Ayodhya Kanda Sarga 58 In Telugu – అయోధ్యాకాండ అష్టపంచాశః సర్గః

అయోధ్యాకాండ అష్టపంచాశః సర్గంలో, భరతుడు, వసిష్ఠ మహర్షి సహాయం తీసుకొని, తన తండ్రి దశరథ మహారాజు అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమవుతాడు. భరతుడు ఎంతో దుఃఖంలో ఉంటాడు, కానీ తండ్రి కర్తవ్యం అనుసరించేందుకు కృతనిశ్చయంతో ఉంటాడు. వసిష్ఠ మహర్షి నేతృత్వంలో దశరథ మహారాజు అంత్యక్రియలు నిర్వహించబడతాయి. రాముని తలచుకొని, భరతుడు మరింత దుఃఖంలో మునిగిపోతాడు. తండ్రికి తగినంత గౌరవం ఇవ్వాలని భరతుడు పట్టుదలతో ఉంటుంది. ఈ సర్గలో, భరతుడు తండ్రి మరణాన్ని ఎలా స్వీకరించాడో, తన బాధను ఎలా పక్కన పెట్టి, కర్తవ్యాన్ని నెరవేర్చాడో చూపిస్తుంది.

రామసందేశాఖ్యానమ్

ప్రత్యాశ్వస్తః యదా రాజా మోహాత్ ప్రత్యాగతః పునః |
అథాఽఽజుహావ తం సూతం రామవృత్తాంతకారణాత్ || ౧ ||

తదా సూతో మహారాజం కృతాంజలిరుపస్థితః|
రామమేవానుశోచంతం దుఃఖశోకసమన్వితమ్ || ౨ ||

వృద్ధం పరమ సంతప్తం నవగ్రహమివ ద్విపమ్ |
వినిఃశ్వసంతం ధ్యాయంతమస్వస్థమివ కుంజరమ్ || ౩ ||

రాజా తు రజసా ధూతం ధ్వస్తాంగం సముపస్థితమ్ |
అశ్రుపూర్ణముఖం దీనమువాచ పరమార్తవత్ || ౪ ||

క్వ ను వత్స్యతి ధర్మాత్మా వృక్ష మూలముపాశ్రితః |
సోఽత్యంతసుఖితః సూత కిమశిష్యతి రాఘవః || ౫ ||

దుఃఖస్యానుచితో దుఃఖం సుమంత్ర శయనోచితః |
భూమిపాలాత్మజో భూమౌ శేతే కథమనాథవత్ || ౬ ||

యం యాంతమనుయాంతి స్మ పదాతిరథకుంజరాః |
స వత్స్యతి కథం రామః విజనం వనమాశ్రితః || ౭ ||

వ్యాలైః మృగైః ఆచరితం కృష్ణసర్పనిషేవితమ్ |
కథం కుమారౌ వైదేహ్యా సార్ధం వనముపస్థితౌ || ౮ ||

సుకుమార్యా తపస్విన్యా సుమంత్ర సహ సీతయా |
రాజపుత్రౌ కథం పాదైః అవరుహ్య రథాద్గతౌ || ౯ ||

సిద్ధార్థః ఖలు సూత త్వం యేన దృష్టౌ మమాత్మజౌ |
వనాంతం ప్రవిశంతౌ తౌ అశ్వినావివ మందరమ్ || ౧౦ ||

కిమువాచ వచో రామః కిమువాచ చ లక్ష్మణః |
సుమంత్ర వనమాసాద్య కిమువాచ చ మైథిలీ || ౧౧ ||

ఆసితం శయితం భుక్తం సూత రామస్య కీర్తయ |
జీవిష్యామ్యహమేతేన యయాతిరివ సాధుషు || ౧౨ ||

ఇతి సూతో నరేంద్రేణ చోదితః సజ్జమానయా |
ఉవాచ వాచా రాజానం సబాష్పపరిరబ్ధయా || ౧౩ ||

అబ్రవీన్మాం మహారాజ ధర్మమేవానుపాలయన్ |
అంజలిం రాఘవః కృత్వా శిరసాఽభిప్రణమ్య చ || ౧౪ ||

సూత మద్వచనాత్తస్య తాతస్య విదితాత్మనః |
శిరసా వందనీయస్య వంద్యౌ పాదౌ మహాత్మనః || ౧౫ ||

సర్వమంతః పురం వాచ్యం సూత మద్వచనాత్త్వయా |
ఆరోగ్యమవిశేషేణ యథాఽర్హం చాభివాదనమ్ || ౧౬ ||

మాతా చ మమ కౌసల్యా కుశలం చాభివాదనమ్ |
అప్రమాదం చ వక్తవ్యా బ్రూయాశ్చైనామిదం వచః || ౧౭ ||

ధర్మనిత్యా యథాకాలమగ్న్యగారపరా భవ |
దేవి దేవస్య పాదౌ చ దేవవత్ పరిపాలయ || ౧౮ ||

అభిమానం చ మానం చ త్యక్త్వా వర్తస్వ మాతృషు |
అనురాజానమార్యాం చ కైకేయీమంబ కారయ || ౧౯ ||

