Ayodhya Kanda Sarga 93 In Telugu – అయోధ్యాకాండ త్రినవతితమః సర్గః

అయోధ్యాకాండం త్రినవతితమ (93వ) సర్గలో, భరతుడు దశరథ మహారాజు మరణ వార్త విని దిగ్భ్రాంతి చెందాడు. అతను తన తల్లి కైకేయి పై మహా కోపంతో తిట్టిపోస్తాడు. కైకేయి తన చర్యలను సమర్థించడానికి ప్రయత్నిస్తే, భరతుడు ఆమెను తీవ్రంగా గద్దించింది. అతను రాముడు తప్ప మరెవ్వరూ రాజ్యం పరిపాలించరని, రాముని తిరిగి తీసుకురావాలని నిర్ణయించాడు. ఆ తరువాత, భరతుడు తన సోదరుడు శత్రుఘ్నుడితో కలిసి గురు వశిష్ఠుని వద్దకు వెళ్లి సలహా కోరుతాడు. వశిష్ఠుడు రాముని తిరిగి పిలవడానికి సమ్మతిస్తాడు. భరతుడు, అల్లరి పరంగా ఉన్న ప్రజల వద్దకు వెళ్లి, రాముని తిరిగి తీసుకురావడానికి ప్రణాళికను సిద్ధం చేస్తాడు. ఈ సర్గ భరతుని ధర్మ నిష్ఠను, రాముని పట్ల అతని అపార ప్రేమను ప్రతిబింబిస్తుంది.

చిత్రకూటవనప్రేక్షణమ్

తయా మహత్యా యాయిన్యా ధ్వజిన్యా వనవాసినః |
అర్దితా యూథపా మత్తాః సయూథాః సంప్రదుద్రువుః || ౧ ||

ఋక్షాః పృషతసంఘాశ్చ రురవశ్చ సమతంతః |
దృశ్యంతే వనరాజీషు గిరిష్వపి నదీషు చ || ౨ ||

స సంప్రతస్థే ధర్మాత్మా ప్రీతో దశరథాత్మజః |
వృతో మహత్యా నాదిన్యా సేనయా చతురంగయా || ౩ ||

సాగరౌఘనిభా సేనా భరతస్య మహాత్మనః |
మహీం సంఛాదయామాస ప్రావృషిద్యామివాంబుదః || ౪ ||

తురంగాఘైరవతతా వారణైశ్చ మహాజవైః |
అనాలక్ష్యా చిరం కాలం తస్మిన్కాలే బభూవ భూః || ౫ ||

స యాత్వా దూరమధ్వానం సుపరిశ్రాంతవాహనః |
ఉవాచ భరతః శ్రీమాన్ వసిష్ఠం మంత్రిణాం వరమ్ || ౬ ||

యాదృశం లక్ష్యతే రూపం యథా చైవ శ్రుతం మయా |
వ్యక్తం ప్రాప్తాః స్మ తం దేశం భరద్వాజో యమబ్రవీత్ || ౭ ||

అయం గిరిశ్చిత్రకూట ఇయం మందాకినీ నదీ |
ఏతత్ప్రకాశతే దూరాన్నీలమేఘనిభం వనమ్ || ౮ ||

గిరేః సానూని రమ్యాణి చిత్రకూటస్య సంప్రతి |
వారణైరవమృద్యంతే మామకైః పర్వతోపమైః || ౯ ||

ముంచంతి కుసుమాన్యేతే నగాః పర్వతసానుషు |
నీలా ఇవాతపాపాయే తోయం తోయధరా ఘనాః || ౧౦ ||

కిన్నరాచరితం దేశం పశ్య శత్రుఘ్న పర్వతమ్ |
మృగైః సమంతాదాకీర్ణం మకరైరివ సాగరమ్ || ౧౧ ||

