కిష్కింధాకాండ ద్వాదశః సర్గలో, రాముడు మరియు సుగ్రీవుడు సీతా ప్రస్తావన చేస్తారు. రాముడు సుగ్రీవుని సీతను వెతికే పనిని త్వరగా చేపట్టమని కోరతాడు. సుగ్రీవుడు రాముని కోపాన్ని పసిగట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్ణయిస్తాడు. అనేక వానర సేనలను సమీకరించి, వివిధ ప్రాంతాలకు పంపించి, సీతా దేవిని కనుగొనాలని ఆజ్ఞాపిస్తాడు. హనుమంతుడు, జాంబవంతుడు, ఆంగదుడు మొదలైన ప్రముఖ వానరులు ప్రధాన పాత్రలుగా సీతను వెతకడానికి నిశ్చయించబడతారు. వారి కృషి మరియు ధైర్యంతో సీతను కనుగొనడమే ప్రధాన లక్ష్యంగా కొనసాగుతుంది.
సుగ్రీవప్రత్యయదానమ్
ఏతచ్చ వచనం శ్రుత్వా సుగ్రీవేణ సుభాషితమ్ |
ప్రత్యయార్థం మహాతేజా రామో జగ్రాహ కార్ముకమ్ || ౧ ||
స గృహీత్వా ధనుర్ఘోరం శరమేకం చ మానదః |
సాలముద్దిశ్య చిక్షేప జ్యాస్వనైః పూరయన్ దిశః || ౨ ||
స విసృష్టో బలవతా బాణః స్వర్ణపరిష్కృతః |
భిత్త్వా సాలాన్ గిరిప్రస్థే సప్త భూమిం వివేశ హ || ౩ ||
ప్రవిష్టశ్చ ముహూర్తేన ధరాం భిత్త్వా మహాజవః |
నిష్పత్య చ పునస్తూర్ణం స్వతూణీం ప్రవివేశ హ || ౪ ||
తాన్ దృష్ట్వా సప్త నిర్భిన్నాన్ సాలాన్ వానరపుంగవః |
రామస్య శరవేగేన విస్మయం పరమం గతః || ౫ ||
స మూర్ధ్నా న్యపతద్భూమౌ ప్రలంబీకృతభూషణః |
సుగ్రీవః పరమప్రీతో రాఘవాయ కృతాంజలిః || ౬ ||
ఇదం చోవాచ ధర్మజ్ఞం కర్మణా తేన హర్షితః |
రామం సర్వాస్త్రవిదుషాం శ్రేష్ఠం శూరమవస్థితమ్ || ౭ ||
సేంద్రానపి సురాన్ సర్వాంస్త్వం బాణైః పురుషర్షభ |
సమర్థః సమరే హంతుం కిం పునర్వాలినం ప్రభో || ౮ ||
యేన సప్త మహాసాలా గిరిర్భూమిశ్చ దారితాః |
బాణేనైకేన కాకుత్స్థ స్థాతా తే కో రణాగ్రతః || ౯ ||
అద్య మే విగతః శోకః ప్రీతిరద్యః పరా మమ |
సుహృదం త్వాం సమాసాద్య మహేంద్రవరుణోపమమ్ || ౧౦ ||
తమద్యైవ ప్రియార్థం మే వైరిణం భ్రాతృరూపిణమ్ |
వాలినం జహి కాకుత్స్థ మయా బద్ధోఽయమంజలిః || ౧౧ ||
తతో రామః పరిష్వజ్య సుగ్రీవం ప్రియదర్శనమ్ |
ప్రత్యువాచ మహాప్రాజ్ఞో లక్ష్మణానుమతం వచః || ౧౨ ||
అస్మాద్గచ్ఛేమ కిష్కింధాం క్షిప్రం గచ్ఛ త్వమగ్రతః |
గత్వా చాహ్వయ సుగ్రీవ వాలినం భ్రాతృగంధినమ్ || ౧౩ ||
సర్వే తే త్వరితం గత్వా కిష్కింధాం వాలినః పురీమ్ |
వృక్షైరాత్మానమావృత్య వ్యతిష్ఠన్ గహనే వనే || ౧౪ ||
సుగ్రీవో వ్యనదద్ఘోరం వాలినో హ్వానకారణాత్ |
