Sri Mallikarjuna Mangalasasanam In Telugu – శ్రీ మల్లికార్జున మంగళాశాసనమ్

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ మల్లికార్జున మంగళాశాసనమ్గురించి తెలుసుకుందాం…

Sri Mallikarjuna Mangalasasanam In Telugu Lyrics

శ్రీ మల్లికార్జున మంగళాశాసనమ్

ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే,
శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళమ్.

టీక. ఉమాకాంతాయ = పార్వతీరమణుఁడైనట్టియు, కాంతాయ = మనోహరుఁడైనట్టియు, కామితార్థ = కోర్కెలను, ప్రదాయినే = ఇచ్చువాఁడును, శ్రీ గిరీశాయ = శ్రీశైలనివాసియు, దేవాయ = దేవుఁడైన మల్లినాథాయ = మల్లి కార్జున ప్రభువుకొఱకు, మంగళం = శుభమగుఁగాక !

తా. ఉమాధవుఁడును, అతి మనోహరుఁడును, సర్వఫల ప్రదాతయు నగు శ్రీగిరి మల్లికార్జునస్వామికి మంగళమగుఁగాక !

సర్వమంగళరూపాయ శ్రీనగేంద్రనివాసినే,
గంగాధరాయ నాథాయ శ్రీగిరీశాయ మంగళమ్.

టీక. సర్వమంగళరూపాయ = సర్వమంగళ స్వరూపమును ధరించినట్టియు, శ్రీనగేంద్రనివాసినే = శ్రీ గిరియందు నివసించియున్నట్టియు, గంగా ధరాయ = గంగను ధరించినట్టియు, నాథాయ = లోక నాథుఁడైనట్టి, శ్రీ గిరీశాయ = శ్రీ శైలమల్లికార్జునునికొఱకు, మంగళమ్ = మంగళమగుఁగాక !

తా. సర్వమంగళరూపుఁడును, శ్రీగిరి నివాసియా, గంగాధరుఁడును, లోకనాథుఁడు నైన మల్లికార్జునుని కొఱకు మంగళమగుఁగాక !

సత్యానందస్వరూపాయ నిత్యానందవిధాయినే,
స్తుత్యాయ శ్రుతిగమ్యాయ శ్రీగిరీశాయ మంగళమ్.

టీక. సత్యానందస్వరూపాయ = సదానందస్వరూపుఁడును, నిత్యానంద విధాయినే = నిత్యానందమును గలుగఁజేయువాఁడును, స్తుత్యాయ = స్తోత్రముఁజేయఁదగిన వాఁడును, శ్రుతిగమ్యాయ = వేదవేద్యుఁడును, (అగు) శ్రీగిరీశాయ = శ్రీగిరిమల్లికార్జునకు, మంగళం = మంగళమగుఁగాక !

తా. సచ్చిదానందరూపధారియు, జీవులకు నిత్యానందమొసఁగు వాఁడును, వేదవేద్యుఁడైన శ్రీగిరి మల్లికార్జునునకు మంగళమగుఁగాక !

ముక్తిప్రదాయ ముఖ్యాయ భక్తానుగ్రహకారిణే,
సుందరేశాయ సౌమ్యాయ శ్రీగిరీశాయ మంగళమ్.

టీక. ముక్తిప్రదాయ = మోక్షము నిచ్చునట్టివాఁడును, ముఖ్యాయ = ప్రధానదైనమైనట్టియు, భక్తానుగ్రహకారిణే = భక్తులపై దయఁగల వాఁడును, సౌమ్యాయ = శాంతిప్రదుఁడైన, శ్రీగిరీశాయ = శ్రీగిరిప్రభువగు మల్లికార్జునునికొఱకు, మంగళమ్ = శుభముగలుగుఁగాక !

తా. మోక్షదాయకుఁడును, సర్వామరముఖ్యుఁడును, భక్తాను గ్రహప్రదుఁడును, సుందరాతి సుందరుఁడునై, శాంతిసౌఖ్య ములిచ్చు శ్రీగిరీశునకు మంగళమగుఁగాక !

మరిన్ని స్తోత్రాలు:

Leave a Comment