Aranya Kanda Sarga 12 In Telugu – అరణ్యకాండ ద్వాదశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” ద్వాదశః సర్గలో, రాముడు, లక్ష్మణుడు, సీత అగస్త్య మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశిస్తారు. అగస్త్య మహర్షి కూడా చాలా కాలం పాటు రాముడిని స్వీకరించడానికి వేచి ఉన్నాడు మరియు ఇప్పుడు వారిని అన్ని గౌరవాలతో స్వీకరిస్తాడు, రాముడిని విష్ణువు అవతారంగా గ్రహించాడు. అగస్త్య మహర్షి విష్ణువు యొక్క దివ్యమైన ధనుస్సును, ఎప్పుడూ బాణాలతో నిండిన రెండు వణుకులను మరియు బంగారు తొడుగులో బంగారు ఖడ్గాన్ని రాముడికి ఇస్తాడు, అదే ఆయుధాలతో విష్ణువు ఒకప్పుడు భూమిపై చెడును నిర్మూలించాడని చెప్పాడు.

అగస్త్యదర్శనమ్

స ప్రవిశ్యాశ్రమపదం లక్ష్మణో రాఘవానుజః |
అగస్త్యశిష్యమాసాద్య వాక్యమేతదువాచ హ ||

1

రాజా దశరథో నామ జ్యేష్ఠస్తస్య సుతో బలీ |
రామః ప్రాప్తో మునిం ద్రష్టుం భార్యయా సహ సీతయా ||

2

లక్ష్మణో నామ తస్యాహం భ్రాతా త్వవరజో హితః |
అనుకూలశ్చ భక్తశ్చ యది తే శ్రోత్రమాగతః ||

3

తే వయం వనమత్యుగ్రం ప్రవిష్టాః పితృశాసనాత్ |
ద్రష్టుమిచ్ఛామహే సర్వే భగవంతం నివేద్యతామ్ ||

4

తస్య తద్వచనం శ్రుత్వా లక్ష్మణస్య తపోధనః |
తథేత్యుక్త్వాఽగ్నిశరణం ప్రవివేశ నివేదితుమ్ ||

5

స ప్రవిశ్య మునిశ్రేష్ఠం తపసా దుష్ప్రధర్షణమ్ |
కృతాంజలిరువాచేదం రామాగమనమంజసా ||

6

యథోక్తం లక్ష్మణేనైవ శిష్యోఽగస్త్యస్య సమ్మతః |
పుత్రౌ దశరథస్యేమౌ రామో లక్ష్మణ ఏవ చ ||

7

ప్రవిష్టావాశ్రమపదం సీతయా సహ భార్యయా |
ద్రష్టుం భవంతమాయాతౌ శుశ్రూషార్థమరిందమౌ ||

8

యదత్రానంతరం తత్త్వమాజ్ఞాపయితుమర్హసి |
తతః శిష్యాదుపశ్రుత్య ప్రాప్తం రామం సలక్ష్మణమ్ ||

9

వైదేహీం చ మహాభాగామిదం వచనమబ్రవీత్ |
దిష్ట్యా రామశ్చిరస్యాద్య ద్రష్టుం మాం సముపాగతః ||

10

మనసా కాంక్షితం హ్యస్య మయాప్యాగమనం ప్రతి |
గమ్యతాం సత్కృతో రామః సభార్యః సహలక్ష్మణః ||

11

ప్రవేశ్యతాం సమీపం మే కిం చాసౌ న ప్రవేశితః |
ఏవముక్తస్తు మునినా ధర్మజ్ఞేన మహాత్మనా ||

12

అభివాద్యాబ్రవీచ్ఛిష్యస్తథేతి నియతాంజలిః |
తతో నిష్క్రమ్య సంభ్రాంతః శిష్యో లక్ష్మణమబ్రవీత్ ||

13

క్వాసౌ రామో మునిం ద్రష్టుమేతు ప్రవిశతు స్వయమ్ |
తతో గత్వాఽఽశ్రమద్వారం శిష్యేణ సహ లక్ష్మణః ||

14

దర్శయామాస కాకుత్స్థం సీతాం చ జనకాత్మజామ్ |
తం శిష్యః ప్రశ్రితో వాక్యమగస్త్యవచనం బ్రువన్ ||

15

ప్రావేశయద్యథాన్యాయం సత్కారార్హం సుసత్కృతమ్ |
ప్రవివేశ తతో రామః సీతయా సహ లక్ష్మణః ||

16

ప్రశాంతహరిణాకీర్ణమాశ్రమం హ్యవలోకయన్ |
స తత్ర బ్రహ్మణః స్థానమగ్నేః స్థానం తథైవ చ ||

17

విష్ణోః స్థానం మహేంద్రస్య స్థానం చైవ వివస్వతః |
సోమస్థానం భగస్థానం స్థానం కౌబేరమేవ చ ||

