Ayodhya Kanda Sarga 94 In Telugu – అయోధ్యాకాండ చతుర్నవతితమః సర్గః

అయోధ్యాకాండం చతుర్నవతితమ (94వ) సర్గలో, భరతుడు వశిష్ఠ మహర్షితో కలిసి రాముని ఆశ్రమం వెళ్ళడానికి సిద్ధమవుతాడు. అతని వెంట కౌసల్య, సుమిత్ర, కైకేయి మరియు ఇతర స్త్రీలు కూడా ఉన్నారు. భరతుడు తన తండ్రి దశరథ మహారాజు మరణాన్ని రాముని చెబుతాడు. రాముడు తండ్రి మరణ వార్త విని శోకసంద్రుడవుతాడు. భరతుడు రాముడిని అరణ్యవాసం నుండి తిరిగి రావలసిందిగా ప్రార్థిస్తాడు. రాముడు తన కర్తవ్యాన్ని సమర్థిస్తూ, తన వాగ్దానం ప్రకారం అరణ్యవాసం పూర్తి చేస్తానని తేల్చి చెబుతాడు. భరతుడు రాముడి పాదుకలు తీసుకుని, అవి రాముని ప్రతీకగా సింహాసనంపై ఉంచుతానని, రాముడు తిరిగి వచ్చేవరకు రాజ్యం పాలిస్తానని అంగీకరిస్తాడు.

చిత్రకూటవర్ణనా

దీర్ఘకాలోషితస్తస్మిన్ గిరౌ గిరివనప్రియః |
వైదేహ్యాః ప్రియమాకాంక్షన్ స్వం చ చిత్తం విలోభయన్ || ౧ ||

అథ దాశరథిశ్చిత్రం చిత్రకూటమదర్శయత్ |
భార్యామమరసంకాశః శచీమివ పురందరః || ౨ ||

న రాజ్యాద్భ్రంశనం భద్రే న సుహృద్భిర్వినాభవః |
మనో మే బాధతే దృష్ట్వా రమణీయమిమం గిరిమ్ || ౩ ||

పశ్యేమమచలం భద్రే నానాద్విజగణాయుతమ్ |
శిఖరైః ఖమివోద్విద్ధైర్ధాతుమద్భిర్విభూషితమ్ || ౪ ||

కేచిద్రజతసంకాశాః కేచిత్ క్షతజసన్నిభాః |
పీతమాంజిష్ఠవర్ణాశ్చ కేచిన్మణివరప్రభాః || ౫ ||

పుష్పార్కకేతకాభాశ్చ కేచిజ్జ్యోతీరసప్రభాః |
విరాజంతేఽచలేంద్రస్య దేశా ధాతువిభూషితాః || ౬ ||

నానామృగగణద్వీపితరక్ష్వృక్షగణైర్వృతః |
అదుష్టైర్భాత్యయం శైలో బహుపక్షిసమాయుతః || ౭ ||

ఆమ్రజంబ్వసనైర్లోధ్రైః ప్రియాలైః పనసైర్ధవైః |
అంకోలైర్భవ్యతినిశైర్బిల్వతిందుకవేణుభిః || ౮ ||

కాశ్మర్యరిష్టవరుణైర్మధూకైస్తిలకైస్తథా |
బదర్యామలకైర్నీపైర్వేత్రధన్వనబీజకైః || ౯ ||

పుష్పవద్భిః ఫలోపేతైశ్ఛాయావద్భిర్మనోరమైః |
ఏవమాదిభిరాకీర్ణః శ్రియం పుష్యత్యయం గిరిః || ౧౦ ||

శైలప్రస్థేషు రమ్యేషు పశ్యేమాన్ రోమహర్షణాన్ |
కిన్నరాన్ ద్వంద్వశో భద్రే రమమాణాన్మనస్వినః || ౧౧ ||

శాఖావసక్తాన్ ఖడ్గాంశ్చ ప్రవరాణ్యంబరాణి చ |
పశ్య విద్యాధరస్త్రీణాం క్రీడోద్ధేశాన్ మనోరమాన్ || ౧౨ ||

జలప్రపాతైరుద్భేదైర్నిష్యందైశ్చ క్వచిత్ క్వచిత్ |
స్రవద్భిర్భాత్యయం శైలః స్రవన్మద ఇవ ద్విపః || ౧౩ ||

గుహాసమీరణో గంధాన్ నానాపుష్పభవాన్వహన్ |
ఘ్రాణతర్పణమభ్యేత్య కం నరం న ప్రహర్షయేత్ || ౧౪ ||

యదీహ శరదోఽనేకాస్త్వయా సార్ధమనిందితే |
లక్ష్మణేన చ వత్స్యామి న మాం శోకః ప్రధక్ష్యతి || ౧౫ ||

బహుపుష్పఫలే రమ్యే నానాద్విజగణాయుతే |
విచిత్రశిఖరే హ్యస్మిన్ రతవానస్మి భామిని || ౧౬ ||

అనేన వనవాసేన మయా ప్రాప్తం ఫలద్వయమ్ |
పితుశ్చానృణతా ధర్మే భరతస్య ప్రియం తథా || ౧౭ ||

వైదేహి రమసే కచ్చిచ్చిత్రకూటే మయా సహ |
పశ్యంతీ వివిధాన్భావాన్ మనోవాక్కాయసమ్మతాన్ || ౧౮ ||

ఇదమేవామృతం ప్రాహుః రాజ్ఞి రాజర్షయః పరే |
వనవాసం భవార్థాయ ప్రేత్య మే ప్రపితామహాః || ౧౯ ||

శిలాః శైలస్య శోభంతే విశాలాః శతశోఽభితః |
బహులా బహుళైర్వర్ణైర్నీలపీతసితారుణైః || ౨౦ ||

