Sri Sainatha Dandakam In Telugu – శ్రీ సాయినాథుని దండకం

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సాయినాథుని దండకం గురించి తెలుసుకుందాం…

శ్రీ సాయినాథుని దండకం

శ్రీసాయిబాబా! దయాసాంద్ర! త్రిమూర్త్యాత్మకా! శ్రీదత్త, శివ, రామకృష్ణ, మారుత్యాది దివ్యావతార స్వరూప! ఈ ధరిత్రిన్ భక్తులన్ రక్షింప లీలతో దేహమున్దాల్చి నీ పూజలన్, నీ సేవలన్, నీ నామ సంకీర్తనల్ జేయు భక్తాళికిన్,భక్తియున్, భుక్తియున్, ముక్తియున్ గూర్చి యావత్తులన్ బాపి, యోగంబు,క్షేమంబుజేకూర్చి రక్షించు దివ్యస్వభావా! నమస్కార మర్పింతు, లోకంబులో జాతిభేధాలు గల్పించు కొన్నట్టివేగాని సత్యంబుగా లేవులేవం చు భక్తాళికిన్ విశ్వప్రేమంబుజాటు చందబునన్ ప్రతిగ్రామంబులో విఫ్రిగే హంబులోజన్మమున్ గాంచి బాలుండవైయుండ, నీ తల్లిదండ్రుల్ ఫకీరొ క్కనింగాంచి నిన్నిచ్చివేయంగ అయిదేడు లా సాధుపోష్యంబులో నుండి, యా పిమ్మటన్ వెంకుసా పేరుతో నొప్పు నాదేశముఖ్యుండు, గోపాలరా యుండు,నిన్ చెంతకుజేర్చి సద్భోదనలే జేసి, జ్ఞానోపదేశంబుగావించి, నిన్నంపివేయంగ, నీ సంగతులీదేశమందెవ్వరున్ గాంచకుండగ సంచార మున్జేసి, యష్టాదశాబ్దంబులున్ బ్రాయమొప్పారగా, పూర్వపుణ్యంబు పక్వంబుగానొప్పు గోదావరి తీరప్రాంతంబులోనున్న షిరిడీయను గ్రామంబు నన్ జొచ్చి యచ్చోటనున్నట్టి యావేపవృక్షంబు క్రిందన్ మాహాప్రీతితో నిల్చి, నీవచటన్ క్రిందగూర్చున్న, యా కొమ్మకున్ చాలామాధుర్యయుక్తం బులౌ యాకులంగూర్చి, యాచెంతనన్ పాడుబడ్డట్టిచోటన్ మసీదొక్కటిన్ గాంచి, యచ్చోటనే సుస్థిరం బై నివాసంబుజేయంగ కాంక్షించి, యద్ధానికిన్ ద్వారకామాయి నామంబు గల్పించి, నీ చెంతకున్ కర్మశేవంబుతో జేరునా శక్యంబైనా? యాకాశభాగంబునన్ పక్షీ బృందంబు పైపైకి తాబోవునేగాని యంతంబు మంగాంచగానోపునే! యట్లు నీ దివ్యమౌ వైభవంబులెల్ల నేన న్నంగరీతి వీలౌను? ప్రాపంచికార్ధంబులన్ గోరునవ్వారికిన్ గొప్ప ఉద్యోగ ముల్, ద్రవ్యలాభంబులున్, సత్సంతానమున్, జేకూర్చుచున్, కొందరిన్ సర్వలోకాధినాథుండు సర్వేశ్వరుడైన యాదేవుపై భక్తిభావంబు సూచింపు చున్. కొందరిన్ ముక్తిమార్గంబు కాంక్షించు మర్త్యావళికిన్ జేరి దృశ్యంబు నిశ్యంబు జీవేశ్వరుల్ వేరుగారంచు నాత్మానుసంధానుభావంబు బోధించు చున్, కొందరున్ బ్రోచిపంచ ప్రదేశంబులన్ దెచ్చుకొన్నట్టి భిక్షాన్న మున్ది నుచు, రోజంతయు పుష్కలంబైనట్టి ద్రవ్యంబుతోడన్ మహావైభవోపేతుడై యుండి, సాయంత్రమౌవేళకున్, సర్వమున్, సాధులోకాళికిన్ ఖర్చు గావిం చి పూర్వంబురీతిన్ ఫకీరై మదిన్ భేదభావంబు లేకుండగా నందరిన్ జేర్చి, నీ పైన భారంబుసర్వంబునున్ వైచి సద్గురుడంచునినే సదా నమ్మి సేవించు జీవాళికార్యంబులెల్లన్ సానుకూలంబుగా దీర్చుచున్ కొంగుబం గారమైవారి రక్షించి సద్భక్త చింతామణీ! నేడు నీ దివ్యపాదాబ్జముల్గాక, గత్యంతరంబేమీ లేదంచు, నీవే శరణ్యంబంచు నీ చెంతకున్ జేరు మమ్మె ల్లరన్ గాపాడుతూ దీనబంధూ, మహాదేవ! దయాసింధు! శ్రీసాయినాధా! నమస్తే నమస్తే నమః

మరిన్ని దండకములు:

Leave a Comment