Ayodhya Kanda Sarga 60 In Telugu – అయోధ్యాకాండ షష్ఠితమః సర్గః

అయోధ్యాకాండ షష్ఠితమః సర్గలో, భరతుడు, తన మంత్రులతో మరియు సైనికులతో కలిసి చిత్తర్కూటానికి చేరుకుంటాడు. అక్కడ అతను రాముని ఆశ్రమానికి చేరుకొని, రాముడు, సీత, లక్ష్మణులను కలుస్తాడు. భరతుడు రాముని పాదాలపై పడి, అయోధ్యకు తిరిగి రావలసిందిగా ప్రార్థిస్తాడు. రాముడు తన తండ్రి వాగ్దానం పాటించాల్సిన కర్తవ్యం చెప్పి, తిరస్కరిస్తాడు. భరతుడు ఎంతో దుఃఖంతో, వనవాసం కొనసాగించాల్సిన అవసరం పట్ల బాధతో ఉంటుంది. ఈ సర్గలో, భరతుడి రాముడి పట్ల ప్రేమ, భక్తి, విధేయత, మరియు రాముని ధర్మపాలన ప్రధానాంశాలు. భరతుడి విన్నపాన్ని రాముడు తిరస్కరించడం, భరతుడి ఆవేదనను మరింతగా వ్యాక్యానిస్తుంది.

కౌసల్యాసమాశ్వాసనమ్

తతః భూతోపసృష్టేవ వేపమానా పునః పునః |
ధరణ్యాం గత సత్త్వేవ కౌసల్యా సూతమబ్రవీత్ || ౧ ||

నయ మాం యత్ర కాకుత్స్థః సీతా యత్ర చ లక్ష్మణః |
తాన్ వినా క్షణమప్యత్ర జీవితుం నోత్సహే హ్యహమ్ || ౨ ||

నివర్తయ రథం శీఘ్రం దండకాన్నయ మామపి |
అథ తాన్నానుగచ్ఛామి గమిష్యామి యమక్షయమ్ || ౩ ||

బాష్ప వేగోపహతయా స వాచా సజ్జమానయా |
ఇదమాశ్వాసయన్ దేవీం సూతః ప్రాంజలిరబ్రవీత్ || ౪ ||

త్యజ శోకం చ మోహం చ సంభ్రమం దుఃఖజం తథా |
వ్యవధూయ చ సంతాపం వనే వత్స్యతి రాఘవః || ౫ ||

లక్ష్మణశ్చాపి రామస్య పాదౌ పరిచరన్ వనే |
ఆరాధయతి ధర్మజ్ఞః పరలోకం జితేంద్రియః || ౬ ||

విజనేఽపి వనే సీతా వాసం ప్రాప్య గృహేష్వివ |
విస్రంభం లభతేఽభీతా రామే సంన్యస్తమానసా || ౭ ||

నాస్యా దైన్యం కృతం కించిత్ సుసూక్ష్మమపి లక్ష్యతే |
ఉచితేవ ప్రవాసానాం వైదేహీ ప్రతిభాతి మా || ౮ ||

నగరోపవనం గత్వా యథా స్మ రమతే పురా |
తథైవ రమతే సీతా నిర్జనేషు వనేష్వపి || ౯ ||

బాలేవ రమతే సీతా బాలచంద్రనిభాననా |
రామా రామే హ్యదీనాత్మా విజనేఽపి వనే సతీ || ౧౦ ||

తద్గతం హృదయం హ్యస్యాస్తదధీనం చ జీవితమ్ |
అయోధ్యాఽపి భవేత్తస్యాః రామహీనా తథా వనమ్ || ౧౧ ||

పరి పృచ్ఛతి వైదేహీ గ్రామాంశ్చ నగరాణి చ |
గతిం దృష్ట్వా నదీనాం చ పాదపాన్ వివిధానపి || ౧౨ ||

రామం హి లక్ష్మణం వాఽపి పృష్ట్వా జానాతి జానకీ |
అయోధ్యాక్రోశమాత్రే తు విహారమివ సంశ్రితా || ౧౩ ||

ఇదమేవ స్మరామ్యస్యాః సహసైవోపజల్పితమ్ |
కైకేయీసంశ్రితం వాక్యం నేదానీం ప్రతిభాతి మా || ౧౪ ||

ధ్వంసయిత్వా తు తద్వాక్యం ప్రమాదాత్పర్యుపస్థితమ్ |
హ్లదనం వచనం సూతో దేవ్యా మధురమబ్రవీత్ || ౧౫ ||

