Sri Ramadasu Keerthanalu 11-20 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

Sri Ramadasu Keerthanalu 11-20 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

ఈ పోస్ట్ లో శ్రీ రామదాసు గారి కీర్తనలు వేదములో అనేక సంగీత పారంపర్యాలు ఉన్నాయి.

11. కాఫీ ఆదితాళం

పల్లవి : చరణములే నమ్మితి నీదివ్య చరణములే నమ్మితి
వారధిగట్టిన భద్రాచలవరదా వరదా నీ దివ్య

॥చరణములే॥

ఆదిశేష నన్నరమర చేయకుమయ్యా నీ దివ్య

॥చరణములే॥

వనమున రాతిని వనితగచేసిన చరణము శరణము నీ దివ్య

॥చరణములే॥

పాదారవిందమే యాధారమని నేను పట్టితి పట్టితి నీ దివ్య

॥చరణములే॥

బాగుగా నన్నేలు భద్రాచల రామదాసుడదాసుడ దాసుడ దాసుడ

॥చరణములే ||

12. నాట ఖంజాతి ఏకతాళం

పల్లవి : జయ జానకీరమణ జయ విభీషణశరణ
జయ సరోరుహచరణ జయ తమోహరణ

||జయ||

జయ త్రిలోక శరణ్య జయభక్త కారుణ్య
జయవణ్య లావణ్య జయ సద్వరేణ్య

||జయ||

సకలలోక నివాస సాకేత పురవాస
అకలంక నిజహాస అబ్జహాస అబ్జముఖభాస

||జయ||

శుకమౌని నుతపాత్ర శుభరమ్య చారిత్ర
మకర కుండలవక్త్ర మహానీయగాత్ర

||జయ||

కమనీయ కోటీర కౌస్తుభాలంకార
కమలాక్ష రఘువీర కలుష సంహార

||జయ||

సమరరిపు జయధీర సకలగుణ గంభీర
అమల హృత్సంచార అఖిలార్తిహారా

||జయ||

రూపవర్జితమార రుచిర సద్గుణశూర
భూపదశరథ కుమార భూరియాభరణహర

||జయ||

పాపసంఘవి విధార పంక్తిముఖ సంహార
శ్రీపతే సుకుమార సీతావిహార

||జయ||

13. నాదనామక్రియ ఆదితాళం

పల్లవి : తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు
ప్రక్కతోడుగా భగవంతుడు మనచక్రధారియై చెంతనెయుండగ

చరణములు
మ్రుచ్చుసోమకుని మును జంపినయా
మత్స్యమూర్తి మన పక్షముండగను

॥తక్కువేమి మనకు॥

సురలకొరకు మందరగిరి మోచిన
కూర్మావతారుని కృప మనకుండగ

॥తక్కువేమి మనకు॥

దురాత్మునా హిరణ్యాక్షు ద్రుంచిన
వరాహమూర్తి మనవాడై యుండగ

॥తక్కువేమి మనకు॥

భూమి స్వర్గమును పొందగ గొలిచిన
వామనుండు మనవాడై యుండగ

॥తక్కువేమి మనకు॥

ధరలో క్షత్రియులను దండించిన
పరశురాముడు మనపాలిట నుండగ

॥తక్కువేమి మనకు॥

దశగ్రీవు మును దండించినయా
దశరథరాముని దయ మనకుండగ

॥తక్కువేమి మనకు॥

ఇలలో యదుకుల మందుదయించిన
బలరాముడు మన బలమైయుండగ

॥తక్కువేమి మనకు॥

దుష్టకంసుని ద్రుంచినట్టి
శ్రీకృష్ణుడు మనపై కృపతో నుండగ

॥తక్కువేమి మనకు॥

కలియుగాంతమున కలిగెడి దైవము
కలికి మనలను గావగ నుండగ

॥తక్కువేమి మనకు॥

రామదాసుని గాచెడి శ్రీమ
న్నారాయణు నెరనమ్మి యుండగ

॥తక్కువేమి మనకు॥

14. గౌళీ పంతు ఏకతాళం

పల్లవి : తలుపు తియ్యయ్య తానీషా
నీకియ్యెడ పైకము నియ్యవచ్చితిమయ్య

||తలుపు తియ్యయ్య||

ఫాలనేత్రుని తుమ్మిపూల పూజించిన
మేలుదొరవు నీవు మేలుకోవయ్యా

||తలుపు తియ్యయ్య||

నీలకంఠుని మల్లెపూల నర్చించిన
మేటి దొరవు నీవు మేలుకోవయ్య

||తలుపు తియ్యయ్య||

దీనుడైన రామదాసు పై నీవభి
మానముగను కృపబూని వేగముగ

||తలుపు తియ్యయ్య॥

15. ధన్యాసి ఆదితాళం

పల్లవి :
తారకమంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా
మీరినకాలుని దూతలపాలిటి మృత్యువుయని మదినమ్మన్నా

॥తారక॥

మచ్చికతో నితరాంతరంబుల మాయలలో బడబోకన్నా
హెచ్చుగ నూటయెనిమిది తిరుపతు లెలమితిరుగ పనిలేదన్నా

||తారక||

ముచ్చటగా నా పుణ్యనదులలో మునిగెడి పనియేమిటికన్నా
వచ్చెడి పర్వదినములలో సుడిపడుటయు మానక యుండన్నా

||తారక||

ఎన్ని జన్మములనుండి చూచినను ఏకోనారాయణుడన్నా
అన్ని రూపులైయున్న నాపరమాత్ముని నామము కథవిన్నా

||తారక||

ఎన్ని జన్మములజేసిన పాపము లీజన్మములో విడునన్నా
అన్నిటికిది కడసారి జన్మము సత్యంబిక పుట్టుకనున్న

||తారక||

నిర్మల మంతర్లక్ష్యభావము నిత్యానందముతో నున్న
కర్మంబులు విడి మోక్షపద్ధతిని కన్నుల జూచుచునున్న

||తారక||

ధర్మము తప్పక భద్రాధీశుని తనమదిలో నమ్మక యున్న
మర్మము దెలిపిన రామదాసుని మందిరమున కేగేచునున్న

