అయోధ్యాకాండం షణ్ణవతితమ (96వ) సర్గలో, భరతుడు రాముని వనవాసం నుండి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న సందర్భంగా సాగుతుంది. భరతుడు తన సైన్యంతో కలిసి చిత్రకూటానికి చేరుకుంటాడు. అక్కడ, అతను రాముడు, సీత, లక్ష్మణులను చూస్తాడు. రాముడు భరతుని ఆత్మీయతను, ప్రేమను గమనించి ఆనందిస్తాడు. భరతుడు రాముని తనతో తిరిగి రావలసిందిగా వేడుకుంటాడు. కానీ, రాముడు తన తండ్రి ఆజ్ఞను పాటించడం ధర్మమని, వనవాసం పూర్తి చేయడం తన కర్తవ్యమని తేల్చి చెబుతాడు. భరతుడు రాముడి పాదుకలను తీసుకుని, అవి రాముని ప్రతీకగా సింహాసనంపై ఉంచి, రాముడు తిరిగి వచ్చేవరకు పాలన చేస్తానని చెప్పి అయోధ్యకు తిరిగి వెళ్తాడు.
లక్ష్మణక్రోధః
తాం తథా దర్శయిత్వా తు మైథిలీం గిరినిమ్నగామ్ |
నిషసాద గిరిప్రస్థే సీతాం మాంసేన ఛందయన్ || ౧ ||
ఇదం మేధ్యమిదం స్వాదు నిష్టప్తమిదమగ్నినా |
ఏవమాస్తే స ధర్మాత్మా సీతయా సహ రాఘవః || ౨ ||
తథా తత్రాసతస్తస్య భరతస్యోపయాయినః |
సైన్యరేణుశ్చ శబ్దశ్చ ప్రాదురాస్తాం నభస్పృశౌ || ౩ ||
ఏతస్మిన్నంతరే త్రస్తాః శబ్దేన మహతా తతః |
అర్దితా యూథపా మత్తాః సయూథా దుద్రువుర్దిశః || ౪ ||
స తం సైన్యసముద్ధూతం శబ్దం శుశ్రావ రాఘవః |
తాంశ్చ విప్రద్రుతాన్ సర్వాన్ యూథపానన్వవైక్షత || ౫ ||
తాంశ్చ విద్రవతో దృష్ట్వా తం చ శ్రుత్వా చ నిస్వనమ్ |
ఉవాచ రామః సౌమిత్రిం లక్ష్మణం దీప్తతేజసమ్ || ౬ ||
హంత లక్ష్మణ పశ్యేహ సుమిత్రా సుప్రజాస్త్వయా |
భీమస్తనితగంభీరస్తుములః శ్రూయతే స్వనః || ౭ ||
గజయూథాని వాఽరణ్యే మహిషా వా మహావనే |
విత్రాసితా మృగాః సింహైః సహసా ప్రద్రుతా దిశః || ౮ ||
రాజా వా రాజమాత్రో వా మృగయామటతే వనే |
అన్యద్వా శ్వాపదం కించిత్ సౌమిత్రే జ్ఞాతుమర్హసి || ౯ ||
సుదుశ్చరో గిరిశ్చాయం పక్షిణామపి లక్ష్మణ |
సర్వమేతద్యథాతత్త్వమచిరాజ్ఞాతుమర్హసి || ౧౦ ||
స లక్ష్మణః సంత్వరితః సాలమారుహ్య పుష్పితమ్ |
ప్రేక్షమాణో దిశస్సర్వాః పూర్వాం దిశముదైక్షత || ౧౧ ||
ఉదఙ్ముఖః ప్రేక్షమాణో దదర్శ మహతీం చమూమ్ |
రథాశ్వగజసంబాధాం యత్తైర్యుక్తాం పదాతిభిః || ౧౨ ||
తామశ్వగజసంపూర్ణాం రథధ్వజవిభూషితామ్ |
శశంస సేనాం రామాయ వచనం చేదమబ్రీత్ || ౧౩ ||
అగ్నిం సంశమయత్వార్యః సీతా చ భజతాం గుహామ్ |
సజ్యం కురుష్వ చాపం చ శరాంశ్చ కవచం తథా || ౧౪ ||
తం రామః పురుషవ్యాఘ్రో లక్ష్మణం ప్రత్యువాచ హ |
అంగావేక్షస్వ సౌమిత్రే కస్యేమాం మన్యసే చమూమ్ || ౧౫ ||
ఏవముక్తస్తు రామేణ లక్ష్మణో వాక్యమబ్రవీత్ |
దిధక్షన్నివ తాం సేనాం రుషితః పావకో యథా || ౧౬ ||
సంపన్నం రాజ్యమిచ్ఛంస్తు వ్యక్తం ప్రాప్యాభిషేచనమ్ |
ఆవాం హంతుం సమభ్యేతి కైకేయ్యా భరతః సుతః || ౧౭ ||
ఏష వై సుమహాన్ శ్రీమాన్ విటపీ సంప్రకాశతే |
విరాజత్యుద్గతస్కంధః కోవిదారధ్వజో రథే || ౧౮ ||
భజంత్యేతే యథాకామమశ్వానారుహ్య శీఘ్రగాన్ |
ఏతే భ్రాజంతి సంహృష్టా గజానారుహ్య సాదినః || ౧౯ ||
గృహీతధనుషౌ చావాం గిరిం వీరశ్రయావహై |
అథవేహైవ తిష్ఠావః సన్నద్ధావుద్యతాయుధౌ || ౨౦ ||
అపి నౌ వశమాగచ్ఛేత్ కోవిదారధ్వజో రణే |
అపి ద్రక్ష్యామి భరతం యత్కృతే వ్యసనం మహత్ || ౨౧ ||
త్వయా రాఘవ సంప్రాప్తం సీతయా చ మయా తథా |
యన్నిమిత్తం భవాన్ రాజ్యాచ్చ్యుతో రాఘవ శాశ్వతాత్ || ౨౨ ||
సంప్రాప్తోఽయమరిర్వీర భరతో వధ్యైవ మే |
భరతస్య వధే దోషం నాహం పశ్యామి రాఘవ || ౨౩ ||
పూర్వాపకారిణాం త్యాగే న హ్యధర్మో విధీయతే |
పూర్వాపకారీ భరతస్త్యక్తధర్మశ్చ రాఘవ || ౨౪ ||
ఏతస్మిన్నిహతే కృత్స్నామనుశాధి వసుంధరామ్ |
అద్య పుత్రం హతం సంఖ్యే కైకేయీ రాజ్యకాముకా || ౨౫ ||
మయా పశ్యేత్సుదుఃఖార్తా హస్తిభగ్నమివ ద్రుమమ్ |
కైకేయీం చ వధిష్యామి సానుబంధాం సబాంధవామ్ || ౨౬ ||
కలుషేణాద్య మహతా మేదినీ పరిముచ్యతామ్ |
అద్యేమం సంయతం క్రోధమసత్కారం చ మానద || ౨౭ ||
మోక్ష్యామి శత్రుసైన్యేషు కక్షేష్వివ హుతాశనమ్ |
అద్యైతచ్చిత్రకూటస్య కాననం నిశితైః శరైః || ౨౮ ||
భిందన్ శత్రుశరీరాణి కరిష్యే శోణితోక్షితమ్ |
శరైర్నిర్భిన్నహృదయాన్ కుంజరాంస్తురగాంస్తథా || ౨౯ ||
శ్వాపదాః పరికర్షంతు నరాంశ్చ నిహతాన్మయా |
శరాణాం ధనుషశ్చాహమనృణోఽస్మి మహామృధే |
ససైన్యం భరతం హత్వా భవిష్యామి న సంశయః || ౩౦ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షణ్ణవతితమః సర్గః || ౯౬ ||
Ayodhya Kanda Sarga 96 Meaning In Telugu
ఆ విధంగా మందాకినీ నదీతీరములో ఆనందముగా విహరిస్తున్న సీతా రాములకు, భరతుని సైన్యము వచ్చునప్పుడు రేగిన ధూళి కనపడింది. సేనలు వచ్చునపుడు పుట్టే ధ్వనులు, ఏనుగుల ఘీంకారములు, అశ్వముల పదఘట్టనములు, సైనికుల కోలాహలము రామునికి లీలామాత్రంగా వినపడ్డాయి. ఆ సైన్యముల రాకతో భయపడి పారిపోతున్న మృగములను కూడా చూచాడు రాముడు.
రాముడు వెంటనే లక్ష్మణుని పిలిచాడు. “లక్ష్మణా! . జాగ్రత్తగా విను. ఏదో మహా సైన్యము వచ్చుచున్న సవ్వడి వినిపించడంలేదూ! ఆ ఏనుగుల ఘీంకారములు, సైనికుల పదఘట్టనములు, గుర్రముల సకిలింపులు, సైన్యములకు బెదిరి పారిపోవు అడవిమృగములు–ఇవన్నీ చూస్తుంటే ఏదో మహాసైన్యముఇక్కడకు వస్తున్నట్టు కనపడుతూఉంది. ఇక్కడకు సైన్యము రావడం ఆశ్చర్యం గా ఉంది. ఎవరైనా రాజ కుమారుడు ఈ అరణ్యమునకు వేట నిమిత్తము వచ్చాడా! లేక ఏదైనా భయంకర మృగముల దండు ఈ అరణ్యములోని ప్రవేశించిందా! నీవు పోయి దాని విషయం కనుక్కొనిరా.”అని అన్నాడు రాముడు.
