Ayodhya Kanda Sarga 78 In Telugu – అయోధ్యాకాండ అష్టసప్తతితమః సర్గః

అయోధ్యాకాండ సప్తసప్తతితమః సర్గములో, భరతుడు రాముని ఆశ్రమానికి చేరి ఆయనకు సమర్పణను చెప్పాడు. రాముడు తన తమ్ముడిని ఆలింగనం చేసి సంతాపం వ్యక్తం చేశాడు. భరతుడు రాముని అయోధ్యకు తిరిగి రావాలని, తాను పాదుకలు మాత్రమే ధరించి రాజ్యం పరిపాలిస్తానని కోరాడు. రాముడు తండ్రి చిత్తానికి ప్రతిబంధకుడు కావడం ఇష్టం లేక, తన నిర్ణయం మార్చుకోకుండా అడవిలో ఉండాలని నిశ్చయించుకున్నాడు. భరతుడు రాముని పాదుకలను తీసుకుని తిరిగి అయోధ్యకు వెళ్ళి, అవి పీఠంపై ఉంచి రాముడి హస్తంతోనే పరిపాలన చేయాలని ప్రతిజ్ఞ చేశాడు. ఇది వాక్కులు, పాదుకల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

కుబ్జావిక్షేపః

అథ యాత్రాం సమీహంతం శత్రుఘ్నః లక్ష్మణానుజః |
భరతం శోకసంతప్తమిదం వచనమబ్రవీత్ || ౧ ||

గతిర్యః సర్వ భూతానాం దుఃఖే కిం పునరాత్మనః |
స రామః సత్త్వసంపన్నః స్త్రియా ప్రవ్రాజితః వనమ్ || ౨ ||

బలవాన్ వీర్యసంపన్నో లక్ష్మణో నామ యోఽప్యసౌ |
కిం న మోచయతే రామం కృత్వా అపి పితృనిగ్రహమ్ || ౩ ||

పూర్వమేవ తు నిగ్రాహ్యః సమవేక్ష్య నయానయౌ |
ఉత్పథం యః సమారూఢో నార్యా రాజా వశం గతః || ౪ ||

ఇతి సంభాషమాణే తు శత్రుఘ్నే లక్ష్మణానుజే |
ప్రాగ్ద్వారేఽభూత్తదా కుబ్జా సర్వాభరణభూషితా || ౫ ||

లిప్తా చందనసారేణ రాజవస్త్రాణి బిభ్రతీ |
వివిధం వివిధైస్తైస్తైర్భూషణైశ్చ విభూషితా || ౬ ||

మేఖలాదామభిశ్చిత్రైః అన్యైశ్చ శుభభూషణైః |
బభాసే బహుభిర్బద్ధా రజ్జుబద్ధేవ వానరీ || ౭ ||

తాం సమీక్ష్య తదా ద్వాస్థాః సుభృశం పాపకారిణీమ్ |
గృహీత్వాఽకరుణం కుబ్జాం శత్రుఘ్నాయ న్యవేదయత్ || ౮ ||

యస్యాః కృతే వనే రామర్న్యస్త దేహశ్చ వః పితా |
సేయం పాపా నృశంసా చ తస్యాః కురు యథామతి || ౯ ||

శత్రుఘ్నశ్చ తదాజ్ఞాయ వచనం భృశదుఃఖితః |
అంతఃపురచరాన్ సర్వాన్ ఇత్యువాచ ధృతవ్రతః || ౧౦ ||

తీవ్రముత్పాదితం దుఃఖం భ్రాతౄణాం మే తథా పితుః |
యయా సేయం నృశంసస్య కర్మణః ఫలమశ్నుతామ్ || ౧౧ ||

ఏవముక్తా తు తేనాశు సఖీజనసమావృతా |
గృహీతా బలవత్ కుబ్జా సా తద్గృహమనాదయత్ || ౧౨ ||

తతః సుభృశ సంతప్తస్తస్యాః సర్వః సఖీజనః |
క్రుద్ధమాజ్ఞాయ శత్రుఘ్నం వ్యపలాయత సర్వశః || ౧౩ ||

