Sri Mallikarjuna Suprabhatam In Telugu – శ్రీ మల్లికార్జున సుప్రభాతమ్

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. శ్రీ మల్లికార్జున సుప్రభాతం ఒక తెలుగు భక్తి గీతంగా తెలుగు వారు ప్రధానంగా పాడే భక్తి సంగీత క్రియలలో ఒకటి. ఈ సుప్రభాతం మల్లికార్జున స్వామిని స్తుతించడానికి సమర్థమైనది. ఈ గీతం భక్తులకు మాత్రమే కాదు, ప్రత్యేకంగా తెలుగు సాంస్కృతిక వ్యవహారాలలో ప్రచురించబడుతుంది. అది భక్తి, ఆధ్యాత్మికత మరియు సాంస్కృతిక సమృద్ధికి ప్రధాన పాత్రని ప్రదర్శిస్తుంది.

శ్రీ మల్లికార్జున స్వామి సుప్రభాతం

“సు-ప్రభాతము” అనగా “మంచి ఉదయం” అని అర్ధం. హిందూ పూజా విధానాలలోను, ప్రత్యేకించి అయ్యప్ప ఆచార పరంపరలోను, భగవంతుని పూజామూర్తికి అనేకమైన సేవలు (షోడశోపచారములు) నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇలాంటి సేవలలోనిదే సుప్రభాత సేవ. ఆ సుప్రభాత సేవా సమయంలో చేసే కీర్తననే “సుప్రభాతం” అని అంటారు.

Sri Srisaila Mallikarjuna Suprabhatam

శ్లో. ప్రాతస్స్మరామి గణనాథమనాథబంధుం
సిందూర పూరపరిశోభితగండయుగ్మమ్,
ఉద్దండవిఘ్నపరిఖండనచండదండ
మాఖండలాదిసురనాయకబృందవంద్యమ్.

టీక. ఆనాథబంధుమ్ = దిక్కు లేని వారికి బంధువైనట్టియు; సిందూర పూర పరిశోభిత గండయుగ్మమ్ = చంది కమను శోభనద్రవ్యము యొక్క సమూ హముచేఁ బ్రకాశించెడి చెక్కిళ్లు గలవాఁడును. ఉద్దండ… దండమ్:— ఉద్దండ = గొప్పవైన; విఘ్న = ఆంతరాయముల యొక్క; పరిఖండన = విచ్ఛేదమందు; చండదండమ్ = తీక్ష్ణ శాసనముగలవాఁడును; ఆఖండల… వంద్యమ్:— ఆఖండలాది = ఇంద్రుఁడు మొదలగు, సురనాయక = దేవ శ్రేష్ఠులయొక్క, బృంద = సమూహముచే, వంద్యమ్ = నమస్కరింపఁ బడువాఁడునగు, గణనాథం = ప్రమథగణనాయకుఁడగు వినాయకుని; ప్రాతః = ఈ ప్రాతః కాలమున, స్మరామి = నేను తలఁచుచున్నాను.

తా. దీన బంధువును, చందిరపుఁ గాంతి చే చెలువొందు గండ స్థలములు గల యేనిక మోమువాఁడును, విఘ్నము లెంత లెంతవైన క్షణములోఁ బ్రచండ శాసనమున నణఁచి వేయు వాఁడును, ఇంద్రాది దేవవంద్యుఁడునగు గణపతిని ఈ సుప్ర భాతము నిర్విఘ్నమగుట కీ ప్రాతఃకాలమున మొదట నేను మనస్సులో స్మరించుకొనుచున్నాను.

కళాభ్యాం చూడాలంకృతశశికళాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే,
శివాభ్యామస్తీకత్రిభువనశివాభ్యాం హృది పున
ర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియమ్.

