కిష్కింధాకాండం సప్తదశం సర్గంలో, రాముడు వాల్మీకి రాజ్యాభిషేకానికి స్థలాన్ని తయారు చేస్తారు. సుగ్రీవుడు అంగదుని దాదాపు వానరులను అందించి, అంగదుని విధిని పాలిస్తున్నారు. రాముని నేతృత్వంలో వానరులు యుద్ధానికి సిద్ధమయ్యారు. కాకసాయే, నల మరియు నీల పంచపర్వాలను ప్రధాన వానర సైన్యాలను నడిపిస్తారు. ఇంద్రజిత్తుని సంహారానికి రాముడు అంగదుని నిర్దేశాలు ఇస్తారు. ఈ సర్గంలో సుగ్రీవుడు రాముని విశ్వాసాన్ని గెలిచేందుకు అనేక చర్యలు తీసుకుంటారు.
రామాధిక్షేపః
తతః శరేణాభిహతో రామేణ రణకర్కశః |
పపాత సహసా వాలీ నికృత్త ఇవ పాదపః || ౧ ||
స భూమౌ న్యస్తసర్వాంగస్తప్తకాంచనభూషణః |
అపతద్దేవరాజస్య ముక్తరశ్మిరివ ధ్వజః || ౨ ||
తస్మిన్నిపతితే భూమౌ వానరాణాం గణేశ్వరే |
నష్టచంద్రమివ వ్యోమ న వ్యరాజత భూతలమ్ || ౩ ||
భూమౌ నిపతితస్యాపి తస్య దేహం మహాత్మనః |
న శ్రీర్జహాతి న ప్రాణా న తేజో న పరాక్రమః || ౪ ||
శక్రదత్తా వరా మాలా కాంచనీ వజ్రభూషితా |
దధార హరిముఖ్యస్య ప్రాణాంస్తేజః శ్రియం చ సా || ౫ ||
స తయా మాలయా వీరో హైమయా హరియూథపః |
సంధ్యానురక్తపర్యంతః పయోధర ఇవాభవత్ || ౬ ||
తస్య మాలా చ దేహశ్చ మర్మఘాతీ చ యః శరః |
త్రిధేవ రచితా లక్ష్మీః పతితస్యాపి శోభతే || ౭ ||
తదస్త్రం తస్య వీరస్య స్వర్గమార్గప్రభావనమ్ |
రామబాణాసనోత్క్షిప్తమావహత్ పరమాం గతిమ్ || ౮ ||
తం తదా పతితం సంఖ్యే గతార్చిషమివానలమ్ |
బహుమాన్య చ తం వీరం వీక్షమాణం శనైరివ || ౯ ||
యయాతిమివ పుణ్యాంతే దేవలోకాత్పరిచ్యుతమ్ |
ఆదిత్యమివ కాలేన యుగాంతే భువి పాతితమ్ || ౧౦ ||
మహేంద్రమివ దుర్ధర్షం మహేంద్రమివ దుఃసహమ్ |
మహేంద్రపుత్రం పతితం వాలినం హేమమాలినమ్ || ౧౧ ||
సింహోరస్కం మహాబాహుం దీప్తాస్యం హరిలోచనమ్ |
లక్ష్మణానుగతో రామో దదర్శోపససర్ప చ || ౧౨ ||
తం దృష్ట్వా రాఘవం వాలీ లక్ష్మణం చ మహాబలమ్ |
అబ్రవీత్ప్రశ్రితం వాక్యం పరుషం ధర్మసంహితమ్ || ౧౩ ||
త్వం నరాధిపతేః పుత్రః ప్రథితః ప్రియదర్శనః |
కులీనః సత్త్వసంపన్నస్తేజస్వీ చరితవ్రతః || ౧౪ ||
పరాఙ్ముఖవధం కృత్వా కో ను ప్రాప్తస్త్వయా గుణః |
యదహం యుద్ధసంరబ్ధః శరేణోరసి తాడితః || ౧౫ ||
[* అధికశ్లోకః –
కులీనః సత్త్వసంపన్నస్తేజస్వీ చరితవ్రతః |
రామః కరుణవేదీ చ ప్రజానాం చ హితే రతః ||