అధ్వనా వాత వేగేన సంభ్రమేణాతపేన చ |
న విగచ్ఛతి వైదేహ్యాశ్చంద్రాంశు సదృశీ ప్రభా || ౧౬ ||

సదృశం శతపత్రస్య పూర్ణ చంద్రోపమ ప్రభమ్ |
వదనం తద్వదాన్యాయాః వైదేహ్యా న వికంపతే || ౧౭ ||

అలక్తరసరక్తాభౌ అలక్తరసవర్జితౌ |
అద్యాపి చరణౌ తస్యాః పద్మకోశసమప్రభౌ || ౧౮ ||

నూపురోద్ఘుష్ట హేలేవ ఖేలం గచ్ఛతి భామినీ |
ఇదానీమపి వైదేహీ తద్రాగాన్న్యస్తభూషణా || ౧౯ ||

గజం వా వీక్ష్య సింహం వా వ్యాఘ్రం వా వనమాశ్రితా |
నాహారయతి సంత్రాసం బాహూ రామస్య సంశ్రితా || ౨౦ ||

న శోచ్యాస్తే న చాత్మానః శోచ్యో నాపి జనాధిపః |
ఇదం హి చరితం లోకే ప్రతిష్ఠాస్యతి శాశ్వతమ్ || ౨౧ ||

విధూయ శోకం పరిహృష్టమానసా
మహర్షియాతే పథి సువ్యవస్థితాః |
వనే రతా వన్యఫలాశనాః పితుః
శుభాం ప్రతిజ్ఞాం పరిపాలయంతి తే || ౨౨ ||

తథాఽపి సూతేన సుయుక్తవాదినా
నివార్యమాణా సుత శోకకర్శితా |
న చైవ దేవీ విరరామ కూజితాత్
ప్రియేతి పుత్రేతి చ రాఘవేతి చ || ౨౩ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షష్ఠితమః సర్గః || ౬౦ ||

ఇంతలో కౌసల్య సుమంత్రుని చూచి ఏడుస్తూ ఇలా అంది. “సుమంత్రా! నేను రాముని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. నన్ను కూడా రాముని వద్దకు తీసుకొనిపో. నీవు నన్ను రాముని వద్దకు తీసుకొని పోతావా లేక నన్ను యమలోకానికి పొమ్మంటావా నువ్వే చెప్పు. రథమును వెనక్కు మరల్చు.” అని ఆవేశంతో పలికింది కౌసల్య.

అప్పుడు సుమంత్రుడు చేతులు జోడించి ఇలా అన్నాడు. “అమ్మా! మీరు శోకమును వదిలిపెట్టండి. రాముడికి అడవులలో ఏ కష్టమూ రాదు. లక్ష్మణుడు రాముని పక్కన ఉండగా రామునికి ఏలోటూ రాదు. ఇంక సీత కూడా ఇక్కడ ఉన్నట్టే అక్కడ కూడా ఉంది. ఏ మాత్రం భయం బాధ పడటం లేదు. భర్తతో సంతోషంగా ఉంది. ఇక్కడ ఉద్యానవనములలో ఎలా విహరిస్తూ ఉందో అడవులలో కూడా అలాగే విహరిస్తూ ఉంది. సీత తనకు ఇచ్చిన ఆభరణములు ధరించి ఎంతో ఉల్లాసంగా ఉద్యానవనములో తిరుగుతున్నట్టు అడవులలో విహరిస్తూ ఉంది. ఆమెలో ఆత్మ విశ్వాసము కనపడుతూ ఉంది. ఏ మాత్రం దు:ఖము కనపడటం లేదు.

సీత హృదయము ఎల్లప్పుడూ రాముని యందే లగ్నం అయి ఉంది. రాముడు ఎక్కడ ఉంటే అదే ఆమెకు అయోధ్య. రాముడు లేని అయోధ్య సీతకు అడవులతో సమానమే. కాబట్టి మనము రామ లక్ష్మణుల గురించి గానీ సీత గురించి గానీ శోకించనవసరము లేదు. ఇంక సీత కైకను గురించి ఏమేమో అన్నది కానీ నాకు గుర్తు లేదు. కానీ సీతారామలక్ష్మణులు మాత్రం ఎంతో ఉల్లాసంగా ఉన్నారు అని మాత్రం చెప్పగలను.” అని సుమంత్రుడు పరి పరి విధాలుగా ఓదారుస్తున్నా కౌసల్య తన దు:ఖము మానలేదు. రామా రామా అని పలవరిస్తూ ఉంది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము అరువదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ఏకషష్ఠితమః సర్గః (61) >>

Leave a Comment