గాఢం పరిహితో వేగాన్నాదైర్భిందన్నివాంబరమ్ || ౧౫ ||
ననాద సుమహానాదం పూరయన్వై నభః స్థలమ్ |
తం శ్రుత్వా నినదం భ్రాతుః క్రుద్ధో వాలీ మహాబలః || ౧౬ ||
నిష్పపాత సుసంరబ్ధో భాస్కరోఽస్తతటాదివ |
తతః సుతుములం యుద్ధం వాలిసుగ్రీవయోరభూత్ || ౧౭ ||
గగనే గ్రహయోర్ఘోరం బుధాంగారకయోరివ |
తలైరశనికల్పైశ్చ వజ్రకల్పైశ్చ ముష్టిభిః || ౧౮ ||
జఘ్నతుః సమరేఽన్యోన్యం భ్రాతరౌ క్రోధమూర్ఛితౌ |
తతో రామో ధనుష్పాణిస్తావుభౌ సముదీక్ష్య తు || ౧౯ ||
అన్యోన్యసదృశౌ వీరావుభౌ దేవావివాశ్వినౌ |
యన్నావగచ్ఛత్ సుగ్రీవం వాలినం వాఽపి రాఘవః || ౨౦ ||
తతో న కృతవాన్ బుద్ధిం మోక్తుమంతకరం శరమ్ |
ఏతస్మిన్నంతరే భగ్నః సుగ్రీవస్తేన వాలినా || ౨౧ ||
అపశ్యన్ రాఘవం నాథమృశ్యమూకం ప్రదుద్రువే |
క్లాంతో రుధిరసిక్తాంగః ప్రహారైర్జర్జరీకృతః || ౨౨ ||
వాలినాఽభిద్రుతః క్రోధాత్ ప్రవివేశ మహావనమ్ |
తం ప్రవిష్టం వనం దృష్ట్వా వాలీ శాపభయార్దితః || ౨౩ ||
ముక్తో హ్యసి త్వమిత్యుక్త్వా సన్నివృత్తో మహాద్యుతిః |
రాఘవోఽపి సహ భ్రాత్రా సహ చైవ హనూమతా || ౨౪ ||
తదేవ వనమాగచ్ఛత్ సుగ్రీవో యత్ర వానరః |
తం సమీక్ష్యాగతం రామం సుగ్రీవః సహలక్ష్మణమ్ || ౨౫ ||
హ్రీమాన్ దీనమువాచేదం వసుధామవలోకయన్ |
ఆహ్వయస్వేతి మాముక్త్వా దర్శయిత్వా చ విక్రమమ్ || ౨౬ ||
వైరిణా ఘాతయిత్వా చ కిమిదానీం త్వయా కృతమ్ |
తామేవ వేలాం వక్తవ్యం త్వయా రాఘవ తత్త్వతః || ౨౭ ||
వాలినం న నిహన్మీతి తతో నాహమితో వ్రజే |
తస్య చైవం బ్రువాణస్య సుగ్రీవస్య మహాత్మనః || ౨౮ ||
కరుణం దీనయా వాచా రాఘవః పునరబ్రవీత్ |
సుగ్రీవ శ్రూయతాం తాత క్రోధశ్చ వ్యపనీయతామ్ || ౨౯ ||
కారణం యేన బాణోఽయం న మయా స విసర్జితః |
అలంకారేణ వేషేణ ప్రమాణేన గతేన చ || ౩౦ ||
త్వం చ సుగ్రీవ వాలీ చ సదృశౌ స్థః పరస్పరమ్ |
స్వరేణ వర్చసా చైవ ప్రేక్షితేన చ వానర || ౩౧ ||
విక్రమేణ చ వాక్యైశ్చ వ్యక్తిం వాం నోపలక్షయే |
తతోఽహం రూపసాదృశ్యాన్మోహితో వానరోత్తమ || ౩౨ ||
నోత్సృజామి మహావేగం శరం శత్రునిబర్హణమ్ |
జీవితాంతకరం ఘోరం సాదృశ్యాత్తు విశంకితః || ౩౩ ||
మూలఘాతో న నౌ స్యాద్ధి ద్వయోరపి కృతో మయా |
త్వయి వీరే విపన్నే హి అజ్ఞానాల్లాఘవాన్మయా || ౩౪ ||
మౌఢ్యం చ మమ బాల్యం చ ఖ్యాపితం స్యాద్ధరీశ్వర |
దత్తాభయవధో నామ పాతకం మహదుచ్యతే || ౩౫ ||
అహం చ లక్ష్మణశ్చైవ సీతా చ వరవర్ణినీ |