*]
సానుక్రోశో జితోత్సాహః సమయజ్ఞో దృఢవ్రతః |
ఇతి తే సర్వభూతాని కథయంతి యశో భువి || ౧౬ ||
దమః శమః క్షమా ధర్మో ధృతిః సత్యం పరాక్రమః |
పార్థివానాం గుణా రాజన్ దండశ్చాప్యపరాధిషు || ౧౭ ||
తాన్ గుణాన్ సంప్రధార్యాహమగ్ర్యం చాభిజనం తవ |
తారయా ప్రతిషిద్ధోఽపి సుగ్రీవేణ సమాగతః || ౧౮ ||
న మామన్యేన సంరబ్ధం ప్రమత్తం యోద్ధుమర్హతి |
ఇతి మే బుద్ధిరుత్పన్నా బభూవాదర్శనే తవ || ౧౯ ||
స త్వాం వినిహతాత్మానం ధర్మధ్వజమధార్మికమ్ |
జానే పాపసమాచారం తృణైః కూపమివావృతమ్ || ౨౦ ||
సతాం వేషధరం పాపం ప్రచ్ఛన్నమివ పావకమ్ |
నాహం త్వామభిజానామి ధర్మచ్ఛద్మాభిసంవృతమ్ || ౨౧ ||
విషయే వా పురే వా తే యదా నాపకరోమ్యహమ్ |
న చ త్వామవజానే చ కస్మాత్త్వం హంస్యకిల్బిషమ్ || ౨౨ ||
ఫలమూలాశనం నిత్యం వానరం వనగోచరమ్ |
మామిహాప్రతియుద్ధ్యంతమన్యేన చ సమాగతమ్ || ౨౩ ||
లింగమప్యస్తి తే రాజన్ దృశ్యతే ధర్మసంహితమ్ |
కః క్షత్రియకులే జాతః శ్రుతవాన్నష్టసంశయః || ౨౪ ||
ధర్మలింగప్రతిచ్ఛన్నః క్రూరం కర్మ సమాచరేత్ |
రామ రాజకులే జాతో ధర్మవానితి విశ్రుతః || ౨౫ ||
అభవ్యో భవ్యరూపేణ కిమర్థం పరిధావసి |
సామ దానం క్షమా ధర్మః సత్యం ధృతిపరాక్రమౌ || ౨౬ ||
పార్థివానాం గుణా రాజన్ దండశ్చాప్యపరాధిషు |
వయం వనచరా రామ మృగా మూలఫలాశనాః || ౨౭ ||
ఏషా ప్రకృతిరస్మాకం పురుషస్త్వం నరేశ్వరః |
భూమిర్హిరణ్యం రూప్యం చ విగ్రహే కారణాని చ || ౨౮ ||
అత్ర కస్తే వనే లోభో మదీయేషు ఫలేషు వా |
నయశ్చ వినయశ్చోభౌ నిగ్రహానుగ్రహావపి || ౨౯ ||
రాజవృత్తిరసంకీర్ణా న నృపాః కామవృత్తయః |
త్వం తు కామప్రధానశ్చ కోపనశ్చానవస్థితః || ౩౦ ||
రాజవృత్తైశ్చ సంకీర్ణః శరాసనపరాయణః |
న తేఽస్త్యపచితిర్ధర్మే నార్థే బుద్ధిరవస్థితా || ౩౧ ||
ఇంద్రియైః కామవృత్తః సన్ కృష్యసే మనుజేశ్వర |
హత్వా బాణేన కాకుత్స్థ మామిహానపరాధినమ్ || ౩౨ ||
కిం వక్ష్యసి సతాం మధ్యే కర్మ కృత్వా జుగుప్సితమ్ |
రాజహా బ్రహ్మహా గోఘ్నశ్చోరః ప్రాణివధే రతః || ౩౩ ||
నాస్తికః పరివేత్తా చ సర్వే నిరయగామినః |
సూచకశ్చ కదర్యశ్చ మిత్రఘ్నో గురుతల్పగః || ౩౪ ||
లోకం పాపాత్మనామేతే గచ్ఛంత్యత్ర న సంశయః |
అధార్యం చర్మ మే సద్భీ రోమాణ్యస్థి చ వర్జితమ్ || ౩౫ ||
