అయోధ్యాకాండంలోని అష్టాశీతితమః సర్గ అంటే 88వ సర్గ. ఈ సర్గలో భరతుడు, శత్రుఘ్నుడు, గురువులు, మరియు ఇతర ఆస్తికులు రాముని కోసం చిత్రకూటానికి బయలుదేరుతారు. మార్గమధ్యంలో వారు పలు ఆశ్రమాలు వద్ద ఆగి మహర్షులతో భేటీ అవుతారు. భరతుడు, రాముడిని కలిసినప్పుడు, రాముడు తండ్రి మరణవార్త విని దిగ్బ్రాంతికి గురవుతాడు. భరతుడు రాముడిని అయోధ్యకు తిరిగి రావాలని, రాజ్యాన్ని పాలించాలని కోరతాడు. కానీ రాముడు తన తండ్రి ఆజ్ఞలను పాటిస్తూ, తన వనవాసాన్ని కొనసాగించాలనే నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. భరతుడు రాముడి పాదుకలను తీసుకొని, వాటిని పెట్టి రాజ్యం పాలిస్తానని నిర్ణయించుకుంటాడు.
శయ్యానువీక్షణమ్
తచ్ఛ్రుత్వా నిపుణం సర్వం భరతః సహ మంత్రిభిః |
ఇంగుదీమూలమాగమ్య రామశయ్యామవేక్ష్య తామ్ || ౧ ||
అబ్రవీజ్జననీః సర్వా ఇహ తేన మహాత్మనా |
శర్వరీ శయితా భూమౌ ఇదమస్య విమర్దితమ్ || ౨ ||
మహాభాగకులీనేన మహాభాగేన ధీమతా |
జాతో దశరథేనోర్వ్యాం న రామః స్వప్తుమర్హతి || ౩ ||
అజినోత్తరసంస్తీర్ణే వరాస్తరణ సంచయే |
శయిత్వా పురుషవ్యాఘ్రః కథం శేతే మహీతలే || ౪ ||
ప్రాసాదాగ్ర విమానేషు వలభీషు చ సర్వదా |
హైమరాజతభౌమేషు వరాస్తరణ శాలిషు || ౫ ||
పుష్పసంచయచిత్రేషు చందనాగరుగంధిషు |
పాండరాభ్ర ప్రకాశేషు శుకసంఘరుతేషు చ || ౬ ||
ప్రాసాదవరవర్యేషు శీతవత్సు సుగంధిషు |
ఉషిత్వా మేరుకల్పేషు కృతకాంచనభిత్తిషు || ౭ ||
గీత వాదిత్ర నిర్ఘోషైర్వరాభరణ నిస్స్వనైః |
మృదంగవరశబ్దైశ్చ సతతం ప్రతిబోధితః || ౮ ||
వందిభిర్వందితః కాలే బహుభిః సూతమాగధైః |
గాథాభిరనురూపాభిః స్తుతిభిశ్చ పరంతపః || ౯ ||
అశ్రద్ధేయమిదం లోకే న సత్యం ప్రతిభాతి మా |
ముహ్యతే ఖలు మే భావః స్వప్నోఽయమితి మే మతిః || ౧౦ ||
న నూనం దైవతం కించిత్ కాలేన బలవత్తరమ్ |
యత్ర దాశరథీ రామో భూమావేవ శయీత సః || ౧౧ ||
విదేహరాజస్య సుతా సీతా చ ప్రియదర్శనా |
దయితా శయితా భూమౌ స్నుషా దశరథస్య చ || ౧౨ ||
ఇయం శయ్యా మమ భ్రాతురిదం హి పరివర్తితమ్ |
స్థండిలే కఠినే సర్వం గాత్రైర్విమృదితం తృణమ్ || ౧౩ ||
మన్యే సాభరణా సుప్తా సీతాఽస్మిన్ శయనోత్తమే |
తత్ర తత్ర హి దృశ్యంతే సక్తాః కనక బిందవః || ౧౪ ||
ఉత్తరీయమిహాసక్తం సువ్యక్తం సీతయా తదా |
తథా హ్యేతే ప్రకాశంతే సక్తాః కౌశేయతంతవః || ౧౫ ||
మన్యే భర్తుః సుఖా శయ్యా యేన బాలా తపస్వినీ |
సుకుమారీ సతీ దుహ్ఖం న విజానాతి మైథిలీ || ౧౬ ||
హా హంతాఽస్మి నృశంసోఽహం యత్సభార్యః కృతేమమ |
ఈదృశీం రాఘవః శయ్యామధిశేతే హ్యనాథవత్ || ౧౭ ||
సార్వభౌమకులే జాతః సర్వలోకస్య సమ్మతః |
