Aranya Kanda Sarga 53 In Telugu – అరణ్యకాండ త్రిపంచాశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ త్రిపంచాశః సర్గం రామాయణంలో అత్యంత కీలకమైనది. రాముడు మరియు లక్ష్మణులు సీత కోసం వెతుకుతారు. ఈ క్రమంలో, వారు గాయపడిన జటాయువును కనుగొంటారు. రావణుడు సీతను అపహరించేప్పుడు జటాయువు ఆపడానికి ప్రయత్నించి గాయపడతాడు. జటాయువు సీతను రావణుడు లంకకు తీసుకెళ్లిన విషయాన్ని రాముడికి చెబుతాడు.

రావణభర్త్సనమ్

ఖముత్పతంతం తం దృష్ట్వా మైథిలీ జనకాత్మజా |
దుఃఖితా పరమోద్విగ్నా భయే మహతి వర్తినీ ||

1

రోషరోదనతామ్రాక్షీ భీమాక్షం రాక్షసాధిపమ్ |
రుదంతీ కరుణం సీతా హ్రియమాణేదమబ్రవీత్ ||

2

న వ్యపత్రపసే నీచ కర్మణాఽనేన రావణ |
జ్ఞాత్వా విరహితాం యన్మాం చోరయిత్వా పలాయసే ||

3

త్వయైవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుమిచ్ఛతా |
మమాపవాహితో భర్తా మృగరూపేణ మాయయా ||

4

యో హి మాముద్యతస్త్రాతుం సోఽప్యయం వినిపాతితః |
గృధ్రరాజః పురాణోఽసౌ శ్వశురస్య సఖా మమ ||

5

పరమం ఖలు తే వీర్యం దృశ్యతే రాక్షసాధమ |
విశ్రావ్య నామధేయం హి యుద్ధే నాస్మి జితా త్వయా ||

6

ఈదృశం గర్హితం కర్మ కథం కృత్వా న లజ్జసే |
స్త్రియాశ్చ హరణం నీచ రహితే తు పరస్య చ ||

7

కథయిష్యంతి లోకేషు పురుషాః కర్మ కుత్సితమ్ |
సునృశంసమధర్మిష్ఠం తవ శౌండీర్యమానినః ||

8

ధిక్ తే శౌర్యం చ సత్త్వం చ యత్త్వం కథితవాంస్తదా |
కులాక్రోశకరం లోకే ధిక్ తే చారిత్రమీదృశమ్ ||

9

కిం కర్తుం శక్యమేవం హి యజ్జవేనైవ ధావసి |
ముహూర్తమపి తిష్ఠస్వ న జీవన్ ప్రతియాస్యసి ||

10

న హి చక్షుష్పథం ప్రాప్య తయోః పార్థివపుత్రయోః |
ససైన్యోఽపి సమర్థస్త్వం ముహూర్తమపి జీవితుమ్ ||

11

న త్వం తయోః శరస్పర్శం సోఢుం శక్తః కథంచన |
వనే ప్రజ్వలితస్యేవ స్పర్శమగ్నేర్విహంగమః ||

12

సాధు కృత్వాఽఽత్మనః పథ్యం సాధు మాం ముంచ రావణ |
మత్ప్రధర్షణరుష్టో హి భ్రాత్రా సహ పతిర్మమ ||

13

విధాస్యతి వినాశాయ త్వం మాం యది న ముంచసి |
యేన త్వం వ్యవసాయేన బలాన్మాం హర్తుమిచ్ఛసి ||

14

వ్యవసాయః స తే నీచ భవిష్యతి నిరర్థకః |
న హ్యహం తమపశ్యంతీ భర్తారం విబుధోపమమ్ ||

15

ఉత్సహే శత్రువశగా ప్రాణాన్ ధారయితుం చిరమ్ |
న నూనం చాత్మనః శ్రేయః పథ్యం వా సమవేక్షసే ||

16

మృత్యుకాలే యథా మర్త్యో విపరీతాని సేవతే |
ముమూర్షూణాం హి సర్వేషాం యత్పథ్యం తన్న రోచతే ||

17

పశ్యామ్యద్య హి కంఠే త్వాం కాలపాశావపాశితమ్ |
యథా చాస్మిన్ భయస్థానే న బిభేషి దశానన ||

18

వ్యక్తం హిరణ్మయాన్ హి త్వం సంపశ్యసి మహీరుహాన్ |
నదీం వైతరణీం ఘోరాం రిధిరౌఘనివాసినీమ్ ||

19

అసిపత్రవనం చైవ భీమం పశ్యసి రావణ |
తప్తకాంచనపుష్పాం చ వైడూర్యప్రవరచ్ఛదామ్ ||

20

ద్రక్ష్యసే శాల్మలీం తీక్ష్ణామాయసైః కంటకైశ్చితామ్ |
న హి త్వమీదృశం కృత్వా తస్యాలీకం మహాత్మనః ||

21

ధరితుం శక్ష్యసి చిరం విషం పీత్వేవ నిర్ఘృణః |
బద్ధస్త్వం కాలపాశేన దుర్నివారేణ రావణ ||

22

క్వ గతో లప్స్యసే శర్మ భర్తుర్మమ మహాత్మనః |
నిమేషాంతరమాత్రేణ వినా భ్రాత్రా మహావనే ||