అభక్ష్యాణి చ మాంసాని త్వద్విధైర్ధర్మచారిభిః |
పంచ పంచనఖా భక్ష్యా బ్రహ్మక్షత్రేణ రాఘవ || ౩౬ ||
శల్యకః శ్వావిధో గోధా శశః కూర్మశ్చ పంచమః |
చర్మ చాస్థి చ మే రాజన్ న స్పృశంతి మనీషిణః || ౩౭ ||
అభక్ష్యాణి చ మాంసాని సోఽహం పంచనఖో హతః |
తారయా వాక్యముక్తోఽహం సత్యం సర్వజ్ఞయా హితమ్ || ౩౮ ||
తదతిక్రమ్య మోహేన కాలస్య వశమాగతః |
త్వయా నాథేన కాకుత్స్థ న సనాథా వసుంధరా || ౩౯ ||
ప్రమదా శీలసంపన్నా ధూర్తేన పతినా యథా |
శఠో నైకృతికః క్షుద్రో మిథ్యాప్రశ్రితమానసః || ౪౦ ||
కథం దశరథేన త్వం జాతః పాపో మహాత్మనా |
ఛిన్నచారిత్రకక్ష్యేణ సతాం ధర్మాతివర్తినా || ౪౧ ||
త్యక్తధర్మాంకుశేనాహం నిహతో రామహస్తినా |
అశుభం చాప్యయుక్తం చ సతాం చైవ విగర్హితమ్ || ౪౨ ||
వక్ష్యసే చేదృశం కృత్వా సద్భిః సహ సమాగతః |
ఉదాసీనేషు యోఽస్మాసు విక్రమస్తే ప్రకాశితః || ౪౩ ||
అపకారిషు తం రాజన్ న హి పశ్యామి విక్రమమ్ |
దృశ్యమానస్తు యుధ్యేథా మయా యది నృపాత్మజ || ౪౪ ||
అద్య వైవస్వతం దేవం పశ్యేస్త్వం నిహతో మయా |
త్వయాఽదృశ్యేన తు రణే నిహతోఽహం దురాసదః || ౪౫ ||
ప్రసుప్తః పన్నగేనేవ నరః పాపవశం గతః |
సుగ్రీవప్రియకామేన యదహం నిహతస్త్వయా || ౪౬ ||
మామేవ యది పూర్వం త్వమేతదర్థమచోదయః |
మైథిలీమహమేకాహ్నా తవ చానీతవాన్ భవేత్ || ౪౭ ||
కంఠే బద్ధ్వా ప్రదద్యాం తే నిహతం రావణం రణే |
న్యస్తాం సాగరతోయే వా పాతాలే వాపి మైథిలీమ్ || ౪౮ ||
ఆనయేయం తవాదేశాచ్ఛ్వేతామశ్వతరీమివ |
యుక్తం యత్ప్రాప్నుయాద్రాజ్యం సుగ్రీవః స్వర్గతే మయి || ౪౯ ||
అయుక్తం యదధర్మేణ త్వయాఽహం నిహతో రణే |
కామమేవంవిధో లోకః కాలేన వినియుజ్యతే |
క్షమం చేద్భవతా ప్రాప్తముత్తరం సాధు చింత్యతామ్ || ౫౦ ||
ఇత్యేవముక్త్వా పరిశుష్కవక్రః
శరాభిఘాతాద్వ్యథితో మహాత్మా |
సమీక్ష్య రామం రవిసన్నికాశం
తూష్ణీం బభూవామరరాజసూనుః || ౫౧ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే సప్తదశః సర్గః || ౧౭ ||
Kishkindha Kanda Sarga 17 Meaning In Telugu
రాముని బాణం దెబ్బ తిన్న వాలినేల మీద పడిపోయాడు. శరీరం పడిపోయింది కానీ అతని తేజస్సు తగ్గలేదు. వాలి మెడలో ఉన్న ఇంద్రమాల, అతని గుండెల్లో గుచ్చుకున్న రామ బాణము అతనిలో ఉన్న తేజస్సును సడలిపోనివ్వడం లేదు.