సర్వలోకప్రియస్త్యక్త్వా రాజ్యం సుఖమనుత్తమమ్ || ౧౮ ||
కథమిందీవర శ్యామో రక్తాక్షః ప్రియదర్శనః |
సుఖ భాగీ చ దుఃఖార్హః శయితో భువి రాఘవః || ౧౯ ||
ధన్యః ఖలు మహాభాగో లక్ష్మణః శుభలక్షణః |
భ్రాతరం విషమే కాలే యో రామమనువర్తతే || ౨౦ ||
సిద్ధార్థా ఖలు వైదేహీ పతిం యాఽనుగతా వనమ్ |
వయం సంశయితాః సర్వే హీనాస్తేన మహాత్మనా || ౨౧ ||
అకర్ణధారా పృథివీ శూన్యేవ ప్రతిభాతి మా |
గతే దశరథే స్వర్గం రామే చారణ్యమాశ్రితే || ౨౨ ||
న చ ప్రార్థయతే కచ్చిత్ మనసాఽపి వసుంధరామ్ |
వనేఽపి వసతస్తస్య బాహు వీర్యాభిరక్షితామ్ || ౨౩ ||
శూన్యసంవరణా రక్షామయంత్రిత హయద్విపామ్ |
అపావృతపురద్వారాం రాజధానీమరక్షితామ్ || ౨౪ ||
అప్రహృష్ట బలాం శూన్యాం విషమస్థామనావృతామ్ |
శత్రవో నాభిమన్యంతే భక్ష్యాన్విషకృతానివ || ౨౫ ||
అద్య ప్రభృతి భూమౌ తు శయిష్యేఽహం తృణేషు వా |
ఫల మూలాశనో నిత్యం జటాచీరాణి ధారయన్ || ౨౬ ||
తస్యార్థముత్తరం కాలం నివత్స్యామి సుఖం వనే |
తం ప్రతిశ్రవమాముచ్య నాస్య మిథ్యా భవిష్యతి || ౨౭ ||
వసంతం భ్రాతురర్థాయ శత్రుఘ్నో మాఽనువత్స్యతి |
లక్ష్మణేన సహత్వార్యో అయోధ్యాం పాలయిష్యతి || ౨౮ ||
అభిషేక్ష్యంతి కాకుత్స్థమయోధ్యాయాం ద్విజాతయః |
అపి మే దేవతాః కుర్యురిమం సత్యం మనోరథమ్ || ౨౯ ||
ప్రసాద్యమానః శిరసా మయా స్వయమ్
బహు ప్రకారం యది నభిపత్స్యతే |
తతోఽనువత్స్యామి చిరాయ రాఘవమ్
వనేచరన్నార్హతి మాముపేక్షితుమ్ || ౩౦ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టాశీతితమః సర్గః || ౮౮ ||
Ayodhya Kanda Sarga 88 Meaning In Telugu
గుహుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు భరతుడు. అందరూ కలిసి ఆ రోజు రాముడు శయనించిన ఇంగుదీవృక్షము దగ్గరకు వెళ్లారు. రాముడు పడుకున్న గడ్డితో చేసిన శయ్యను చూచారు.
భరతుడు తన తల్లులను చూచి “అమ్మా! రాకుమారుడు అయిన రాముడు పడుకున్న శయ్య ఇదేనమ్మా! చూడమ్మా రామునికి ఎంత దుర్గతి పట్టిందో. రాముడు ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. రాచబిడ్డ. రాచ మర్యాదలు, రాజభోగములు అనుభవించాడు. కానీ, ఈ నాడు నేల మీద గడ్డి పరుచుకొని పడుకుంటున్నాడు. ప్రతిరోజూ హంసతూలికా తల్పముల మీద శయనించిన రాముడు కటిక నేల మీద ఎలా పడుకుంటున్నాడో కదా! రాజ ప్రాసాదములలో నివసించిన రాముడు కొండగుహలలో, పర్ణశాలలో ఎలా ఉంటాడో కదా! ప్రతిరోజూ మంగళవాద్య ఘోషలతో వంది మాగధుల కైవారములతో నిద్రలేచే రాముడు ఈ నాడు క్రూరమృగముల అరుపులతో నిద్రలేవడం ఎంతటి దౌర్భాగ్యం. ఎవరికైనా చెబితే నమ్మేట్టుగా లేదు. అందరూ ఇదినిజం కాదు అని అంటారు.
