కిష్కింధాకాండంలో వింశం సర్గంలో, రాముడు లక్ష్మణుడిని వానర సేనలకు సహాయంగా పంపిస్తాడు. సుగ్రీవుడు హనుమంతుడిని కళంకించడానికి చేయాల్సి, అవను మొదటి రామాయణ వెర్షన్ను చెప్పింది. రాముని సోదరి శ్రీమతి మారుతి వాల్మీకితో సందేహంకు కారణమైన కోపానికి ప్రకారం మరులసియుండదు.
తారావిలాపః
రామచాపవిసృష్టేన శరేణాంతకరేణ తమ్ |
దృష్ట్వా వినిహతం భూమౌ తారా తారాధిపాననా || ౧ ||
సా సమాసాద్య భర్తారం పర్యష్వజత భామినీ |
ఇషుణాభిహతం దృష్ట్వా వాలినం కుంజరోపమమ్ || ౨ ||
వానరేంద్రం మహేంద్రాభం శోకసంతప్తమానసా |
తారా తరుమివోన్మూలం పర్యదేవయదాతురా || ౩ ||
రణే దారుణ విక్రాంత ప్రవీర ప్లవతాం వర |
కిం దీనామపురోభాగామద్య త్వం నాభిభాషసే || ౪ ||
ఉత్తిష్ఠ హరిశార్దూల భజస్వ శయనోత్తమమ్ |
నైవంవిధాః శేరతే హి భూమౌ నృపతిసత్తమాః || ౫ ||
అతీవ ఖలు తే కాంతా వసుధా వసుధాధిప |
గతాసురపి యాం గాత్రైర్మాం విహాయ నిషేవసే || ౬ ||
వ్యక్తమన్యా త్వయా వీర ధర్మతః సంప్రవర్తితా |
కిష్కింధేవ పురీ రమ్యా స్వర్గమార్గే వినిర్మితా || ౭ ||
యాన్యస్మాభిస్త్వయా సార్ధం వనేషు మధుగంధిషు |
విహృతాని త్వయా కాలే తేషాముపరమః కృతః || ౮ ||
నిరానందా నిరాశాహం నిమగ్నా శోకసాగరే |
త్వయి పంచత్వమాపన్నే మహాయూథపయూథపే || ౯ ||
హృదయం సుస్థిరం మహ్యం దృష్ట్వా వినిహతం పతిమ్ |
యన్న శోకాభిసంతప్తం స్ఫుటతేఽద్య సహస్రధా || ౧౦ ||
సుగ్రీవస్య త్వయా భార్యా హృతా స చ వివాసితః |
యత్తు తస్య త్వయా వ్యుష్టిః ప్రాప్తేయం ప్లవగాధిప || ౧౧ ||
నిఃశ్రేయసపరా మోహాత్త్వయా చాహం విగర్హితా |
యైషాఽబ్రవం హితం వాక్యం వానరేంద్ర హితైషిణీ || ౧౨ ||
రూపయౌవనదృప్తానాం దక్షిణానాం చ మానద |
నూనమప్సరసామార్య చిత్తాని ప్రమథిష్యసి || ౧౩ ||
కాలో నిఃసంశయో నూనం జీవితాంతకరస్తవ |
బలాద్యేనావపన్నోఽసి సుగ్రీవస్యావశో వశమ్ || ౧౪ ||
వైధవ్యం శోకసంతాపం కృపణం కృపణా సతీ |
అదుఃఖోపచితా పూర్వం వర్తయిష్యామ్యనాథవత్ || ౧౫ ||
లాలితశ్చాంగదో వీరః సుకుమారః సుఖోచితః |
వత్స్యతే కామవస్థాం మే పితృవ్యే క్రోధమూర్ఛితే || ౧౬ ||
కురుష్వ పితరం పుత్ర సుదృష్టం ధర్మవత్సలమ్ |
దుర్లభం దర్శనం వత్స తవ తస్య భవిష్యతి || ౧౭ ||
సమాశ్వాసయ పుత్రం త్వం సందేశం సందిశస్వ చ |
