మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. శ్రీ వీరబ్రహ్మ సుప్రభాతమ్ ఒక తెలుగు భక్తి గీతంగా తెలుగు వారు ప్రధానంగా పాడే భక్తి సంగీత క్రియలలో ఒకటి. ఈ సుప్రభాతం శ్రీ వీరబ్రహ్మ స్వామిని స్తుతించడానికి సమర్థమైనది. ఈ గీతం భక్తులకు మాత్రమే కాదు, ప్రత్యేకంగా తెలుగు సాంస్కృతిక వ్యవహారాలలో ప్రచురించబడుతుంది. అది భక్తి, ఆధ్యాత్మికత మరియు సాంస్కృతిక సమృద్ధికి ప్రధాన పాత్రని ప్రదర్శిస్తుంది.
శ్రీ వీరబ్రహ్మ సుప్రభాతమ్
శ్రీ వీర బ్రహ్మ యోగీశ ! ప్రాతస్సంధ్యా ప్రవర్తతే,
ఉత్తిష్ఠ జగదాచార్య! కర్తవ్యం లోక పాలనమ్.
టీక. శ్రీ వీరబ్రహ్మయోగీశ వీరబ్రహ్మమను పేరుగల ఓ యోగీశ్వరుఁడా, ప్రాతస్సం ధ్యా = ప్రాతస్సంధ్యాకాలము, ప్రవర్తతే = జరుగుచున్నది, జగదాచార్య = ఓ జగద్గురూ ! లోకపాలనం = లోకరక్షణము, కర్తవ్యం = చేయదగినది, కనుక) ఉత్తిష్ఠ = లెమ్ము. (మేల్కొన వలసినది.)
తా. జగద్గురుడవగు నో వీర బ్రహ్మ యోగీశ్వరా ! ప్రాతస్సంధ్య జరుగుచున్నది గావున, లోకరక్షణ కార్యార్థమై నీవు మేల్కొనవలసినది.
ఉత్తి పోత్తిష్ఠ వీరేశ! ఉత్తిష్ఠ సమతావిభో!
ఉత్తిష్ఠ వేద వేదాన ధర్మ మర్మ ప్రచారక !
టీక. వీ రేశ = ఓ వీ రేశ్వరస్వామి, ఉత్తిష్ఠ- ఉత్తిష్ఠ = లే లెమ్ము. (శ్రీఘ్ర ముగా మేల్కాంచుము) సమతావిభో – సమభావములకు ప్రభుడ వైన వాడా! ఉత్తిష్ఠ = లెమ్ము, వేద వేదాన ధర్మ మర్మ ప్రచారక: వేదముల యొక్కయు, ఉపనిషత్తుల యొక్కయు ధర్మ రహస్యములను ప్రచారము చేయువాడా! ఉత్తిష్ట = లెమ్ము.
తా. సమతా సిద్ధాంతమునకు ప్రభుడవైన ఓ వీరేశ్వరస్వామీ! మేల్కాంచుము. వేదోపనిషత్తుల ధర్మరహస్యములను ప్రచారము చేసిన ప్రభూ! మేల్కాంచుము.
ఉత్తిష్ఠ లోకజననీ గోవిందాంబా మనోహర!
ఉత్తిష్ఠాశ్రిత మందార విశ్వరక్షా విధిం కురు !
టీక. లోకజననీ గోవిందాంబా మనోహర=లోకమాతృస్వరూపిణి యైన గోవిందమ్మకు భర్తవైన వీర బ్రహ్మ గురూ! ఉత్తిష్ఠ = లెమ్మో. ఆశ్రిత మందార = ఆశ్రయించినవారికి కల్పవృక్షమువంటి వాడా! ఉ ఉత్తిష్ఠ = లెమ్ము. విశ్వరక్షావిధిం = విశ్వపాలన కార్యమును, కురు = చేయుము.
తా. జగన్మాతయగు గోవిందమ్మకు భర్తవుతు, ఆశ్రయించిన వారి వాంఛలను దీర్చుటకు కల్పవృక్షమైన వాడవును నగు ఓ స్వామీ! శీఘ్రమే మేల్కాంచి లోకరక్షణ కార్యము నొనర్పుము.
మాత స్సరుస్త జగతాం మహనీయ వీర
బ్రహ్మేశ్వరప్రణయిని ! ప్రణతార్థదాత్రి!
శ్రీ కందిమల్లయ పురీశ్వరి ! లోకవంద్యే !
శ్రీ వీరయోగి దయితే! తవ సుప్రభాతమ్.
టీక. సమస్తజగతాం = ఎల్ల లోకములకును, మాతః = – అమ్మవును, నీయ వీరబ్రహ్మేశ్వర ప్రణయిని మహాత్ముడగు వీర బ్రహ్మమునకు ప్రియురాలవునూ, ప్రణత ఆరదాత్రి నమస్కరించినవారలకు ఫల ములనిచ్చు దానవును, శ్రీ కందిమల్లయ పురీ ఈశ్వరి = మంగళకరమగు కందిమల్లయపురమున నివసించి పాలించుదానవును, లోకవంద్యే = లోకములచే నమస్కరింపదగినదానవును, శ్రీ వీరయోగి దయితే = శ్రీ వీరబ్రహ్మయోగి పత్నినగు నో తల్లీ ! తవ నీకు, సుప్రభాతం= శుభోదయము. (అగుగాక)
తా. సమస్త లోకములకు తల్లివీ, వీర బ్రహ్మేశ్వరుని ప్రేమను చూఱగొన్న దానవూ, నమస్కరించువారలకు సత్ఫలముల నిచ్చుదానవూ, కందిమల్లయపురమున నివసించి పాలించు దానవూ, లోకములచే నమస్కరింపబడు దానవూ, వీర బ్రహ్మగురుని పత్నివీ అగు నీకు సుప్రభాత మగుగాక.