త్వదధీనా వయం సర్వే వనేఽస్మిన్ శరణం భవాన్ || ౩౬ ||
తస్మాద్యుధ్యస్వ భూయస్త్వం నిశ్శంకో వానరేశ్వర |
అస్మిన్ముహూర్తే సుగ్రీవ పశ్య వాలినమాహవే || ౩౭ ||
నిరస్తమిషుణైకేన వేష్టమానం మహీతలే |
అభిజ్ఞానం కురుష్వ త్వమాత్మనో వానరేశ్వర || ౩౮ ||
యేన త్వామభిజానీయాం ద్వంద్వయుద్ధముపాగతమ్ |
గజపుష్పీమిమాం ఫుల్లాముత్పాట్య శుభలక్షణామ్ || ౩౯ ||
కురు లక్ష్మణ కంఠేఽస్య సుగ్రీవస్య మహాత్మనః |
తతో గరితటే జాతాముత్పాట్య కుసుమాకులామ్ || ౪౦ ||
లక్ష్మణో గజపుష్పీం తాం తస్య కంఠే వ్యసర్జయత్ |
స తయా శుశుభే శ్రీమాన్ లతయా కంఠసక్తయా || ౪౧ ||
మాలయేవ బలాకానాం ససంధ్య ఇవ తోయదః |
విభ్రాజమానో వపుషా రామవాక్యసమాహితః |
జగామ సహ రామేణ కిష్కింధాం వాలిపాలితామ్ || ౪౨ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే ద్వాదశః సర్గః || ౧౨ ||
Kishkindha Kanda Sarga 12 Meaning In Telugu
సుగ్రీవుని మాటలను విన్న రాముడు, అతని మనసులో ఉన్న సందేహమును నివారించ నిశ్చయించుకున్నాడు. మారుమాటాడ కుండా తన ధనుస్సును చేత బట్టుకున్నాడు. శరమును సంధించాడు. ఒకే ఒక బాణంతో ఒక సాల వృక్షము కాదు, వరుసగా ఉన్న ఏడు సాలవృక్షములను పడగొట్టాడు. సుగ్రీవునికి నోట మాట రాలేదు. ఆశ్చర్యపోయాడు. తాను ఒక్క వృక్షమును కొట్ట మంటే ఏడు వృక్షములను కొట్టాడు రాముడు. రాముని కాళ్ల మీద సాష్టాంగ పడ్డాడు.
“రామా! చాలు చాలు. నీవు సాక్షాత్తు ఇంద్రుడినే చంపగల సమర్ధుడవు. నీకు వాలి ఒక లెక్కా! ఏడు సాలవృక్షములను కూల్చిన నీముందు ఎవడు నిలిచి యుద్ధము చేయగలడు? నీవు నాకు మిత్రుడుగా లభించినందుకు నా మనసంతా ఆనందంతో నిండి పోయింది. రామా! చేతులు జోడించి ప్రార్ధిస్తున్నాను. వాలిని చంపి నాకు మనశ్శాంతిని చేకూర్చు.” అని అన్నాడు సుగ్రీవుడు.
“మిత్రమా! సుగ్రీవా! నీవు చెప్పినట్టే చేద్దాము. ముందు నీవు కిష్కింధకు వెళ్లు. నీ వెనువెంటనే మేము వస్తాము. నీవు వెళ్లి వాలిని యుద్ధానికి రమ్మని పిలువు. వాలితో యుద్ధము చెయ్యి. నేను చాటుగా ఉంది నా బాణముతో వాలిని చంపుతాను.” అని అన్నాడు రాముడు.
రాముని మాటల మీద నమ్మకంతో సుగ్రీవుడు కిష్కింధకు వెళ్లాడు. సుగ్రీవుని మంత్రులు, రాముడు, లక్ష్మణుడు అతని వెంటనే వెళ్లి సమీపములో ఉన్న పొదల మాటున దాగి ఉన్నారు. సుగ్రీవుడు పెద్దగా అరుస్తూ వాలిని యుద్ధానికి పిలిచాడు. సుగ్రీవుని పిలుపు విని వాలి బయటకు వచ్చాడు.
