కిష్కింధాకాండలో షష్ఠ సర్గ, హనుమంతుడు సీతను వెతికే ప్రస్థానంలో కీలకమైనది. అన్వేషణ బృందం దక్షిణ దిశలోని ఎడారి, అడవులు దాటింది. అన్వేషణలో వారు సింహిక అనే రాక్షసితో పోరాడుతారు, హనుమంతుడు ఆమెను సంహరిస్తాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, హనుమంతుడు ధైర్యంతో ముందుకు సాగుతాడు. చివరికి, వారికి సంపాతి అనే జటాయువు సోదరుడు లభిస్తాడు, అతను సీత లంకలో ఉంది అని సమాచారమిస్తాడు. ఈ వార్తతో హనుమంతుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు, అంగదుడు తదితరులు ఉత్సాహంగా లంకకు ప్రయాణించడానికి సిద్ధమవుతారు. ఈ సర్గలో హనుమంతుడి ధైర్యం, ప్రతిభ, అన్వేషణలో ఉత్సాహం ప్రధానంగా చూపిస్తాయి.
భూషణప్రత్యభిజ్ఞానమ్
పునరేవాబ్రవీత్ ప్రీతో రాఘవం రఘునందనమ్ |
అయమాఖ్యాతి మే రామ సచివో మంత్రిసత్తమః || ౧ ||
హనుమాన్ యన్నిమిత్తం త్వం నిర్జనం వనమాగతః |
లక్ష్మణేన సహ భ్రాత్రా వసతశ్చ వనే తవ || ౨ ||
రక్షసాఽపహృతా భార్యా మైథిలీ జనకాత్మజా |
త్వయా వియుక్తా రుదతీ లక్ష్మణేన చ ధీమతా || ౩ ||
అంతరప్రేప్సునా తేన హత్వా గృధ్రం జటాయుషమ్ |
భార్యావియోగజం దుఃఖమచిరాత్త్వం విమోక్ష్యసే || ౪ ||
అహం తామానయిష్యామి నష్టాం వేదశ్రుతీమివ |
రసాతలే వా వర్తంతీం వర్తంతీం వా నభస్తలే || ౫ ||
అహమానీయ దాస్యామి తవ భార్యామరిందమ |
ఇదం తథ్యం మమ వచస్త్వమవేహి చ రాఘవ || ౬ ||
న శక్యా సా జరయితుమపి సేంద్రైః సురాసురైః |
తవ భార్యా మహాబాహో భక్ష్యం విషకృతం యథా || ౭ ||
త్యజ శోకం మహాబాహో తాం కాంతామానయామి తే |
అనుమానాత్తు జానామి మైథిలీ సా న సంశయః || ౮ ||
హ్రియమాణా మయా దృష్టా రక్షసా క్రూరకర్మణా |
క్రోశంతీ రామ రామేతి లక్ష్మణేతి చ విస్వరమ్ || ౯ ||
స్ఫురంతీ రావణస్యాంకే పన్నగేంద్రవధూర్యథా |
ఆత్మనా పంచమం మాం హి దృష్ట్వా శైలతటే స్థితమ్ || ౧౦ ||
ఉత్తరీయం తయా త్యక్తం శుభాన్యాభరణాని చ |
తాన్యస్మాభిర్గృహీతాని నిహితాని చ రాఘవ || ౧౧ ||
ఆనయిష్యామ్యహం తాని ప్రత్యభిజ్ఞాతుమర్హసి |
తమబ్రవీత్తతో రామః సుగ్రీవం ప్రియవాదినమ్ || ౧౨ ||
ఆనయస్వ సఖే శీఘ్రం కిమర్థం ప్రవిలంబసే |
ఏవముక్తస్తు సుగ్రీవః శైలస్య గహనాం గుహామ్ || ౧౩ ||
ప్రవివేశ తతః శీఘ్రం రాఘవప్రియకామ్యయా |
ఉత్తరీయం గృహీత్వా తు శుభాన్యాభరణాని చ || ౧౪ ||
ఇదం పశ్యేతి రామాయ దర్శయామాస వానరః |
తతో గృహీత్వా తద్వాసః శుభాన్యాభరణాని చ || ౧౫ ||
అభవద్బాష్పసంరుద్ధో నీహారేణేవ చంద్రమాః |
సీతాస్నేహప్రవృత్తేన స తు బాష్పేణ దూషితః || ౧౬ ||
హా ప్రియేతి రుదన్ ధైర్యముత్సృజ్య న్యపతత్ క్షితౌ |
హృది కృత్వా తు బహుశస్తమలంకారముత్తమమ్ || ౧౭ ||
నిశశ్వాస భృశం సర్పో బిలస్థ ఇవ రోషితః |
అవిచ్ఛిన్నాశ్రువేగస్తు సౌమిత్రిం వీక్ష్య పార్శ్వతః || ౧౮ ||
పరిదేవయితుం దీనం రామః సముపచక్రమే |
పశ్య లక్ష్మణ వైదేహ్యా సంత్యక్తం హ్రియమాణయా || ౧౯ ||
ఉత్తరీయమిదం భూమౌ శరీరాద్భూషణాని చ |
శాద్వలిన్యాం ధ్రువం భూమ్యాం సీతయా హ్రియమాణయా || ౨౦ ||
ఉత్సృష్టం భూషణమిదం తథారూపం హి దృశ్యతే |
ఏవముక్తస్తు రామేణ లక్ష్మణో వాక్యమబ్రవీత్ || ౨౧ ||
నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే |
నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్ || ౨౨ ||
తతః స రాఘవో దీనః సుగ్రీవమిదమబ్రవీత్ |
బ్రూహి సుగ్రీవ కం దేశం హ్రియంతీ లక్షితా త్వయా || ౨౩ ||
రక్షసా రౌద్రరూపేణ మమ ప్రాణైః ప్రియా ప్రియా |
క్వ వా వసతి తద్రక్షో మహద్వ్యసనదం మమ || ౨౪ ||
యన్నిమిత్తమహం సర్వాన్నాశయిష్యామి రాక్షసాన్ |
హరతా మైథిలీం యేన మాం చ రోషయతా భృశమ్ |
ఆత్మనో జీవితాంతాయ మృత్యుద్వారమపావృతమ్ || ౨౫ ||
మమ దయితతరా హృతా వనాంతా-
-ద్రజనిచరేణ విమథ్య యేన సా |
కథయ మమ రిపుం త్వమద్య వై
ప్లవగపతే యమసన్నిధిం నయామి || ౨౬ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే షష్ఠః సర్గః || ౬ ||
Kishkindha Kanda Sarga 6 Meaning In Telugu
సుగ్రీవుడు రాముని చూచి ఇలా అన్నాడు. “రామా! నీ గురించి హనుమంతుడు నాకు అంతా చెప్పాడు. నీవు నీ సోదరుడు లక్ష్మణుడు ఈ అరణ్యవాసము ఎందుకు చేస్తున్నారో వివరంగా చెప్పాడు. నీ భార్య సీతను మీరు లేని సమయమున ఒక రాక్షసుడు అపహరించిన విషయం కూడా చెప్పాడు. నీవు నాకు మిత్రుడవు అయినావు. ఇంక నీ దు:ఖమును విడిచి పెట్టు. నీ భార్య సీత ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొని వచ్చి నీకు అప్పగిస్తాను. నీ దు:ఖాన్ని తొలగిస్తాను. నీ భార్య ఆకాశములో ఉన్నా, పాతాళములో ఉన్నా వెతికి తీసుకొని వస్తాను. ఇది సత్యము. నేను మాట తప్పను.
రామా! నీవు చెబుతుంటే నాకు ఒక విషయం గుర్తుకు వస్తూ ఉంది. ఒక రోజు మేమందరమూ ఈ పర్వత శిఖరము మీద కూర్చుని ఉండగా ఒక రాక్షసుడు ఒక స్త్రీని అపహరించుకు పోవడం, ఆమె రామా, రామా అని అరవడం మేము చూచాము. ఆమె సీతయే. సందేహము లేదు. ఆ రాక్షసుడు రావణుడు అయి ఉంటాడు. ఆమె అలా ఏడుస్తూ తన పైనున్న వస్త్రములో కొన్ని ఆభరణములను మూటగా కట్టి జారవిడిచినది. ఆ మూట మా దగ్గర పడింది. మేము వాటిని మా దగ్గరే ఉంచాము. వాటిని నీకు చూపిస్తాను. ఆ ఆభరణములను నీవు గుర్తు పట్టగలవేమో చూడు.”అని అన్నాడు సుగ్రీవుడు.