23

రాక్షసా నిహతా యేన సహస్రాణి చతుర్దశ |
స కథం రాఘవో వీరః సర్వాస్త్రకుశలో బలీ ||

24

న త్వాం హన్యాచ్ఛరైస్తీక్ష్ణైరిష్టభార్యాపహారిణమ్ |
ఏతచ్చాన్యచ్చ పరుషం వైదేహీ రావణాంకగా |
భయశోకసమావిష్టా కరుణం విలలాప హ ||

26

తథా భృశార్తాం బహు చైవ భాషిణీం
విలాపపూర్వం కరుణం చ భామినీమ్ |
జహార పాపః కరుణం వివేష్టతీం
నృపాత్మజామాగతగాత్రవేపథుమ్ ||

27

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే త్రిపంచాశః సర్గః ||

Aranya Kanda Sarga 53 Meaning In Telugu

రావణుడు ఆకాశమార్గాన ఎగురుతున్నాడు. సీత వాడి చేతిలో పిట్ట మాదిరి నలిగిపోతూ ఉంది. రావణుని చూచి సీత ఇలా అంది.

“ఓరి రావణా! నీచుడా!నాభర్త ఇంటలేని సమయంలో, కుక్క మాదిరి ఇంట్లోకి దూరి, దొంగమాదిరి నన్ను అపహరించుకొని పోతున్నావే. నీకు సిగ్గులేదట్రా! నీదీ ఒక పరాక్రమమేనా! దమ్ముంటే, ధైర్యం ఉంటే నా భర్త ఉన్నప్పుడు నా వంక కన్నెత్తిచూడు. నా భర్త నిన్ను భస్మం చేస్తాడు.

ఒక ఆడదాన్ని అపహరించడానికి ఇంత పన్నాగమా! ఒక లేడిని పంపి, నా భర్తను దూరంగా పంపి నన్ను అపహరిస్తావా! నీదీ ఒక మగతనమేనా నీచుడా! నా మామగారి చిరకాల మిత్రుడు అయిన జటాయువు నన్ను రక్షించడానికి వస్తే ఆయనను కూడా చంపుతావా! నీ దుర్మార్గానికి హద్దులేదా! నీ పేరు గొప్ప గా చెప్పుకుంటున్నావు. ఇదా నీ పరాక్రమము. పక్షిని చంపడమా నీ వీరత్వము.

ఎటువంటి దుర్మార్గుడైనా ఒంటరిగా ఉన్న స్త్రీని కన్నెత్తి కూడా చూడడే. అటువంటిది నువ్వు ఎంతటి నీచుడివి అయితే నన్ను అపహరించుకు పోతావు! ఇంతటి నీచమైన పని చేయడానికి నీకు సిగ్గుగా లేదా! ఇటువంటి సిగ్గుమాలిని పని చేసినందుకు, నీ ప్రజలే నిన్ను నిందిస్తారని నీకు తెలియదా!

నీవు పుట్టిన వంశము ఎట్టిది! నీవు చేసే పని ఎట్టిది! నీ వంశంలో చెడబుట్టావు కదా దుర్మార్గుడా! నీకు ధైర్యం ఉంటే కాసేపు నన్ను భూమి మీద దింపు. రామలక్ష్మణులు వచ్చేంత వరకూ ఆగు. అప్పుడు నీ సైన్యంతో కూడా రా. రాముడితో యుద్ధం చెయ్యి, నువ్వు యమపురికి వెళతావో నన్ను తీసుకొని లంకకు వెళుతావో అప్పుడు తెలుస్తుంది. రామలక్ష్మణుల బాణములు నిన్ను దహించి వేస్తాయి.

కాబట్టి ఓ రావణా! నా మాట విను. నన్ను విడిచిపెట్టు. లేకపోతే నీ సర్వనాశనం తథ్యం. నీవు నన్ను బలాత్కారంగా తీసుకుపోతే మాత్రం నేను నీకు లొంగుతాను అని అనుకుంటున్నావా! అది కలలో మాట. నేను నీకు ఏ మాత్రం లొంగను. నా ప్రాణాలు అన్నా విడుస్తాను కానీ నిన్ను తాకను. కాబట్టి నీ ప్రయాస అంతావ్యర్థము అవుతుంది. నీకు మరణకాలము సమీపించింది అందుకనే ఇటువంటి వ్యర్థమైన పనికి పూనుకున్నావు. నీకు నరకములో వైతరిణీ నది, కత్తులో బోను సిద్ధంగా ఉన్నాయి.

నాకు ఇంత అపకారము చేసిన నీవు ఎంతో కాలము జీవించలేవు. నీవు నన్ను ఎక్కడ దాచి పెట్టినా నా భర్త ఆ చోటికి రాగలడు. నిన్ను చంపి నన్ను దక్కించుకుంటాడు. నా భర్త రాముని బారి నుండి తప్పించుకోడం నీ తరం కాదు. ఓ రావణా! నా రాముడు ఒంటరిగా, ఎవరి సాయమూ లేకుండా, 14,000 మంది రాక్షసులను, నీ తమ్ములను చంపాడు అని గుర్తులేదా! అటువంటి రాముడు, తన భార్యను ఒక రాక్షసుడు ఎత్తుకుపోతే వాడిని తన బాణాలకు బలి చేయకుండా ఊరుకుంటాడా!”ఈ విధంగా సీత రాముని నిందిస్తూ ఉంది. సీత మాటలను రావణుడు లక్ష్యపెట్టలేదు. సీతను సందిట ఇరికించుకొని ఆకాశమార్గంలో అంకవైపు ప్రయాణం చేస్తున్నాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ చతుఃపంచాశః సర్గః (54) >>

Leave a Comment