మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ ద్వాత్రింశః సర్గలో శ్రీరాముడు, సీత, లక్ష్మణులు అయోధ్యకు చేరిన తరువాత జరిగే సంఘటనలు వివరించబడ్డాయి. దశరథ మహారాజు వారిని సంతోషంగా స్వాగతిస్తాడు. కైకేయి, సుమిత్ర, కౌసల్యలు సీతను తమ కోడలిగా ఆహ్వానిస్తారు. రామ-సీతల వివాహానికి ప్రజలు ఆనందంతో మురిసిపోతారు. ఈ సందర్భంలో, దశరథుడు తన సింహాసనాన్ని రాముడికి అప్పగించాలని నిర్ణయిస్తాడు.
కుశనాభకన్యోపాఖ్యానమ్
బ్రహ్మయోనిర్మహానాసీత్కుశో నామ మహాతపాః |
అక్లిష్టవ్రతధర్మజ్ఞః సజ్జనప్రతిపూజకః ||
1
స మహాత్మా కులీనాయాం యుక్తాయాం సుగుణోల్బణాన్ |
వైదర్భ్యాం జనయామాస చతురః సదృశాన్సుతాన్ ||
2
కుశాంబం కుశనాభం చ అధూర్తరజసం వసుమ్ |
దీప్తియుక్తాన్మహోత్సాహాన్ క్షత్రధర్మచికీర్షయా ||
3
తానువాచ కుశః పుత్రాన్ధర్మిష్ఠాన్సత్యవాదినః |
క్రియతాం పాలనం పుత్రా ధర్మం ప్రాప్స్యథ పుష్కలమ్ ||
4
కుశస్య వచనం శ్రుత్వా చత్వారో లోకసంమతాః |
నివేశం చక్రిరే సర్వే పురాణాం నృవరాస్తదా ||
5
కుశాంబస్తు మహాతేజాః కౌశాంబీమకరోత్పురీమ్ |
కుశనాభస్తు ధర్మాత్మా పురం చక్రే మహోదయమ్ ||
6
అధూర్తరజసో రామ ధర్మారణ్యం మహీపతిః |
చక్రే పురవరం రాజా వసుశ్చక్రే గిరివ్రజమ్ ||
7
ఏషా వసుమతీ రామ వసోస్తస్య మహాత్మనః |
ఏతే శైలవరాః పంచ ప్రకాశంతే సమంతతః ||
8
సుమాగధీ నదీ పుణ్యా మగధాన్విశ్రుతా యయౌ |
పంచానాం శైలముఖ్యానాం మధ్యే మాలేవ శోభతే ||
9
సైషా హి మాగధీ రామ వసోస్తస్య మహాత్మనః |
పూర్వాభిచరితా రామ సుక్షేత్రా సస్యమాలినీ ||
10
కుశనాభస్తు రాజర్షిః కన్యాశతమనుత్తమమ్ |
జనయామాస ధర్మాత్మా ఘృతాచ్యాం రఘునందన ||
11
తాస్తు యౌవనశాలిన్యో రూపవత్యః స్వలంకృతాః |
ఉద్యానభూమిమాగమ్య ప్రావృషీవ శతహ్రదాః ||
12
గాయంత్యో నృత్యమానాశ్చ వాదయంత్యశ్చ సర్వశః |
ఆమోదం పరమం జగ్ముర్వరాభరణభూషితాః ||
13
అథ తాశ్చారుసర్వాంగ్యో రూపేణాప్రతిమా భువి |
ఉద్యానభూమిమాగమ్య తారా ఇవ ఘనాంతరే ||
14
తాః సర్వగుణసంపన్నా రూపయౌవనసంయుతాః |
దృష్ట్వా సర్వాత్మకో వాయురిదం వచనమబ్రవీత్ ||
15
అహం వః కామయే సర్వా భార్యా మమ భవిష్యథ |
మానుషస్త్యజ్యతాం భావో దీర్ఘమాయురవాప్స్యథ ||
16
చలం హి యౌవనం నిత్యం మానుషేషు విశేషతః |
అక్షయం యౌవనం ప్రాప్తా అమర్యశ్చ భవిష్యథ ||
17
తస్య తద్వచనం శ్రుత్వా వాయోరక్లిష్టకర్మణః |
అపహాస్య తతో వాక్యం కన్యాశతమథాబ్రవీత్ ||
18
అంతశ్చరసి భూతానాం సర్వేషాం త్వం సురోత్తమ |
ప్రభావజ్ఞాశ్చ తే సర్వాః కిమస్మానవమన్యసే ||
19
కుశనాభసుతాః సర్వాః సమర్థాస్త్వాం సురోత్తమ |
స్థానాచ్చ్యావయితుం దేవం రక్షామస్తు తపో వయమ్ ||
20
మా భూత్స కాలో దుర్మేధః పితరం సత్యవాదినమ్ |
నావమన్యస్వ ధర్మేణ స్వయంవరముపాస్మహే ||
21
పితా హి ప్రభురస్మాకం దైవతం పరమం హి నః |
యస్య నో దాస్యతి పితా స నో భర్తా భవిష్యతి ||
22
తాసాం తద్వచనం శ్రుత్వా వాయుః పరమకోపనః |
ప్రవిశ్య సర్వగాత్రాణి బభంజ భగవాన్ప్రభుః ||
23
తాః కన్యా వాయునా భగ్నా వివిశుర్నృపతేర్గృహమ్ |
ప్రాపతన్భువి సంభ్రాంతాః సలజ్జాః సాశ్రులోచనాః ||
24
స చ తా దయితా దీనాః కన్యాః పరమశోభనాః |
దృష్ట్వా భగ్నాస్తదా రాజా సంభ్రాంత ఇదమబ్రవీత్ ||
25
కిమిదం కథ్యతాం పుత్ర్యః కో ధర్మమవమన్యతే |
కుబ్జాః కేన కృతాః సర్వా వేష్టంత్యో నాభిభాషథ |
ఏవం రాజా వినిశ్వస్య సమాధిం సందధే తతః ||
26
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ద్వాత్రింశః సర్గః ||
Balakanda Sarga 32 Meaning In Telugu
” ఓ రామా! పూర్వము కుశుడు అనే మహా తపస్వి ఉండే వాడు. అతడు బ్రహ్మదేవుని కుమారుడు. అతడు సకల ధర్మములను తెలిసిన వాడు. మంచి వాడు. విదర్భ రాజకుమారి ఆయన భార్య వారికి నలుగురు కుమారులు. వారిపేర్లు కుశాంబుడు. కుశనాభుడు. అధూర్తజసుడు. వసువు. వారందరూ తండ్రి వలె ధర్మాత్ములు. సుగుణ వంతులు.
