Mukunda Mala Stotram In Telugu – ముకుందమాలా

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు ముకుందమాలా స్తోత్రము గురించి తెలుసుకుందాం…

Mukunda Mala Stotram Telugu

ముకుందమాలా

ఘుష్యతే యస్య నగరే, రంగయాత్రా దినే దినే,
తమహం శిరసా వందే, రాజానం కులశేఖరమ్.
శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి, భక్తప్రియేతి భవలుంఠనకోవిదేతి,
నాథేతి నాగశయనేతి జగన్నివాసే, త్యాలాపనం ప్రతిపదం కురు మే ముకుంద !

1

జయతు జయతు దేవో దేవకీనందనోయం
జయతు జయతు కృష్ణా వృష్టివంశ ప్రదీపః,
జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగః
జయతు జయతు పృథ్వీభారనాశో ముకుందః.

2

ముకుంద ! మూగ్షా ప్రణిపత్య యాచే
భవన్తమేకాన్త మియన్త మర్దమ్,
అవిస్మృతి స్త్వచ్చరణారవిందే
భవే భవే మే స్తు భవత్ప్రసాదాత్.

3

నాహం వందే తవచరణయోర్ద్వంద్వమద్వంద్వ హేతోః
కుంభీపాకం గురుమపి హరే ! నారకం నాపనేతుమ్,
రమ్యా రామా మృదుతనులతా నందనే నాపి రంతుం
భావే భావే హృదయభవనే భావయేయం భవంతమ్.

4

నా ధర్మే న వసునిచయే నైవ కామోపభోగే
యద్యద్భవ్యం భవతు భగవన్ ! పూర్వకర్మానురూపమ్,
ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మజన్మాంతరేపి
త్వత్పాదాంభోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు.

5

దివి వా భువి వా మమాస్తు వాసః
నరకే వా నరకాంతక ప్రకామమ్,
అవధీరిత శారదారవిందౌ
చరణా తే మరణేపి చింతయామి.

6

కృష్ణ ! త్వదీయ పదపంకజ పంజరాంత
మద్వైవ మే విశతు మానసరాజహంసః
ప్రాణప్రయాణ సమయే కఫవాతపిత్తెః
కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తే.

7

చింతయామి హరిమేవ సంతతం
మందమందహసితాననాంబుజమ్,
నందగోపతనయం పరాత్పరం
నారదాది మునిబృంద వందితమ్.

8

కరచరణ సరోజే కాంతిమన్నేత్రమీనే
శ్రమముషి భుజవీచి వ్యాకులే గాధమార్గే
హరిసరసి విగాహ్యాపీయ తేజో జలౌఘం
భవమరుపరిభిన్నః ఖేదమద్య త్యజామి.

9

సరసిజనయనే సశంఖచక్రే
మురభిది మా విరమస్వ చిత్త! రంతుమ్,
సుఖతర మపరం న జాతు జానే
హరిచరణస్మరణామృతేన తుల్యమ్.

10

మాభీర్మందమనో విచింత్య బహుధా యామీశ్చిరం యాతనాః
నామీనః ప్రభవన్తి పాపరిపవః స్వామీ నను శ్రీధరః,
ఆలస్యం వ్యపనీయ భక్తిసులభం ధ్యాయస్వ నారాయణం
లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య కిం న క్షమః.

11

భవజలధి గతానాం ద్వంద్వ వాతాహతానాం
సుత దుహితృ కళత్రత్రాణభారార్దితానామ్,
విషమవిషయతోయే మజ్జతామప్లవానాం
భవతు శరణమేకో విష్ణుపోతో నరాణామ్.

12

భవజలధి మగాధం దుస్తరం నిస్తరేయం
కథమహమితి చేతో మాస్మగాః కాతరత్వమ్,
సరసిజదృశి దేవే తావకీ భక్తిరేకా
నరకభిది నిషణ్ణా తారయిష్య త్యవశ్యమ్.

13

తృష్ణాతోయే మదనపవనోద్ధూతమోహోర్మిమాలే
దారావర్తే తనయసహజగ్రాహసంఘాకులే చ,
సంసారాఖ్యే మహతి జలధౌ మజ్జతాల నస్త్రిధామన్
పాదాంభోజే వరద ! భవతో భక్తినావం ప్రయచ్ఛ.

