Ayodhya Kanda Sarga 97 In Telugu – అయోధ్యాకాండ సప్తనవతితమః సర్గః

అయోధ్యాకాండం సప్తనవతితమ (97వ) సర్గలో, భరతుడు రాముని పాదుకలను తీసుకుని, అవి రాముని ప్రతీకగా సింహాసనంపై ఉంచి పాలన చేయడానికి సిద్ధమవుతాడు. ఈ సర్గలో, భరతుడు, శత్రుఘ్నుడు, వశిష్ఠుడు, ఇతర రుషులు, సైనికులు రాముని వద్దకు చేరుకుంటారు. భరతుడు రాముని పాదాలు స్పృశించి, తన తండ్రి మరణాన్ని, తన బాధను వ్యక్తపరుస్తాడు. భరతుడు రాముని తిరిగి రావాలని ప్రాధేయపడతాడు, కానీ రాముడు తన వాగ్దానం ప్రకారం అరణ్యవాసం కొనసాగిస్తానని చెప్పి, తన ధర్మాన్ని పాటిస్తాడు. భరతుడు రాముని పాదుకలను తీసుకుని, అయోధ్యకు తిరిగి వెళ్లి, అవి సింహాసనంపై ఉంచి, రాముని ప్రతినిధిగా రాజ్యాన్ని పాలిస్తాడు.

భరతగుణప్రశంసా

సుసంరబ్ధం తు సౌమిత్రిం లక్ష్మణం క్రోధమూర్ఛితమ్ |
రామస్తు పరిసాంత్వ్యాథ వచనం చేదమబ్రవీత్ || ౧ ||

కిమత్ర ధనుషా కార్యమసినా వా సచర్మణా |
మహేష్వాసే మహాప్రాజ్ఞే భరతే స్వయమాగతే || ౨ ||

పితుః సత్యం ప్రతిశ్రుత్య హత్వా భరతమాగతమ్ |
కిం కరిష్యామి రాజ్యేన సాపవాదేన లక్ష్మణ || ౩ ||

యద్ద్రవ్యం బాంధవానాం వా మిత్రాణాం వా క్షయే భవేత్ |
నాహం తత్ ప్రతిగృహ్ణీయాం భక్షాన్విషకృతానివ || ౪ ||

ధర్మమర్థం చ కామం చ పృథివీం చాపి లక్ష్మణ |
ఇచ్ఛామి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమి తే || ౫ ||

భ్రాతౄణాం సంగ్రహార్థం చ సుఖార్థం చాపి లక్ష్మణ |
రాజ్యమప్యహమిచ్ఛామి సత్యేనాయుధమాలభే || ౬ ||

నేయం మమ మహీ సౌమ్య దుర్లభా సాగరాంబరా |
న హీచ్ఛేయమధర్మేణ శక్రత్వమపి లక్ష్మణ || ౭ ||

యద్వినా భరతం త్వాం చ శత్రుఘ్నం చాపి మానద |
భవేన్మమ సుఖం కించిద్భస్మ తత్కురుతాం శిఖీ || ౮ ||

మన్యేఽహమాగతోఽయోధ్యాం భరతో భ్రాతృవత్సలః |
మమ ప్రాణాత్ప్రియతరః కులధర్మమనుస్మరన్ || ౯ ||

శ్రుత్వా ప్రవ్రాజితం మాం హి జటావల్కలధారిణమ్ |
జానక్యాసహితం వీర త్వయా చ పురుషర్షభ || ౧౦ ||

స్నేహేనాఽక్రాంతహృదయః శోకేనాకులితేంద్రియః |
ద్రష్టుమభ్యాగతో హ్యేష భరతో నాన్యథాఽఽగతః || ౧౧ ||

అంబాం చ కైకయీం రుష్య పరుషం చాప్రియం వదన్ |
ప్రసాద్య పితరం శ్రీమాన్ రాజ్యం మే దాతుమాగతః || ౧౨ ||

ప్రాప్తకాలం యదేషోఽస్మాన్ భరతో ద్రష్టుమిచ్ఛతి |
అస్మాసు మనసాఽప్యేషః నాప్రియం కించిదాచరేత్ || ౧౩ ||

విప్రియం కృతపూర్వం తే భరతేన కదా ను కిమ్ |
ఈదృశం వా భయం తేఽద్య భరతం యోఽత్ర శంకసే || ౧౪ ||

న హి తే నిష్ఠురం వాచ్యో భరతో నాప్రియం వచః |
అహం హ్యప్రియముక్తః స్యాం భరతస్యాప్రియే కృతే || ౧౫ ||

కథం ను పుత్రాః పితరం హన్యుః కస్యాంచిదాపది |
భ్రాతా వా భ్రాతరం హన్యాత్ సౌమిత్రే ప్రాణమాత్మనః || ౧౬ ||

యది రాజ్యస్య హేతోస్త్వమిమాం వాచం ప్రభాషసే |
వక్ష్యామి భరతం దృష్ట్వా రాజ్యమస్మై ప్రదీయతామ్ || ౧౭ ||

