అయోధ్యాకాండంలోని సప్తాశీతితమః సర్గ అంటే 87వ సర్గ. ఈ సర్గలో భరతుడు తన తండ్రి దశరథ మహారాజు మరణవార్త విని తీవ్ర దుఃఖంలో మునిగిపోతాడు. భరతుడు తన తల్లి కైకేయిని మరిచిపోలేడు, ఆమె కారణంగా తన ప్రియ అన్న రాముడు అరణ్యవాసం చేశాడు. భరతుడు దశరథ మహారాజు అంత్యక్రియలను నిర్వహించిన తర్వాత, రాముని అన్వేషణ కోసం అరణ్యానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతను రాముని తీసుకురావడానికి తన సోదరుడు శత్రుఘ్నుడితో పాటు ప్రజలు, మంత్రి వర్గం మరియు గురువులను కూడా తీసుకొని అరణ్యానికి బయలుదేరాడు. ఈ సర్గలో భరతుడు రాముని రాజ్యానికి తిరిగి తీసుకురావడానికి చేసిన ప్రయాణం గురించి వర్ణించబడింది.
రామశయనాదిప్రశ్నః
గుహస్య వచనం శ్రుత్వా భరతో భృశమప్రియమ్ |
ధ్యానం జగామ తత్రైవ యత్ర తచ్ఛ్రుతమప్రియమ్ || ౧ ||
సుకుమారో మహాసత్త్వః సింహస్కంధో మహాభుజః |
పుండరీకవిశాలాక్షస్తరుణః ప్రియదర్శనః || ౨ ||
ప్రత్యాశ్వస్య ముహూర్తం తు కాలం పరమదుర్మనాః |
పపాత సహసా తోత్రైః హ్యతివిద్ధ ఇవ ద్విపః || ౩ ||
తదవస్థం తు భరతం శత్రుఘ్నోఽనంతర స్థితః |
పరిష్వజ్య రురోదోచ్చైర్విసంజ్ఞః శోకకర్శితః || ౫ ||
తతః సర్వాః సమాపేతుర్మాతరో భరతస్య తాః |
ఉపవాసకృశా దీనా భర్తుర్వ్యసనకర్శితాః || ౬ ||
తాశ్చ తం పతితం భూమౌ రుదంత్యః పర్యవారయన్ |
కౌసల్యా త్వనుసృత్యైనం దుర్మనాః పరిషస్వజే || ౭ ||
వత్సలా స్వం యథా వత్సముపగూహ్య తపస్వినీ |
పరిపప్రచ్ఛ భరతం రుదంతీ శోకలాలసా || ౮ ||
పుత్ర వ్యాధిర్న తే కచ్చిత్ శరీరం పరిబాధతే |
అద్య రాజకులస్యాస్య త్వదధీనం హి జీవితమ్ || ౯ ||
త్వాం దృష్ట్వా పుత్ర జీవామి రామే సభ్రాతృకే గతే |
వృత్తే దశరథే రాజ్ఞి నాథైకస్త్వమద్య నః || ౧౦ ||
కచ్చిన్ను లక్ష్మణే పుత్ర శ్రుతం తే కించిదప్రియమ్ |
పుత్రే వా హ్యేకపుత్రాయాః సహభార్యే వనం గతే || ౧౧ ||
స ముహూర్తం సమాశ్వస్య రుదన్నేవ మహాయశాః |
కౌసల్యాం పరిసాంత్వేదం గుహం వచనమబ్రవీత్ || ౧౨ ||
భ్రాతా మే క్వావసద్రాత్రౌ క్వ సీతా క్వ చ లక్ష్మణః |
అస్వపచ్ఛయనే కస్మిన్ కిం భుక్త్వా గుహ శంస మే || ౧౩ ||
సోఽబ్రవీద్భరతం హృష్టో నిషాదాధిపతిర్గుహః |
యద్విధం ప్రతిపేదే చ రామే ప్రియహితేఽతిథౌ || ౧౪ ||
అన్నముచ్చావచం భక్షాః ఫలాని వివిధాని చ |
రామాయాభ్యవహారార్థం బహు చోపహృతం మయా || ౧౫ ||
తత్సర్వం ప్రత్యనుజ్ఞాసీద్రామః సత్య పరాక్రమః |
న తు తత్ప్రత్యగృహ్ణాత్స క్షత్ర ధర్మమనుస్మరన్ || ౧౬ ||
న హ్యస్మాభిః ప్రతిగ్రాహ్యం సఖే దేయం తు సర్వదా |
ఇతి తేన వయం రాజన్ అనునీతా మహాత్మనా || ౧౭ ||
లక్ష్మణేన సమానీతం పీత్వా వారి మహాయశాః |
ఔపవాస్యం తదాఽకార్షీద్రాఘవః సహ సీతయా || ౧౮ ||
తతస్తు జలశేషేణ లక్ష్మణోఽప్యకరోత్తదా |
వాగ్యతాస్తే త్రయః సంధ్యాం సముపాసత సంహితాః || ౧౯ ||
సౌమిత్రిస్తు తతః పశ్చాదకరోత్స్వాస్తరం శుభమ్ |
స్వయమానీయ బర్హీంషి క్షిప్రం రాఘవకారణాత్ || ౨౦ ||
తస్మిన్ సమావిశద్రామః స్వాస్తరే సహ సీతయా |
ప్రక్షాళ్య చ తయోః పాదౌ అపచక్రామ లక్ష్మణః || ౨౧ ||