14

మాద్రాక్షం క్షీణపుణ్యాన్ క్షణమపి భవతో భక్తిహీనాన్ పదాబే
మాశ్రాషం శ్రావ్యబంధం తవచరితమపాస్యాన్యదాఖ్యానజాతమ్,
మాస్మార్షం మాధవ ! త్వామపి భువనపతే ! చేతసా పహ్నువానాన్
మాభూవం త్వత్సపర్యా వ్యతికరరహితో జన్మజన్మాన్తరే పి.

15

జిహ్వే ! కీర్తయ కేశవం మురరిపుం చేతో ! భజ శ్రీధరం
పాణిద్వంద్వ! సమర్చయాచ్యుతకథాః శ్రోత్రద్వయ ! త్వం శృణు,
కృష్ణం లోకయ లోచనద్వయ ! హరేర్గచ్ఛాంధ్రియుగ్మాలయం
జిఘ్ర ఘ్రాణ ! ముకుందపాదతులసీం మూర్ధన్ ! నమాధోక్షజమ్.

16

హేలోకాః! శృణుత ప్రసూతిమరణవ్యాధేశ్చికిత్సామిమాం
యోగజ్ఞాః సముదాహరన్తి మునయో యాం యాజ్ఞవల్క్యాదయః,
అంతర్జ్యోతిరమేయమేకమమృతం కృష్ణాఖ్యమాపీయతాం
తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణ మాత్యన్తికమ్.

17

హేమర్త్యాః ! పరమం హితం శృణుత వో వక్ష్యామి సంక్షేపతః
సంసారార్ణవ మాపదూర్మిబహుళం సమ్యక్రవిశ్య స్థితాః,
నానాజ్ఞానమపాస్య చేతసి నమో నారాయణాయేత్యముం
మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్తయధ్వం ముహుః.

18

పృథ్వీ రేణురణుః పయాంసి కణికాః ఫల్గుః స్ఫులింగో లఘుః
తేజో నిశ్శ్వసనం మరుత్తనుతరం రంధ్రం సుసూక్ష్మం నభః,
క్షుద్రా రుద్ర పితామహప్రభృతయః కీటాః సమస్తాః సురాః
దృష్టే యత్ర స తావకో విజయతే భూమావధూతావధిః.

19

బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రైః సరోమోద్గమైః
కంఠేన స్వరగద్గదేన నయనే నోధీర్ణ బాష్పాంబునా,
నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాది నాం
అస్మాకం సరసీరుహాక్ష ! సతతం సంపద్యతాం జీవితమ్.

20

హే గోపాలక ! హే కృపాజలనిధే ! హే సింధుకన్యాపతే !
హే కంసాంతక ! హే గజేంద్రకరుణాపారీణ ! హే మాధవ !
హే రామానుజ ! హే జగత్రయగురో ! హే పుండరీకాక్ష ! మాం
హే గోపీజననాథ ! పాలయ పరం జానామి న త్వాం వినా.

21

భక్తాపాయభుజంగగారుడ మణి స్త్రైలోక్యరక్షామణిః
గోపీలోచనచాతకాంబుదమణిః సౌందర్యముద్రామణిః,
యః కాంతామణిరుక్మిణీఘనకుచద్వంద్వైకభూషామణిః
శ్రేయో దేవశిఖామణిర్దిశతు నో గోపాల చూడామణిః.

22

శత్రుచ్ఛేదైకమంత్రం సకలముపనిషద్వాక్యసంపూజ్య మంత్రం
సంసారోత్తారమంత్రం సముపచితతమస్సంఘ నిర్యాణమంత్రమ్,
సర్వైశ్వర్యైకమంత్రం వ్యసనభుజగసందష్టసంత్రాణమంత్రం
జిహ్వే ! శ్రీకృష్ణమంత్రం జప జప సతతం జన్మసాఫల్యమంత్రమ్.

23

వ్యామోహప్రశమౌషధం మునిమనోవృత్తిప్రవృత్తా ్యషధం
దైత్యేంద్రార్తికరౌషధం త్రిభువనీ సంజీవనైకౌషధమ్,
భక్తాత్యంతహితౌషధం భవభయప్రధ్వంసనైకౌషధం
శ్రేయఃప్రాప్తికరౌషధం పిబ మనః ! శ్రీకృష్ణదివ్యౌషధమ్.

24

ఆమ్నాయాభ్యసనాన్యరణ్యరుదితం వేదవ్రతాన్యన్వహం
మేదశ్ఛేదఫలాని పూర్తవిధయః సర్వే హుతం భస్మని,
తీర్థానామవగాహనాని చ గజస్నానం వినా యత్పద –
ద్వంద్వాంభోరుహసంస్మృతిర్విజయతే దేవస్సనారాయణః.