సుప్రభాతం భవే దేవి ! తవ నీ రేజలోచనే!
గోవిందాం బాస్వరూపిణ్యా జగన్మాతు ర్జగచ్ఛియై.
శ్రీక. నీ రేజిలోచనే = తామరలవంటి కన్నులుగల, దేవి = ఓ దేవతా, గోవిందాంబా స్వరూపిణ్యాః = గోవిందమ్మరూపముననున్న, జగత్ మాతు ః = లోక జనని వైన, తవ జ నీకు, జగత్ శ్రియై = లోకముల శ్రేయస్సుకొఱకు, సుప్రభాతం = శుభోదయము, భవేత్ =అగుగాక.
తా. తామర పూలవంటి కన్నులుగల ఓ దేవీ! గోవిందాంబా స్వరూపమునుదాల్చిన లోక జననివగు నీకు లోకములకు శుభము కలుగుటకొఱకై సుప్రభాత మగుగాక.
పూజోచిత ప్రసవ పత్ర సమృద్ధ హస్తా
భక్తా స్తపో విభవ సంభృత హృష్ట చిత్తాః,
ప్రాప్తా స్వదంగణ మభంగుర మంగళాఢ్యం
శ్రీవీర దేశిక విభో ! తవ సుప్రభాతమ్
టీక. పూజా, ఉచిత, ప్రసవ, పత్ర, సమృద్ధ, హస్తాః = పూజించుటకు తగీన పుష్పముల చేత పత్రముల చేత నిండిన చేతులు గలవారును; తపస్,, విభవ, సంభృత, హృష్ట, చిత్తాః = తపస్సంపద చేత భరింపఁబడినట్టియు సంతసించినట్టియు మనస్సులు గలవారును, అగు భక్తాః భక్తులు, అభంగుర, మంగళ, అఢ్యం = శాశ్వతములైన శుభములతో నిండిన, (శాశ్వతసుఖమనఁగా మోక్షమని యర్థము) త్వత్, అంగణం = మీ ఆలయపు ముంగిలి ప్రదేశమును, ప్రాప్తాః = చేరుకొన్నారు; శ్రీవీర దేశికవిభో ! = వీరబ్రహ్మమను పేరుగల గురుస్వామి ! తవ = నీకు, సుప్రభాతమ్ = సుప్రభాతము అగుగాక.
తా. ఓ వీర బ్రహ్మ గురూ! చిరకాలము తపస్సు చేసిన వారును, సంతోషముతో గూడిన మనస్సులు గలవారును అగు నీభక్తులు పూజించుటకు దగినట్టి పూలను పత్రములను తీసికొని శాశ్వతములైన శుభములకు నివాసమైన నీ ఆలయప్రాంగణమును జేరుకొన్నారు. కాన నీకు సుప్రభాత మగుగాక !
ఆదాయ రమ్య సలిలాశయ పద్మగంధాన్
త్వత్సేననాయ నితరా మతికౌతు కేన,
ప్రాభాత మందపవనాః పరిత శ్చరన్తి
గోవిందమా హృదయవల్లభ ! సుప్రభాతమ్.
హృదయవల్లభ = గోవిందమ్మ గారికి మనోనాథుఁ డైనవాఁడా! ప్రాభాత మందపపనాః = ఉదయకాలపు మెల్లని గాడ్పలు ; రమ్యసలిలాశయ పద్మగంధాజ్= అందమైన కొలకుల లోని పద్మములయందలి సువాసనలను; నితరాం = మిక్కిలిగా ; ఆదాయ = తీసికొని; అతికాతు కేన= ఎక్కువ కుతూహలముతో; త్వత్ సేవనాయ= నీ సేవకొరకై ; పరితః = అంతట; చరన్తి= సంచారము గావించుచున్నవి. సుప్రభాతమ్ = నీకు సుప్రభాత మగుగాక.
తా. ఓ గోవిందమా ప్రాణవల్లభ ! ఉదయ కాలమున మెల్లగా వీచెను వాయువులు సరస్సులలోని తామరపూల సువాస నల నెక్కువగా గ్రహించి నీసేవ చేయవలయుననెడి కుతూహలముతో అంతట సంచరించుచున్నవి. ఆ మంద మారుతముల ననుభవించుటకై నీవు మేల్కొందువుగాక!
ఈషత్ప్రఫుల్ల సరసీజ రసప్రమత్తాః
పుష్పందయా స్సహచరీ సహితా స్సుమంద్రం,
ప్రత్యూషయోగ్య పరమార్థ విబోధ గేయం
గాయన్తి కక్కయగురో! తవ సుప్రభాతమ్.