తాను ఇంతకాలము ఎవరి కోసరం వెతుకుతున్నాడో ఆ సుగ్రీవుడు కంటపడేసరికి, వాలికి కోపం ముంచుకొచ్చింది. సుగ్రీవునితో తలపడ్డాడు. ఇద్దరూ ఘోరంగా యుద్ధం చేసుకుంటున్నారు. రాముడు పొదల మాటున నిలబడి వాలిని తన బాణంతో కొట్టవలెనని శతవిధాలా ప్రయత్నించాడు. కానీ వాలి, సుగ్రీవుడు ఒకే రూపంలో ఉండటం వలన ఎవరు వాలి, ఎవరు సుగ్రీవుడు అని పోల్చుకోలేకపోయాడు. వాలికి బదులుగా సుగ్రీవుని కొడతానేమో అని భయపడ్డాడు. అందువలన బాణప్రయోగము చేయలేదు.
ఈ లోపల వాలి సుగ్రీవుని చావ చితక కొట్టాడు. వాలి కొట్టిన దెబ్బలకు సుగ్రీవుని శరీరం అంతా రక్తసిక్తము అయింది. ఆ దెబ్బలు తట్టుకోలేక సుగ్రీవుడు ఋష్యమూక పర్వతము మీదికి పారిపోయాడు. వాలి సుగ్రీవుని కొంత దూరం తరిమాడు. కాని సుగ్రీవుడు ఋష్యమూక పర్వతము మీదికి పోవడం చూచి, శాపానికి భయపడి వెనుదిరిగి పోయాడు. సుగ్రీవుని వెంట అతని మంత్రులు, రామలక్ష్మణులు వెళ్లారు.
రాముని చూచి సుగ్రీవుడు ఇలా అన్నాడు. “ఓ రామా! ఏమిటీ పని! వాలిని యుద్ధానికి పిలువ మన్నావు. వాలిని చంపుతానని నన్ను నమ్మించావు. కాని వాలి చేత నన్ను కొట్టించావు. చావు దెబ్బలు తిని పారిపోయి వచ్చాను. ఇలా ఎందుకు చేసావు. నేను వాలిని చంపను అని ముందే చెప్పి ఉంటే నేను అసలు వాలితో యుద్ధానికి పోను కదా!” అని దీనంగా పలికాడు.
సుగ్రీవుని చూచి రాముడు జాలి పడ్డాడు. “మిత్రమా! నేను ఏ పరిస్థితులలో బాణం వెయ్యలేదో వివరిస్తాను. కోపం లేకుండా విను. నీవు, వాలి, ఎత్తు, లావు, శరీర ఛాయ అన్నిటిలోనూ ఒకే విధంగా ఉన్నారు. నిన్ను, వాలిని, పోల్చుకోలేకపోయాను. నేను వదిలిన బాణం నీకు తగిలి నీవు మరణిస్తావేమో అని భయపడ్డాను. అప్పుడు మిత్రునికి ద్రోహం చేసినవాడిని అవుతానుకదా! అందుకని బాణం వదలలేదు. నా తొందరపాటుతో గానీ, పొరపాటున గానీ, ఆ బాణం నీకు తగిలితే. శాశ్వతంగా నీ వంటి మంచి మిత్రుని పోగొట్టుకున్నవాడిని అవుతాను కదా!
నేను నీకు అభయం ఇచ్చాను. వాలిని చంపకపోయినా బాధ లేదు కానీ నిన్ను చంపితే అభయం ఇచ్చిన వాడిని చంపిన పాపం నాకు చుట్టుకుంటుంది. నీవు లేకపోతే మాకు ఎవరు దిక్కు. కాబట్టి నీవు మరలా వాలిని యుద్ధానికి పిలువు. కాని నిన్ను గుర్తించుటకు ఒక ఆనవాలు పెట్టుకో. ఆ ఆనవాలు సాయంతో నేను వాలిని ఒకే ఒక బాణంతో నేలకూలుస్తాను. నీవు నిశ్చింతగా ఉండు.” అని అన్నాడు రాముడు.
రాముడు చుట్టూ చూచాడు. రామునికి ఎదురుగా ఒక పుష్టములతో కూడిన ఒక తీగ కనపడింది. “లక్ష్మణా! పుష్పములతో కూడిన ఆ తీగను తెచ్చి సుగ్రీవుని మెడలో హారంగా అలంకరించు.” అని అన్నాడు. వెంటనే లక్ష్మణుడు పోయి గజపుష్పములతో నిండి ఉన్న తీగను తీసుకొని వచ్చి సుగ్రీవుని మెడలో వేసాడు. ఎర్రగా ఉన్న ఆ పూలు సుగ్రీవుని మెడలో మెరిసిపోతున్నాయి. అందరూ కలిసి తిరిగి కిష్కింధకు వెళుతున్నారు.
శ్రీమద్రామాయణము
కిష్కింధాకాండము పండ్రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్