ఆయనకు రాజ్యపాలన చేయవలెనని కోరిక కలిగింది. అప్పుడు ఆ కుశుడు తన పుత్రులతో ఇలా అన్నాడు. ” ఓ పుత్రులారా! మీరు ధర్మమును అనుసరించి రాజ్యపాలన చెయ్యండి.” అని అన్నాడు.
తండ్రి మాటను అనుసరించి ఆ నలుగురూ జనపదములను నిర్మించారు.
కుశాంబుని చేత నిర్మింప బడిన నగరము పేరు కౌశాంబి.
కుశనాధుని చేత నిర్మింప బడిన నగరము పేరు మహోదయము.
అధూర్త రజసుడు నిర్మించిన నగరము పేరు ధర్మారణ్యము.
వసువు నిర్మించిన నగరము పేరు గిరివ్రజపురము.
మనము ఇప్పుడు ఉన్న ప్రాంతము ఆ వసువు నివసించిన గిరివ్రజపురము భూమి. దీని చుట్టూ ఐదు పర్వతములు ఉన్నాయి. మగధ దేశములో పుట్టిన శోణ నది ఈ ఐదు పర్వతముల మధ్య ప్రవహించుచున్నది. ఈ శోణ నది తూర్పునుండి పడమరకు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదీ పరీవాహక ప్రాంతము అన్నీ సస్యశ్యామలములైన పంట పొలాలతో నిండి ఉన్నాయి.
కుశనాభుని భార్య ఘృతాచి. వారికి నూర్గురు కుమార్తెలు. ఆ కన్యలందరూ లోకోత్తర సౌందర్య వతులు. వారికి యుక్త వయసు వచ్చింది.
ఒకరోజు ఆ కన్యలందరూ వన విహారము చేస్తున్నారు. అప్పుడు వాయుదేవుడు వారిని చూచి ఇలా అన్నాడు. “నేను వాయుదేవుడను. నేను మీ అందరనూ వివాహమాడదలిచాను. మీరు నన్ను వివాహం చేసుకుంటే మీకు దైవత్వము సిద్ధిస్తుంది. దానితో పాటు మీరు కలకాలము జీవిస్తారు. మీ మానవులకు యౌవనము కొద్ది కాలమే ఉంటుంది. కాని మా దేవతలు నిత్య యౌవనులుగా ఉంటారు. కాబట్టి నన్ను పెళ్లి చేసుకోండి.” అని అన్నాడు వాయుదేవుడు.
ఆ మాటలను పరిహాసంగా తీసుకున్నారు ఆ కన్యలు.
” ఓ వాయుదేవా! నీవు సకల జీవరాసులలో సంచరిస్తుంటావు. అందరికీ ప్రాణ దాతవు. నీ శక్తి మాకు తెలుసు. కాని నీవు ఇలా మాట్లాడటం బాగాలేదు. మేము కుశనాభుని కుమార్తెలము. మాకు నిన్ను శపించే శక్తి కలదు కాని మా తపశ్శక్తిని మేము వృధా చేయము. ఎందుకంటే మేము స్వతంత్రు లము కాము. మా తండ్రి మాటను జవదాటము. మేమే కాదు ఈ లోకంలో ఏ కన్యకూడా తల్లి తండ్రుల మాటను జవదాటే దుస్థితి కలుగకుండు గాక! మాకు మా తండ్రి ప్రభువు. దైవము. మా తండ్రి మమ్ములను ఎవరికి ఇచ్చి వివాహము చేస్తాడో వారినో మేము వివాహము చేసుకుంటాము.” అని చెప్పారు ఆ కన్యలు.
వారి మాటలకు వాయుదేవునకు కోపం వచ్చింది. వెంటనే వాయుదేవుడు తన మహిమ చేత వారి శరీరములు అన్నీ బలము లేకుండా చేసాడు. ఏ మాత్రం బలము లేని ఆ కన్యలు ఎలాగోలాగ అంత:పురము చేరుకున్నారు. కిందపడిపోయారు. బాధతో కన్నీరు కారుస్తున్నారు.
వారి తండ్రి అయిన కుశనాభుడు కుమార్తె ల దుస్థితి చూచాడు. వారితో ఇలా అన్నాడు.
” ఓ పుత్రికలారా! ఏమిజరిగింది? మీకు ఈ దుస్థితి ఎలా దాపురించింది. దీనికి కారణం ఎవరు.” అని అడిగాడు.
శ్రీమద్రామాయణము
బాల కాండ ముప్పది రెండవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
బాలకాండ త్రయస్త్రింశః సర్గః (33) >>