Sri Mallikarjuna Prapatti In Telugu – శ్రీ మల్లికార్జున ప్రపత్తిః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ మల్లికార్జున ప్రపత్తిః గురించి తెలుసుకుందాం…

Sri Saila Mallikarjuna Prapatti In Telugu Lyrics

శ్రీ మల్లికార్జున ప్రపత్తిః

జయ జయ జయ శంభో ! జంభభిత్పూర్వదేవ
ప్రణతపదసరోజద్వంద్వ ! నిర్ద్వంద్వ ! బంధో !
జయ జయ జయ జన్మస్థేమసంహారకార !
ప్రణయసగుణమూర్తే ! పాలయాస్మాన్ ప్రపన్నాన్.

టీక. శంభో! = ఓ శంకర! జంభభిత్ = ఇంద్రుఁడు, పూర్వదేవ = రాక్ష శులు మొదలగువారిచేత, ప్రణత = నమస్కరింపఁబడిన, పదసరోజిద్వంద్వ = పాదపద్మమాల జంటగలఁవాడా! నిర్ద్వంద్వ = ద్వంద్వభావము లేనివాఁడా!బంధో! = ఆపద్బాంధవుఁడా! జయ, జయ, జయ! = ముమ్మాటికి నీకు జయమగుఁగాక ! జన్మమ సంహారకార! = జన్మస్థితిలయకార = కుఁడైనవాఁడా! ప్రణయ సగుణమూర్తే! = భక్తియే గుణముగాఁగల మూర్తీ! జయ, జయ, జయ = ముమ్మాటికి జయము నొందుమ!, ప్రశన్నాన్ = నిన్ను శరణన్న, ఆస్మాన్ = మమ్ము, పాలయ= పరిపాలిం పుము !

తా. దేవాసురులచే నమస్కరింపఁబడు పాదపద్మయుగళము గలవాఁడా! అద్వైతమూర్తి ! ఆపద్బాంధవ! జన్మస్థితి లయ కారక ప్రపన్నులమగు మమ్ము పాలింపుమ ! నీకు జయ మగుఁ గాక !

వధూముఖం వల్గదపాంగరేఖం
అఖండితానందకరప్రసాదమ్,
విలోకయన్ విస్ఫురదాత్మభావ
స్స మే గతిశ్శ్రీగిరిసార్వభౌమః.

టీక. వల్గదపొంగరేఖం = ఏటవాలుగనున్న క్రీగంటి రేఖలఁ గలిగినట్టిదగ్గు, వధూముఖం = తన కాంతాముఖమును, అఖండితానందకర ప్రసాదం = అమితానందానుగ్రహము గలుగునట్లుగా, విలోకయన్ = చూచుచు, విస్ఫురదాత్మభావః = ప్రకాశించు నాత్మస్వరూపముగానున్న, సః = ఆ, శ్రీగిరిసార్వభౌమః = శ్రీశైలసార్వభౌముఁడైన శివుఁడు, మే = నాకు, గతిః = దిక్క గుఁగాక !

తా. క్రీఁగన్నులఁజూచుచున్న ఆత్మకాంతాముఖము నమితా నందానుగ్రహములతోఁ జూచుచు నాత్మస్వరూపియై ప్రకాశించు నా మల్లికార్జున ప్రభువు నాకు గతియగుఁగాక!

కురంగపాణిః కరుణావలోకః
సురోత్తమశ్చంద్రకళావతంసః,
వధూసహాయస్సకలేష్టదాతా
భవత్యసౌ శ్రీగిరిభాగ్యరాశిః.

టీక. కురంగపాణి = లేడిని చేతియందుఁగలవాఁడును, కరుణావలోకః = దయా వీక్షణములు గలవాఁడును, సురోత్తమః = దేవతలలో నుత్తముఁడును, చంద్రకళావతంసః = చంద్రకళను శిరోమణిగ ధరించినవాఁడును, వధూసహాయః = వామభాగార్ధమున నాఁడుతోఁడుగలవాఁడును, అగు, అసౌ = ఈ, శ్రీగిరిభాగ్యరాశిః = శ్రీశైలేశ్వరుఁడు, సకలేష్టదా = సమస్తాభీష్టము లిచ్చువాఁడు, భవతి = అగుచున్నాఁడు.