టీక. కలాభ్యాం = చతుష్షష్టి (64) కళలుగలవారును; (కలిఃకామధేనుః అనుటచే కలి ఛాతూత్పన్నమైన కలయనుదాని కనేకార్థములుగలవు; వానిని వివరింప విస్తారమగును) చూడాలంకృత = శిరసునం దలంకరించు కొనఁబడిన, శశికలాభ్యాం = చం ద్రకళ గలవారును; నిజతపః = ఒకరి కొఱ కొకరు చేసికొనిన తపస్సు యొక్క, ఫలాభ్యాం = ఫలముగల వారును, భక్తేషు = భక్తులమీఁద, ప్రశటిత ఫలాభ్యాం = విశదపఱచిన ఫలముగలవారును; అస్తోక… శివాభ్యాం:- అస్తోక = గొప్పదైన, త్రిభు వనశివాభ్యాం = ముల్లోకములకు శుభమునొసఁగువారును; భవాభ్యాం = కారణజన్ములైనట్టియు, ఆనంద…. అనుభవాభ్యాం _ ఆనంద = ఆనంద ముచే, స్ఫురత్ = ప్రకాశితమైన, అనుభవాభ్యాం = అనుభూతిగల వారిను, ఆగు-శివాభ్యాం = పార్వతీ పరమేశ్వర దంపతుల కొఱకు, మే = నాయొక్క; హృదిపుః = హృదయమందైతే; ఇయం = ఈ, నతిః = నమస్కారము; భవతు = ఆగుగాక !

తా. చతుష్షష్టి కళాస్వరూపులును, చంద్రకళాధరులును, వర స్పర తపఃఫల సంపాదితులును, భక్తతతి కభీష్టదాయకు లును, ముల్లోకములకు శుభములొసఁగువారును, కారణ జన్ములును, నిత్యానందగోచరులును పార్వతీవర మేశ్వరు లకు నా మనస్సులో మ్రొక్కులిడుదును.

నమస్తే నమస్తే మహాదేవ! శంభో!
నమస్తే నమస్తే దయాపూర్ణసింధో!
నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో!
నమస్తే నమస్తే నమస్తే మహేశ.

టీశ. మహాదేవ! = దేవతల కెల్లదేవుఁడవైనవాఁడా | శంభో! = సుఖమును గల్గించువాఁడా! తే=నీకొఱకు, నమః = నమస్కారము – తే = నీకొఱకు, నమః = నమస్కారము, దయాపూర్ణసింధో = దయతో నిండిన సముద్రుఁడా ! నమస్తే నమస్తే = నీకు మరల మరల నమస్కారము. ప్రపన్నాత్మబంధో! = శరణన్నవారి కాత్మబంధువైనవాఁడా! నమస్తే నమస్తే = నీకు నమస్కారము. మహేశ్ ! ఓయీ! లోకమంతటిని శానించు ప్రభువా! నమస్తే, నమస్తే, నమస్తే = నీకు ముమ్మాటికి నమస్కారములు.

తా. ఓయీ! మహా దేవ! శంభో! దయాసాగర! శరణార్తిహర ! మహేశ్వర ! నీకు పదే పదే నేను నమస్కరించు చున్నాను.

శశ్వచ్ఛ్రీగిరిమూర్ధని త్రిజగతాం రక్షాకృతౌ లక్షితాం
సాక్షాదక్షతసత్కటాక్షసరణిశ్రీమత్సుధావర్షిణీమ్,
సోమార్ధాంకితమస్తకాం ప్రణమతాం నిస్సీమసంపత్ప్రదాం
సుశ్లోకాం భ్రమరాంబికాం స్మితముఖీం శంభోస్సఖీం త్వాం సుమః.