టీక. కక్క యగురో = కక్కయ్యకు గురుడవైనవాడా! ఈషత్ప్రఫుల్ల సర సీజ రస ప్రమత్తాః = కొలదిపాటిగా విప్పారిన తామర పూలలోని మకరందముచేత మరించినట్టి; పుష్పందయాః = తుమ్మెదల ; సహ చరీ సహితాః = ప్రియురాండ్రతో గూడుకొనిన వై; సుమంద్రమ్= గంభీరము గా; ప్రత్యూషయోగ్య పరమార్థ విబోధ గేయమ్=ప్రాతః కాలమున పాడదగినదియు శ్రద్ధమగు నర్థముతోఁ గూడినడియు నగు మేలుకొలుపుపాటను; గాయని = పాడుచున్న వికి తవ – నీకు ; సుప్రభాతమ్ =శుభోదయము అగుగాక!
తా. కక్కయ్యకు తత్త్వబోధ చేసిన గురుమూర్తీ ! కొద్దిగా వికసించిన పద్మములలోని తేనెను ద్రావి మదించిన తుమ్మెదలు తమ భార్యలతో గూడినవై ఉత్కృష్టార్థ ముతో నిండిన మేలుకొలుపును గంభీరముగా పాడు చున్నవి. నీకు సుప్రభాత మగుగాక !
వీణాద్యనేక సుమనోహర వాద్యవర్దేశి
ప్రౌఢప్రబంధ రచనా పటవఃక వీద్రాః,
నిర్మాయ తే సుచరితం కలిదోషనాశం
గాయన్తి విశ్వగురురా టవ సుప్రభాతమ్.
టీక. విశ్వగురురాట్ = ఓ లోకగురు మహారాజా! ప్రౌఢ, ప్రబంధ, రచనా, పటవః = ప్రౌఢములైన కావ్యములను వ్రాయుటలో సమర్థు లైన; కవీంద్రాః = కవిశ్రేష్ఠులు; కలిదోష నాళమ్ = కలియుగము నందలి పాపములను నశింపఁజేయునట్టిదైన; తే= నీయొక్క ; సుచరి తమ్ = సచ్చరిత్రమునః; నిర్మాయ = సృష్టించి; (వ్రాసి) వీణావ్య సేక, సుమనోహర, వాద్యవర్ధేః = వీణ మొదలైన పెక్కు మనోహర వాద్యములచేత; గాయన్తి = పాడుచున్నారు; తవ= నీకు, సుప్ర భాతమ్ = సుప్రభాత మగుగాక !
తా. ప్రౌఢములైన కావ్యములను వ్రాయుటలో నేర్పరులైన కవీశ్వరులు కలిదోషములను నశింప జేయునట్టిదైన నీ సచ్చరిత్రమును వ్రాసి వీణ మొదలగు వాద్యములను తోడుచేసికొని గానము చేయుచున్నారు. ఓ విశ్వ గురుమూర్తీ! నీకు సుప్రభాత మగుగాక !
బ్రహ్మాచ్యుతాభవ సురేశ్వర లోక బంధు
మూర్త్యాత్మక స్త్వ మితి కేచి దుదాహరన్తి;
మూర్తిత్రయీ రుచిరరూప ఇతీహ
కేచిత్ గాయన్తి దేశికవిభో! తవ సుప్రభాతమ్.
టీక. దేశికవిభో = గురుప్రభూ ! ఇహ=ఈలోకమున; కేచిత్= కొందఱు; బ్రహ్మ… మూర్త్యాత్మక ః. బ్రహ్మ = బ్రహ్మ; అచ్యుత : విష్ణువు; అభవ = శివుఁడు; సురేశ్వర = ఇంద్రుఁడు; లోకబంధు = సూర్యుఁడు ఆస; మూర్తి ఆత్మకః = పంచమూర్తుల స్వరూపుఁడవు; ఇతి = అని; ఉదాహరన్తి= చెప్పుచున్నారు; కేచిత్ = నటిం దఱు; మూర్తిత్రయీ, రుచింరూపః = బ్రహ్మ విష్ణువు శివుఁడు ఆను త్రిమూర్తులయొక్క మనోహరస్వరూపుడవు; ఇతి = అని; గాయన్తి=గానము చేయుచున్నారు; తవ = నీకు; సుప్రభాతమ్ = సుప్రభాత మగుగాక !
తా. ఓ గురుప్రభూ ! ఈలోకమున పెద్దలగు కొందఱు నిన్ను సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహకర్తలగు బ్రహ్మ, విష్ణువు, శివుఁడు, ఇద్రుఁడు, సూర్యుఁడు అను పంచ మూర్తుల సమష్టి స్వరూపునిగా పేర్కొనుచున్నారు. మఱికొందఱు బ్రహ్మ, విష్ణు, శివు లను మువ్వురు మూర్తుల సమష్ట్యవతారముగ భావించుచున్నారు. ఇట్టి నీకు సుప్రభాత మగుగాక ! కేచి ద్వదన్తి పరిపూర్ణ హరిస్వరూపం గోపాలనాశ్రిత జనావన ముఖ్యకార్యైః బ్రహ్మావతార మితి శిల్ప గురుత్వ హేతోః కేచి దువన్తి గురురా టన సుప్రభాతమ్.
టీక. గురురాట్ = ఓగురుమహారాజా! కేచిత్ = కొందఱు; గోపాలన, గాయుట ఆశ్రితులను అశ్రితజనావన, ముఖ్యకార్యైః = అవులను రక్షించుట మన్నగు కార్యముల చేత; పరిపూర్ణ హరిస్వరూపం = పరి పూర్ణమగు విష్ణ్వవతారమని, వదన్తి – చెప్పుచున్నారు; కేచిత్ = మఱిగొందఱు;శిల్ప గురుత్వ హేతో ః = శిల్పములకు గురుఁడ వైన కారణ ముస; బ్రహ్మావతారమితి = బ్రహ్మదేవుని యవతారమని; బ్రువన్తి= చెప్పుచున్నారు; తవ = నీకు; సుప్రభాతమ్ = సుప్రభాతముఅగుగాక!
