Vinavamma Janaki Nivibhudintesesinadu In Telugu – వినవమ్మ జానకి నీవిభుడింతేసేసినాడు

ఈ పోస్ట్ లో వినవమ్మ జానకి నీవిభుడింతేసేసినాడు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

వినవమ్మ జానకి నీవిభుడింతేసేసినాడు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : వినవమ్మ జానకి నీవిభుడింతేసేసినాడు
సంఖ్య : 462
పుట: 311
రాగం: రామక్రియ

రామక్రియ

51 వినవమ్మ జానకి నీవిభుఁ డింతసేసినాఁడు
యెనసి యీరఘరాముఁ డిఁక నేమి సేసునో

||పల్లవి||

వానరులదండు గూడి వారధి కొండలఁ గట్టె
ఆని లంక చుట్టిరా నదే విడిసె
కోనలఁ ద్రికూటమెక్కె గొడగులన్నియుఁ జెక్కె
యేనెపాన రఘురాముఁ డిఁక నేమిసేసునో

||విన||

కోరి ఇంద్రజిత్తుఁ జంపె కుంబకర్ణు నిర్జించె
గోరదానవులనెల్ల కూలఁగుమ్మెను
మారణహెూమము నేనె మతకమింతాఁ జెరిచె
యీరసాన రఘురాముఁ డిఁక నేమిసేసునో

||విన||

లావున రావణుఁ జంపె లంక విభీషణు కిచ్చె
చేవల నోసీత నిన్నుఁ జెకొనెను
భావించి శ్రీవేంకటాద్రిఁ బట్టము దాఁ గట్టుకొనె
యీవలనావల నాతఁ డిఁక నేమిసేసునో

||విన||462

అవతారిక:

ఇటువంటి కీర్తన నభూతో న భవిష్యతి అని గట్టిగా చెప్పగలను. ఎందుకంటే గతంలో “ఓ సీతమ్మ తల్లీ! నను బ్రోవమని చెప్పవే” అని మొరబెట్టిన వారున్నారు. తల్లీ! నీవు సాక్షాత్తు లక్ష్మీదేవివమ్మా! అని కీర్తించినవారున్నారు కాని తానే ఒక రామదూత కపియై శ్రీరాముని శత్రు నిర్మూలనం సీతమ్మకు వర్ణించి వివరించటం యెన్నడూ యెరుగము. అన్నమాచార్యుని కృపచేత ఈ కీర్తన రూపంలో ఆలోటు తీరింది. “ఓ జానకమ్మా! మీ ఆయన యేమి చేశాడో వినవమ్మా! ఈయనగారు తిరుమల కొండలెక్కాడు. ఇకపై యేమిచేస్తాడో తెలియకుండావున్నది” అంటున్నారు, నభవిష్యతి- అని ఎందుకన్నానంటే ఈ తెలుగు పాండిత్యం వున్న మొనగాడెవడండీ…

భావ వివరణ:

ఓ జానకీదేవీ! ఇది వినవమ్మా! నీ విబుడు (నీభర్తయైన శ్రీరాముడు) ఇంసేసినాడు, ఇన్ని వీరోచితకార్యములను చేసినాడు. ఈ రగురాముడు, ఎనసి (పూని) ఇకన్ యేమిసేసునో!! ఇంకా ఏమిచేస్తాడో యేమో!!

నీ భర్త వానరదండు (కపులసేనతో కూడి కొండలతో వారధిగట్టె (సేతువును నిర్మించినాడమ్మా!) ఆపైన ఈ లంక చుట్టిరా (చుట్టూతా) అదే తన సైన్యంతో విడిసె (విడిది యేర్పరచుకొనినాడు) అదిగో ఆ లోయలవైపునుంచి చిత్రకూట పర్వతమునెక్కినాడు. ఆయనశక్తిసామర్థాల గురించి చెవులు కొరుక్కున్నవారి గొడుగులన్నిటికీ (గొణుక్కోవటాలకన్నింటికీ) చెక్కె (చెక్కినట్లు సమాధానమిచ్చాడు. ఈ రఘురాముడు ఇకపై యేనెపానటేమిసేసునో!! (దేనికోసం యేమిచేస్తాడో చెప్పలేము తల్లీ!)

కోరి ఇంద్రజిత్తుని జంపె (సీతాపరహరణంలో అతని పాత్రయేమీ లేకపోయినా, వాడు రావణుని ఆత్మజుడు కావున లక్ష్మణునితో చంపించాడు). అనేక వానరులను మూకొమ్మడిగాచంపాడని కుంభకర్ణుని తెగవేసినాడు. ఘోరమైన దానవులను కూలగమ్మె (కూలవేసినాడు). మతకమంతా జెరిచి (రాక్షసమాయను పటాపంచెలము చేసెను). రణరంగంలో మారణ హెూమం (మృత్యుహెూమం) చేశాడు ఈ రఘురాముడు, ఈరసానవున్నాడు (కోపముచేత వివశుడైయున్నాడు. ఇంకాయేమిసేసునో!!

ఆపైన రావణాసురుని లావున (ధైర్యముతో) చంపెను. లంకానగరానికి విభీషణుని పట్టాభిషిక్తునిచేశాడు. ఓ సీతా! ఆయన ఇక నిన్న చేవల చేకొనును (వశమై చేపట్టును). భావించి (ఆశ్రీరాముడే ఈ శ్రీవేంకటేశ్వరునిగా యెంచి) తాను శ్రీవేంకటాద్రిని, పట్టము కట్టుకొన్నాడు (పట్టాభిషిక్తుడయ్యాడు). ఈవల నావల (ఇక్కడ తిరుమలలోను అక్కడ అయోధ్యలోను) అతడు ఇక నేమిసేసునో!! ఎవరు చెప్పగలరు?

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment