలాంఛనములైన ఛత్రచామరములు లేకుండా కాలినడకన వెళు తున్న రాముని చూచి అయోధ్య ప్రజలు దు:ఖము ఆపుకోలేక పోయారు.

కేవలము తండ్రి మాటను మన్నించడానికి రాజ్యమును వదులుకొన్నాడు రాముడు అని అందరూ చెప్పుకుంటున్నారు. అప్పటిదాకా వారు సీతను ముఖాముఖి చూడలేదు. ఎండ అంటే అసలు తెలియని సీత ఈనాడు భర్త వెంట నడిచి వెళుతుంటే అందరూ ఆశ్చర్యం చూస్తున్నారు.
కొందరు ఆశావాదులు మాత్రము “రాజు రాజ్యమును ఇవ్వక పోతే మానె, రాముని ఊరువెళ్ల గొట్టడం ఎందుకు. ఏదో ఊరికే అని ఉంటాడు. రాముడు ఎక్కడకూ వెళ్లడు.” అని తమలో తాము సర్దిచెప్పుకుంటున్నారు.

మరి కొంతమంది “ఆ… ఈరోజుల్లో చెడ్డవాడైన కొడుకును కూడా మమకారంతో ఇంటి నుండి బయటకు పొమ్మనడం లేదు. అలాంటిది రాముని వంటి సుగుణాల రాసిని ఇంటినుండి ఎందుకు పొమ్మంటాడు. అదేమీ కాదు. మనం పొరపాటు వినిఉంటాము.”అని తమలో తాము అనుకుంటున్నారు.

కాని అందరూ రాముడు తమను విడిచి అడవులకు వెళు తున్నాడు అనే మాటను కూడా జీర్ణం చేసుకోలేక పోతున్నారు. ఇన్నాళ్లు తమ కష్టసుఖాలలో పాలుపంచుకున్న రాముడు ఇలా అర్థాంతరంగా అడవులకు వెళ్లడంలోని ఆంతర్యం వారికి అవగతం కావడం లేదు. ఎవరికి తోచినట్టు వారు అనుకుంటున్నారు.

ఇంతలో కొంతమందికి ఒక ఆలోచన వచ్చింది. “రాముడు లేని అయోధ్యలో మనం మాత్రం ఎందుకు. మనం కూడా రాముని వెంట అరణ్యములకు వెళుదాము. రాముడు ఎక్కడ ఉంటే అదే మనకు అయోధ్య” అని రాముని వెంట వెళ్లడానికి సిద్ధం అయ్యారు.

ఆ మాట ఆనోటా ఆనోటా పాకి అందరూ రాముని వెంట అడవులకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఇంతలో కైకేయీ వల్లనే ఇదంతా జరిగింది అని అందరికీ తెలిసిపోయింది. దాంతో వారి ఆలోచన బలపడింది.

“మనం అంతా అయోధ్యను విడిచి వెళ్లిపోతే ఇక్కడెవరుం టారు. ఇండ్లు అన్నీ పాడుపడిపోతాయి. అగ్నిహోత్రములు వెలగవు. పంటలు పండించే వాళ్లు ఉండరు. వీళ్లకు పనిపాటలు చేసేవాళ్లు ఉండరు. ఈ పాడుబడ్డ శ్మశానములాంటి అయోధ్యను కైక ఒక్కతే ఏలుకుంటుంది” అని కసిదీరా అనుకొన్నారు.

మరికొందరు “రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య. అరణ్యమే అయోధ్య. ఈ అయోధ్య అరణ్యము అవుతుంది.” అని శపిస్తున్నారు. ఇంకొంత మంది అయితే “ఒరేయ్! మనం అంతా రాముని వెంట అడవులకు వెళితే, మనలను చూచి, అడవులలో ఉన్న క్రూరమృగములు, ఏనుగులు, పాములు, తేళ్లు అన్నీ అడవులు వదిలి అయోధ్యలోకి వస్తాయి. అప్పుడు కైకకు మంచి శాస్త్రిఅవుతుంది. మనం అంతా రాముని పాలనలో అడవిలో సుఖంగా ఉంటే ఇక్కడ అయోధ్యలో కైక క్రూరమృగముల బారిన పడి నానా బాధలు పడుతుంది” అని కసిదీరా తిడుతున్నారు.

ఈ మాటలన్నీ రాముడు, సీత లక్ష్మణుడు వింటూ ముందుకు నడుస్తున్నారు. ముగ్గురూ దశరథమహారాజు మందిరమునకు సమీపించారు. మందిరము లోపల సుమంత్రుడు దీనంగా మొహం పెట్టుకొని కూర్చుని ఉన్నాడు. అతని చుట్టు కొంతమంది పౌరులు గుమిగూడి ఉన్నారు.
వారందరినీ చూచి రాముడు చిరునవ్వు నవ్వి వారిని పలకరించాడు. “సుమంత్రా! నేను, సీత, లక్ష్మణుడు వచ్చామని మహారాజు గారికి మనవి చెయ్యి.” అని అన్నాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ముప్పదిమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ చతుస్త్రింశః సర్గః (33) >>

Leave a Comment