తా. ఓగురుమహారాజా! కొందఱు పండితులు నీవు విష్ణుమూర్తి చేసిన గోపాలనము ఆశ్రితజన రక్షణము మున్నగు స్థితి ప్రధాన కార్యములను చేసినందువలన నిన్ను విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణావతారమని చెప్పుచున్నారు. సృష్టి శిల్పము నొనర్చిన బ్రహ్మవలె నీవును అయో, దారు, తామ్ర, శిలా, స్వర్ణమయములగు పంచశిల్పములను నెర పినందువలన బ్రహ్మ దేవుని యవతారమని చెప్పుచున్నారు. ఇట్టి నీకు సుప్రభాతమగు గాక.
వివ : వీరగురుడు పంచశిల్పములను స్వయము గా చేసి, వానిని సమాజతారకములుగా ప్రోత్సహించినాడన్న విష యము నిచ్చట స్మరింపవలయును.
ఏత న్మహాంధ్ర ధరణీకృత పుణ్య కాన్యై
రుద్భూత దివ్య మహిమాఢ్య శివావతారం,
ఆచక్ష తే పరమతత్త్వవిదో భవన్తు
శ్రీ బ్రహ్మ దేశికవిభో! తవ సుప్రభాతమ్.
టీక. శ్రీ బ్రహ్మదేశికవిభో = ఓ బ్రహ్మ గురూత్తమా! పరమకత్వ శ్రీ విదః = శ్రేష్ఠమగు తత్వము నెఱింగిన పెద్దలు; భవనం = నిన్ను; ఏతత్, మహార్ద్ర, ధరణీకృత, పుణ్యకార్యైః = ఈవిశాలా ర్ధ్రభూమి చేత చేయఁబడిన పుణ్య కార్యముల చేత; ఉద్భూత, దివ్య, మహిమాఢ్య, శివావతారం = పుట్టినట్టియు దివ్యమహిమలతో నిండినట్టియు శివుని యవతారమని; ఆచత తే= చెప్పుచున్నారు;6వ= నీకు; సుప్రభాతమ్= సుప్రభాత మగుగాక !
తా. ఓ బ్రహ్మగురువర్యా! తత్వవేత్తలగు పెద్దలు నిన్ను గొప్పదగు ఈ తెలుగు దేశము చేసికొన్న పుణ్య ములవలన ఆవిర్భవించిన దివ్యమహిమలుగల శంకరావతారమని చెప్పుచున్నారు. ఇట్టి నీకు సుప్రభాత మగుగాక !
వివ: వీరబ్రహ్మము శైవకుటుంబము వారగు పాపఘ్ని మఠాధిపతులవద్ద పెరుగుట, అల్లాడుపల్లెలో వీరభద్రస్వామిని ప్రతిష్ఠించి నిజగురువుగా ఉపాసించుట మొదలగు దివ్యలీలలు ఇచ్చట అనుసంధింప దగినవి.
బ్రహ్మాచ్యుతాభవ ముఖాఖల దేవతాంశ
భ్రాజిష్ణు మేవ కలయే గురురా ద్భవస్త్రం,
నానామనోజ్ఞ మహనీయ గుణాలయ త్వాత్
శ్రీ వీర దేశిక విభో ! తవ సుప్రభాతమ్.
టీక. గురురాట్ = ఓ గురుమహా రాజా! భవన్తమ్ = నిన్ను; మనోజ్ఞ, మహనీయ, గుణాలయత్వాత్ = పలువిధములైన మనో హర మహత్తర గుణములకు నిలయుఁడవైనందున, బ్రహ్మా….. భ్రాజిష్ణుమేవ. బ్రహ్మా = బ్రహ్మదేవుడు; అచ్యుత = విష్ణువు; అభవ= శివుఁడు; ముఖ = మొదలైన; అఖిల దేవతాంశ = = సమస్త దేవతాశ ములచేత; భ్రాజిష్ణుమ్ ఏవ = ప్రకాశించువానిని గా నే; కలయే= తెలిసికొనుచున్నాను; శ్రీవీరదేశికవిభో = ఓ వీరబ్రహ్మ గురుమూర్తీ ! తవ = నీకు; సుప్రభాతమ్ = సుప్రభాతము అగుగాక!
తా. ఓ గురుమహారాజు! బ్రహ్మాది సర్వ దేవతలకు నుండునట్టి కొనియాడదగిన మహనీయగుణములు పెక్కులు నీలో నుండుటచేత నిన్ను బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలగు సర్వ దేవతలయొక్క అంశములను పొంది ప్రకాశించు సర్వ దేవమయునిగా భావించుచున్నాను. ఇట్టి నీకు సుప్రభాత మగుగాక !
వివ: వీరగురుడు ఒక్క సత్పదార్థమే పలు నామ రూపములచే ప్రకాశించినదని బోధించినాడుగాన, ఆయనను సర్వదేవమయునిగా భావించుట సముచితము.
గోవిందమా హృదయ తామర సాబ్జబంధో!
సిద్ధిపనేవిత పదాబ్జ! దయైక సింధో !