మూర్ధ్ని చైనం సమాఘ్రాయ ప్రవాసం ప్రస్థితో హ్యసి || ౧౮ ||
రామేణ హి మహత్కర్మకృతం త్వామభినిఘ్నతా |
ఆనృణ్యం చ గతం తస్య సుగ్రవస్య ప్రతిశ్రవే || ౧౯ ||
సకామో భవ సుగ్రీవ రుమాం త్వం ప్రతిపత్స్యసే |
భుంక్ష్వ రాజ్యమనుద్విగ్నః శస్తో భ్రాతా రిపుస్తవ || ౨౦ ||
కిం మామేవం విలపతీం ప్రేమ్ణా త్వం నాభిభాషసే |
ఇమాః పశ్య వరా బహ్వీర్భార్యాస్తే వానరేశ్వర || ౨౧ ||
తస్యా విలపితం శ్రుత్వా వానర్యః సర్వతశ్చ తాః |
పరిగృహ్యాంగదం దీనం దుఃఖార్తాః పరిచుక్రుశుః || ౨౨ ||
కిమంగదం సాంగదవీరబాహో
విహాయ యాస్యద్య చిరప్రవాసమ్ |
న యుక్తమేవం గుణసన్నికృష్టం
విహాయ పుత్రం ప్రియపుత్ర గంతుమ్ || ౨౩ ||
కిమప్రియిం తే ప్రియచారువేష
మయా కృతం నాథ సుతేన వా తే |
సహాంగదాం మాం స విహాయ వీర
యత్ప్రస్థితో దీర్ఘమితః ప్రవాసమ్ || ౨౪ ||
యద్యప్రియం కించిదసంప్రధార్య
కృతం మయా స్యాత్తవ దీర్ఘబాహో |
క్షమస్వ మే తద్ధరివంశనాథ
వ్రజామి మూర్ధ్నా తవ వీర పాదౌ || ౨౫ ||
తథా తు తారా కరుణం రుదంతీ
భర్తుః సమీపే సహ వానరీభిః |
వ్యవస్యత ప్రాయముపోపవేష్టు-
-మనింద్యవర్ణా భువి యత్ర వాలీ || ౨౬ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే వింశః సర్గః || ౨౦ ||
Kishkindha Kanda Sarga 20 Meaning In Telugu
రాముని బాణం దెబ్బతిని చావుబతుకుల్లో ఉన్న భర్త వాలిని చూచి తార భోరున ఏడిచింది. “ఓ వీరుడా! నీవు లోకోత్తర వీరుడవే. నీ వీరత్వము, పరాక్రమము ఏమైపోయాయి. ఎందుకు ఇలా దీనంగా నేల మీద పడి ఉన్నావు. నేను, నీ భార్య తారను, వచ్చాను. లే. నన్ను పలకరించు. నీవు మహారాజువు. ఇలా నేల మీద పడుకోవడం తగునా. లేచి మెత్తని హంసతూలికా తల్పం మీద పడుకో. ఓ భూనాధా! ఇన్నాళ్లు ఈ భూమిని పాలించిన నీవు, అవసాన సమయంలో కూడా భూదేవిని వదల లేక. ఆమెను కౌగలించుకొని పడుకున్నావా!
ఓ వానరవీరా! ఎంతో కష్టపడి, స్వర్గాన్ని తలదన్నే విధంగా, ఈ కిష్కింధను నిర్మించావు. ఇప్పుడు ఆ కిష్కింధను వదిలి ఎక్కడకు పోతున్నావు? నాధా! నేను నీ వియోగము తట్టుకోలేకున్నాను. నన్ను విడిచి వెళ్లవద్దు. నిన్ను ఈ స్థితిలో చూచి కూడా నా హృదయం బద్దలు కాలేదంటే, నా గుండె కఠినమైన పాషాణము అనుకుంటాను. అయినా కాలగతిని ఎవరు తప్పించగలరు. ఈ కాలమే నిన్ను సుగ్రీవుని చేతిలో మరణించేట్టు చేసింది.