ఆమంత్రయత కృత్స్నశ్చ తస్యాః సర్వసఖీజనః |
యథాఽయం సముపక్రాంతర్నిశ్శేషం నః కరిష్యతి || ౧౪ ||

సానుక్రోశాం వదాన్యాం చ ధర్మజ్ఞాం చ యశస్వినీమ్ |
కౌసల్యాం శరణం యామః సా హి నోఽస్తు ధ్రువా గతిః || ౧౫ ||

స చ రోషేణ తామ్రాక్షః శత్రుఘ్నః శత్రుతాపనః |
విచకర్ష తదా కుబ్జాం క్రోశంతీం ధరణీతలే || ౧౬ ||

తస్యా హ్యాకృష్యమాణాయా మంథరాయాస్తతస్తతః |
చిత్రం బహువిధం భాండం పృథివ్యాం తద్వ్యశీర్యత || ౧౭ ||

తేన భాండేన సంస్తీర్ణం శ్రీమద్రాజనివేశనమ్ |
అశోభత తదా భూయః శారదం గగనం యథా || ౧౮ ||

స బలీ బలవత్క్రోధాద్గృహీత్వా పురుషర్షభః |
కైకేయీమభినిర్భర్త్స్య బభాషే పరుషం వచః || ౧౯ ||

తైః వాక్యైః పరుషైర్దుఃఖైః కైకేయీ భృశదుఃఖితా |
శత్రుఘ్నభయసంత్రస్తా పుత్రం శరణమాగతా || ౨౦ ||

తాం ప్రేక్ష్య భరతః క్రుద్ధం శత్రుఘ్నమిదమబ్రవీత్ |
అవధ్యాః సర్వభూతానాం ప్రమదాః క్షమ్యతామితి || ౨౧ ||

హన్యామహమిమాం పాపాం కైకేయీం దుష్టచారిణీమ్ |
యది మాం ధార్మికో రామర్నాసూయేన్మాతృ ఘాతకమ్ || ౨౨ ||

ఇమామపి హతాం కుబ్జాం యది జానాతి రాఘవః |
త్వాం చ మాం చైవ ధర్మాత్మా నాభిభాషిష్యతే ధ్రువమ్ || ౨౩ ||

భరతస్య వచః శ్రుత్వా శత్రుఘ్నః లక్ష్మణానుజః |
న్యవర్తత తతః రోషాత్ తాం ముమోచ చ మంథరామ్ || ౨౪ ||

సా పాదమూలే కైకేయ్యాః మంథరా నిపపాత హ |
నిశ్శ్వసంతీ సుదుఃఖార్తా కృపణం విలలాప చ || ౨౫ ||

శత్రుఘ్న విక్షేప విమూఢసంజ్ఞామ్
సమీక్ష్య కుబ్జాం భరతస్య మాతా |
శనైః సమాశ్వాసయదార్తరూపామ్
క్రౌంచీం విలగ్నామివ వీక్షమాణామ్ || ౨౬ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టసప్తతితమః సర్గః || ౭౮ ||

Ayodhya Kanda Sarga 78 Meaning In Telugu

దశరథ మహారాజు కర్మకాండలు అన్నీ పూర్తి అయ్యాయి. తదుపరి కార్యక్రమము గురించి ఆలోచిస్తున్నాడు భరతుడు. ఎందుకంటే ప్రస్తుతము అయోధ్యకు రాజులేడు. రాజు లేకుండా రాజ్యము ఉండకూడదు. అందుకని వెంటనే భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి. కాని ముందుగా రాముని కలుసుకొని రాముని అనుమతి పొందాలని భరతుడు అనుకుంటున్నాడు. ఆ సమయంలో శత్రుఘ్నుడు భరతుని వద్దకు వచ్చాడు. భరతునితో ఇలా అన్నాడు.