ఏతే పరన్తి చరితం తవ సూరిముఖ్యాః
శ్రీకందిమల్లయ పురీశ్వర! సుప్రభాతమ్.
టీక. గోవిందమా, హృదయ, తామరసాబ్జ, బంధో= గోవిందాంబ యొక్క హృదయపద్మమును వికసింపఁజేయుటకు సూర్యునివంటివాడవును; సిద్ధ, ఉపసేవిత, పద, అబ్జ = సిద్దప్పయను శిష్యుని చేత సేవింపబడిన పాదపద్మములు గలవాఁడవును; దయా, ఏక సింధో = దయకు సముద్రుఁ డవును అగు; శ్రీ కందిమల్లయ పురీశ్వర = కందిమల్లయ పల్లెయను గ్రామమున నివసించు ప్రభూ! ఏతే = ఈ; సూరిముఖ్యాః = పండిత శ్రేష్ఠులు; తవ = నీయొక్క; చరితం = – చరిత్రమును; పఠన్తి = చదువు చున్నారు; నీకు, సుప్రభాతమ్ = శుభోదయమగు గాక!
తా. ఉత్తమ గృహస్థాశ్రమ నిర్వహణము చేతను, లోకోద్ధ రణ కార్యముల చేతను, భార్యయగు గోవిందమ్మను సంతోష పెట్టువాఁడవును, శిష్యుఁడుగు సిద్దప్ప చేత సేవింపఁబడు వాడవును, దయానిధివినీ అగు నో కందిమల్లయపురమున వసించు వీర బ్రహ్మగురూ! ఇచ్చటకు విచ్చేసిన పండితులు నీచరిత్రమును చదువుచున్నారయ్యా! నీవు మేల్కొందువు గాక!
యా త్వన్నిరంతర నివాస విశేష హేతోః
శ్రీ కందిమల్లయపద ప్రకటా కుపిల్లీ
బ్రహ్మస్థలాహ్వయ మగా ద్భువి లోకనాథ !
శ్రీ బ్రహ్మ దేశిక విభో ! తవ సుప్రభాతమ్.
టీక. లోకనాథ = ఓ లోకేశ్వరుఁడా! భువి = భూమియందు శ్రీకంది మల్లయపద ప్రకటా = కందిమల్లయ పదము చేత ప్రసిద్ధమయిన థూ = ఏ; కుపల్లీ = కుగ్రామము; త్వత్, నిరంతర, నివాస, విశేష హేతోః = నీయొక్క నిరంతర నివాసమను గొప్ప కారణమువలన, బ్రహ్మస్థల, అహ్వయమ్ = బ్రహ్మక్షేత్రమను పేరును; అగాత్ = పొందినదో; శ్రీ బ్రహ్మ దేశిక విభో = బ్రహ్మగురుత్తమా! తవ = అట్టి నీకు; సుప్రభాతమ్ శుభోదయము అగుగాక!
తా. లో కేశ్వరుడవగు నో వీర బ్రహ్మగురూ ! నీవు గృహస్థుఁడవై ఎల్లప్పుడును కాపుర ముండుటవలన కందిమల్లయపల్లె యను కుగ్రామము బ్రహ్మక్షేత్రమను ప్రసిద్ధిని భూమి పై కీ ర్తనీయమైనది. కందిమల్లయపల్లె కట్టి సుప్రసిద్ధి జెంది చేకూర్చిన నీకు సుప్రభాత మగుగాక!
అన్నాజయాఖ్య నిజశిష్య వరో పదిష్టు
భావ్యర్థ బంధుర మహత్తర శాస్త్రవక్తః !
గాయన్తి తేఁద్భుత విభూతి లసచ్చరిత్రం
లోకా స్సదా మునివిభో ! తవ సుప్రభాతమ్.
టీక. అన్నా జయా …… వక్త్రః అన్నాజయాఖ్య = అన్నాజయ్య యను ‘పేరుగల; నిజశివ్యవర = సొంతశిష్యునికి, ఉపఠిష్టు = ఉపదేశింప బడిన; భావి అర్థబధుర = భవిష్య ద్విషయములతో నిండిన, మహ త్తర శాస్త్ర పక్తః = గొప్పకాలజ్ఞానమను శాస్త్రమును చెప్పినవాడా! లోకాః = లోకములు, తే=నీయొక్క, అద్భుత, విభూతి, లస చ్చరిత్రమ్ = ఆశ్చర్యకరములగు, అణిమాది విభూతులు కలదైయొప్పు చరిత్రమును; సదా = ఎల్లప్పుడు; గాయన్తి = గానము చేయుచున్నవి; మునివిభో = ఓ మునీంద్రా! తవ= నీకు; సుప్రభాతమ్ = సుప్ర భాతము అగుగాక.
తా. ఓమ:నీశ్వరా! నీవు బనగాన పల్లెలో అన్నా జయ్య యను శిష్యునికి రాబోవు సంగతులతో గూడిన గొప్పదై న కాల జ్ఞానము నుప జేశించినాడవు. జీవితములో ఆశ్చర్యకరము లగు పెక్కు మహిమలను బ్రదర్శించినావు. లోకములు మహిమాఢ్య రుగు నిట్టి నీసచ్చరిత్రమును గానము చేయు చున్నవి. నీకు సుప్రభాత మగు గాక.
స్త్రీ శూద్ర భేద మపహాయ గుణైక దృష్ట్యా
రెడ్డ్యన్వవాయ భవ వేంకట రెడ్డి పత్న్యాః
మంత్రోపదేశ సహితం మహితాత్మ తత్త్వ
ముక్తం త్వయా మునివిభో! తవ సుప్రభాతమ్.
