Aranya Kanda Sarga 23 In Telugu – అరణ్యకాండ త్రయోవింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ – త్రయోవింశః సర్గలో, రాముడు సీతను దుర్భాషలాడిన రాక్షసిని దండిస్తాడు. సీతకు సాంత్వన చెప్పి ఆమెను రక్షిస్తాడు. ఆ తర్వాత రాముడు సీతను తోటలో తిరగడానికి తీసుకెళతాడు. సీత రాముడికి ధైర్యం చెబుతూ తమ ప్రయాణం సాఫల్యం చెందాలని కోరుకుంటుంది. రాముడు సీతకు విశ్వాసాన్ని నూరిపోస్తాడు.

|| ఉత్పాతదర్శనమ్ ||

తస్మిన్ యాతే జనస్థానాదశివం శోణితోదకమ్ |
అభ్యవర్షన్మహామేఘస్తుములో గర్దభారుణః ||

1

నిపేతుస్తురగాస్తస్య రథయుక్తా మహాజవాః |
సమే పుష్పచితే దేశే రాజమార్గే యదృచ్ఛయా ||

2

శ్యామం రుధిరపర్యంతం బభూవ పరివేషణమ్ |
అలాతచక్రప్రతిమం పరిగృహ్య దివాకరమ్ ||

3

తతో ధ్వజముపాగమ్య హేమదండం సముచ్ఛ్రితమ్ |
సమాక్రమ్య మహాకాయస్తస్థౌ గృధ్రః సుదారుణః ||

4

జనస్థానసమీపే తు సమాగమ్య ఖరస్వనాః |
విస్వరాన్వివిధాంశ్చక్రుర్మాంసాదా మృగపక్షిణః ||

5

వ్యాజహ్రుశ్చ ప్రదీప్తాయాం దిశి వై భైరవస్వనమ్ |
అశివం యాతుధానానాం శివా ఘోరా మహాస్వనాః ||

6

ప్రభిన్నగిరిసంకాశాస్తోయశోణితధారిణః |
ఆకాశం తదనాకాశం చక్రుర్భీమా బలాహకాః ||

7

బభూవ తిమిరం ఘోరముద్ధతం రోమహర్షణమ్ |
దిశో వా విదిశో వాఽపి న చ వ్యక్తం చకాశిరే ||

8

క్షతజార్ద్రసవర్ణాభా సంధ్యా కాలం వినా బభౌ |
ఖరస్యాభిముఖా నేదుస్తదా ఘోరమృగాః ఖగాః ||

9

కంకగోమాయుగృధ్రాశ్చ చుక్రుశుర్భయశంసినః |
నిత్యాశుభకరా యుద్ధే శివా ఘోరనిదర్శనాః ||

10

నేదుర్బలస్యాభిముఖం జ్వాలోద్గారిభిరాననైః |
కబంధః పరిఘాభాసో దృశ్యతే భాస్కరాంతికే ||

11

జగ్రాహ సూర్యం స్వర్భానురపర్వణి మహాగ్రహః |
ప్రవాతి మారుతః శీఘ్రం నిష్ప్రభోఽభూద్దివాకరః ||

12

ఉత్పేతుశ్చ వినా రాత్రిం తారాః ఖద్యోతసప్రభాః |
సంలీనమీనవిహగా నలిన్యః శుష్కపంకజాః ||

13

తస్మిన్ క్షణే బభూవుశ్చ వినా పుష్పఫలైర్ద్రుమాః |
ఉద్ధూతశ్చ వినా వాతం రేణుర్జలధరారుణః ||

14

వీచీకూచీతి వాశ్యంత్యో బభూవుస్తత్ర శారికాః |
ఉల్కాశ్చాపి సనిర్ఘాతా నిపేతుర్ఘోరదర్శనాః ||

15

ప్రచచాల మహీ సర్వా సశైలవనకాననా |
ఖరస్య చ రథస్థస్య నర్దమానస్య ధీమతః ||

16

ప్రాకంపత భుజః సవ్యః స్వరశ్చాస్యావసజ్జత |
సాస్రా సంపద్యతే దృష్టిః పశ్యమానస్య సర్వతః ||

17

లలాటే చ రుజా జాతా న చ మోహాన్న్యవర్తత |
తాన్ సమీక్ష్య మహోత్పాతానుత్థితాన్రోమహర్షణాన్ ||

