Sri Madhava Nagar Sai Kshetram In Telugu – శ్రీ మాధవ నగర సాయి క్షేత్రము

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. భక్తి యోగం అనేది మనస్సును శుద్ధి చేసే, ఆత్మ అధ్యాత్మిక ప్రయత్నము. అనుష్ఠానాల్లో ప్రార్థన, భజన, ధ్యాన, పరమాత్మ సేవ మరియు ముక్తి సాధన ముందుగా ఉంటుంది. భక్తి యోగం యోగుడును ఆత్మశుద్ధి, సర్వోత్తమ ప్రమేయాలు మరియు ఆనందంతో ప్రాముఖ్యత ఇస్తుంది. ఈ రోజు మన వెబ్‌సైట్ నందు శ్రీ మాధవ నగర సాయి క్షేత్రము గురించి తెలుసుకుందాం…

Sri Madhava Nagar Sai Baba Kshetram

శ్రీ మాధవ నగర సాయి క్షేత్రము

సదానింబ వృక్షస్య మూలాధి వాసాత్
సుదా సావిణం విక్రమప్య ప్రియంతం
తరుం కల్ప వృక్షాధికమ్ సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ ।

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దివ్య మంగళ స్వరూపుడైన భగవానుడు సాయిబాబ రూపంలో శ్రీరామ నవమి పర్వదినమున ఈ అవనిపై అవతరించాడు. మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లాలోని కోపర్గాన్ సమీపాన గోదావరి తీరంలో గల షిరిడీలోని మసీదును కోవెలగా మలచుకొని కొలువైనాడు. ప్రాణుల పట్ల దయను కలిగియుండాలని, అందరి దైవం ఒక్కడేనని చాటి, కనులుండి చూడలేని లోకానికి వెలుగు దారిని చూపాడు. బాబా నివసించు మసీదులో ఎల్లప్పుడు ‘ధుని’ (హోమ గుండం)ని వెలిగించేవారు. ప్రతి అణువులో నిండియుండి ప్రతి ఇంటిలో పూజలందుకొంటున్న పరమేశుడు సాయి. ఆయన లీలలు తెలుపగ ఈ జీవితం చాలదు. వ్రాయడానికి ఎన్ని పుటలైనా సరిపోవు.

ఇందూరుకు 5 కి.మీ. దూరంలో ఇప్పుడు మాధవనగర్ సాయిబాబ దేవస్థానం ఉన్న స్థానంలో క్రీ.శ. 1930-35 సం॥ ప్రాంతంలో అంజయ్య అనే భక్తుడు రావిచెట్టు క్రింద బాబా ఫోటో పెట్టి ప్రతి నిత్యము భక్తి శ్రద్ధలతో పూజనాచరించేవాడు. ప్రతి గురువారము రోజున సాయి పల్లకితో ఒంటెద్దు బండిపై ఇందూరు పరిసర ప్రాంతాలలో భిక్షాటన చేసేవాడు. క్రీ.శ. 1945-55 సం॥ ప్రాంతంలో ద్వారకామాయిని ఏర్పాటు చేసి షిరిడీలో మాదిరిగా ‘ధుని’ని వెలిగించేవారు.

అలా అంజయ్య అనే భక్తుడు సాయినాథుని సేవ చేస్తున్న రోజులలో 1962-63 సం॥ ప్రాంతంలో నవీపేట్ వాస్తవ్యులు శ్రీ కిష్టాపురం బాలాగౌడ్ గారు ఈ దారి వెంట ప్రయాణిస్తూ తన వాహనం చెడిపోగా ఆ రాత్రి ఇక్కడే బస చేశారు. ఆ రాత్రి సాయినాథుడు అంజయ్య, బాలాగౌడ్ గార్లకు స్వప్నంలో కనిపించి తనకు ఆలయము నిర్మించండని చెప్పినాడట.

జైపూర్ నుండి శ్రీ సాయిబాబ పాలరాతి విగ్రహాన్నితీసుకొని వచ్చి 21 రోజులు 101 మంది పురోహితులచే పూజా హోమాదులను జరిపించి క్రీ.శ. 1964 సం||లో బాబా విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి సాక్షాత్తు శ్రీ సాయినాథుని ద్వారా నవ నాణెములు పొందిన సాయి భక్తురాలు శ్రీమతి లక్ష్మీ బాయి షిండే గారు షిరిడీ నుండి వచ్చారు. 1972 సం॥లో ఈ దేవస్థానం రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. 6 ఎకరాల 30 గుంటల భూమిని శ్రీ సుబ్బారెడ్డి (మోస్రా) గారు ఆలయానికి విరాళముగా అందజేశారు. ఆలయ అభివృద్ధి కమిటి చైర్మన్లుగా పదవీ బాధ్యతలను చేపట్టేవారు, అభివృద్ధికై కృషి చేసినారు. ఆలయ సిబ్బంది, అర్చక . బృందము మరియు భక్తుల సహాయ సహకారములతో దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ ఉంది.

ఆలయ ప్రాంగణంలో శ్రీ గణపతి, శివుడు, నాగేంద్రుడు, సీతారామ లక్ష్మణులు, ఆంజనేయ స్వామి, శ్రీ పద్మావతీ శ్రీనివాసులు, దత్తాత్రేయులు, నవగ్రహాలు మొదలగు దేవతామూర్తులు దర్శనమిస్తారు. ఎల్లప్పుడు ద్వారకామాయిలో వెలుగొందే ‘ధుని’ లోని విభూతి సర్వరోగహరిణి, సర్వ పాప నివారిణి.

ఇక్కడి మందిరములో షిరిడీలో మాదిరిగా నాలుగు వేళలందు హారతులివ్వడం జరుగుతుంది. ఉ॥ 5-15 ని॥లకు కాకడ హారతి, మ॥ 12-00 గం॥లకు మధ్యాహ్న హారతి, సాయం సంధ్యా సమయంలో సంధ్యా హారతి, రాత్రి 10 గం॥లకు శేజారతి ఉంటుంది. ప్రతి గురువారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు నిండైన మనస్సుతో బాబాను కొలుస్తారు. ఇదే రోజున సాయంత్రం సాయికి పల్లకీ సేవ జరుగుతుంది.

సాయి జన్మదినమైన శ్రీరామనవమి, సద్గురుని శ్రీ గురు పౌర్ణిమ సాయినాథుని పుణ్యతిథియైన విజయదశమి (బాబా సమాధియైన రోజు), దత్త రూపుని శ్రీ దత్త జయంతి రోజులలో అశేష భక్తజనావళి తరలిరాగ ఘనముగా వేడుకలు జరుగుతాయి.

అష్టదిక్కులే అప్లైశ్వర్యములుగా, పంచభూతములే పంచభక్ష పరమాన్నములుగా మలచుకొన్న సచ్చిదానంద రూపునకు ఈ ఇందూరు అవని తన మదినే మందిరముగా చేయగా నిత్య పూజలతో మరో షిరిడీగా మారిపోయింది.

భక్తుల కొరకు నీటి సరఫరా, వసతిగృహాలు, వంట గదులు, స్నానపు గదులు, మరుగుదొడ్లు వంటి సౌకర్యములను కల్పించడం జరిగినది.

మరిన్ని పోస్ట్లు:

Leave a Comment