తన బాణము దెబ్బకు వాలి పడి పోగానే, రాముడు, లక్ష్మణుడు వాలి దగ్గరకు వెళ్లారు. వాలి ముందు గౌరవ సూచకంగా తలవంచి నిలబడ్డారు. కొన ఊపిరితో ఉన్న వాలి రాముని చూచాడు. యుద్ధంలో గెలిచాను అన్న గర్వంతో ఉన్న రామునితో తనలో ఉన్న గర్వం తగ్గని వాలి ఇలా అన్నాడు. వాలి మాటల్లో రాముని పట్ల వినయం ఉంది. కాని పౌరుషం తగ్గలేదు. ధర్మబద్ధంగా మాట్లాడుతున్నాడు వాలి.
“నేను సుగ్రీవునితో యుద్ధం చేస్తూ నీ మూలంగా మరణిస్తున్నాను. నేను నీతో యుద్ధం చేయడం లేదు కదా! నీవంక తిరిగి నీ తో యుద్ధం చేయని వాడిని చంపి నీవు ఏం సాధించావు? నేను విన్నదానిని బట్టి రాముడు కులీనుడు. సత్త్వగుణ సంపన్నుడు. తేజస్వి. వ్రతనిష్ట కలవాడు. రాముడు కరుణామయుడు. ఎల్లప్పుడూ ప్రజలహితం కోరేవాడు. ఇతరుల పట్ల జాలి, దయ కలవాడు. ఉత్సాహవంతుడు. సమయస్ఫూర్తి కలవాడు. ధృడమైన బుద్ధికలవాడు. ఈ లోకంలో ఉన్న వారంతా నిన్ను పై గుణములతో కీర్తిస్తుంటారు కదా! పైగా నీవు రాజువు. రాజైన వాడు ఇంద్రియనిగ్రహము, ఓర్పు, ధైర్యము, బలము, పరాక్రమము, తప్పుచేసిన వారిని దండించే గుణము కలిగి ఉండాలి.
నీవు సుగ్రీవునికి అండగా, మిత్రుడుగా ఉన్నావని తార చెప్పింది. కానీ సకల సద్గుణ సంపన్నుడవైన నీవు తప్పు చేయవని నేను సుగ్రీవునితో యుద్ధానికి తలపడ్డాను. నేను సుగ్రీవునితో యుద్ధం చేసేటప్పుడు నీవు నాకు కనపడలేదు. (అంటే రాముడు చెట్టు చాటునో పొదలమాటునో దాక్కుని ఉన్నాడని వాలి అంటున్నాడు.) కాని నీ బాణం దెబ్బనాకు తగిలింది. అంటే నేను సుగ్రీవునితో యుద్ధం చేస్తుంటే, నీవు నాకు కనపడకుండా మాటు వేసి నన్ను కొట్టావు అని నేను అనుకుంటున్నాను.
ధర్మాత్ముడవు అని పేరుగాంచిన నీ బుద్ధి ఇంత చెడ్డదనీ, నీవు ధర్మాత్ముడు అనే ముసుగులో అధర్మాలను ఆచరించే దుర్మార్గుడవు అనీ, పాపాత్ముడవనీ, గడ్డితో కప్పబడిన నేలబావి లాంటి వాడివనీ నాకు తెలియక, నేను సుగ్రీవునితో ధర్మయుద్ధానికి తలపడ్డాను. రామా! నీవు సాత్వికుని వేషంలో ఉన్న పాపాత్ముడివి, నివురు కప్పిన నిప్పులాంటి వాడివి అని తెలుసుకోలేకపోయాను.