18

ధాతుర్విధాతుః స్థానే చ వాయోః స్థానం తథైవ చ |
నాగరాజస్య చ స్థానమనంతస్య మహాత్మనః ||

19

స్థానం తథైవ గాయత్ర్యా వసూనాం స్థానమేవ చ |
స్థానం చ పాశహస్తస్య వరుణస్య మహాత్మనః ||

20

కార్తికేయస్య చ స్థానం ధర్మస్థానం చ పశ్యతి |
తతః శిష్యైః పరివృతో మునిరప్యభినిష్పతత్ ||

21

తం దదర్శాగ్రతో రామో మునీనాం దీప్తతేజసామ్ |
అబ్రవీద్వచనం వీరో లక్ష్మణం లక్ష్మివర్ధనమ్ ||

22

ఏష లక్ష్మణ నిష్క్రామత్యగస్త్యో భగవానృషిః |
ఔదార్యేణావగచ్ఛామి నిధానం తపసామిమమ్ ||

23

ఏవముక్త్వా మహాబాహురగస్త్యం సూర్యవర్చసమ్ |
జగ్రాహ పరమప్రీతస్తస్య పాదౌ పరంతపః ||

24

అభివాద్య తు ధర్మాత్మా తస్థౌ రామః కృతాంజలిః |
సీతయా సహ వైదేహ్యా తదా రామః సలక్ష్మణః ||

25

ప్రతిజగ్రాహ కాకుత్స్థమర్చయిత్వాసనోదకైః |
కుశలప్రశ్నముక్త్వా చ హ్యాస్యతామితి చాబ్రవీత్ ||

26

అగ్నిం హుత్వా ప్రదాయార్ఘ్యమతిథీన్ప్రతిపూజ్య చ |
వానప్రస్థేన ధర్మేణ స తేషాం భోజనం దదౌ ||

27

ప్రథమం చోపవిశ్యాథ ధర్మజ్ఞో మునిపుంగవః |
ఉవాచ రామమాసీనం ప్రాంజలిం ధర్మకోవిదమ్ ||

28

అగ్నిం హుత్వా ప్రదాయార్ఘ్యమతిథిం ప్రతిపూజయేత్ |
అన్యథా ఖలు కాకుత్స్థ తపస్వీ సముదాచరన్ ||

29

దుఃసాక్షీవ పరే లోకే స్వాని మాంసాని భక్షయేత్ |
రాజా సర్వస్య లోకస్య ధర్మచారీ మహారథః ||

30

పూజనీయశ్చ మాన్యశ్చ భవాన్ప్రాప్తః ప్రియాతిథిః |
ఏవముక్త్వా ఫలైర్మూలైః పుష్పైరన్యైశ్చ రాఘవమ్ ||

31

పూజయిత్వా యథాకామం పునరేవ తతోఽబ్రవీత్ |
ఇదం దివ్యం మహచ్చాపం హేమరత్నవిభూషితమ్ ||

32

వైష్ణవం పురుషవ్యాఘ్ర నిర్మితం విశ్వకర్మణా |
అమోఘః సూర్యసంకాశో బ్రహ్మదత్తః శరోత్తమః ||

33

దత్తౌ మమ మహేంద్రేణ తూణీ చాక్షయసాయకౌ |
సంపూర్ణౌ నిశితైర్బాణైర్జ్వలద్భిరివ పావకైః ||

34

మహారజత కోశోఽయమసిర్హేమవిభూషితః |
అనేన ధనుషా రామ హత్వా సంఖ్యే మహాసురాన్ ||

35

ఆజహార శ్రియం దీప్తాం పురా విష్ణుర్దివౌకసామ్ |
తద్ధనుస్తౌ చ తూణీరౌ శరం ఖడ్గం చ మానద ||

36

జయాయ ప్రతిగృహ్ణీష్వ వజ్రం వజ్రధరో యథా |
ఏవముక్త్వా మహాతేజాః సమస్తం తద్వరాయుధమ్ |
దత్త్వా రామాయ భగవానగస్త్యః పునరబ్రవీత్ ||

37

Aranya Kanda Sarga 12 Meaning In Telugu PDF

రాముని ఆదేశానుసారము లక్ష్మణుడు అగస్త్యముని ఆశ్రమంలోకి వెళ్లాడు. లోపల అగస్త్యముని శిష్యుని వద్దకు పోయి “అయోధ్యాధీశుడు, దశరధ మహారాజు కుమారుడు, రాముడు, తన భార్య సీతతో సహా అగస్యులవారి దర్శనానికి వచ్చి వేచి ఉన్నారని మనవి చెయ్యి” అని అన్నాడు.

ఆ శిష్యుడు లక్ష్మణుని చూచి “మీరు ఎవరు?” అని అడిగాడు.