నాధా! నేను నీకు భార్యగా ఉన్నాను. నేను కాకుండా ఎంతో మంత్రి స్త్రీలు ఉన్నారు కదా! కానీ నీవు ఆ సుగ్రీవుని భార్యను కోరుకున్నావు. అతనిని రాజ్యము నుండి వెళ్లగొట్టావు. దాని ఫలితమే నీకు సంప్రాప్తించిన ఈ దుర్మరణం. నాధా! నీవు సుగ్రీవునితో యుద్ధానికి పోకముందు ఎన్నోవిధాలుగా చెప్పాను. సుగ్రీవునితో సంధి చేసుకోమన్నాను. కానీ నీవు నా మాటలను పెడచెవిని పెట్టావు. పైగా నన్ను నిందించావు. కోరి కోరి మరణాన్ని కౌగలించుకున్నావు.
నాధా! రాముడు నిన్ను చంపినందుకు నేను చారించడం లేదు. కానీ ఏ నాడూ కష్టము గానీ, దు:ఖము కానీ అనుభవించని నేను ఈ వైధవ్య దుఃఖమును అనుభవించవలసి రావడం చాలా బాధగా ఉంది. నాధా! నీ కుమారుడు అంగదుని చూడండి. చిన్నప్పటి నుండి అల్లారుముద్దుగా పెరిగాడు. ఇప్పుడు పినతండ్రి సుగ్రీవుని వశమయ్యాడు. ఎన్ని బాధలు పడతాడో ఏమో!
నాయనా! అంగదా! నీ తండ్రివాలిని చూడు. కడసారి దర్శనం చేసుకో. ఇంక మీదట రోజూ చూచే నీ తండ్రి ముఖం రేపటి నుండి నీకు కనిపించదు. నాథా! నీ కుమారుడు అంగదుడు నిన్ను పిలుస్తున్నాడు. అంగదుని పలకరించు. అతనికి జీవితంలో నడుచుకోవలసిన జాగ్రత్తలు చెప్పు.
నాధా! నిన్ను చంపడం ద్వారా రాముడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. సుగ్రీవునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఓ సుగ్రీవా! నీ కోరిక తీరింది కదా! ఇంక నీ భార్య రుమ నీకు లభిస్తుందిలే. నీవు ఏ దిగులు, భయమూ లేకుండా ఈ కిష్కింధను ఏలుకో! నీ అన్న వాలిని చంపించావు కదా! ఇంకనీకు అడ్డేముంది.
నాధా! నేను ఇంతగా మాట్లాడుతున్నా నువ్వు ఒక్కమాట కూడా పలుకవేమి? మాట్లాడు. నేనే కాదు. నీ భార్యలందరూ వచ్చి ఉన్నారు. వారి వంక కన్నెత్తి చూడు. వారిని పలకరించు.” అని తార, ఆమెతో వచ్చిన వాలి భార్యలు వలా వలా ఏడుస్తున్నారు. అంగదుని పట్టుకొని రోదిస్తున్నారు.
తారకు ఇంకా ఆశ చావలేదు. వాలి మరలా బతుకుతాడని ఆశతో వాలిని కుదిపి కుదిపి ఏడుస్తూ ఉంది. “ఓ నాధా! నేను, అంగదుడు ఏమి అపరాధము చేసామని మమ్ములను విడిచి పోతున్నావు. తెలిసో తెలియకో మేము నీ పట్ల ఏమైనా అపరాధము చేస్తే దానిని క్షమించు. నీ పాదాలు పట్టి వేడుకుంటున్నాను.” అని వాలి పాదాల మీద తల పెట్టి ఏడుస్తూ ఉంది తార. భర్త లేని బతుకు తనకు వ్యర్ధమని ఎంచి, తార తన భర్త వాలితో పాటు ప్రాయోపవేశము చెయ్యాలని నిర్ణయించుకుంది.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ఇరువదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్