రామా! నేను నీ దేశానికి రాలేదు. నీ నగరానికి రాలేదు. నీ దేశంలో కానీ, నీ నగరంలో కానీ ఏ నేరమూ, తప్పూ చేయలేదు. నిన్ను నేను ఎన్నడూ అవమానించలేదు. నీకు ఎటువంటి అపకారము చేయలేదు. నామానాన నేను అడవులలో ఉంటూ ఫలములు, మూలములు తింటూ బతుకుతున్నాను. నీవు నరుడవు. నేను కాయలు పండ్లు తినే వానరమును. పాపం చెయ్యడం అంటే ఏమిటో నాకు తెలియదు. నేను నీతో యుద్ధం చేయడం లేదు. మరొకరితో యుద్ధం చేస్తున్నాను. అటువంటి నన్ను ఏ కారణంతో చంపావు?
రామా! నీవు రాజులలో ప్రసిద్ధుడవు. ఎన్నో శాస్త్రములను చదివావు. ప్రస్తుతము జటలు, నారచీరలు ధరించి మునివేషములో ఉన్నావు. ముని వేషములో ఉన్న నీవు ఇటువంటి క్రూరమైన పని చేయడం తగునా!
రామా! నీవు రఘు వంశములో పుట్టావు. పైకి మాత్రం ధర్మానికి ప్రతిరూపంగా కనపడతావు. కాని లోలోపల దుష్టుడివి. నీవు క్రూరత్వానికి ప్రతిరూపం. లోకానికి మాత్రం ధర్మాత్ముడు, మంచి వాడు అని చెప్పుకుంటూ తిరుగుతున్నావు. రామా! రాజుకు ఉండవలసిన గుణములు ఏవంటే—సామము, దానము, క్షమ, ధర్మగుణము, సత్యము పలకడం, పరాక్రమము, ధైర్యము. ఇవీ రాజుకు ఉండవలసిన గుణములు. రామా! మేము అడవులలో ఉంటూ ఆకులు, కాయలు, పండ్లు తిని బతికే వానరులము. నీవు నరుడివి. నరులకు రాజువు. మీకు అనుభవించడానికి రాజ్యము, వెండి, బంగారము కావాలి. కాని ఎక్కడో మారుమూల ఉన్న నా అరణ్యరాజ్యము నీకు ఎందుకు?
నీతిగా ఉంటడం, వినయము కలిగి ఉండటం, దండించతగినవారిని దండించడం, నిరపరాధులను విడిచిపెట్టడం, ఇవీ రాజు పాటించవలసిన ధర్మములు. రాజులు ఈ ధర్మములకు లోబడి ప్రవర్తించాలి కానీ వారి ఇష్టము వచ్చినట్టు ప్రవర్తించరాదు. కాని నీవు రాజువై ఉండీ పై ధర్మములను పాటించలేదు. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు. నీకు నీ కోరికలు తీరాలి. దాని కోసం ఏమి చెయ్యడానికైనా వెనుదీయవు. పైగా నీకు కోపం ఎక్కువ. నీ మనస్సు నిలకడలేదు. రాజధర్మములను ఆచరించడంలో నీకు | స్థిరమైన బుద్ధిలేదు. ఆయుధము నీ చేతిలో ఉంది కదా అని అందరినీ చంపుకుంటూపోతావు. అదీ నీ తత్త్వము.
ఓ మనుజేశ్వరా! రామా! నీకు ధర్మాచరణములో శ్రద్ధ, భక్తి లేవు. నీవు కామానికి దాసుడవు. నీ కోరికలు ఎటు లాగితే అటు వెళతావు. నాకు తెలిసీ నేను ఏ అపరాధమూ చెయ్యలేదు. అటువంటి నన్ను అకారణంగా చంపావు. ఈ చర్యను లోకుల ముందు, సాటి రాజుల ముందు, ఎలా సమర్ధించుకుంటావు?
ఓ రామా! రాజును, బ్రాహ్మణుని, గోవును, అమాయకమైన జంతువులను నిర్దాక్షిణ్యంగా చంపేవాడు, వేదప్రమాణమును నమ్మని వాడు, ఇతరుల మీద చాడీలు చెప్పేవాడు, మిత్రుడికి ద్రోహం చేసేవాడు, గురువుగారి భార్యను కామించేవాడు, నరకానికి వెళతారు. నేను మనిషినికాను జంతువును. నన్ను అకారణంగా చంపావు. నీకు ఏ గతి పడుతుందో ఆలోచించుకో?