నా మటుకు నాకు ఇదంతా ఒక కలలాగా అనిపిస్తూ ఉంది. కాని ఇది అంతా యదార్థము అని తెలిసిన నాడు మనస్సు తల్లడిల్లి పోతూ ఉంది. అంతా కాలమహిమ అని సరిపెట్టుకోక తప్పదు. ఎందుకంటే రాజాధిరాజులకంటే, వారి బలప్రతాపముల కంటే, కాలము బలవత్తరమైనది అనుట యదార్థము.
రాముడు సరే తండ్రి మాట ప్రకారము అరణ్యములలో కష్టములు పడుతున్నాడు. మరి జనకరాజ పుత్రి సీతకూడా రాముని తోపాటు కష్టములు అనుభవిస్తూ ఉంది కదా. దీనికి ఏమను కొనవలెను. అంతా విధివిలాసము అనుకోడం తప్ప.
అమ్మా! చూడండమ్మా! రాముడు, సీత పడుకొన్న ఈ గడ్డి శయ్య. ఈ శయ్యల మీద బంగారు ఆభరణముల చిహ్నములు కనపడుతూఉన్నాయి. సీత ఈ శయ్యమీద తన ఆభరణములతోనే శయనించినట్టు ఉంది. సీత మహా పతివ్రత. భర్తతో పాటు ఉంటే కష్టములు కూడా ఆమెకు సుఖముల మాదిరి కనపడుతున్నట్టు ఉంది.
అయినా, నేను అనుకున్నట్టు, ఇందులో విధి విలాసము ఏమున్నది, నా కోసరము నా తల్లి చేసిన ఘాతుకము తప్ప. నేనే లేకపోతే నా తల్లి ఇంతటి ఘోరమునకు ఒడికట్టదు కదా! దీని కంతటికీ నేనే కారణము. నా వలననే రాముడు సీత లక్ష్మణుడు అరణ్యముల పాలయ్యారు. నా తండ్రి దశరథుడు అకాల మరణం చెందాడు. రాముడు ఇక్ష్వాకు వంశపు రాజు అయి ఉండి కూడా, తన రాజ్యమును సుఖములను త్యజించి నేడు ఇలా కటిక నేల మీదనిద్రిస్తున్నాడు.
రాముని అరణ్యములకు అనుసరించిన సీత, లక్ష్మణులు అదృష్టవంతులు. నేనే అదృష్టహీనుడను. రాముని విడిచి జీవచ్ఛవము మాదిరి బతుకుతున్నాను. లేక పోతే రాజు కావలసిన రాముడు అరణ్యములకు పోవడం ఏమిటి! మహారాజు మరణించడం ఏమిటి! ఈ రాజ్యభారము నా పాలబడటం ఏమిటి! నేను దిక్కుతోచకుండా ఈ అరణ్యములలో తిరగడం ఏమిటి!
అయినా రామునికి రాజ్యము, నాకు అరణ్యము సముచితమే. రాముడు అరణ్యములలో ఉన్నా రాజే. నేను అయోధ్యలో ఉన్నా అడవులలో ఉన్నట్టే. అందుకని నేను కూడా నారచీరలు ధరించి ఈ అడవిలోనే ఉంటాను. నాతో పాటు శతృఘ్నుడు కూడా అడవిలోనే ఉంటాడు. మేము ఇద్దరం జడలు కట్టుకొని మునివృత్తి అవలంబిస్తాము.
అయోధ్యలో రాజులేడు. సైన్యము లేదు. పరిపాలన లేదు. అరాచకం ప్రబలుతోంది. ఈ విషమ పరిస్థితులలో నైనా రాముడు సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్యకు వచ్చి రాజ్యపాలన చేపట్టడా! ఈ మూలంగానైనా రాముడు రాజ్యపాలన చేపడితే అయోధ్యా ప్రజలే కాదు దేవతలు కూడా సంతోషిస్తారు.
అందుకే నేను ఒక నిశ్చయానికి వచ్చాను. రాముని వద్దకు పోయి నా తలను ఆయన పాదాల మీద పెట్టి అయోధ్యకు వచ్చి రాజ్యపాలన చేపట్టమని ప్రార్ధిస్తాను. అప్పటికీ రాముడు ఒప్పుకోకపోతే నేను కూడా ఇక్కడే ఉండిపోతాను. రాముడు నన్ను కాదనడు. ఇదే నా నిశ్చయము.” అని ధృఢంగా అనుకున్నాడు భరతుడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.