కుమారే భరతే వృత్తిర్వర్తితవ్యా చ రాజవత్ |
అర్థజ్యేష్ఠా హి రాజానో రాజధర్మమనుస్మర || ౨౦ ||

భరతః కుశలం వాచ్యః వాచ్యో మద్వచనేన చ |
సర్వాస్వైవ యథాన్యాయం వృత్తిం వర్తస్వ మాతృషు || ౨౧ ||

వక్తవ్యశ్చ మహాబాహురిక్ష్వాకు కులనందనః |
పితరం యౌవరాజ్యస్థో రాజ్యస్థమనుపాలయ || ౨౨ ||

అతిక్రాంతవయా రాజా మాస్మైనం వ్యవరోరుధః |
కుమారరాజ్యే జీవత్వం తస్యైవాజ్ఞాప్రవర్తనాత్ || ౨౩ ||

అబ్రవీచ్చాపి మాం భూయో భృశమశ్రూణి వర్తయన్ |
మాతేవ మమ మాతా తే ద్రష్టవ్యా పుత్రగర్ధినీ || ౨౪ ||

ఇత్యేవం మాం మహారాజ బృవన్నేవ మహాయశాః |
రామః రాజీవ తామ్రాక్షో భృశమశ్రూణ్యవర్తయత్ || ౨౫ ||

లక్ష్మణస్తు సుసంక్రుద్ధో నిశ్శ్వసన్ వాక్యమబ్రవీత్ |
కేనాయమపరాధేన రాజపుత్రః వివాసితః || ౨౬ ||

రాజ్ఞా తు ఖలు కైకేయ్యా లఘుత్వాశ్రిత్య శాసనమ్ |
కృతం కార్యమకార్యం వా వయం యేనాభిపీడితాః || ౨౭ ||

యది ప్రవ్రాజితః రామః లోభకారణకారితమ్ |
వరదాననిమిత్తం వా సర్వథా దుష్కృతం కృతమ్ || ౨౮ ||

ఇదం తావద్యథాకామమీశ్వరస్య కృతే కృతమ్ |
రామస్య తు పరిత్యాగే న హేతుముపలక్షయే || ౨౯ ||

అసమీక్ష్య సమారబ్ధం విరుద్ధం బుద్ధి లాఘవాత్ |
జనయిష్యతి సంక్రోశం రాఘవస్య వివాసనమ్ || ౩౦ ||

అహం తావన్ మహారాజే పితృత్వం నోపలక్షయే |
భ్రాతా భర్తా చ బంధుశ్చ పితా చ మమ రాఘవః || ౩౧ ||

సర్వలోకప్రియం త్యక్త్వా సర్వలోకహితే రతమ్ |
సర్వలోకోఽనురజ్యేత కథం త్వాఽనేన కర్మణా || ౩౨ ||

సర్వప్రజాభిరామం హి రామం ప్రవ్రాజ్య ధార్మికమ్ |
సర్వలోకం విరుధ్యేమం కథం రాజా భవిష్యసి || ౩౩ ||

జానకీ తు మహారాజ నిఃశ్వసంతీ మనస్వినీ |
భూతోపహతచిత్తేవ విష్ఠితా విస్మితా స్థితా || ౩౪ ||

అదృష్ట పూర్వ వ్యసనా రాజ పుత్రీ యశస్వినీ |
తేన దుఃఖేన రుదతీ నైవ మాం కించిదబ్రవీత్ || ౩౫ ||

ఉద్వీక్షమాణా భర్తారం ముఖేన పరిశుష్యతా |
ముమోచ సహసా బాష్పం మాం ప్రయాంతముదీక్ష్య సా || ౩౬ ||

తథైవ రామోఽశ్రు ముఖః కృతాంజలిః
స్థితోఽభవల్లక్ష్మణబాహు పాలితః |
తథైవ సీతా రుదతీ తపస్వినీ
నిరీక్షతే రాజరథం తథైవ మామ్ || ౩౭ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టపంచాశః సర్గః || ౫౮ ||

Ayodhya Kanda Sarga 58 Meaning In Telugu

కొంచెం సేపటికి దశరథుడు తెప్పరిల్లాడు. సుమంత్రుని పిలిపించాడు. సుమంత్రుడు దశరథుని వద్దకు వెళ్లాడు. దశరథుడు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు. తల ఎత్తి సుమంత్రుని చూచి దశరథుడు ఇలాఅన్నాడు.

“సుమంత్రా! రాముడు ఎలా ఉన్నాడు? ఎక్కడ పడుకుంటు న్నాడు? ఏమి తింటున్నాడు? సుమంత్రా! రాముడు ఎన్నడూ అడవులలో ఉండలేదు. ఇటువంటి కష్టములు అతనికి తెలియవు. రాజ భోజన ములు ఆరగించి హంసతూలికా తల్పముల మీద శయనించు రాముడు అడవులలో కందమూలములు తింటూ, కటిక నేల మీద ఎలా పడుకుంటున్నాడో కదా! రాముడు ఎప్పుడు బయటకు వెళ్లినా అతని వెంట రథములు, కాల్బలములు, ఏనుగులు వెంట ఉండేవి. అవన్నీ లేకుండా అడవులలో ఎలా ఉంటున్నాడో కదా! సీతా రామ లక్ష్మణులు క్రూరజంతువులు, పాములు ఉన్న వనములలో ఎలా ఉంటున్నారో కదా!