నేను జంతువును కాబట్టి నన్ను వేటాడావు అని అనుకోడానికీ వీలు లేదు. ఎందుకంటే నన్ను వేటాడి, చంపినందువలన నీకు ఏమన్నా ప్రయోజనము ఉందా అంటే అదీలేదు. నా చర్మము దేనికీ పనికిరాదు. నా వెంట్రుకలు, ఎముకలు, మీ వంటి మంచివారు తాకను కూడా తాకరు. నా మాంసము తినడానికి పనికిరాదు. ఏ ప్రయోజనమూ లేకుండా నన్ను ఎందుకు వేటాడావు?
రామా! నీ క్రూర బుద్ధిని ఊహించిన నా భార్య నాకు హితోపదేశము చేసింది. కానీ గర్వాంధుడనై ఆమె ఉపదేశము పెడచెవిని పెట్టాను. తగిన ఫలితము అనుభవించాను. ఒక శీలవతికి దుర్మార్గుడైన భర్త ఉన్నా ఒకటే లేకా ఒకటే. అలాగే నీ రాజ్యానికి, ఈ భూమికి, దుర్మార్గుడైన, శీలవంతుడుకాని నీవంటిరాజు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే! దొంగచాటుగా దెబ్బతీసేవాడివి, ఇతరులకు అకారణంగా హాని చేసేవాడివి, నీచ బుద్ధి కలవాడివి, పైకి మాత్రం మంచి వాడిగా కనిపిస్తూ లోపల కుచ్ఛితమైన బుద్ధి కలవాడివి, పాపాత్ముడవు అయిన నీవు ఆ దశరథునికి కుమారుడిగా ఎలా జన్మించావో అర్థం కావడం లేదు. సత్పురుషులు, యోగ్యులు అయిన వాళ్లు నిందించే పనిని నీవు చేసావు. వారి ముందు నీ చర్యను ఎలా సమర్ధించుకుంటావు?
రామా! నేను నీకు శత్రువును కాను. మిత్రుడను కాను. నీవు నిజంగా వీరుడవు, పరాక్రమ వంతుడివి అయితే నీ శత్రువులతో యుద్ధం చేసి గెలువు. అదీ వీరత్వము అంటే! నేను నీకు శత్రువును అని నీవు అనుకుంటే, నాతో యుద్ధమే చేయాల్సింది. ఈ పాటికి నిన్ను యమునికి అతిథిగా పంపి ఉండేవాడిని. నన్ను ఎదిరించి పోరాడే ధైర్యము లేక, చేత కాక, చాటున ఉండి నన్ను చంపావు.
మద్యము మత్తులో నిద్రించు వాడిని పాము కాటు వేసినట్టు, నువ్వు నన్ను చాటునుండి చంపావు. నీ భార్యను వెతికి పెట్టడానికి నీవు సుగ్రీవునితో స్నేహం చేసావు అని నాకు తెలిసింది. దానికి ప్రతిఫలంగా సుగ్రీవునికి మేలు చేయడానికి నన్ను చంపావు.
రాజ్యభ్రష్టుడైన సుగ్రీవునితో స్నేహం చెయ్యడానికికి బదులుగా నీవు నా వద్దకు వచ్చి నాతో స్నేహం చేసి ఉంటే నేను ఆ రావణుని కాళ్లు చేతులు కట్టితెచ్చి నీ పాదాల ముందు పడవేసేవాడిని. ఆకాశములో గానీ, పాతాళములోకానీ, నీ సీత ఎక్కడ ఉన్నా వెతికి తెచ్చి నీకు అప్పగించి ఉండేవాడిని.
రామా! సుగ్రీవుడు నాసోదరుడు. నా తరువాత కిష్కింధకు రాజు అవుతాడు. అది ధర్మమే. కానీ నీవు నన్ను చాటునుండి చంపడం మాత్రం అధర్మము. క్షమించరాని నేరము. నీకు చేతనయితే నీవు చేసిన కార్యము ధర్మబద్ధము అని నిరూపించుకో.” అని పలికి వాలి మౌనంగా ఉండిపోయాడు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము పదిహేడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్