తా. దేవోత్తముఁడు నర్ధనారీ రూపుఁడగు చంద్రకళాశేఖరుడు తేడి నొకచేతథరించి దయారస మొలుకు చూపులతో నీ శ్రీశైల వాసుఁడుగా నుండెను, అట్టి యీ దేవుఁడు మాకు సకలాభీష్టము లొసఁగుగాక !

Sri Saila Mallikarjuna Prapatti In Telugu

సంధ్యారంభవిజృమ్భితం శ్రుతిశిరస్థ్సానాంతరాధిష్ఠితం
సప్రేమభ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితమ్,
భోగీంద్రాభరణం సమస్తసుమనఃపూజ్యం గుణావిష్కృతం
సేవే శ్రీగిరి మల్లికార్జున  మహాలింగం శివాలింగితమ్.

టీక. సంధ్యారంభ = సంధ్యానట నారంభ సమయమునందు, విజృంభితమ్ = ప్రకటితమైనట్టియు; శ్రుతిశిరస్థాన = ఉపనిషత్ప్రదేశములయొక్క, అంతర = నడుమ, ఆధిష్ఠితం = నిండియున్నట్టియు, సప్రేమ = ప్రీతితో గూడిన, భ్రమరా = భ్రమరాదేవితో, అభిరామం = మనోహరమైనట్టియు, అసకృత్ = మాటిమాటికి, సద్వాసనా = సువాసనచే, శోభితం = ప్రకాశించునట్టియు, భోగీంద్రాభరణం = సర్పరాజాభరణముల గల్గినట్టియు, సమస్తసుమనఃపూజ్యం = పండితుఅందఆకు (ఎల్లదేవతలకు) పూజ్యం = పూజింపఁజగినట్టియు, గణావిష్కృతమ్ = సత్త్వరజోగుణ ములచేఁ బ్రకటిత మైనదియు, శివాలింగితం = పార్వతిచే నాలింగితమైన, శ్రీశైలమల్లికార్జున మహాలింగం = శ్రీ శైలమల్లికార్జున మహాలింగమును, సేవే = సేవించుచున్నాను.

తా. సంధ్యానటన విజృంభితమును, ఉపనిషత్సం వేద్యమును, భ్రమరాంబా ప్రేమాభిశోభితమును, సగుణనిర్గుణోపేతమును, శేషాహిభూషితమును, సర్వదేవతాపూజ్యమును పార్వతీప్రియమైన శ్రీగిరి మల్లికార్జున లింగమును నేను. సేవించుచున్నాను.

యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖీ
వ్యక్తాత్మా పరిపాలనాయ జగతామాప్తావతారస్థితిః,
దుష్టధ్వంస-సదిష్టదానవిధయే నానాసనాధ్యాసినీ
శ్రీశైలాగ్రనివాసినీ భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ.

టీక. యా = ఏ దేవి, సచరాచరస్య = స్థావరజంగమాత్మకమైన, జగతః = ప్రపంచమానకు, మూలం = ప్రథానమైనదో (ప్రకృతియైనదో) పుంసః = ఆదిపురషుఁడైన యీశ్వరునకు, పురాణీ = ప్రాచీనమైన, సఖీ = చెలికత్తియయో, వ్యక్తాత్మా = ఆకారముతోఁ బ్రకటితమైనదో, జగ తాం = లోకములయొక్క, పరిపాలనాయ= రక్షణమకొఱకు, ఆప్తావ తారస్థితిః = పొందఁబడిన జన్మలంగలదో, దుష్టధ్వంస = దష్టులనాశ మొనర్చిట, సత్ = నుఁచివారలకు, ఇష్టదాన = అభీష్టములిచ్చుటయను, విధయే = పనికొఱకు, నానాసనాధ్యానినీ = శ్రీ గిరిశిఖరమున నివసించిన, భ్రామరీ = ఆ భ్రమరాఁబిక, మే నాకు, మే నాకు, శ్రేయస్కరీ = మంగళప్రదురాలు, భవతు = ఆగుఁగాక !