నిశి భాంత్యచలేంద్రస్య హుతాశనశిఖా ఇవ |
ఓషధ్యః స్వప్రభాలక్ష్యా భ్రాజమానాః సహస్రశః || ౨౧ ||

కేచిత్ క్షయనిభా దేశాః కేచిదుద్యానసన్నిభాః |
కేచిదేకశిలా భాంతి పర్వతస్యాస్య భామిని || ౨౨ ||

భిత్త్వేవ వసుధాం భాతి చిత్రకూటః సముత్థితః |
చిత్రకూటస్య కూటోఽసౌ దృశ్యతే సర్వతః శుభః || ౨౩ ||

కుష్ఠపున్నాగస్థగరభూర్జపత్రోత్తరచ్ఛదాన్ |
కామినాం స్వాస్తరాన్ పశ్య కుశేశయదలాయుతాన్ || ౨౪ ||

మృదితాశ్చాపవిద్ధాశ్చ దృశ్యంతే కమలస్రజః |
కామిభిర్వనితే పశ్య ఫలాని వివిధాని చ || ౨౫ ||

వస్వౌకసారాం నళినీమత్యేతీవోత్తరాన్ కురూన్ |
పర్వతశ్చిత్రకూటోఽసౌ బహుమూలఫలోదకః || ౨౬ ||

ఇమం తు కాలం వనితే విజహ్రివాన్
త్వయా చ సీతే సహ లక్ష్మణేన చ |
రతిం ప్రపత్స్యే కులధర్మవర్ధనీం
సతాం పథి స్వైర్నియమైః పరైః స్థితః || ౨౭ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్నవతితమః సర్గః || ౯౪ ||

Ayodhya Kanda Sarga 94 Meaning In Telugu

భరతుడు రాముని గురించి వెతుకుతుంటే, రాముడు సీతతో కలిసి వనవిహారం చేస్తున్నాడు. సీతకు చిత్ర విచిత్రములైన మొక్కలను వృక్షములను చూపించి వాటి గురించి వివరిస్తున్నాడు. “సీతా!ఇక్కడ ఉన్న సౌందర్యశోభలను, ఈ వనముల అందములను చూచిన తరువాత ఇక్కడి నుండి అయోధ్యకు పోవాలని అనిపించడంలేదు. ఈ పర్వతములు అనేకములైన ఓషధులకు, వన్యమృగములకు, పక్షులకు నిలయము. ఈ ప్రశాంత వాతావరణములో ఈ పర్వత శిఖరములను, వృక్షములను చూస్తూ ఎన్నాళ్లు ఉన్నా విసుగు అనిపించదు. ఈ అరణ్యములో వేప, మామిడి, నేరేడు, వేగిస, లోధ్ర, ప్రియాళ, పనస, చండ్ర, అంకోల, బిల్వ, తుమ్మ, వెదురు,కశ్మ, ఇప్ప, తిలక, బదరి, ఆమలక, పేము పొదలు, మద్ది మొదలగు వృక్షజాతులో నిండి ఉన్నది.

(వాల్మీకి తన రామాయణకావ్యంలో ఆనాడు ఉన్న వృక్షజాతులను తరువాతి తరాల వారికి పరిచయం చేస్తున్నాడు.)

ఓ సీతా! అటు చూడు, కిన్నరులు, గంధర్వులు, విద్యాధరులు ఆ పర్వత శిఖరముల మీద జంట జంటలుగా విహరిస్తున్నారు. నేను ఈ వనవాసము చేయడం వలన నా తండ్రి మాటను నిలబెట్టడం, భరతుని రాజ్యాభిషేకమునకు ఆటంకం తొలగి పోవడం లాంటి గొప్ప పనులు సాధించాను. దీని వలన నా పితృఋణము తీర్చుకున్నట్టు అయింది. నాతో పాటు నువ్వు కూడా నన్నుఅనుసరించి వచ్చి ఈ వనసౌందర్య మును ఆస్వాదించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. రాజులకు మరణానంతరము ఉత్తమ లోకములు లభించుటకు వనవాసమే ఉ త్తమైనది అయి పూర్వపు రాజర్షులు చెప్పి ఉన్నారు కదా!

సీతా! ఈ చిత్రకూటపర్వతము మీద ఎన్నోఓషధులు ఉ న్నాయి. ఆ ఓషధుల మీది నుండి వీచే గాలి అన్ని రోగములను పోగొడుతుంది అని పెద్దలు చెబుతారు. సీతా! అటు చూడు! ఇక్కడ కొన్ని ప్రదేశములు సహజముగా ఏర్పడిన ఉద్యానవనముల మాదిరి, మరి కొన్ని పూపొదరిళ్లు గృహముల మాదిరి, కనపడుతున్నాయి కదా! ఈ చిత్రకూట పర్వతము భూమిని చీల్చుకొని పైకి వచ్చినట్టు ఎలా గర్వంగా నిలబడిఉన్నదో చూడు! ఇక్కడ కామాతురు లైన స్త్రీపురుషులు, ఈ నిర్జన ప్రదేశములలో కుష్ఠ, పున్నాగ, భూర్జర చెట్ల ఆకులతో శయ్యలు ఏర్పరచుకొని ఉన్నారు చూడు. ఆ కాముకులు నలిపి పారవేసిన పూలమాలలు, తినగా మిగిలిన ఫలములు అక్కడక్కడా పడి ఉన్నాయి చూడు.” అని చిత్రకూటపర్వత విశేషములను సీతకు రాముడు చూపిస్తున్నాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ పంచనవతితమః సర్గః (95) >>

Leave a Comment