ఏతత్తదింగుదీమూలమిదమేవ చ తత్తృణమ్ |
యస్మిన్ రామశ్చ సీతా చ రాత్రిం తాం శయితావుభౌ || ౨౨ ||
నియమ్య పృష్ఠే తు తలాంగులిత్రవాన్
శరైః సుపూర్ణావిషుధీ పరంతపః |
మహద్ధనుః సజ్యముపోహ్య లక్ష్మణో
నిశామతిష్ఠత్పరితోఽస్య కేవలమ్ || ౨౩ ||
తతస్త్వహం చోత్తమబాణ చాపధృత్
స్థితోఽభవం తత్ర స యత్ర లక్ష్మణః |
అతంద్రిభిర్జ్ఞాతిభిరాత్త కార్ముకైః
మహేంద్రకల్పం పరిపాలయంస్తదా || ౨౪ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తాశీతితమః సర్గః || ౮౭ ||
Ayodhya Kanda Sarga 87 Meaning In Telugu
గుహుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్న భరతుడు దీర్ఘాలోచనలో పడ్డాడు. రాముని వనవాసము తండ్రిమరణము లక్ష్మణుని వాక్కులు అతని మనసును కలచి వేసాయి. ఆ మానసిక క్షోభకు తట్టుకోలేక భరతుడు కిందపడిపోయాడు. స్పృహ తప్పాడు. పక్కన ఉన్న శతృఘ్నుడు పట్టుకున్నాడు. శయ్యమీద పడుకోబెట్టాడు.
ఈ వార్త తెలిసి కౌసల్య, సుమిత్ర కైక పరుగు పరుగున అక్కడకు వచ్చారు. కౌపల్య స్పృహ తప్పిన భరతుని చూచి బిగ్గరగా ఏడవడం మొదలెట్టింది.
“నాయనా! భరతా! ఇక్ష్వాకు వంశమునకు నీవే దిక్కు. నీకేమయింది. ఏదైనా శారీరక వ్యాధి వచ్చిందా. రామ లక్ష్మణులు అడవులకు వెళ్లారు. ఎక్కడున్నారో ఏమి చేస్తున్నారో తెలియదు. మహారాజుగారు పరమపదించారు. నువ్వు ఒక్కడివే ఈ సామ్రాజ్యానికి వారసుడివి. మాకు రక్షకుడవు. నిన్ను చూచుకొని మేమందరమూ ప్రాణాలు నిలుపుకొని ఉన్నాము. నాయనా! భరతా! రామలక్ష్మణుల గురించి గానీ, సీత గురించి గానీ ఏమైనా దుర్వార్త తెలిసినదా! చెప్పు భరతా! ఏం జరిగింది. మామనసులు తల్లడిల్లిపోతున్నాయి.” అని రోదిస్తూ ఉంది కౌసల్య పరిచారికలు భరతునికి పరిచర్యలు చేసారు.
ఇంతలో భరతుడు తేరుకున్నాడు. కౌసల్యను ఓదార్చాడు. గుహుని చూచి ఇలా అన్నాడు. “మిత్రమా! ఆ రోజు రాత్రి రాముడు, లక్ష్మణుడు, సీత ఎక్కడ . ఏ ఆహారము తీసుకున్నారు. వివరంగా చెప్పు” అని భరతుడు ఆరోగ్యంగా ఉండటం చూచి గుహుడు అడిగాడు.
సంతోషించాడు. రాముని చూచి ఇలా అన్నాడు. “రాకుమారా! ఆరోజు రాత్రి నేను ఎన్నోరకములైన ఆహారపదార్థములను రాముని కొరకు తీసుకొని వచ్చాను. కాని రాముడు వాటిని ముట్ట లేదు. వెనుకకు తీసుకొని వెళ్లమన్నాడు. ఆ రోజు రాత్రి రాముడు కేవలము నీటిని ఆహారంగా తీసుకున్నాడు. రామునితో పాటు సీత, లక్ష్మణుడు కూడా జలమునే ఆహారంగా తీసుకున్నారు.
తర్వాత లక్ష్మణుడు రామునికి సీతకు శయ్యలను ఏర్పాటు చేసాడు. రాముడు సీత ఆ శయ్యల మీద శయనించారు. లక్ష్మణుడు వారి పాదముల వద్ద నిలబడి వారిని కంటికి రెప్పలా కాపలా కాస్తున్నాడు. ఆ రాత్రి రాముడు సీత ఇదుగో ఈ ఇంగుదీ వృక్షము కిందనే శయనించారు. వారు శయనించిన గడ్డి శయ్యలను నేను భద్రపరిచాను. లక్ష్మణుడు ఆ రాత్రి అంతా ధనుస్సును చేతబూని కునుకు లేకుండా కాపలా కాసాడు. నేను కూడా నా వారితో కూడా పరిసరప్రాంతములలో ఉండి రామునికి ఏ ఆపదా రాకుండా కాపలాగా నిలబడి ఉన్నాము.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.