ఉచ్యమానోఽపి భరతో మయా లక్ష్మణ తత్త్వతః |
రాజ్యమస్మై ప్రయచ్ఛేతి బాఢమిత్యేవ వక్ష్యతి || ౧౮ ||

తథోక్తో ధర్మశీలేన భ్రాత్రా తస్య హితే రతః |
లక్ష్మణః ప్రవివేశేవ స్వాని గాత్రాణి లజ్జయా || ౧౯ ||

తద్వాక్యం లక్ష్మణః శ్రుత్వా వ్రీడితః ప్రత్యువాచ హ |
త్వాం మన్యే ద్రష్టుమాయాతః పితా దశరథః స్వయమ్ || ౨౦ ||

వ్రీడితం లక్ష్మణం దృష్ట్వా రాఘవః ప్రత్యువాచ హ |
ఏష మన్యే మహాబాహురిహాస్మాన్ ద్రష్టుమాగతః || ౨౧ ||

అథవా నౌ ధ్రువం మన్యే మన్యమానః సుఖోచితౌ |
వనవాసమనుధ్యాయ గృహాయ ప్రతినేష్యతి || ౨౨ ||

ఇమాం వాఽప్యేష వైదేహీమత్యంతసుఖసేవినీమ్ |
పితా మే రాఘవః శ్రీమాన్ వనాదాదాయ యాస్యతి || ౨౩ ||

ఏతౌ తౌ సంప్రకాశేతే గోత్రవంతౌ మనోరమౌ |
వాయువేగసమౌ వీర జవనౌ తురగోత్తమౌ || ౨౪ ||

సైష సుమహాకాయః కంపతే వాహినీముఖే |
నాగః శత్రుంజయో నామ వృద్ధస్తాతస్య ధీమతః || ౨౫ ||

న తు పశ్యామి తచ్ఛత్త్రం పాండరం లోకసత్కృతమ్ |
పితుర్దివ్యం మహాబాహో సంశయో భవతీహ మే || ౨౬ ||

వృక్షాగ్రాదవరోహ త్వం కురు లక్ష్మణ మద్వచః |
ఇతీవ రామో ధర్మాత్మా సౌమిత్రం తమువాచ హ || ౨౭ ||

అవతీర్య తు సాలాగ్రాత్తస్మాత్స సమితింజయః |
లక్ష్మణః ప్రాంజలిర్భూత్వా తస్థౌ రామస్య పార్శ్వతః || ౨౮ ||

భరతేనాపి సందిష్టా సమ్మర్దో న భవేదితి |
సమంతాత్తస్య శైలస్య సేనా వాసమకల్పయత్ || ౨౯ ||

అధ్యర్ధమిక్ష్వాకుచమూర్యోజనం పర్వతస్య సా |
పార్శ్వే న్యవిశదావృత్య గజవాజిరథాకులా || ౩౦ ||

సా చిత్రకూటే భరతేన సేనా
ధర్మం పురస్కృత్య విధూయ దర్పమ్ |
ప్రసాదనార్థం రఘునందనస్య
విరాజతే నీతిమతా ప్రణీతా || ౩౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తనవతితమః సర్గః || ౯౭ ||

Ayodhya Kanda Sarga 97 Meaning In Telugu

భరతుని మీద కోపంతో ఊగిపోతున్న లక్ష్మణుని చూచి రాముడు ఇలా అన్నాడు. “లక్ష్మణా! శాంతించు. తొందర పడకు. వచ్చేవాడు భరతుడు అని నువ్వే చెప్పావు. భరతుడు మన సోదరుడు. పైగా ధర్మాత్ముడు. ఇప్పుడు మనకు కత్తులతోనూ విల్లుతోనూ అస్త్రశస్త్రములతోనూ పని ఏమున్నది. నేను నా తండ్రి ఆజ్ఞను పాటించుటకు అరణ్యములకు వచ్చాను. ఇప్పుడు భరతుని చంపి ఆ రాజ్యమును ఏమి చేసుకుంటాను. ఎందుకంటే నేను 14 సంవత్సరముల దాకా రాజ్యపాలన చేయలేను కదా. అదీకాకుండా సోదరుని చంపితే వచ్చేరాజ్యము విషము వంటిది. దానిని నేను ముట్టను.

మరొక విషయం. నేను ఈ రాజ్యమును కోరుతున్నానుఅంటే అది మీ కొరకే గానీ నాకు కాదు. నాకు ఏమీ అక్కరలేదు. ఈ పదునాలుగు సంవత్సరముల తరువాత కూడా నేను మీ కొరకు మాత్రమే రాజ్యపాలన చేస్తాను. నాకు రాజ్య కాంక్ష ఏ మాత్రమూ లేదు. ఇది నా ప్రతిజ్ఞ. మరొక మాట. నేను కావాలి అనుకుంటే శత్రువుల నందరినీ సమూలంగా నాశనం చేసి రాజ్యము కైవసము చేసు కోగలను. కానీ అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అధర్మపరంగా వచ్చే ఇంద్రపదవి కూడా నాకు ఇష్టం లేదు. అయినా మీకు లేని సుఖము నాకు ఎందుకు. భరతుడు, శత్రుఘ్నుడు, లేని రాజ్యము నాకు ఎందుకు. కాబట్టి శాంతించు. అసలు విషయం తెలుసుకో. నా ఊహ ప్రకారము భరతుడు తన మాతామహుల ఇంటి నుండి తిరిగి వచ్చి, తన తల్లి మూలంగా మనము అరణ్యములకు వెళ్లినట్టు తెలుసుకొని, తిరిగి మనలను అయోధ్యకు తీసుకొని వెళ్లుటకు వచ్చిఉంటాడు. ఎందుకంటే మన కులధర్మము ప్రకారము జ్యేష్టుడే రాజు కావలయును కదా. అందువలన భరతుడు పట్టాభిషేకమునకు అంగీకరించడు. కేవలము మనలను చూచుటకే వస్తూఉంటాడు.