టీక. త్రిజగతాం = ముల్లోకములకు, రక్షాకృతిం = రక్షణాకారమును, శశ్వత్ = ఎల్లప్పుడు, శ్రీగిరిమూర్ధని = శ్రీశైలపర్వత శిఖరమందు, లక్ష్మీతాం = కనబఱచునట్టిదియు, సాక్షాత్ = ప్రత్యక్షముగ, అక్షత = తఱుఁగని, సత్కటాక్ష = అనుగ్రహవీక్షణముల యొక్క, సరణి = మార్గముచే, శ్రీమత్ = శోభతో గూడిన, సుధావర్షిణీమ్ = అమృతమును వర్షించునదియు, సోమ… మస్తకాం :- సోమార్ధ = చంద్రకళ చే, అం కిత = గుర్తుగానున్న, మస్తకాం = శిరస్సును గలిగినదియు. ప్రణమతాం = తనకు నమస్కరించువారలకు, నిస్సీమసంపత్ప్రదాం = మితిలేని సంపద నిచ్చునదియు, సుశ్లోకాం = మంచి వారిచేఁ గొనియాడఁబడునదియు, స్మితముఖీం = చిఱునవ్వుగల ముఖముఁ గలిగినదియు, శంభోః = శంకరునకు, సఖీం = ప్రియురాలైన, భ్రమరాంబికాం = భ్రమరాంబ యను పేరుగల, త్వామ్ = నిన్నును, నుమః = నమస్కరించుచున్నాము.

తా. లోకరక్షణమునకై శ్రీశైలశిఖరమున నెల్లప్పుడు నాకారమును గల్గియున్నట్టియు, అక్షయము నమృత సమ్మితమైన చూపులను భక్తులపై నెఱపునదియు, చంద్రరేఖా వతంసయు, మితి లేని సంపదల నాశ్రితులకిచ్చుచు సుజనులచే నుతింపఁబడునదియు శివునర్ధాంగియు భ్రమరాంబ. యను నామముగల నిన్నును స్తోత్రించుచున్నాము.

మాతః! ప్రసీద, సదయా భవ, భవ్యశీలే !
లీలాలవాకులితదైత్యకులాపహారే !
శ్రీచక్రరాజనిలయే ! శ్రుతిగీతకీర్తే !
శ్రీశైలనాథదయితే ! తవ సుప్రభాతమ్.

టీక. మాతః! = ఓతల్లీ!, ప్రసీద = ఆనుగ్రహింపుము; భవ్యశీలే! = మంగళ స్వభావము గలదాన! సదయా = దయతో ఁగూడినదానవు, భవ = అగుము; లీలా…. హారే!: – లీలాలవ విలాసలేశముచేతనే, ఆకలిత చూడఁబడిన, దైత్యకుల = రాక్షస వంశమును ఆపహారే = నాళన మొందించినదాన! శ్రీ చక్రరాజనిలయే ! = ఉత్తమమగు శ్రీచక్రము నాధారముగఁజేసికొనినదాన!, శ్రుతిగీతకీర్తే! = వేదముల చేఁ గీర్తింపఁ బడిన కీర్తిగలదాన! శ్రీ శైలనాథదయితే ! = శ్రీశైలపతికి ప్రియురాల నగునో భ్రమరాంబ! తవ నీకు, సుప్రభాతమ్ = సుఖమయమైన యుదయమగుఁ గాక !

తా. ఓ తల్లి! నీవు మంగళమగు మనస్సుగలదానవు; కృపా వతివి, కావున మమ్మనుగ్రహింపుము; శ్రీ చక్ర ము సధిష్ఠించి యొక్కసారి విలాసమున దుష్టరాక్షసులఁజూచి వారినంతమొందించిన దాన ! వేదవాక్కులచే సుప్రతిష్ఠిత మగు కీర్తి గలదాన! శ్రీశైలనాథార్ధదేహ భాగినియగు నో భ్రమరాంబా దేవి! నీకిది సుప్రభాతమగుఁగాక !

శంభో ! సురేంద్రనుత ! శంకర ! శూలపాణే !
చంద్రావతంస ! శివ ! శర్వ ! పినాకపాణే !
గంగాధర ! క్రతుపతే ! గరుడధ్వజాప్త !
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్.