“భరతా! మనము ఇంట లేని సమయములో ఒక ఆడుది రాముని అడవులకు పంపి వేసినది. రాముడు తండ్రి మాటను పాటించాడు. లక్ష్మణునికి ఏమయింది. కనీసం లక్ష్మణుడు అయినా దశరథుని కట్టడి చేసి ఆ వనవాసమును ఆపవచ్చు కదా! స్త్రీలోలత్వముతో వరములు ఇచ్చిన మహారాజును ముందే కట్టడి చేసినచో వ్యవహారము ఇంతదూరము వచ్చిఉండెడిది కాదు. అలా లక్ష్మణుడు ఎందుకు చేయలేదో అర్థం కావడం లేదు.” అని అన్నాడు శత్రుఘ్నుడు. ఆ సమయంలో ఒంటి నిండా నగలు వేసుకొని కైక దాసి మంథరం అటుగా వెళుతూ ఉంది. ఆమెను చూచాడు శత్రుఘ్నుడు.

ఒంటినిండా నగలు అలంకరించు కున్న మంథర శత్రుఘ్నునికి తాళ్లతో కట్టిన ఆడకోతి లాగ కనపడింది. ఈ అనర్థములకు అన్నిటికీ మూలము మంథర అని అందరికీ తెలుసు. అందుకని ద్వారపాలకుడు మంథరను పట్టుకొని శత్రుఘ్నుని వద్దకు తీసుకొని వచ్చారు.

“శత్రుఘ్నకుమారా! ఈమె కైక ఆంతరంగిక దాసి. పేరు మంథర. ఈమె రాముని వనవాసమునకు, మహారాజు మరణమునకు, కారణము. ఈమెను నీ ముందర నిలబెట్టాము. ఈమెను నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి.” అని అన్నారు.

ఆ మాటలు విన్న శత్రుఘ్నునికి కోపం మిన్నుముట్టింది. “మా అన్నదమ్ములకు మా మహారాజుకు తీరని అపకారము చేసిన ఈ దాసికి తగిన గుణపాఠము చెబుతాను.” అని అన్నాడు. ఆసమయంలో మంథర తో వచ్చిన వాళ్లు శత్రుఘ్నుని కోపం చూచి తలొకదిక్కుకూ పారిపోయారు. “ఈరోజు మంథర శత్రుఘ్నుని చేతిలో చచ్చింది” అని అందరూ అనుకున్నారు.

కొందరు గబగబా కౌసల్యకు ఈ వార్త చెప్పడానికి వెళ్లారు. శత్రుఘ్నుడు మంధరను నేల మీద పడేసి ఈడ్చుకుంటూ వచ్చాడు. మక్కువతో మంధర అలంకరించుకున్న ఆభరణములు అన్నీ నేల మీద “చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇంతలో కైక అక్కడికి వచ్చింది. శత్రుఘ్నుడు మంథర మెడ పట్టుకొని తిడుతున్నాడు. కైకకు భయం వేసింది. భరతుని వద్దకు పోయి మంథరను కాపాడమని బతిమాలింది.

భరతుడు శత్రుఘ్నుని చూచి “శత్రుఘ్నా! ఆగు. ఎంత అపరాథము చేసినా స్త్రీలను చంపరాదు.. కాబట్టి మంథరను విడిచి పెట్టు. దాని పాపాన అదే పోతుంది. అంతెందుకు నాకు వచ్చిన కోపానికి నిన్ననే నేను మా తల్లి కైకను చంపి ఉండేవాడిని. కాని రాముడికి అది ఇష్టంలేదు. అందుకని నాకోపాన్ని దిగమింగుకొని ఊరుకున్నాను. ఈ మంథర ఒక దాసి. ఆమె ఏమి చేస్తుంది. ఆమెను క్షమించు.” అని అన్నాడు భరతుడు. భరతుని మాటలకు శత్రుఘ్నుడు తనకోపాన్ని దిగమింగుకొని మంథరను విడిచిపెట్టాడు. మంథర కైక పాదాల మీద పడి ఏడుస్తూ ఉంది. కైక ఆమెను ఓదారుస్తూ ఉంది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బడి ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ఏకోనాశీతితమః సర్గః (79) >>

Leave a Comment