“నేను రాముని తమ్ముడను. లక్ష్మణుడను, సదా రాముని హితము కోరేవాడిని. రాముడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము అరణ్యవాసము చేయుచున్నాడు. ఆయన భార్య సీత, నేను ఆయనను అనుసరించు చున్నాము. ” అని అన్నాడు.

“మంచిది. మీరు ఇక్కడే ఉండండి. నేను మహర్షులవారికి మీ గురించి చెప్పి వస్తాను.” అని లోపలకు వెళ్లాడు.

అగ్ని గృహములో ఉన్న అగస్త్యుని వద్దకు పోయి రాముడు, లక్ష్మణుడు, సీత రాక గురించి తెలిపాడు. ఆ మాటలు వినిన అగస్యుడు ఎంతో సంతోషించాడు.

“ఎన్నోనాళ్ల నుండి నేను రాముని దర్శనము కొరకు ఎదురుచూస్తున్నాను. ఇంతకాలానికి రాముడు నన్నే వెదుకు కొనుచూ నా వద్దకు వచ్చాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. నీవు వెంటనే పోయి రాముని, సీతను, లక్ష్మణుని సగౌరవంగా నా వద్దకు తీసుకొని రా. అయినా రాముని రాక గురించి నాకు చెప్పవలెనా. రాముని అంతసేపు బయట నిలబెట్టవలెనా. వెంటనే నావద్దకు తీసుకొని రావలదా! ” అని శిష్యునితో అన్నాడు.

వెంటనే ఆ శిష్యుడు పరుగు పరుగున రాముని వద్దకు పోయి “రాముడు ఎక్కడ? రాముడు ఎక్కడ? రామునికి ఎలాంటి అనుమతి అవసరం లేదు. వెంటనే లోపలకు రావచ్చును.” అని అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు ఆ శిష్యునకు ద్వారము వద్ద ఉన్న రాముని సీతను చూపించాడు. వెంటనే ఆ శిష్యుడు రాముని గౌరవించి, సత్కరించి అగస్త్యుని వద్దకు తీసుకొని వెళ్లాడు.

రాముడు లోపలకు రావడం చూచి అగస్త్యుడు రామునికి ఎదురు వచ్చాడు. రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.

“లక్ష్మణా! అటు చూడు! అగ్ని వలె వెలుగుతున్న అగస్త్యమహర్షి మనకోసం వస్తున్నాడు.” అని అన్నాడు.

రాముడు అగస్త్యుని పాదాల మీద పడి నమస్కరించాడు. తరువాత సీత, లక్ష్మణుడు కూడా మహామునికి పాద నమస్కారము చేసారు. అగస్త్యుడు రామునికి అర్ఘ్యము, పాద్యము ఇచ్చాడు. ఒక ఆసనము చూపించాడు. తరువాత అగ్నిహోత్రము ముగించుకొని, అతిథిపూజ చేసి రామలక్ష్మణులకు సీతకు ఆహారము ఇచ్చాడు. భోజన కార్యక్రమము అయిన తరువాత రాముడు అగస్త్యుని పక్కనే ఒదిగి కూర్చున్నాడు. అగస్త్యుడు రామునితో ఇలా అన్నాడు.

“రామా! ముందుగా అగ్నిహోత్రము చేసి, అతిధులను పూజించి, తరువాత భోజనము చేయవలెను. అలాచేయని వాడు నరకానికి పోతాడు.

రామా! నీవు క్షత్రియుడవు. అయోధ్యకు రాజువు. ధర్మము తెలిసినవాడవు. అందరి చేతా గౌరవింప తగినవాడవు. అలాంటి నీవు ఈ రోజు మాకు అతిథిగా వచ్చావు. మాకు చాలా సంతోషంగా ఉంది.

రామా! నీకు కొన్ని ఆయుధములను ఇస్తాను. ఇది విష్ణుదేవుని ధనుస్సు. ఇది విశ్వకర్మ నిర్మించాడు. ఇది అక్షయతూణీరము. ఈ తూణీరములో బాణములు ఎప్పటికీ నిండుగా ఉంటాయి. ఈ ఖడ్గము దేవేంద్రుడు ఇచ్చాడు.

ఇవన్నీ దివ్యమైన ఆయుధములు. ఇవన్నీ విష్ణువు, ఇంద్రుడు దేవాసుర యుద్ధములో ఉపయోగించి విజయలక్ష్మిని వరించారు. ఈ ఆయుధములను నీవు స్వీకరించు. నీకు జయం కలుగుతుంది.” అని పలికి అగస్త్యుడు దివ్యమైన ధనుర్బాణములను, ఖడ్గమును రామునికి ఇచ్చాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పన్నెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ త్రయోదశః సర్గః (13) >>

Leave a Comment