Balakanda Sarga 41 In Telugu – బాలకాండ ఏకచత్వారింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకచత్వారింశః సర్గలో అంశుమాన్ యొక్క గుర్రం కోసం అన్వేషణలో కపిల తన తండ్రి-మామలను బూడిదలో పెట్టాడని తెలుస్తుంది. అతను వారి ఆత్మలకు నివాళిగా జల సమర్పణ చేయాలనుకున్నప్పుడు అతనికి నీరు దొరకలేదు. అప్పుడు గరుడ, విష్ణువు యొక్క డేగ వాహనం మరియు అంశుమాన్ యొక్క మామ అయిన గంగా నదిని భూమిపైకి తీసుకురావాలని అతనికి సలహా ఇస్తాడు, తద్వారా ఆత్మలు శుద్ధి చేయబడి స్వర్గానికి వెళతాయి.

సగరయజ్ఞసమాప్తిః

పుత్రాంశ్చిరగతాన్ జ్ఞాత్వా సగరో రఘునందన |
నప్తారమబ్రవీద్రాజా దీప్యమానం స్వతేజసా ||

1

శూరశ్చ కృతివిద్యశ్చ పూర్వైస్తుల్యోఽసి తేజసా |
పితౄణాం గతిమన్విచ్ఛ యేన చాశ్వోఽపహారితః ||

2

అంతర్భౌమాని సత్వాని వీర్యవంతి మహాంతి చ |
తేషాం త్వం ప్రతిఘాతార్థం సాసిం గృహ్ణీష్వ కార్ముకమ్ ||

3

అభివాద్యాభివాద్యాంస్త్వం హత్వా విఘ్నకరానపి |
సిద్ధార్థః సన్నివర్తస్వ మమ యజ్ఞస్య పారగః ||

4

ఏవముక్తోంశుమాన్సమ్యక్సగరేణ మహాత్మనా |
ధనురాదాయ ఖడ్గం చ జగామ లఘువిక్రమః ||

5

స ఖాతం పితృభిర్మార్గమంతర్భౌమం మహాత్మభిః |
ప్రాపద్యత నరశ్రేష్ఠస్తేన రాజ్ఞాభిచోదితః ||

6

దైత్యదానవరక్షోభిః పిశాచపతగోరగైః | [దేవ]
పూజ్యమానం మహాతేజా దిశాగజమపశ్యత ||

7

స తం ప్రదక్షిణం కృత్వా దృష్ట్వా చైవ నిరామయమ్ |
పితౄన్స పరిపప్రచ్ఛ వాజిహర్తారమేవ చ ||

8

దిశాగజస్తు తచ్ఛ్రుత్వా ప్రత్యాహాంశుమతో వచః |
ఆసమంజ కృతార్థస్త్వం సహాశ్వః శీఘ్రమేష్యసి ||

9

తస్య తద్వచనం శ్రుత్వా సర్వానేవ దిశాగజాన్ |
యథాక్రమం యథాన్యాయం ప్రష్టుం సముపచక్రమే ||

10

తైశ్చ సర్వైర్దిశాపాలైర్వాక్యజ్ఞైర్వాక్యకోవిదైః |
పూజితః సహయశ్చైవ గంతాసీత్యభిచోదితః ||

11

తేషాం తద్వచనం శ్రుత్వా జగామ లఘువిక్రమః |
భస్మరాశీకృతా యత్ర పితరస్తస్య సాగరాః ||

12

స దుఃఖవశమాపన్నస్త్వసమంజసుతస్తదా |
చుక్రోశ పరమార్తస్తు వధాత్తేషాం సుదుఃఖితః ||

13

యజ్ఞీయం చ హయం తత్ర చరంతమవిదూరతః |
దదర్శ పురుషవ్యాఘ్రో దుఃఖశోకసమన్వితః ||

14

స తేషాం రాజపుత్రాణాం కర్తుకామో జలక్రియామ్ |
సలిలార్థీ మహాతేజా న చాపశ్యజ్జలాశయమ్ ||

15

విసార్య నిపుణాం దృష్టిం తతోఽపశ్యత్ఖగాధిపమ్ |
పితౄణాం మాతులం రామ సుపర్ణమనిలోపమమ్ ||

16

స చైనమబ్రవీద్వాక్యం వైనతేయో మహాబలః |
మా శుచః పురుషవ్యాఘ్ర వధోఽయం లోకసమ్మతః ||

17

కపిలేనాప్రమేయేన దగ్ధా హీమే మహాబలాః |
సలిలం నార్హసి ప్రాజ్ఞ దాతుమేషాం హి లౌకికమ్ ||

18

గంగా హిమవతో జ్యేష్ఠా దుహితా పురుషర్షభ |
తస్యాం కురు మహాబాహో పితౄణాం తు జలక్రియామ్ ||

19

భస్మరాశీకృతానేతాన్ ప్లావయేల్లోకపావనీ |
తయా క్లిన్నమిదం భస్మ గంగయా లోకకాంతయా ||

20

షష్టిం పుత్రసహస్రాణి స్వర్గలోకం నయిష్యతి |
గచ్ఛ చాశ్వం మహాభాగ సంగృహ్య పురుషర్షభ ||