టీక. మునివిభో – ఓ మునీశ్వరా! త్వయా = నీ చేత; స్త్రీ శూద్ర భేదవ్ = వీరు స్త్రీలు, వీరశూద్రులు అనుభేదము; ఆపహాయ =వదలి; గుణ, ఏకదృష్ట్యా= గుణములయందలి ముఖ్యదృష్టితో; రెడ్డి, ఆన్వవాయ భవ, వేంకట రెడ్డిపత్న్యాః = రెడ్డి వంశమున బుట్టిన వేంకట రెడ్డి భార్య యగు ఆచ్చమ్మగారికి; మంత్ర, ఉపదేశ, సహితం – మహామంత్రోప దేశముతో గూడిన; మహిత, ఆత్మతత్వం కొనియాడఁదగిన ఆత్మ రహస్యము (ఆత్మజ్ఞానమన్నమాట) ఉక్తం= చెప్పబడినది; తవ= నీకు; సుప్రభాతమ్=శుభోదయమగుగాక!
తా. ఓబ్రహ్మమునీ,ద్రా! నీవు వీరు స్త్రీలు, వీరుశూద్రులు అను భేదమును పాటింపక గుణములకు మాత్రమే ప్రాధాన్య మిచ్చి బనగాన పల్లెలో రెడ్డి వంశమున బుట్టిన వేంకట రెడ్డిగారి భార్యయగు అచ్చమాంబకు మంత్రోప దేశము చేసి జన్మతారకమగు ఆత్మతత్వమును గూడ బోధించితివి. ఇంత విశాలదృష్టిగల నీకు సుప్రభాత మగుగాక!
గోవిందయాది సుత సిద్ధవముఖ్య శిప్యై
ర్విస్తార్యమాణ మహితాశయ మాననీయ!
త్వదర్శితాని సుపధాని విశాల విశ్వ
సంతారకాని మునిరా టన సుప్రభాతమ్.
టీక. మునిరాట్ = ఓ మునీశ్వరా; గోవిందయాది, సుతీ, సిద్ధప, ముఖ్య, శిస్యైః = గోవిందయ్య మొదలగు కుమారుల చేతను, సిద్దప్ప మొదలగు శిష్యుల చేతను; విస్తార్యమాణ, మహిత, ఆశయ, మాననీయపిస్త రింప జేయఁబడుచున్న గొప్ప భావములచేత పూజింపఁదగినవాఁడా! త్వద్దర్శి తాని = నీ చేఁజూపఁబడిన; సుపథాని= మంచి మార్గములు; విశాల, విశ్వ, సంతారకాని విశాలమగు లోకమును తరింపఁజేయం నట్టివి; తవ = అట్టి నీకు; సుప్రభాతమ్ = శుభోదయ మగుగాక!
తా. ఓ వీర బ్రహ్మమునీంద్రా ! గోవిందయ్య, పోతులూరయ్య మొదలగు కుమారులచేతను, అన్నాజయ్య, సిద్దప్ప మొదలగు శిష్యులచేతను జగత్కల్యాణకరములయిన నీ భావములు ప్రచారము చేయఁబడినవి. లోక శ్రేయమునకు నీవు చూపిన మార్గములు ఒక్క భారతదేశమునే గాక, సమస్త ప్రపంచమునుగూడ తరింపఁ జేయునట్టివి. (నీసదుప దేశములకు దేశకాలములు ప్రతిబంధకములు కావని తాత్పర్యము) అట్టి నీకు సుప్రభాత మగుగాక !
విప్రోజయ మేష ధరణీపతి రేష వైశ్య
ళ్ళూద్రోయ మంత్యజ ఇతి స్వసుతః పరో
జయమ్ భేదం విహాయ గుణ గౌరవ బద్ధ బుద్ధి
సంవర్తసేన్మ గురురాటవ సుప్రభాతమ్.
టీక. త్వం = నీవు, ఆయం=వీడు,విప్రః = బ్రాహ్మణుడు, ఏవః – ఇతడు, ధరణీపతిః = రాజు, ఏవః = ఇతఁడు. వైశ్యః=కోమటి, ఆయం= వీడు, శూద్రః = శూద్రుఁడు, (వీడు) అంత్యజ = చండాలుఁడు; ఆయం = వీడు, స్వసుతః = సొంత కొడుకు, (వీడు) పరః = ఇతరుఁడు ఇతి = అని, భేదం = భేదమును, విహాయ- వీడి, గుణగౌరవ బద్ద బుద్ధిః= గుణముల యొక్క గౌరవమునందే బంధింపఁబడిన బుద్ధిగల వాఁడవై, వర్తసేస్మ = ప్రవర్తించినాఁడవుకదా!, గురురాట్ = ఓ గురురాజా! తవ = నీకు, సుప్రభాతమ్ = శుభోదయము అగుగాక.
తా. కులభేదములచే కూలిపోవు లోకమున నీ వవతరించి వీఁడు బ్రాహ్మణుఁడు, వీడు క్షత్రియుఁడు, ఇతఁడు వైశ్యుఁడు ఇతఁడు శూద్రుఁడు, ఇతఁడు చండాలుఁడు, వీడు నా కొడుకు, ఇతఁ డింకొకడు అను భేదమును వదలి సద్గుణ ములకు మాత్రమే ప్రాధాన్య మొసగి, అన్ని తరగతుల వారిని మన్నించినావు. ఇట్టి గురుమహారాజవగు నీకు సుప్రభాత మగుగాక!
