Ayodhya Kanda Sarga 79 In Telugu – అయోధ్యాకాండ ఏకోనాశీతితమః సర్గః

అయోధ్యాకాండ ఏకోనాశీతితమః సర్గములో, భరతుడు చిత్తతో రాముడిని అనుసరించి అరణ్యానికి చేరుకున్నాడు. అతని వెంట సుమంతుడు, వశిష్టుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి తదితరులు ఉన్నారు. రాముడు తన తల్లి కౌసల్యను పలకరించి ఆశీర్వాదం అందుకున్నాడు. భరతుడు రాముని పాదాలను తాకి అయోధ్యకు తిరిగి రావాలని వేడుకున్నాడు. రాముడు తన పాదుకలను భరతునికి సమర్పించి, అవి ఆయుధాలుగా రాజ్యం పరిపాలించమని ఆదేశించాడు. భరతుడు పాదుకలను తీసుకొని, రాముడి ఆజ్ఞ ప్రకారం నందిగ్రామంలో ఉంటూ, రాముడి ప్రతినిధిగా రాజ్యపాలన చేయడానికి తిరిగి వెళ్ళాడు. భరతుడి త్యాగం, భక్తి, సోదర ప్రేమ ఈ సర్గలో స్పష్టంగా దర్శనమిస్తుంది.

సచివప్రార్థనాప్రతిషేధః

తతః ప్రభాతసమయే దివసే చ చతుర్దశే |
సమేత్య రాజకర్తారః భరతం వాక్యమబ్రువన్ || ౧ ||

గతర్దశరథః స్వర్గం యో నో గురుతరః గురుః |
రామం ప్రవ్రాజ్య వై జ్యేష్ఠం లక్ష్మణం చ మహాబలమ్ || ౨ ||

త్వమద్య భవ నో రాజా రాజపుత్ర మహాయశః |
సంగత్యా నాపరాధ్నోతి రాజ్యమేతదనాయకమ్ || ౩ ||

ఆభిషేచనికం సర్వమిదమాదాయ రాఘవ |
ప్రతీక్షతే త్వాం స్వజనః శ్రేణయశ్చ నృపాత్మజ || ౪ ||

రాజ్యం గృహాణ భరత పితృపైతామహం మహత్ |
అభిషేచయ చాత్మానం పాహి చాస్మాన్నరర్షభ || ౫ ||

[* ఏవముక్తః శుభం వాక్యం ద్యుతిమాన్ సత్య వాక్ఛుచిః |*]
ఆభిషేచనికం భాండం కృత్వా సర్వం ప్రదక్షిణమ్ |
భరతస్తం జనం సర్వం ప్రత్యువాచ ధృతవ్రతః || ౬ ||

జ్యేష్ఠస్య రాజతా నిత్యముచితా హి కులస్య నః |
నైవం భవంతః మాం వక్తుమర్హంతి కుశలా జనాః || ౭ ||

రామః పూర్వో హి నో భ్రాతా భవిష్యతి మహీపతిః |
అహం త్వరణ్యే వత్స్యామి వర్షాణి నవ పంచ చ || ౮ ||

యుజ్యతాం మహతీ సేనా చతురంగ మహాబలా |
ఆనయిష్యామ్యహం జ్యేష్ఠం భ్రాతరం రాఘవం వనాత్ || ౯ ||

ఆభిషేచనికం చైవ సర్వమేతదుపస్కృతమ్ |
పురః కృత్య గమిష్యామి రామహేతోర్వనం ప్రతి || ౧౦ ||

తత్రైవ తం నరవ్యాఘ్రమభిషిచ్య పురస్కృతమ్ |
ఆనేష్యామి తు వై రామం హవ్యవాహమివాధ్వరాత్ || ౧౧ ||

న సకామాం కరిష్యామి స్వామిమాం మాతృగంధినీమ్ |
వనే వత్స్యామ్యహం దుర్గే రామః రాజా భవిష్యతి || ౧౨ ||

క్రియతాం శిల్పిభిః పంథాః సమాని విషమాణి చ |
రక్షిణశ్చానుసంయాంతు పథి దుర్గ విచారకాః || ౧౩ ||

ఏవం సంభాషమాణం తం రామహేతోర్నృపాత్మజమ్ |
ప్రత్యువాచ జనస్సర్వః శ్రీమద్వాక్యమనుత్తమమ్ || ౧౪ ||