వెంటనే లక్ష్మణుడు పోయి ఒక పొడుగాటి సాలవృక్షమును ఎక్కాడు. నలుదిక్కులా చూచాడు. తూర్పు దిక్కునుంచి వస్తున్న ఒక రథ, గజ, తురగ, పదాతి దళములతో కూడిన మహా సైన్యము కనపడింది. లక్ష్మణుడు వెంటనే చెట్టు దిగి వచ్చి ఆ సైన్యము రాక గురించి రామునికి చెప్పాడు. వెంటనే రాముడు తగుజాగ్రత్తలు తీసుకున్నాడు. బయట మండుతున్న అగ్నిని ఆర్పివేసారు. సీతను ఒక గుహలో దాచిపెట్టారు. రామలక్ష్మణులు ఇద్దరూ తమతమ వింటినారిని సంధించారు. అమ్ములపొదులను సరిచేసుకున్నారు. కవచములను ధరించారు.
మరలా రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! ఆసేన ఎవరిదో ఆనవాలు పట్టగలవా!” అని అడిగాడు. మరలా లక్ష్మణుడు చెట్టు ఎక్కి పరిశీలనగా పతాకములను చూచి అవి అయోధ్యానగరపతాకములు అని గుర్తించాడు. చెట్టు దిగివచ్చి “అన్నయ్యా! అది భరతునిసేన. భరతుడుసేనా సమేతంగా ఇక్కడకు వస్తున్నాడు. భరతుడు తన మార్గమును నిష్కంటకము చేయదలచుకొని మనలనిద్దరినీ చంపడానికి వస్తున్నాడని నా ఊహ. ఆ రథము మీద అయోధ్య రాజ చిహ్నమగు కోవిదార వృక్షము గల పతాకము ఎగురుతూ ఉంది. రామా! మనము ఇద్దరమూ ఇక్కడే ఉందామా! లేక పర్వతశిఖరములు ఎక్కి అక్కడ పొంచి ఉందామా! ఈ భరతుడు మనలను ఇక్కడ కూడా సుఖంగా ఉండనీయక తన సైన్యముతో మనమీదకు దాడి వస్తున్నాడు. ఏం చేద్దాము? రామా! ఎవరి కొరకు కైక నిన్ను అడవులకు పంపిందో, ఆ భరతుడు నీ మీదికి వస్తున్నాడు.
కాబట్టి భరతుడు మనకు శత్రువు. శత్రుడైన భరతుడు చంపతగ్గవాడు. భరతుడు నీ రాజ్యము అపహరించి నీకు అపకారమే చేసాడు. కాబట్టి అతనిని చంపుటలో దోషము ఏమీ లేదు. నేను భరతుని సంహరిస్తాను. నీ రాజ్యము నీకు ఇప్పిస్తాను. అడవులలో ఉన్న మనలను వదలకుండా, భరతుడు మన మీదికి వచ్చినపుడు అతనిని సంహరించడంలో తప్పులేదు కదా! దీనితో కైకకు తగినశాస్తి జరుగుతుంది. నాచే చంపబడిన భరతుని చూచి కైక కుళ్లి కుళ్లి ఏడవాలి. అలా ఏడుస్తున్న కైకను కూడా నిర్దాక్షిణ్యంగా సంహరిస్తాను. దానితో పాపశేషము తొలగిపోతుంది. పాపాత్ముల నుండి భూదేవికి విముక్తి కలుగుతుంది. నాడు నిన్ను అడవులకు పంపునపుడు నాకు వచ్చిన కోపము ఈ రోజుతో చల్లారుతుంది. మన శత్రువుల రక్తంతో ఈ చిత్రకూట పర్వతమును తడిపివేస్తాను. భరతుని చతురంగ బలముల శవాలతో ఈ అడవిలో ఉన్న క్రూరమృగములు విందు చేసుకుంటాయి. నేను ఈ ధనురాణములు ధరించినందుకు, భరతుని సేనలను చంపి వాటి ఋణం తీర్చుకుంటాను. ఇందుకుసందేహము లేదు.”అని పౌరుషంగా పలికాడు లక్ష్మణుడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్