సుమంత్రా! సీతారాములు నీ రథము దిగి అడవులలో ఎలా ప్రవేశించారు? ఏది ఏమైనా నా కన్నా నువ్వే అదృష్టవంతుడవు. రాముడు అడవులలో ప్రవేశించు వరకూ అతని వెన్నంటి ఉన్నావు. రాముడు, సీత, లక్ష్మణుడునాతో చెప్పమని ఏమన్నా చెప్పారా! వివరంగా చెప్పు.” అని అన్నాడు దశరథుడు.

సుమంత్రుడు ఇలా బదులుచెప్పాడు. “మహారాజా! రాముడు తమకు నమస్కరించి తమరితో ఇలా చెప్పమన్నాడు. “సుమంత్రా! నా తండ్రికి నేను తలవంచి నమస్కారము చేసానని చెప్పు. అంత:పురములోని అందరినీ వారు వీరు అనే బేధము లేకుండా పేరుపేరునా అడిగినట్టు చెప్పు. నా తల్లి కౌసల్యకు నేను తలవంచి అభివాదము చేసినట్టు చెప్పు. నా మాటలుగా నా తల్లికి ఈ విధంగా చెప్పు.

“అమ్మా! నీవు ధర్మము తప్పకుండా అగ్ని కార్యములు నిర్వర్తించుచూ నా తండ్రిదశరధునికి ఏ కష్టము రాకుండా సేవలు చేస్తూ ఉండు. అమ్మా! నీవు పట్టపు రాణివి అని అహంకరించకుండా దశరథుని ఇతర భార్యలనుకూడా ఆదరించు. నా తల్లి కైకను నా తండ్రి దశరథుని పట్ల అనుకూలంగా ఉండేట్టు చెయ్యి. అమ్మా! భరతుడు నీ కుమారుడే అయినప్పటికీ, అతనిని రాజుగానే గౌరవించు. అదే కదా రాజధర్మము. తల్లులందరి పట్లా ఆదర భావంతో ఉండమని నా మాటగా భరతునికి చెప్పు. భరతునితో నా మాటగా ఇలా చెప్పు:

“భరతా! నీ తండ్రి ఆజ్ఞ ప్రకారము నీవు అయోధ్యను పరిపాలించు. దశరథుడు వృద్ధుడైనాడు. అందుకని ఆయన మాటలను కూడా గౌరవిస్తూ, రాజ్యపాలన సాగించు. భరతా! నా తల్లి కౌసల్యను కూడా నీ తల్లి వలెనే ఆదరించు.” అని కౌసల్యకు చెప్పమని రాముడు నాతో చెప్పాడు.
మహారాజా! లక్ష్మణుడు మాత్రము చాలా కోపంతో తమతో ఇలా చెప్పమన్నాడు. “రాముడు ఏ నేరం చేసాడని రాజ్యము నుండి వెడలగొట్టారు. మహారాజు తన అధికారమును మరిచి కైక మాటలకు లోబడి మమ్ములను అడవులకు పంపాడు. దానివలన మేము ఎన్నో బాధలు పడుతున్నాము. రాజ్యముమీద దురాశతో గానీ, లేక వరములు అడుగు మిషమీద గానీ, అన్న మాటను నిలబెట్టుకోడం కోసం గానీ, కారణం ఏదైనా రాముని అడవులకు పంపడం దుషృత్యము.

తాను మహారాజు అనే అహంకారంతో రాముని అడవులకు పంపాడే కానీ, వేరు కాదు. కనీసము ఇది మంచా లేక చెడ్డా అనే ఆలోచించకుండా రాముని అడవులకు పంపడం చాలా శోచనీయము. అందుకనే నేను దశరథుని నా తండ్రిగా అంగీకరించడం లేదు. నాకు తల్లీ, తండ్రీ అన్నా అన్నీ రాముడే. ఎందుకంటే సకల జనులకు ఆరాధ్యుడైన రాముని విడిచి పెట్టిన వాడిని ఎవరు గౌరవిస్తారు. అయోధ్య ప్రజల అభీష్టమునకు విరుద్ధంగా రాముని అడవులకు పంపి వారి ఆగ్రహమునకు గురి అయిన దశరథుడు మహారాజుగా ఉండటానికి ఎంత మాత్రమూ అర్హుడు కాదు.” అని లక్ష్మణుడు అన్నాడు. శోక రాసిగా నిలిచిన సీత మాత్రమూ నాతో ఏమీ చెప్పలేదు. రాముని చూస్తూ కన్నీటి సముద్రంలో మునిగిపోయింది కానీ ఆ ఇల్లాలు ఎవరినీ ఒక్కమాట కూడా అనలేదు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఏబది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ఏకోనషష్ఠితమః సర్గః (59) >>

Leave a Comment