॥తారక॥

16. కల్యాణి రాగము ఆదితాళం

పల్లవి : నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే
నను బ్రోవమని చెప్పు నారీశిరోమణి
జనకుని కూతురు జనని జానకమ్మ

॥నను||

ప్రక్కనచేరిక చెక్కిలినొక్కుచు
చక్కగ మరుకేళి జొక్కియుండు వేళ

॥నను||

లోకాంతరంగుడి శ్రీకాంత నినుగూడి
ఏకాంతముననేక శయ్యనున్న వేళ

॥నను||

అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు
నిద్రమేల్కొనువేళ నెలతరో బోధించి

॥నను||

17. ఆనందభైరవి ఆదితాళం

పల్లవి : పలుకే బంగారమాయెనా కోదండపాణి

॥పలుకే ||

చరణములు
పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి
కలలో నీ నామస్మరణ మఱవ చక్కనితండ్రి

॥పలుకే ||

ఇరువుగ నిసుకలోన బొరలిన యుడుతభక్తికి
కరుణించి బ్రోచితివని నెరనమ్మితి నిన్నేతండ్రి

॥పలుకే॥

రాతినాతిగజేసి భూతలమున ప్ర
ఖ్యాతిచెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి

॥పలుకే॥

ఎంత వేడిన గాని సుంతైన దయరాదు
పంతంబు సేయ నేనెంతటివాడను తండ్రి

॥పలుకే॥

శరణాగత త్రాణ బిరుదాంకితుడవు గావ
కరుణించి భద్రాచల వరరామదాసపోషక

॥పలుకే॥

18. యదుకుల కాంభోజి ఆదితాళం

పల్లవి : పాహిమాం శ్రీరామాయంటె పలుకవైతివి
నీ స్నేహమిట్టిదని నేచెప్పనో హోహో

॥పాహిమాం॥

ఇబ్బంది నొంది యాకరి బొబ్బ పెట్నింతలోనే
గొబ్బున గాచితివట నేనెంతో జాగు సేయక
నిబ్బరముతో నేనెంతో కబ్బమిచ్చి వేడుకొన్న
తబ్బిబ్బు చేసేదవు దామ అబ్బబ్బబ్బబ్బబ్బ

॥పాహిమాం॥

సన్నుతించు వారినెల్ల మున్నుదయతో బ్రోచితివని
పన్నగశాయినే నిన్నే విన్నవించితి
విన్నపము వినక యెంతో కన్నడజేసెదవు రామా
యెన్నటికీ నమ్మరాదు రన్నన్నన్నన్నన

||పాహిమాం॥

చయ్యన భద్రాద్రినిలయ స్వామివని నమ్మి నేను
వేయారు విధముల నుతిచేయసాగితి
ఈయెడను రామదాసుని కుయ్యాలించి ప్రోవకున్న
నీయొయ్యార మేమనవచ్చు నయ్యయ్యయ్యయ్యయ్యయ్యో

||పాహిమాం॥

19. పంతువరాళి ఆదితాళం

పల్లవి : రామనామము బల్కవే పాపపు జిహ్వ
రామనామము బల్కవే

॥రామనామము ||

రామనామము నీవు ప్రేమతో బల్కిన
స్వామి యెల్లప్పుడు కామితార్థములిచ్చు

॥రామనామము ||

మతిలేనివారలెల్లరు సీతాపతిని సతతము దలచినను
హితవున వారి పూర్వకృతములెల్ల మాన్పి
అతులిత సామ్రాజ్యానంత మొందజేయు

॥రామనామము ||

మారసుందరాకారుని వేసారకెపుడు
కోరి భజించుచుండ నీ భూరికృత
కిల్బిషదోషములన్నియు చేరనీయగొట్టిపారద్రోలేటిదగు

॥రామనామము॥

దోషములెల్ల బాపి వాసిగ ధరలో
రామదాసుని హృదయ నివాసుడైనసీతా

॥రామనామము॥

20. మధ్యమావతి ఆదితాళం

పల్లవి : రామానను బ్రోవరాగద నన్ను గన్న సీతా
భామామణికైన జాలిలేదా నామీద నీకు

॥రామా॥

ప్రేమ లేకుండుట మర్యాద రక్షింప భార
మే మీకులేదా భద్రాచలధామ సుంతైన నెవరు తలుపున నిలుచుకద

॥రామా॥

నీలోన జగములుండుగాద జగములోన లీలతో
నీవుందుగాద మీజాలిచేత మేలుగ నుండుట పరాకా ఎంతోవేడితి నిక

॥రామా॥

నానాటికెంతో సులభమున నీవను పెన్నిధానము దొరికెనుమాకు
చేసెనా ఎటులైన నినుమానానా కన్నులార పరదైవాలను
మ్రొక్కెదనా జరుగవచ్చినా నేనీ వాడగానా

॥రామా॥

ఈసమయంబున రామదాసపోషక చిద్విలాసభద్రాచలవాస
తెలిసి కృపజేసి రక్షింప ప్రయాస అనువర్ధనివాసా
గాసిమాన్పు శ్రీనివాస బ్రోవకుండుటిది బాసా

॥రామా॥

మరిన్ని కీర్తనలు:

Leave a Comment