టీక. శంభో = సుఖమును గల్గిచువాఁడా! సురేంద్రనుత = ఇంద్రునిచే సుతిఁపఁబడువాఁడా ! శంకర! = మంగళముల నొనరించువాఁడా ! శూలపాణే = శూలాయుధముమ హస్తమందు గలవాఁడా! చంద్రావ తెంస = చంద్రుని శిరసున ధరించినవాఁడా! శివ! = మంగళ మగు రూపముగలవాడా! శర్వ సర్వస్వరూపుఁడా! పినాకపాణే = పినాకమను పేరుగల ధనస్సును చేతియందుఁ గలవాఁడా! గంగాధర! = గంగను ధరించినవాఁడా! శ్రితుపతే = యజ్ఞమున అధిపతియైనవాఁడా!, గరుడధ్వజ = విష్ణువునకు, ఆప్త = ప్రియమైనవాఁడా! శ్రీ మల్లికారున = విభో! = శోభితో గూడిన ఓ మల్లి కార్డు నేశ్వర! తవ = నీకు, సుప్రభా తమ్ = సుఖరుగు ప్రణాతమగుఁ గాక !

తా. ‘శఁభో’ అనునదాదిగా ఁగల పై శ్లోకములోఁ జెప్పబడిన పదునొకండు నామములతో గూడిన యో రుద్రుఁడా! (మల్లికార్జున!) నీ కీ యుదయము శుభ మైనదగుఁగాళ !

విశ్వేశ ! విశ్వజనసేవిత ! విశ్వమూర్తే !
విశ్వంభర ! త్రిపురభేదన ! విశ్వయోనే !
ఫాలాక్ష ! భవ్యగుణ ! భోగివిభూషణేశ !
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్.

టీక. విశ్వేశ ! = ప్రపంచమును శాసించువాఁడా! విశ్వజనసేవిత ! = ప్రపంచములోని జీవకోటిచే సేవించఁబడినవాఁడా!; విశ్వమూర్తే! ప్రపంచమే స్వరూపముగఁ గలవాఁడా!: విశ్వంభర! ప్రపంచభార మును మోయువాఁడా! త్రిపురి భేదః! = త్రిపురాసురులను భేదించిన వాఁడా!, విశ్వయోనే ! = ప్రపంచమునకుఁ గారణమైనవాఁడా!, ఫాలాక్ష! = నొసట మూఁడవకన్ను గలవాఁడా!, భవ్యగుణ! = శుభమగు గుణములు గలవాఁడా!, భోగి విభూషణేశ! = పర్పముల నాభరణము గాఁ గలశ్రభువా!, శ్రీ మల్లి కార్జున భో! = శోభాయుక్తుఁడవగు నో మల్లి కార్జునశ్రుభూ!, తవ = నీకు, సుప్రభాతమ్ = శోభనమగు ముదయకాల మగుఁ గాక !.

తా. ‘విశ్వేశ’ అనునది మొదలు తొమ్మిదినామముల ధరించిన ఓమల్లి కార్జున స్వామి! సీకీప్రభాతముశోభ వ మైనదగుఁగాక!

కళ్యాణరూప ! కరుణాకర ! కాలకంఠ !
కల్పద్రుమప్రసవపూజిత ! కామదాయిన్ !
దుర్నీతిదైత్యదళనోద్యత ! దేవ దేవ !
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్.

టీక. కల్యాణరూప! = మంగళమైన రూపముగలవాఁడా!; కరుణాకర! = దయానిధియైనవాఁడా!; కల్పద్రుమ….పూజితః :- కల్పద్రుమ = కల్పవృక్షముల సంబంధమగు, ప్రసవ = పుష్పములచే, పూజిత! = పూజింపఁబడువాఁడా !; కామదాయిన్ ! = కోరికలిచ్చువాఁడా !; దుర్నీతి…. ఉద్యత :- దుర్నీతి = దుర్నయులైన, దైత్య = రాక్షసులను, దళన = ఛేదించుటయందు; ఉద్యత! = సంసిద్ధుఁడా!; దేవదేవ! = దేవతల కెల్ల దేవుఁ డైన వాఁడా, శ్రీ మల్లికార్జున విభో ! = శోభాయుతుఁడ వగు నో మల్లికార్జునస్వామి! తవ = నీకు, సుప్రభాతమ్ శుభోదయ మగుఁ గాళ !

తా. ‘కల్యాణరూప’ అనునది మొదలు సప్తనామములతో శోభిల్లునో మల్లి కార్జునస్వామీ! నీకు శుభోదయమగుఁగాః !

