Sai Bhakti Kusumalu In Telugu – సాయి భక్తి కుసుమాలు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. సాధారణ పాట అంతటా ఒకే టెంపోతో సాగిన శ్రావ్యమైన భక్తి పాటను గీతం అంటారు. అంగలో మార్పు, పునరవృతి, సంగతి వంటి అంశాలలో ఏ మార్పు గీతంలో ఉండవు. ఇవి సాధారణంగా 10/12 ఆవర్తనాలను కలిగి ఉంటాయి. గీతం మొత్తంలో ఖచ్చితమైన పల్లవి, అనుపల్లవి, చరణాలు అనే విభాగాలు లేవు. కొన్ని సందర్భాలలో గీతాలలో వీటిని మనం చూడవచ్చు. నిర్వచించిన విభాగాల కంటే కొన్ని గీతాలు ఎక్కువ విభాగాలను కలిగి ఉంటాయి (పల్లవి మొదలైనవి). ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సాయి భక్తి కుసుమాలు గురించి తెలుసుకుందాం…

Sai Bhakti Kusumalu Telugu

ప్రార్థన

విన్నవించుచుంటిని స్వామి వినయముగను
శతక మాలను కూర్చగ శరణు గోరి
నిన్ను తలచి యుంటిని మది నిండ నిల్పి
విఘ్నములను తొలగ సేయు విజయ సాయి.

1

శుభములొసగు మూలపుటమ్మ చూడవమ్మ
మహిమ గల తల్లి మొక్కెద మనసుతోడ
నీ కృపా కటాక్షమ్ముల నింపవమ్మ
యని, సరస్వతి వేడెద నయ్య సాయి

2

భక్తి కుసుమాలు

సుప్రభాత వేళాయెనో సుప్రకాశ
భానుడుదయించె పొద్దెక్కి బారెడయ్యె.
భక్త జనులెల్ల నిను చేరి భజన సేయ
పూజలను గొని దయ చూడ పూను సాయి

3

నిర్మల మనముతో పూజ నీకు సేయ
భక్తులెల్ల మందిరమున భజన లొసగ
పూలు పళ్ళతో దూప దీపాల తోడ
వచ్చి యుండిరి దీవించు భవ్య సాయి

4

భక్తు లెక్కడ నున్నను వరములిచ్చి
పాప సంచయమ్ములనన్ని పాపి వేయ
మాధవ నగరమందున మాని తముగ
షిరిడిని తలపింపనిట నిల్చితివి సాయి

5

పద్యమగ కోరిక పల్లవించ
ఆకుల పరిచయమ్ముతో నదియు పెరిగె
పూర్తి జేయుటకు దగిన స్ఫూర్తి నిచ్చి
నీల కంఠేశ శతకమ్ము నిలిచె సాయి

6

నా కలము కవితల నల్లి నీ కొసంగ
నిండు మనసుతో మనసులో నిలిచిపోయి
శతకము పరిపూర్తిగ సేయు శక్తి నొసగి
సాగ నివ్వుము సాంతమ్ము సాధు సాయి

7

తెలియ కుండెను నాకు నీ తీపి చెలిమి
చూడ కుండగ ఉండను సుందరాంగ
కనికరముతో నొసగితివి గంగధరుని
కూర్మితో నిల్చె మనసైన గురువు సాయి

8

పాల రాతి కందిన పుణ్య వరమదేదొ
మేను రూపముతోనిట మెరిసిపోయె
పూల కబ్బిన ఏనాటి పుణ్య ఫలమొ
నీదు మెడలోన దండగా నిలిచె సాయి

9

ఎందరెందరినో ధరణి ఎరిగి యుండె
తీరు తీరు రూపంబుల తీరు చూసి
మేలిమైనట్టి రూపుతో మెరియునట్లు
తనదు కళలతో నిను తీర్చ తలచె సాయి

10

దత్త రూపుడ మాపైన దయను చూపు
వరములిచ్చు దేవర మమ్ము వదల తగదు
కనులుగల్గిన అంధుల కరణి మేము
వెదకుచుంటిమి దారి చూపించు సాయి

11

ఇంత సృష్టికి మూలమై ఇలను చేరి
మమ్ము గాంచెడి గురువువు మాదుజనక
ఆలయమ్మున గురువారమందు జనులు
భక్తితో నిను గొలుతురు భవ్య సాయి

12

అవని నేలెడు ప్రభువర ఆదుకొనుము
నింగి నిండిన దైవమా నిలువ రమ్ము
అంద చందాల నాథుడ అందుకొనుము
భక్తి నొసగు పూజలనిల బాబ సాయి

13

వేములాడలో వెలసిన వేల్పు వీవ
భక్తి తోడ కొలుచు చుంటి పరమ శివుడ
ఇంటిలో ఇలవేల్పుగా ఇమిడి పోయి
మమ్ము చల్లంగ కాపాడు మహిత సాయి

14

తల్లి దండ్రులులేనట్టి తనయుడవట
ఆలు బిడ్డలు లేని విశ్వాంగుడవట
షిరిడి చేరిన పుణ్యాత్మ సిద్ధరూప
అందుకొనవయ్య పూజలనిందు సాయి

15

ఇంద్రపురి భాగ్యమదియేమొ ఇచట నీవు
హృదయ గోపురమున నిల్చి ముదముతోడ
అడిగినంతనే కరుణతో నరుగుదెంచి
భాగ్యమొసగుచు నుందువు బంధు సాయి

16

సద్గురుని లీల గాంచని చవట నేను
జన్మ నిచ్చితివెందుకు జనక నాథ
ఉన్నఫలమేమి జీవించి ఉండి నీదు
పాదముల జేర గాంచని బ్రతుకు సాయి

17

వింత వింతగ చూడకు విసుగు చెంది
నీకో నీవె మా నీడవనుచు
“నిండు మనసులో స్థిరముగా నిన్ను చేర్చి
కొలుచుచుందును పూజల గొనుము సాయి

18

ఆత్మ యందు నీవే పరమాత్మ నీవె
సూక్ష్మమందు మోక్షమొసగి చూడ నీవె
నీవు లేని చోటెక్కడ నిజము దెలియ
ఏది నీవు కనని అందమేది సాయి

19

జానకీరామ కళ్యాణ సమయమందు
మమ్ము నేలేటి దైవమ్ము మహిని బుట్టె
మాదు పాపాల కడుగగ మరల తండ్రి
నవమి నాడు జన్మించిన నవ్య సాయి

20

ఆలయమున నాలుగు వేళలందు నీకు
భక్తి భావన పెంపొంద పరమనిష్ఠ
భక్త జనులంత నీ నామ భజన సల్ప
హారతు లొసగ వచ్చినారయ్య సాయి

21

మరిన్ని భక్తి గీతాలు

Leave a Comment