తా. ఏ దేవి చరాచరజగత్తున కంతటికి మూలప్రకృతియో, పురాణపురుషుఁడై న యీశ్వరునకే దేవి పట్టపురాణియో, లోకుల సనుగ్రహింప నేదేవి రూపమును ధరించినదో, దుష్ట సంహారము, శిష్టరక్షణ మొనర్చుచు సర్వాభీష్టములను భక్తుల కనేక స్థలములనుండి యొసంగుచున్నదో ఆ శ్రీగిరి భ్రమరాఁబిక నాకు శుభప్రదురాలగుఁగాక !

యత్తేజః పరమాణురేతదఖిలం నానాస్ఫురన్నామభిః
భూతం భావి భవచ్చరాచరజగద్ధత్తే బహిశ్చాంతరే,
సా సాక్షాత్ భ్రమరాంబికా శివసఖీ శ్రీశైలవాసోత్సుకా
దిశ్యాదాశ్రితలోకకల్పలతికా శ్రేయాంసి భూయాంసి నః.

టీక . ఏతత్ = ఈ, ఆఖిలం = సమస్తజగత్తు, యత్తేజః పరమాణుః = ఏ దేవి యొక్క తేజో రూపపరమాణువో, ఏతత్ = ఈ భూతం, భావి, భవత్ = జరిగినది (పుట్టినది) భావి = పుట్టఁబోవుంది, భగత్ = జరుగుచున్న, చరాచరజగత్ = స్థావరజంగమాత్మళమగు ప్రపంచమును నానాస్ఫురన్నా మభిః = తేజోవంతములగు ననేక నామములతో, ఆంతరే = లోపలను, బహిశ్చా = వె· పలను, ధత్తే = ఏ దేవి ధరించుచున్నదో, సా = ఆ, శివసఖీ = శివప్రియము, శ్రీ శైలవాసోత్సుకా = శ్రీ శైలశిఖర వాసమందు వేడ్కఁ గలదియు, ఆశ్రితలోక కల్పలతికా = ఆశ్రితజనమునకుఁ గల్పవృక్షమువంటిదైన, సాక్షాత్ప్రమరాంబికా = ప్రత్యేక్ష భనురాంబిక, సః = మాకు, భూయాంని = అనేకములగు, శ్రేయాంసి = శుభములను, దిశ్యాత్ = ఇచ్చునుగాక !

తా. ఏ జగదంబికయొక్క తేజోవిశేషమే యీ చరాచర ప్రపంచరూపమో, భూత భవిష్య ద్వర్తమాన సర్వ ప్రపంచము నేదేవి యనేకరూప నామములతో ధరించుచున్నదో, ఆ శ్రీశైలవాసిని యగు భ్రమరాంబిక మాకు శుభము లొడఁ గూర్చుఁగాక !

శరణం తరుణేందుశేఖరశ్శరణం మే గిరిరాజకన్యకా,
శరణం పునరేవ తావుభౌ శరణం నాన్యదుపైమి దైవతమ్.

టీక. మే = నాకు, తరుణేందుశేఖరః = బాలచంద్ర శేఖరుఁడు, శరణం = రక్షకుఁడు; గిరిరాజకన్యకా = హిమవత్పు తియగు పార్వతి, మే = నాకు, శరణం = రక్షణము. తౌ = ఆ, ఉభౌపునః = పార్వతీపరమేశ్వరు : లిరువురును, శరణ మేవ = రక్షకులేయగుదురుగాక! ఆన్యత్ = ఇతరమగు, (ఈ పార్వతీపర మేశ్వరులకంటే) దైవతం = దైవమును, శరణం = రక్షణను, నోప్రేమి = పొందను,

తా. నాకా చంద్రకళావతంసుఁడు, శ్రీగిరి భ్రమరాంబికయు రక్షకులగుదురు గాక! ఆ యుభయమునకున్న నితరదైవ మెద్దియు నాచే శరణ మనఁబడ కుండుఁగాక!

మరిన్ని ప్రపత్తులు:

Leave a Comment