18

అబ్రవీద్రాక్షసాన్ సర్వాన్ ప్రహసన్ స ఖరస్తదా |
మహోత్పాతానిమాన్ సర్వానుత్థితాన్ ఘోరదర్శనాన్ ||

19

న చింతయామ్యహం వీర్యాద్బలవాన్ దుర్బలానివ |
తారా అపి శరైస్తీక్ష్ణైః పాతయామి నభఃస్థలాత్ ||

20

మృత్యుం మరణధర్మేణ సంక్రుద్ధో యోజయామ్యహమ్ |
రాఘవం తం బలోత్సిక్తం భ్రాతరం చాస్య లక్ష్మణమ్ ||

21

అహత్వా సాయకైస్తీక్ష్ణైర్నోపావర్తితుముత్సహే |
సకామా భగినీ మేఽస్తు పీత్వా తు రుధిరం తయోః ||

22

యన్నిమిత్తస్తు రామస్య లక్ష్మణస్య విపర్యయః |
న క్వచిత్ప్రాప్తపూర్వో మే సంయుగేషు పరాజయః ||

23

యుష్మాకమేతత్ప్రత్యక్షం నానృతం కథయామ్యహమ్ |
దేవరాజమపి క్రుద్ధో మత్తైరావతయాయినమ్ ||

24

వజ్రహస్తం రణే హన్యాం కిం పునస్తౌ కుమానుషౌ |
సా తస్య గర్జితం శ్రుత్వా రాక్షసస్య మహాచమూః ||

25

ప్రహర్షమతులం లేభే మృత్యుపాశావపాశితా |
సమీయుశ్చ మహాత్మానో యుద్ధదర్శనకాంక్షిణః ||

26

ఋషయో దేవగంధర్వాః సిద్ధాశ్చ సహ చారణైః |
సమేత్య చోచుః సహితాస్తేఽన్యోన్యం పుణ్యకర్మణః ||

27

స్వస్తి గోబ్రాహ్మణేభ్యోఽస్తు లోకానాం యేఽభిసంగతాః |
జయతాం రాఘవః సంఖ్యే పౌలస్త్యాన్ రజనీచరాన్ ||

28

చక్రహస్తో యథా యుద్ధే సర్వానసురపుంగవాన్ |
ఏతచ్చాన్యచ్చ బహుశో బ్రువాణాః పరమర్షయః ||

29

జాతకౌతూహలాస్తత్ర విమానస్థాశ్చ దేవతాః |
దదృశుర్వాహినీం తేషాం రాక్షసానాం గతాయుషామ్ ||

30

రథేన తు ఖరో వేగాదుగ్రసైన్యో వినిఃసృతః |
తం దృష్ట్వా రాక్షసం భూయో రాక్షసాశ్చ వినిఃసృతాః ||

31

శ్యేనగామీ పృథుగ్రీవో యజ్ఞశత్రుర్విహంగమః |
దుర్జయః కరవీరాక్షః పరుషః కాలకార్ముకః ||

32

మేఘమాలీ మహామాలీ సర్పాస్యో రుధిరాశనః |
ద్వాదశైతే మహావీర్యాః ప్రతస్థురభితః ఖరమ్ ||

33

మహాకపాలః స్థూలాక్షః ప్రమాథీ త్రిశిరాస్తథా |
చత్వార ఏతే సేనాన్యో దూషణం పృష్ఠతో యయుః ||

34

సా భీమవేగా సమరాభికామా
మహాబలా రాక్షసవీరసేనా |
తౌ రాజపుత్రౌ సహసాఽభ్యుపేతా
మాలా గ్రహాణామివ చంద్రసూర్యౌ ||

35

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే త్రయోవింశః సర్గః ||

Aranya Kanda Sarga 23 Meaning In Telugu PDF

రాముని మీదికి ఉత్సాహంగా బయలుదేరిన ఖరునికి ఎన్నో దుశ్శకునములు గోచరించాయి. వారి మీద రక్తవర్షము కురిసింది. ఖరుని రథమునకు కట్టిన గుర్రములు సమతలప్రదేశము మీద కూడా తడబడుతూ పరుగెడుతున్నాయి. దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్యుని చుట్టూ నల్లని వలయం ఏర్పడింది. ఒక గ్రద్ద ఖరుని రథముమీద ఎగురుతున్న ధ్వజము మీద నిలబడింది. అనేకములైన క్రూర మృగములు జనస్థానము వద్ద గుమిగూడి వికృతంగా అరుస్తున్నాయి. ఒక పక్కనుంచి నక్కలు తలలు పైకెత్తి ఏదో అమంగళము జరగబోతున్నట్టు కూస్తున్నాయి. పక్షులు, డేగలు, గ్రద్దలు ఖరుని రథానికి అడ్డంగా ఎగురుతున్నాయి.