అదీకాకుండా తన తల్లి మూలంగా ఇది అంతా జరిగింది అని తెలుసుకొని నన్ను తిరిగిఅయోధ్యకు తీసుకొనివెళ్లి పట్టాభిషేకము జరిపించవలెనని నా రాజ్యము తిరిగి నాకు ఇవ్వవలెననే ఉద్దేశ్యముతోనే వస్తూ ఉంటాడు. కాబట్టి భరతుడు మనకు కలలో కూడా అపకారము తలపెట్టడు.

అదీకాకుండా లక్ష్మణా! భరతుని సంగతి నీకు తెలియదా! ఇంతకు పూర్వము భరతుడు నీకు ఎప్పుడైనా ఎలాంటి అపకారమైనా చేసాడా! ఇలాంటి భయమును కలిగించాడా! లేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు భరతుడు మనకు అపకారము చేస్తాడు అని భయపడు తున్నావు. కాబట్టి భరతుని ఒక్క మాట కూడా అనకు. ఎందుకంటే భరతుని తిడితే నన్ను తిట్టినట్టే.

మరొక మాట ఈ లోకంలో ఎవరైనా ఎంతటి ఆపదలో ఉన్నా కన్న తండ్రిని, తోడబుట్టిన సోదరులను చంపుకుంటారా! పోనీ నీవు రాజ్యము కావలెనని కోరుకుంటూ ఉంటే చెప్పు. భరతునితో చెప్పి అయోధ్యను నా బదులు నీకు ఇప్పిస్తాను. హాయిగా రాజ్యము ఏలుకో. ఎందుకంటే, ‘భరతా! ఈరాజ్యము లక్ష్మణునికి ఇమ్ము’ అని అనగానే భరతుడు సంతోషంగా నీకు రాజ్యము ఇస్తాడు. ఆ నమ్మకము నాకు ఉంది. చెప్పు నీకు రాజ్యము కావాలా!” అని అడిగాడు రాముడు. లక్ష్మణుడు తన అవివేకపు మాటలకు సిగ్గుతో తల దించుకున్నాడు.

“లక్ష్మణా! అసలు విషయం ఏమిటంటే, భరతుడు రాగానే, మన తండ్రి దశరథుడు, భరతుని వెంటబెట్టుకొని మనలను చూడటానికి వస్తున్నాడు అని అనుకుంటున్నాను. అంతే కాదు, మనము పడుతున్న కష్టములను చూచి, మనలను తిరిగి అయోధ్యకు ఆహ్వానించుటకు వస్తున్నాడేమో అని కూడా అనుమానంగా ఉంది. ఒక వేళ మనము అయోధ్యకు రావడానికి ఇష్టపడక పోతే, కనీసము సీతనైనా తన వెంట తీసుకొని వెళతాడు దశరథుడు.

లక్ష్మణా! అటుచూడు అది మన తండ్రిగారి భద్రగజము కదా! మంద్రగమనంతో ఇటే వస్తూ ఉంది. కాని ఆగజము మీద మన తండ్రి గారి చిహ్నమైన తెల్లటి గొడుగు ఉండాలే. అది కనపడటం లేదు. ఏమయి ఉంటుంది. తండ్రిగారు వస్తుంటే ఆయనవెంట రాజచిహ్నమైన శ్వేతఛత్రము తప్పనిసరిగా ఉంటుంది కదా! అంటే తండ్రిగారు రావడం లేదా! భరతుడు ఒక్కడే వస్తున్నాడా! సరేలే. నువ్వు ఇక్కడే ఉండు.

నేనుచెప్పువరకూ కదలకు.”అని ఆదేశించాడు రాముడు. ఇక్కడ ఇలా ఉంటే, అక్కడ భరతుడు తన సేనలకు ఆజ్ఞఇచ్చాడు. “ఇక్కడ రాముని ఆశ్రమము ఉంది. ఆ ఆశ్రమము వద్ద శాంతికి భంగము కలగకూడదు. కాబట్టి సైన్యము అంతా ఈ పర్వతము చుట్టు విడిది చేయండి.” అని ఆజ్ఞాపించాడు. భరతుని ఆజ్ఞ ప్రకారము భరతుని సైన్యము చిత్రకూట పర్వతము చుట్టూ ఆవరించింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ అష్టనవతితమః సర్గః (98) >>

Leave a Comment