కక్కయ్యనామక మతి ప్రవిమూఢబుద్ధిమ్
భార్యాం విచార్య మణిపూరక ముఖ్య పట్కమ్,
అన్వేషయ న్త మకరోః శ్వపచం కృతార్థం
శ్రీ వీర దేశిక విభో ! తవ సుప్రభాతమ్.
టీక. శ్రీ వీర దేశిక విభో! = ఓ వీర గురూత్తమా ! భార్యాం = ‘పెండ్ల మును; విచార్య =కత్తితో చీల్చి; మణిపూరక ముఖ్యషట్కం = మణి పూరకము మాన్ను గాగల షట్చక్రములను; ఆన్వేషయ న్తమ్ = వెదకు చున్నవాఁడును; అతిప్రవిమూఢబుద్ధిం గాఢముగు నజ్ఞానముతోఁ గూడిన బుద్ధిగలవాఁడును నగు; కక్కయ్య నామకం = కక్కడను పేరుగల శ్వపచం = కుక్క మాంసము తినునట్టి మాదిగ వానిని; కృతార్థం = తత్త్వోపదేశము చేత ధన్యునిగా; ఆకరోః = చేసితివి; తవ = నీకు; సుప్రభాతమ్ = మేలుకొలుపు ఆగుగాక!
టీక. ఓ వీర బ్రహ్మగురూ ! నీవు చేయు షట్చక్ర రహస్య బోధలను బుద్ధిమాండ్యము చేత అర్థము చేసికొనఁజాలక భార్యాశరీరమున వానిని వెదకఁదలచి, ఆమెకు కత్తితో కోసిచూచి నిష్ఫలుఁడైన కక్కడను మాదిగవానికి తత్వ బోధ చేసి వాని భార్యను బ్రతికించి కృతార్థునొనరించితివి. ఇట్టి నీకు సుప్రభాత మగుగాక !
నానా మతో క్త వివిధార్థ విభిన్న సత్యా
న్యాలోచ్య న్యాలో చ్య సంయమపరీత విశాలబుద్ధ్యా
తత్త్వం భవే ద్భహుముఖీన మితి త్వయోక్త్రమ్
శ్రీ బ్రహ్మ దేశికవిభో! తవ సుప్రభాతమ్.
టీక. శ్రీ బ్రహ్మ దేశికవిభో = ఓ బ్రహ్మగురూత్తమా! నానా, మత్తోక్త, వివిధార్థ, విభిన్న సత్యాని పెక్కు మతములయందు చెప్పబడిన పలు ప్రయోజనములు గల వేఱు వేఱు సత్యములను; సంయము, పరీత, విశాల బుద్ధ్యా= సంయమ జ్ఞానముతో గూడిన విశాలమగు బుద్ధితో; ఆలోచ్య=సమాలోచించి; తత్త్వమ్ = మూలతత్త్వమనునది; బహుముఖీ నమ్ = అ నేక ముఖములు గల దై; భవేత్ = ఉండును. ఇతి = అని; త్వయా=నీ చేత; ఈ క్తమ్ – చెప్పబడినది; తవ= నీకు; సుప్రభాతమ్= శుభోదయ మగు గాక.
తా. ఓవీర బ్రహ్మ గురూ! నీవు ధ్యాన ధారణా సమాధులను మూడింటి సమష్టియైన సంయమమును అనుష్ఠించి, మహ త్తరమగు ప్రాతిభజ్ఞానమును సంపాదించిన మహాయోగీశ్వ రుడవు. అన్ని మతములును పలు ప్రయోజనములుగల వివిధ సత్యములను చాటుచున్నవి. పరిపూర్ణజ్ఞానము లేని వారు అవి వేఱు వే అని భావించి కలహించుచున్నారు. ఇట్టి స్థితిలో సమ్యగ్ జ్ఞానము నార్జించిన విశాల బుద్ధితో నానామతసత్యముల నర్థము చేసికొని తత్త్వమనునది బహు ముఖములు గలదై విరాజిల్లుచుండుననియు, ఒక ముఖ మును మాత్ర మెఱింగినవాడు మఱియొక ముఖమును అసత్యమనరాదనియు, లోకమునకు నీవు చాటియున్నావు. ఇట్టి సంపూర్ణ జ్ఞానఖనివగు ( సర్వజ్ఞుడవు) నీకు సుప్రభాతమగుగాక!
గోవిందయాఖ్యగణకం ధరణీసు రేశం
చండాలవర్గ భవ కక్కయ భక్తముఖ్యం,
త్వం వీక్షనే స్మ కరుణాసమయైన దృష్ట్యా
శ్రీ బ్రహ్మ దేశిక విభో! తవ సుప్రభాతమ్.
టీక. శ్రీ బ్రహ్మ దేశికవిభో = ఓ వీర బ్రహ్మ గురూత్తమా! త్వమ్ = నీవు; = ధరణీసు రేశమ్ =బ్రాహ్మణ శ్రేష్ఠుఁడయిన, గోవిందయాఖ్యగణక మ్= గోవిందయ్య యను “పేరుగల గ్రామకరణమును; చండాలన్న, భవ, కక్కడో, భక్త, ముఖ్యమ్ = అంత్య వర్ణమునఁబుట్టిన కక్కఁడను భక్త శ్రేష్ఠుని; కరుణాసమయా = కారుణ్యము చేత సమానమైనా; దృష్ట్యా, | దృష్టితోడ నే; వీక్షసేస్మ = చూచినాఁడవు; తవ సుప్రభాతమ్= సుప్రభాతము అగుగాక !