ఇంతలో సాయం సమయం అయింది.. గ్రహణ కాలం కాకుండానే రాహువు సూర్యుని మింగుతున్నాడా అన్నట్టు సూర్యుడు అస్తమించాడు. ఆకాశంనుండి ఉల్కాపాతం జరిగింది. స్వల్పంగా భూమి కంపించింది. రథం మీద కూర్చుని పెద్దగా అరుస్తున్న ఖరుడికి ఎడమ భుజము అదిరింది. మాట తడబడుతూ ఉంది. కళ్లు మండటం మొదలెట్టాయి.

ఇన్ని అపశకునాలు కనపడుతున్నా ఖరుడు చలించలేదు. వెనుకకు మరలలేదు. ముందుకు దూకుతున్నాడు. “సైనికులారా! ఈ ఉత్పాతాలకు భయపడకండి. ఇలాంటివి పిరికి వాళ్లను భయపెడతాయి కానీ మనలను కాదు. ధైర్యంగా ముందుకు దూకండి. ఆ రామలక్ష్మణులను చంపి గానీ వెనకకు తిరగ వద్దు. వాళ్లను చంపి వాళ్ల రక్తం తాగితేనే గానీ నా సోదరి శూర్పణఖ అవమానము చల్లారదు. మనం ఎన్నడూ యుద్ధంలో ఓడిపోలేదు. ఇప్పుడూ ఓడిపోము. నేను తల్చుకుంటే ఆ దేవేంద్రుని కూడా సంహరించగలను. ఈ మానవులు ఎంత?” అని ఖరుడు తనకు తానే ధైర్యము చెప్పుకుంటూ సేనలను ఉత్సాహపరుస్తున్నాడు.

ఈ విధంగా రాక్షసులు యుద్ధానికి కదలడం చూచి ఆ అడవిలో ఉన్న ఋషులు, మునులు, ఏంజరుగుతుందో అని ఆతురతగా చూస్తున్నారు. అందరూ లోక క్షేమాన్ని కోరి (అంటే రాక్షస సంహారాన్ని కోరి) ప్రార్థనలు చేస్తున్నారు. “చక్రాయుధమును ధరించిన శ్రీమహావిష్ణువు దానవులను సంహరించినట్టు ధనుర్ధారి అయిన రాముడు రాక్షస సంహారము చేయుగాక!” అని మనసులో ఆకాంక్షిస్తున్నారు. ఇంక పైనుంచి దేవతలు విమానములు ఎక్కి రాక్షస సైన్యమును చూస్తున్నారు. ఖరుని సేనలో పన్నెండు మంది మహావీరులైన రాక్షసులు ఉన్నారు.

వారు శ్యేనగామి, పృథుగ్రీవుడు, యజ్ఞశత్రువు, విహంగముడు, దుర్జయుడు, కరవీరాక్షుడు, పరుషుడు, కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, సరాస్యుడు, రుధిరాశనుడు ( పైన చెప్పి పేర్లలో వారి అలవాట్లు, గుణగణాలు ప్రతిబింబిస్తున్నాయి. ఉదాహరణకు… శ్యేనగామి పక్షిలా తిరిగేవాడు. యజ్ఞశత్రువు = యజ్ఞములను పాడుచేసేవాడు, విహంగముడు=పక్షిలా ఎగిరేవాడు, పరుషుడు=ఎప్పుడూ పరుషంగా, కఠినంగా మాట్లాడేవాడు, రుధిరాశనుడు=రక్తం తాగేవాడు). వీరే కాకుండా దూషణుని వెంట మహాకపాలి,, స్థూలాక్షుడు, ప్రమాథీ, త్రిశిరస్సుడు అనే మరో నలుగురు రాక్షస సేనానాయకులు తమ తమ సేనలతో నడుస్తున్నారు. వీరందరూ రామలక్ష్మణులు ఉన్న ప్రదేశానికి వెళుతున్నారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువదిమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ చతుర్వింశః సర్గః (24) >>

Leave a Comment