గౌరీమనోహర ! గణేశ్వరసేవితాంఘ్రే !
గంధర్వయక్షసురకిన్నరగీతకీర్తే !
గండావలంబిఫణికుండలమండితాస్య !
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్.

టీక. గౌరీ మనోహర ! = పార్వతీ ప్రియుఁడా!; గణేశ్వర = ప్రమధగణ నాథునిచే, సేవిత = సేవింపఁబడుచున్న, ఆంఘ్రే! = పాదములు గల వాఁడ! గంధర్వ… కీర్తే! :- గంధర్వ = గంధర్వుల చేత, యక్ష= యక్షులచేత, కిన్నర = కిన్నరుల చేత (ఈమూఁడు రకములగు కులములు గల దేవతలు సంతోషమున గానము చేయుటలో ప్రవీణులు) గీత = కీర్తింపఁబడిన; కీర్తే! = యశస్సుగలవాఁడా!; గండావలంబి = గండ = స్థలముల వఱకు వ్రేలాడుచున్న; ఫణికుండల = పాముల వేడి చెవిపోగులతో, మండిత = ఆలంకరింపఁబడిన, ఆస్య = ముఖము గలవాఁడా!; శ్రీమల్లికార్జునవిభో! = శోభతోఁగూడిన, ఓ మల్లికార్జునస్వామి! తవ = నీకు, సుప్రభాతమ్ = శుభోదయమగుఁ గాక !

తా. ‘గౌరీ మనోహర’ అను నామ చతుష్టయముగల ఓ మల్లికార్జునస్వామీ! నీకు శుభోదయమగుఁగాః !

నాగేంద్రభూషణ ! నిరీహిత ! నిర్వికార !
నిర్మాయ ! నిశ్చల ! నిరర్గల ! నాగభేదిన్ !
నారాయణీప్రియ ! నతేష్టద ! నిర్మలాత్మన్ !
శ్రీ పర్వతాధిప ! విభో ! తవ సుప్రభాతమ్.

టీక. నాగేంద్రభూషణ! = వాసుకి, శేషుఁడు మొదలగు రాజసర్పములు భూషణముగఁ గలవాఁడా!, నిరీహిత = కోరికలు లేనివాడా! నిర్వికార! = జన్మాది షడ్వికారములు లేనివాఁడా!, నిర్మాయ = మాయా విరహితుఁడా! నిశ్చల! = స్థాణుస్వరూపుఁడా! నిరర్గల! = అవరోధము లేనివాఁడా! నాగ భేదిన్! = గజేంద్ర సంహారకుఁడా!, నారాయణీ ప్రియ! = నారాయణి యను పేరుగల శాంకరికి ప్రియుఁడైనవాఁడా!, నతేష్టదా! :- నత = నమస్కరించువారలకు, ఇష్టద = ఇష్టములనిచ్చువాఁడా! నిర్మలాత్మన్ :- నిర్మల = స్వచ్ఛమైన, ఆత్మన్ = దేహము గలవాఁడా! (శివుఁడు తెల్లనిదేహము గలవాఁడనుట) లేదా? పరిశుద్దాం తఃకరణము గలవాఁడా! శ్రీ పర్వతాధిప! = శ్రీ యను పేరుగల కొండపై నివసించు ప్రభూ!, విభో! = ఓ దేవ!, తవ = నీకు, సుప్రభాతమ్ = శుభోదయమగును గాక !

తా. ‘నా గేంద్రభూషణ’ అను నామము మొదలుకొని పదు నొకండు నామములతోఁ గూడిన యో శంకరా! నీకు శుభోదయ మగునుగాక!

Sri Srisaila Mallikarjuna Suprabhatam

సృష్టం త్వయైవ జగదేతరశేషమీశ !
రక్షావిధిశ్చ విధిగోచర ! తావకీనః,
సంహారశక్తిరపి శంకర ! కింకరీ తే
శ్రీ శైలశేఖరవిభో ! తవ సుప్రభాతమ్.