21

యజ్ఞం పైతామహం వీర సంవర్తయితుమర్హసి |
సుపర్ణవచనం శ్రుత్వా సోంశుమానతివీర్యవాన్ ||

22

త్వరితం హయమాదాయ పునరాయాన్మహాయశాః |
తతో రాజానమాసాద్య దీక్షితం రఘునందన ||

23

న్యవేదయద్యథావృత్తం సుపర్ణవచనం తథా |
తచ్ఛ్రుత్వా ఘోరసంకాశం వాక్యమంశుమతో నృపః ||

24

యజ్ఞం నిర్వర్తయామాస యథాకల్పం యథావిధి |
స్వపురం చాగమచ్ఛ్రీమానిష్టయజ్ఞో మహీపతిః ||

25

గంగాయాశ్చాగమే రాజా నిశ్చయం నాధ్యగచ్ఛత |
అగత్వా నిశ్చయం రాజా కాలేన మహతా మహాన్ |
త్రింశద్వర్షసహస్రాణి రాజ్యం కృత్వా దివం గతః ||

26

Balakanda Sarga 41 In Telugu Pdf With Meaning

ఇక్కడ సగరుడు తన కుమారుల రాక కోసరం ఎదురు చూస్తున్నాడు. ఎన్నాళ్లకూ తన కుమారులు యజ్ఞాశ్వముతో తిరిగి రాలేదు. అందుకని సగరుడు తన మనుమడైన అంశుమంతుని పిలిచి అతనితో ఇలా అన్నాడు.

“కుమారా! నీవు వీరుడవు. పరాక్రమవంతుడవు. నీ పినతండ్రులు యజ్ఞాశ్వము కొరకు వెళ్లి చాలా కాలం అయింది. వారు ఇంకా తిరిగి రాలేదు. నీవు పోయి వారి జాడ కనుక్కొని రా. యజ్ఞాశ్వముతో తిరిగి రా! జాగ్రత్త! నీవు మహాబలవంతులతో పోరాడవలసి ఉంటుంది. కాబట్టి కావలసిన అస్త్ర శస్త్ర ములను తీసుకొని వెళ్లు. నీకు నమస్కరించిన వారికి తిరిగి నమస్కరించు. నిన్ను ఎదిరించినవారిని నాశనం చెయ్యి. విజయుడవై తిరిగిరా!” అని పలికాడు.

సగరుడి మనుమడు అయిన అంశుమంతుడు తాతగారికి నమస్కరించి తన పినతండ్రులను వెతుకుతూ బయలుదేరాడు. అంశు మంతుడు తన పిన తండ్రులు తవ్విన మార్గమును వెతుకు కుంటూ వెళ్లాడు. దారిలో అంశుమంతుడు దిగ్గజములను చూచాడు. వారిని తన పినతండ్రుల జాడను గురించి అడిగాడు. ఆ దిగ్గజములు చూపిన మార్గములో వెళ్లి అంశుమంతుడు తన పినతండ్రుల భస్మరాసుల వద్దకు వెళ్లాడు. తన పిన తండ్రులు అలా భస్మరాసులుగా మారడం చూచి ఎంతో బాధపడ్డాడు. పక్కనే పచ్చిమేయుచున్న యజ్ఞాశ్వమును చూచాడు.

ఇంక మిగిలింది తన పిన తండ్రులకు తర్పణములు విడవాలి. దానికి జలము కావాలి. చుట్టూ చూచాడు ఎక్కడా జలాశయము కనపడలేదు. అప్పుడు గరుడుడు అక్కడకు వచ్చాడు. గరుడుడు వరుసకు సగర పుత్రులకు మేనమామ అవుతాడు. గరుడుడు అంశు మంతుని చూచి ఇలా అన్నాడు.

“కుమారా! నీ పినతండ్రుల మరణమునకు చింతింపకుము. వారి మరణమునకు లోకములు అంతా హర్షిస్తున్నాయి. నీ పినతండ్రులు అటువంటి దుర్మార్గులు. నీ పిన తండ్రులు కపిల మహర్షి శాపముతో భస్మము అయ్యారు. వీరికి ఉదక తర్షణము ఇవ్వడం ఉచితము కాదు. నీవు గంగానదిలో వీరికి తర్పణములు విడువుము. ఆ గంగానదీమ తల్లి వీరి భస్మరాసులను తడిపినపుడు మాత్రమే వీరికి స్వర్గలోక ప్రాప్తి కలుగ గలదు. కాబట్టి నీవు వీరిని గురించి చింతింపక హయమును తీసుకొని పోయి నీ తాతగారి యజ్ఞమును నిర్వర్తింపుము.” అని అన్నాడు.

గరుడుని మాట ప్రకారము అంశుమంతుడు యజ్ఞాశ్వమును తీసుకొని తన పురమును చేరుకున్నాడు. యజ్ఞ దీక్షలో ఉన్న సగర చక్రవర్తితో జరిగినది అంతా చెప్పాడు. గరుడుడు తనకు తెలిపిన విషయములు అన్నీ చెప్పాడు. యజ్ఞాశ్వమును ఆయనకు అప్పగించాడు.

సగరుడు తన కుమారుల మరణమునకు చింతించాడు. తరువాత తేరుకొని యధావిధిగా యజ్ఞమును పూర్తిచేసాడు. ఇప్పుడు గంగను తీసుకొని వచ్చి కుమారుల భస్మరాసులను తడపడం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు సగరుడు. ఎందుకంటే పవిత్ర గంగాజలం వారి భస్మరాసుల మీద పారితే గానీవారికి స్వర్గలోకము సిద్ధించదు. గంగ దేవతల అధీనములో స్వర్గములో ప్రవహిస్తూ ఉంది. దానిని భూమి మీదకు తీసుకొని వచ్చు ఉపాయము దొరకలేదు సగరునకు.

సగరుడు 30,000 సంవత్సరములు రాజ్యపాలన చేసాడు కానీ గంగను మాత్రము భూమి మీదకు తీసుకొని రాలేకపోయాడు. కాలము తీరి సగరుడు స్వర్గస్థుడయ్యాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండ నలుబది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ ద్విచత్వారింశః సర్గః (42) >>

Leave a Comment