ఏవం తే భాషమాణస్య పద్మా శ్రీరుపతిష్ఠతామ్ |
యస్త్వం జ్యేష్ఠే నృపసుతే పృథివీం దాతుమిచ్ఛసి || ౧౫ ||

అనుత్తమం తద్వచనం నృపాత్మజ
ప్రభాషితం సంశ్రవణే నిశమ్య చ |
ప్రహర్షజాస్తం ప్రతి బాష్పబిందవో
నిపేతురార్యానననేత్ర సంభవాః || ౧౬ ||

ఊచుస్తే వచనమిదం నిశమ్య హృష్టాః
సామాత్యాః సపరిషదో వియాతశోకాః |
పంథానం నరవర భక్తిమాన్ జనశ్చ
వ్యాదిష్టాస్తవ వచనాచ్చ శిల్పివర్గః || ౧౭ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోనాశీతితమః సర్గః || ౭౯ ||

Ayodhya Kanda Sarga 79 Meaning In Telugu

పదమూడవ రోజు అలాగడిచిపోయింది. పదునాలుగవ రోజున మంత్రులు పురోహితులు భరతుని వద్దకు వెళ్లారు. “కుమారా! భరతా! మన మహారాజు గారు మృతిచెందారు. పెద్దకుమారుడైన రాముడు తండ్రిమాట ప్రకారము అడవులకు వెళ్లాడు. ప్రస్తుతము అయోధ్యకు రాజు లేడు. రాజు లేని రాజ్యములో అరాచకము చెలరేగుతుంది. అయోధ్య ప్రజలు ధర్మపరులు అందుకని అటువంటి ఉ పద్రవము చెలరేగలేదు. పట్టాభిషేకమునకు నీవు ఆలస్యము చేస్తే, దేశంలో అరాచకము చెలరేగే ప్రమాదము ఉంది. రాజప్రముఖులు, పురప్రముఖులూ పురోహితులూ పట్టాభిషేకమునకు కావలసిన సంభారములు చేసుకొని నీ అనుమతి కోసరం ఎదురు చూస్తున్నారు. వంశపారపర్యముగా నీవే అయోధ్యకు మహారాజువు. కాబట్టి నీవు అయోధ్యకు రాజ్యాభిషిక్తుడవై మమ్ములను పాలించు.”అని అన్నాడు.

భరతుడు ఆలోచించాడు. వారితో ఇలా అన్నాడు. “మీకందరికీ రాజధర్మము బాగా తెలుసు. రాచరిక వ్యవస్థలో రాచకుటుంబము లోని పెద్దవాడు రాజ్యమునకు అర్హుడు. మహారాజు కుమారులలో పెద్దవాడు రాముడు. అందుకని రాముడే రాజ్యమునకు అర్హుడు. నేను కాదు. నన్ను పట్టాభిషేకము చేసుకోమనడం యుక్తము కాదు. కాబట్టి, రాముని రాజ్యాభిషిక్తుని చేద్దాము. రాముని బదులు నేను పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము చేస్తాను. అందుకని చతురంగ బలములు సిద్ధం చేయండి.

వెంటనే నేను రాముని ఉన్నచోటికి వెళ్లి ఆయనను ఒప్పించి అయోధ్యకు తీసుకొని వస్తాను. లేకపోతే రామునికి అక్కడే పట్టాభిషేకము జరిపించి అయోధ్యాధి పతిగా ఆయనను అయోధ్యకు తీసుకొని వస్తాను. ఎట్టి పరిస్థితులలో కూడా నా తల్లి కైక కోరిక తీరడానికి వీలులేదు. మా తల్లి కోరికకు భిన్నంగా జరగాలి. రాముడు రాజుకావాలి. నేను పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము చెయ్యాలి. కాబట్టి మన ప్రయాణమునకు తగిన ఏర్పాట్లు చేయండి.” అని ఆదేశించాడు భరతుడ ఆయన మాటలకు అందరూ సంతోషంతో అంగీకరించారు. రాముని మీద భరతునికి ఉన్న అనురాగానికి, భక్తికి, అక్కడ ఉన్న వారికండ్ల వెంట ఆనందభాష్పాలు రాలాయి. “భరత కుమారా! తమరి ఆజ్ఞ ప్రకారము తమరి ప్రయాణమునకు అన్ని ఏర్పాట్లు చేస్తాము.” అని అన్నారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము డెబ్బది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ అశీతితమః సర్గః (80) >>

Leave a Comment