టీక. ఈశ = ఓ ప్రభువా ! ఏతత్ = ఈ, ఆశేషం = సమస్తరుగు, జగత్ = లోకముత్వయైవ = నీచేతనే, స్పష్టం = సృజింపఁబడినది. విధిగోచర ! = ఓయీ! అదృష్టరూపుఁడా!, రక్షావిధిశ్చ = లోకరక్షణ విధానమును, తావకీనః = నీ సంబంధమైనదే! శంకర! = ఓ శంకరుఁడా! సంహారశ క్తిరపి = లయ మొనర్చుశక్తియు, తే = నీకు, కింకరి = వళమైన సేవకురాలేగద? శ్రీశైల శేఖరవిభో! = శ్రీశైలపర్వతమందుండెడి యో దేవుఁడా! తవ = నీకు, సుప్రభాతమ్ = శుభోదయమగుఁ గాక!

తా. ఓ శ్రీశైల వాస! నీవు, ఈశ్వరుఁడవై లోకముల సృజిం చుచు విష్ణుస్వరూవుఁడవై లోకరక్షణభారమును నిర్వ హించుచు శివుఁడను నామమున లయక ర్త పై సర్వమును వహించిన యో శ్రీశైలవాస! శంకరా! నీకు శుభోదయ మగుగాక!

ఏకస్త్వమేవ బహుధా భవ ! భాసి లోకే
నిశ్శంకధీర్వృషభకేతన ! మల్లినాథ !
శ్రీ భ్రామరీప్రయ ! సుఖాశ్రయ ! లోకనాథ !
శ్రీ శైలశేఖరవిభో ! తవ సుప్రభాతమ్.

టీక. భవ! = ఓయీ! శంకరుడా!, త్వం = నీవు, ఏక ఏవ = ఒక్కఁడవే, లోకే = లోకమఁదు, బహుథా = అనేక రూపములతో, భాని = ప్రకాశించుచున్నావు, నిశ్శంకధీః = నిర్భయబుద్ధిగలవాఁడ వృషభకేతన = వృషభధ్వజముగలవాఁడా! మల్లినాథ! = మల్లీశ్వరుఁడా, శ్రీ భ్రామరీ ప్రియ = శ్రీ భ్రమరాంబాదేవికి ప్రియుఁడైనవాఁడా!. సుఖాశ్రయ! = సుఖమున కాశ్రయమైనవాఁడా!, లోకనాథ! = లోకులకుఁ బ్రభువైన వాఁడా!, శ్రీశైలశేఖరవిభో! = శ్రీ శైలరాజమున నుండెడి ప్రభువా!, తవ = నీకు, సుప్రభాతమ్ = శుభోదయమగు గాక !

తా. ఓయీ! భవుఁడా! నీ వొక్కఁడవే అనేక రూపములతో నీలోకమునఁ బ్రకాశించుతున్నావు. ‘నిశ్శంక ధీ’ అను నామము మొదలు ఆఱునామములతో నొప్పు శ్రీశైల వాస! నీకు శుభోదయమగుఁగాక!

పాతాళగాంగజలమజ్జననిర్మలాంగాః
భస్మతిపుండ్రసమలంకృతఫాలభాగాః,
గాయంతి దేవమునిభక్తజనా భవంతం
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్.

టీక. పాతాళ … అంగాః :- పాతాళ గాంగజల = పాతాళగంగలోని నీటి యందు, మజ్జన = స్నానముచేత, నిర్మల = పాపరహితమైన, అంగాః= అవయవములు గలిగినట్టియు, భస్మత్రిపుండ్ర = భూతితో మూడడ్డరేఖలంగా, సమలంకృత = అలంకరించుకొనఁబడిన, ఫాలభాగాః = నొసటి భాగముగలవారగు, దేవమునిభ క్తజనాః = దేవతలం, మునులు, భక్తజనులంను, భవంతం = నిన్ను, గాయతి = కీర్తించుచున్నారు. శ్రీ మల్లికార్జునవిభో! = కాంత్యు పేతుఁడవైన ఓ మల్లి కార్జునస్వామి! తవ = ఓ నీకు, సుప్రభాతమ్ = శోభనోదయమగుఁగాక!