25

శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాఖ్యం
కేన ప్రాపుర్వాంఛితం పాపినో పి,
హా నః పూర్వం వాక్రవృత్తా న తస్మిన్
తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖమ్.

26

మజ్జన్మనః ఫలమిదం మధుకైటభారే !
మత్రార్థనీయమదనుగ్రహ ఏష ఏవ,
త్వద్భృత్యభృత్యపరిచారక భృత్యభృత్య –
భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ !

27

నాథే నః పురుషోత్తమే త్రిజగతామేకాధిపే చేతసా
సేవ్యే స్వస్య పదస్య దాతరి సురే నారాయణే తిష్ఠతి,
యం కంచిత్పురుషాధమం కతిపయగ్రామేశ మల్పార్థదం
సేవాయై మృగయామహే నరమహో ! మూకా వరాకా వయమ్.

28

మదన ! పరిహర స్థితిం మదీయే
మనసి ముకుంద పదారవిందధామ్ని,
హరనయన కృశానునా కృశో సి
స్మరసి న చక్ర పరాక్రమం మురారేః.

29

తత్త్వం బ్రువాణాని పరం పరస్మాత్
మధు క్షరంతీవ సతాం ఫలాని,
ప్రావర్తయ ప్రాంజలిరస్మి జిహ్వే !
నామాని నారాయణ గోచరాణి.

30

ఇదం శరీరం పరిణామపేశలం
పతత్యవశ్యం శ్లథసంధి జర్జరమ్,
కిమౌషధైః క్లిశ్యసి మూఢ ! దుర్మతే !
నిరామయం కృష్ణరసాయనం పిబ.

31

దారా వారాకరవరసుతా తే తనూజో విరించిః
స్తోతా వేదస్తవ సురగణో భృత్యవర్గః ప్రసాదః,
ముక్తిర్మాయా జగదవికలం తావకీ దేవకీ తే
మాతా మిత్రం బలరిపుసుతస్త్వయ్యతో న్యన్నజానే.

32

కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం
కృష్ణనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః,
కృష్ణాదేవ సముస్థితం జగదిదం కృష్ణస్య దాసో స్మ్యహం
కృష్ణ తిష్ఠతి సర్వమేతదఖిలం హేకృష్ణ ! రక్షస్వ మామ్.

33

తత్త్వం ప్రసీద భగవన్ ! కురు మయ్యనాథే
విష్ణో! కృపాంపరమకారుణికః కిల త్వమ్,
సంసార సాగర నిమగ్నమనంత ! దీనమ్
ఉద్దరు మర్హసి హరే ! పురుషోత్తమో సి.

34

నమామి నారాయణపాదపంకజం
కరోమి నారాయణపూజనం సదా,
వదామి నారాయణనామ నిర్మలం
స్మరామి నారాయణ తత్త్వమవ్యయమ్.

35

శ్రీ నాథ ! నారాయణ ! వాసుదేవ !
శ్రీ కృష్ణ ! భక్తప్రియ ! చక్రపాణే !
శ్రీ పద్మనాభాచ్యుత ! కైటభారే !
శ్రీ రామ ! పద్మాక్ష ! హరే ! మురారే !

36

అనంత ! వైకుంఠ ! ముకుంద ! కృష్ణ !
గోవింద ! దామోదర ! మాధవేతి,
వక్తుం సమర్ధో పి న వక్తి కశ్చిత్
అహో జనానాం వ్యసనా భిముఖ్యమ్.

37

ధ్యాయంతి యే విష్ణుమనంత మవ్యయం
హృత్పద్మమధ్యే సతతం వ్యవస్థితమ్,
సమాహితానాం సతతాభయప్రదం
తే యాంతి సిద్ధిం పరమాం చ వైష్ణవీమ్.

38

క్షీరసాగరతరంగశీకరా సారతారకిత చారుమూర్తయే,
భోగిభోగశయనీయశాయినే, మాధవాయ మధువిద్విషే నమః.

39

యస్య ప్రియౌ శ్రుతిధరౌ కవిలోకవీరౌ
మిత్రే ద్విజన్మ వరపద్మ శరావభూతామ్,
తేనాంబుజాక్షచరణాంబుజషట్పదేన
రాజ్ఞా కృతా కృతిరియం కులశేఖరేణ.

40

ఇతి శ్రీ ముకుందమాలా సంపూర్ణా

మరిన్ని స్తోత్రములు

Leave a Comment