ఏతే మృగగణా భాంతి శీఘ్రవేగాః ప్రచోదితాః |
వాయుప్రవిద్ధా శరది మేఘరాజిరివాంబరే || ౧౨ ||

కుర్వంతి కుసుమాపీడాన్ శిరస్సు సురభీనమీ |
మేఘప్రకాశైః ఫలకైర్దాక్షిణాత్యా యథా నరాః || ౧౩ ||

నిష్కూజమివ భూత్వేదం వనం ఘోరప్రదర్శనమ్ |
అయోధ్యేవ జనాకీర్ణా సంప్రతి ప్రతిభాతి మా || ౧౪ ||

ఖురైరుదీరితో రేణుర్దివం ప్రచ్ఛాద్య తిష్ఠతి |
తం వహత్యనిలః శీఘ్రం కుర్వన్నివ మమ ప్రియమ్ || ౧౫ ||

స్యందనాంస్తురగోపేతాన్ సూతముఖ్యైరధిష్ఠితాన్ |
ఏతాన్సంపతతః శీఘ్రం పశ్య శత్రుఘ్న కాననే || ౧౬ ||

ఏతాన్విత్రాసితాన్పశ్య బర్హిణః ప్రియదర్శనాన్ |
ఏతమావిశతః శీఘ్రమధివాసం పతత్త్రిణః || ౧౭ ||

అతిమాత్రమయం దేశో మనోజ్ఞః ప్రతిభాతి మా |
తాపసానాం నివాసోఽయం వ్యక్తం స్వర్గపథో యథా || ౧౮ ||

మృగా మృగీభిః సహితా బహవః పృషతా వనే |
మనోజ్ఞరూపా లక్ష్యంతే కుసుమైరివ చిత్రితాః || ౧౯ ||

సాధుసైన్యాః ప్రతిష్ఠంతాం విచిన్వంతు చ కాననే |
యథా తౌ పురుషవ్యాఘ్రౌ దృశ్యేతే రామలక్ష్మణౌ || ౨౦ ||

భరతస్య వచః శ్రుత్వా పురుషాః శస్త్రపాణయః |
వివిశుస్తద్వనం శూరాః ధూమం చ దదృశుస్తతః || ౨౧ ||

తే సమాలోక్య ధూమాగ్రమూచుర్భరతమాగతాః |
నామనుష్యే భవత్యాగ్నిర్వ్యక్తమత్రైవ రాఘవౌ || ౨౨ ||

అథ నాత్ర నరవ్యాఘ్రౌ రాజపుత్రౌ పరంతపౌ |
మన్యే రామోపమాః సంతి వ్యక్తమత్ర తపస్వినః || ౨౩ || [అన్యే]

తచ్ఛ్రుత్వా భరతస్తేషాం వచనం సాధుసమ్మతమ్ |
సైన్యానువాచ సర్వాంస్తానమిత్రబలమర్దనః || ౨౪ ||

యత్తా భవంతస్తిష్ఠంతు నేతో గంతవ్యమగ్రతః |
అహమేవ గమిష్యామి సుమంత్రో గురురేవ చ || ౨౫ ||

ఏవముక్తాస్తతః సర్వే తత్ర తస్థుః సమంతతః |
భరతో యత్ర ధూమాగ్రం తత్ర దృష్టిం సమాదధాత్ || ౨౬ ||

వ్యవస్థితా యా భరతేన సా చమూ-
-ర్నిరీక్షమాణాఽపి చ ధూమమగ్రతః |
బభూవ హృష్టా నచిరేణ జానతీ
ప్రియస్య రామస్య సమాగమం తదా || ౨౭ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రినవతితమః సర్గః || ౯౩ ||