తా. ఓ మల్లికార్జునస్వామి! దేవతలు, మునులు, భ క్తులు నందఱును బాతాళగంగను స్నానించి నిర్మలాంతః కర ణులై భస్మ త్రిపుండ్ర రేఖల నలంకృతమైన మోములతో వచ్చి నీ సన్నిధినుండి నిన్నుఁ గీర్తించుచున్నారు; నీ కీ ప్రభాతసమయము శుభమైనది; లెమ్ము.

సారస్వతాంబుయుతభోగవతీశ్రితాయాః
బ్రహ్మేశవిష్ణుగిరిచుంబితకృష్ణవేణ్యాః,
సోపానమార్గమధిరుహ్య భజంతి భక్తాః
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్.

టీక . సారస్వత = రసమ తోఁజెల వొందు, అంబు = ఉదఃముతో; యుత = కూడిన, భోగవతీ = పాతాళగంగయను నామమును, శ్రితాయాః = ధరించినట్టియు; బ్రహ్మ బ్రహ్మశిఖరము, ఈశ = ఈశ్వర శిఖరము, విష్ణుగిరి = విష్ణు శిఖరమును కూటత్రయము చే, చుంబిత = తాకఁబడుచున్న, కృష్ణవేణ్యాః = కృష్ణానది యొక్క, సోపాన మార్గం = మెట్లమార్గమును ఆధిరుహ్య = ఎక్కి, భక్తాః = నీ భక్తులు, భజంతి నిన్ను సేవించు చున్నారు. శ్రీ మల్లి కార్జునఁభో ! = ఓ మల్లి కార్జున దేవ! తవ= నీకు, సుప్రభాతమ్ = శుభోదయమగుఁ గాక!

తా. ఓ మల్లికార్జునస్వామి! నీ భ క్తులందఱును — బ్రహ్మవిష్ణు శివ నామములతోనున్న శిఖరములనంటి ప్రవహించు నదియు, కృష్ణానదీస్థాన విశేషమైనదియు, మధురోదశములతో నిండిన పాతాళగంగలో, (భోగవతి) స్నానముచేసి యచటినుండి నీయొద్దకువచ్చు సోపానమార్గములోనుండి నిన్ను సేవించుచున్నారు; నీ కీ ప్రభాతము సుప్రసన్న మగుఁగాక!

శ్రీ మల్లికార్జున మహేశ్వర సుప్రభాత
స్తోత్రం పఠంతి భువి యే మనుజాః ప్రభాతే,
తే సర్వ సౌఖ్యమనుభూయ పరానవాప్యం
శ్రీ శాంభవం పదమవాప్య ముదం లభంతే.

టీక. శ్రీ మల్లికార్జున = శ్రీయుతుడగు మల్లికార్జునుఁడైన, మ హేశ్వర = శివునియొక్క, సుప్రభాత = ప్రాతః కాలశోభను జెప్పునట్టి, స్తోత్రం = ఈ స్తవమును, ప్రభాతే = ప్రాతస్సమయమున, యే = ఏ, మనుజాః = మానవులు, భువి = భూలోకమందు, పఠంతి = పఠించుచున్నారో, తేజ వారు, సర్వసౌఖ్యం = అన్ని విధములగు సౌఖ్యమును అనుభూయ = అనుభవించి, పరానవాప్యం = ఈ సుప్రభాతపఠనము లేని వారు పొంద లేని, శ్రీ శాంభవం పదం = శ్రీ శంకర నివాసస్థాననుగు కైలాసమును, ఆవాస్య = పొంది, ముదం = సంతోషమును, లభంతే = పొండుచున్నారు.

తా. ఈ మల్లి కారున సుప్రభాతమును ప్రతి ప్రాతస్సమయు మున నే మానవులు శ్రద్ధతోఁ పఠింతురో వారీలోకమున సర్వసౌఖ్యము లనుభవించి చివరకు కైలాసమున కేగి సంతసింతురు.

Leave a Comment