ఆ మాటలు విని రాముడు ఉత్సాహంగా “మిత్రమా! ఆ ఆభరణములు వస్త్రము త్వరగా తీసుకొనిరా. నా సీత ఆభరణములు, వస్త్రము నేను చూడాలి.” అని ఆతురతగా అన్నాడు రాముడు. సుగ్రీవుడు వెంటనే పక్కనేఉన్న గుహలోకి వెళ్లాడు.
క్షణములో ఒక ఉత్తరీయములో కట్టబడిన ఆభరణములను తీసుకొని వచ్చాడు. “రామా! ఇదే ఆ వస్త్రము. ఇవే ఆ ఆభరణములు. చూడు. ఇవి నీ భార్య సీతకు చెందినవేమో!”అని అన్నాడు.
రాముడు ఆ ఉత్తరీయమును, ఆభరణములను చూచాడు. రాముని కళ్లనిండా నీళ్లు కమ్మాయి. ఏమీ కనిపించడం లేదు మనసు వశం తప్పింది. “హా సీతా!” అంటూ కిందపడి పోయాడు. రాముడు ఆ ఆభరణములను ఉత్తరీయమును తన గుండెలకు హత్తుకున్నాడు. రాముని శ్వాస భారంగా వస్తూ ఉంది. నోట మాట రావడం లేదు. ఉ ద్వేగంతో ఉన్నాడు. రాముని కళ్ల నుండి నీరు ధారాపాతంగా కారుతూ ఉంది. ఏడుస్తూ లక్ష్మణుని వంక చూచాడు.
“లక్ష్మణా! సీతను ఆ రాక్షసుడు అపహరించుకు పోతున్నప్పుడు సీత జారవిడిచిన ఆభరణములు, ఉత్తరీయము చూడు. ఇవి మెత్తని గడ్డి మీద పడి ఉంటాయి. అందుకనే విరిగిపోకుండా ఉ న్నాయి. లక్ష్మణా! సీత ఆభరణములను నీవు గుర్తు పట్టగలవా!”అని అడిగాడు. అప్పుడు లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు.
“రామా! నాకు సీత ధరించే ఏ ఆభరణముల గురించి అంతగా తెలియదు. నేను ప్రతిరోజూ ఆమెకు పాదాభివందనము చేయునపుడు ఆమె కాళ్లకు ధరించే నూపురములు చూస్తూ ఉంటాను. కాబట్టి అవి మాత్రమే గుర్తు పట్టగలను.” అని అన్నాడు. (లక్ష్మణుడు చెప్పినట్టుగా రాయబడి ఉన్న ఈ శ్లోకము ప్రాచ్య ప్రతిలో లేదు అని పండితుల అభిప్రాయము.)
ఆ ఆభరణములను చూచి రాముడు సుగ్రీవునితో ఇలా అన్నాడు. “సుగ్రీవా! ఇవి నిస్సంశయముగా నా సీత ఆభరణములే. ఇది నా సీత ధరించిన ఉత్తరీయము. సీతను అపహరించిన ఆ రాక్షసుడు సీతను ఏ దేశమునకు తీసుకొని వెళ్లాడో చెప్పగలవా? ఆ రాక్షసుడు. ఎక్కడ ఉంటాడో చెప్పగలవా? వాడి మూలంగా రాక్షస జాతి అంతా సర్వనాశనం అవుతుంది. ఇది సత్యము. సీతను అపహరించి ఆ రాక్షసుడు తన మృత్యువును తానే కొని తెచ్చుకున్నాడు. సుగ్రీవా! చెప్పు. ఆ రాక్షసుడి గురించిన వివరాలు చెప్పు. వాడు ఎక్కడ ఉంటాడో చెప్పు. ఇప్పుడే వాడిని సంహరిస్తాను.” అని కోపావేశంతో ఊగిపోతూ అన్నాడు రాముడు.
శ్రీమద్రామాయణము
కిష్కింధాకాండము ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్