Ayodhya Kanda Sarga 93 Meaning In Telugu

మహాసముద్రము వలె ఉన్న భరతుని సైన్యము పరివారము ఆ అడవులలో ప్రయాణం చేస్తూ ఉంటే అడవిలో ఉన్న మృగములు భయపడి పారిపోతున్నాయి. ఆ సైన్యము నడిచేటప్పుడు రేగిన ధూళితో ఆకాశం ఎర్రగా కవురు వేసినట్టు అయింది. వారందరూ చిత్రకూట పర్వతమును సమీపించారు. భరతుడు వసిష్ఠునితో ఇలా అన్నాడు. “మహాత్మా! పరిసరములను బట్టి చూడగా మనకు చిత్రకూటపర్వతమును సమీపించినట్టు కనపడు చున్నది. అదుగో అదే మందాకినీ నది. ఇక్కడ కిన్నరులుసంచరిస్తూ ఉంటారని ప్రతీతి.

(ఇక్కడ వాల్మీకి ఒక శ్లోకం రాసాడు. అదేమిటంటే—-
కుర్వన్తికుసుమాపీడాన్ శిరస్సు సురభీనమీ।
మేఘప్రకాశై: ఫలకైర్దాక్షిణాత్యా యథానరా॥

ఈ పర్వత శిఖరములు, మేఘములతో సమానంగా, దాక్షిణాత్య నరుల వలె ప్రకాశిస్తున్నాయి. అని స్థూలంగా చెప్పుకోవచ్చు. దూరానికి మేఘములు, పర్వత శిఖరములు నల్లగా ఉంటాయి. అంటే దక్షిణదేశ నరులు నల్లగా ఉంటారని మనం అనుకోవచ్చునా. అలా కాకపోతే, ఇక్కడ దాక్షిణాత్యుల ప్రసక్తి తీసుకురావడం ఎందుకు? ఉత్తరదేశస్థులు తెల్లగా ఆజానుబాహులుగా ఉంటారని మనకు తెలిసిందే. కాబట్టి మన చరిత్రలో చెప్పినట్టు ఆర్యులు దస్యులు అనే రెండు తెగలు ఉన్నాయని స్పష్టం అవుతున్నట్టుగా ఉంది. ఇది కేవలము ఊహ మాత్రమే రూఢి కాదు.)

తరువాత భరతుడు శత్రుఘ్నుని చూచి “సోదరా! ఈ ప్రశాంత మైన అరణ్యమును చూస్తుంటే ఇక్కడ ఋషులు నివసిస్తున్నారు అని స్పష్టం అవుతోంది. ఇప్పుడు మనము రాముని పర్ణశాల కొరకు వెతకవలెను. మన సైన్యమును నలుదిక్కులకు పంపి రాముని జాడ కనుగొనమని చెప్పు.” అని అన్నాడు.

భరతుని ఆదేశము మేరకు సైన్యము నలుదిక్కులకు వెళ్లారు. వారికి కొంచెం దూరంలో పొగ లేస్తున్నట్టు కనపడింది. వెంటనే వారు భరతుని వద్దకు వచ్చి “మహారాజా! ఈ అరణ్యములో ఆ ప్రదేశములో పొగవస్తోంది అంటే అక్కడ జనసంచారము ఉన్నట్టే. అక్కడే రామలక్ష్మణులు ఉండవచ్చు అని అనుమానంగా ఉంది. అలా కాకపోతే అక్కడ ముని ఆశ్రమములు ఉండవచ్చు. వారిని అడిగితే రాముని జాడలు చెప్పగలరు.” అని అన్నారు.

భరతుడు వారితో ఇలా అన్నాడు. “మీరందరూ ఇక్కడే ఉండండి. నేను, వసిష్ఠుడు సుమంత్రుడు పోయి చూచి వస్తాము. అంతదాకా మీరు ఇక్కడే వేచి ఉండండి.”అని అన్నాడు. తరువాత భరతుడు ఆపొగవస్తున్న దిక్కుగా చూచాడు. చాలారోజుల తరువాత తాను రాముని చూడబోవుచున్నానని ఎంతో సంతోషించాడు భరతుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ చతుర్నవతితమః సర్గః (94) >>

Leave a Comment