తా. ఓ బ్రహ్మదేవ ! నీవు బ్రాహ్మణుఁడైన కరణము గోవిందయ్యను, మాదిగవాఁడైన కక్కయభక్తుని పక్ష పాతము లేక సమానమగు దయాదృష్టితోడనే చూచి తత్త్వార్థము నుపదేశించినావు. ఇట్టి నీకు సుప్రభాత మగుగాక !
“ముస్లిం” మతానుచర మూఢ ధరాధినాథాన్
హిందూమతః పరమ ఇక్యభిమన్య మానాన్,
ఉద్బోధ్య సాధిత మ హెూ ! మతసామరస్యమ్
దేవ ! త్వయా మునివిభో ! తవ సుప్రభాతమ్.
టీక. దేవ = ఓ దేవ! ముస్లింపు తాను చర, మూఢ, ధరాధినాథాన్ = మతము వారైన జ్ఞానహీనులగు నవాబులను; మహమ్మదీయ హిందూమతః = హిందూమతమే; పరమః = శ్రేష్ఠ మైనది; ఇతి = అభిమానించువారైన హిందువులను; అని, అభిమన్యమానాన్ ఉద్బోధ్య = ప్రబోధించి; మతసామరస్యమ్ = ఉభయమతముల కైక మత్యము; సాధికమ్ = సాధింపఁబడినది; ఆహో = ఆశ్చర్య; మునివిభో ! = మునీశ్వరుఁడా ! తవ = నీకు; సుప్రభాతమ్ = సుప భాతము అగుగాక !
తా. మహమ్మదీయమతమే గొప్పదను మూఢవిశ్వాసముగల తురక నవాబులను, హిందూమతమే శ్రేష్ఠమనుకొని పిట్టి వీరు హైందవులను సద్బోధలచే ప్రబోధించి, ఉభయ మతములకు నీవు సామరస్యమును సంపాదించినావు. ఇట్టి నీకు సుప్రభాత మగుగాక.
అష్టాంగయోగ పదవీ మధిరుహ్య బాఢ
మధ్యాత్మయోగ మనుశాసయత స్త వేయం,
రీతి ర్ముముక్షుషు మహత్తర యోగశక్తిం
జ్ఞానం తనోతి మునిరా టవ సుప్రభాతమ్.
టీక. మునిరాట్ = ఓ మునీశ్వరా! అష్టాంగయోగ పదవీమ్ = : అష్టాంగయోగ మార్గమును; అధిరుహ్య – ఆరోహించి; ఆధ్యాత్మయోగం = జ్ఞానయో గమును; బాధం = మిక్కిలిగా; అనుశాసయతః = బోధించునటువంటి; తవ = నీయొక్క; ఇయం = ఈ; రీతిః = పద్ధతి; ముముక్షుషు= మోక్షము బడయఁ గోరువారియందు; (సాధకులయందు) మహత్తర యోగశక్తిమ్ = గొప్పదగు యోగశక్తిని; జ్ఞానం = సుజ్ఞానమును;, తనోతి = విస్తరింపఁ జేయుచున్నది; తవ = నీకు; సుప్రభారమ్ = సుప్రభాతము అగుగాక.
ఓ వీర బ్రహ్మమునీంద్రా ! అష్టాంగయోగము నాచరణలో’ బెట్టి, బ్రహ్మా త్మైక్యజ్ఞానమును శిష్యసమూహమున కుప దేశించునట్టి నీమార్గము ముముక్షువులగు సాధకులలో గొప్ప యోగ సామర్థ్యమును, జ్ఞానశక్తిని పెంపొందించు చున్నది. అనేకులగు గురువులు యోగశక్తిలేని వాచా మాత్రజ్ఞాను లైయుండ నీవువారికి భిన్నముగా యోగమును, జ్ఞానమును కలిపి శిష్యులకు బోధించి వారి ననుభవజ్ఞాన సంపన్నులనుగా జేసినాఁడవు. ఇట్టినీకు సుప్రభాత మగుగాక ..
వేదాన్త వేద్య ! మహనీయ గుణాలవాల!
ధ్యానైకగమ్య ! పురుషోత్తమ! భవ్యశీల !
యోగీశ్వ రేడ్య ! సమతామిత దివ్యకీర్తే !
శ్రీ వీర దేశిక విభో ! తవ సుప్రభాతమ్.
వేదాస్త వేద్య ! = వేదాన్తములగు నుపనిషత్తుల చే నెఱుఁగఁదగిన వాడవును; మహనీయగుణ, ఆలవాల = భజింపఁదగిన గుణములకు నిల “యుఁడవును; ధ్యాన, ఏక, గమ్య = ధ్యానమను ముఖ్య సాధనముచేత నే పొందఁదగినవాఁడవును; పురుషఉత్త మ = పురుషులలో శ్రేష్ఠుడవును; (పరమాత్మరూపుడవును) భవ్యశీల = మంచిస్వభావము గలవాడవును; యోగీశ్వర, ఈడ్య = యోగీంద్రులచే స్తుతింపఁదగినవాడవును; సమతౌ, ఆమిక, దివ్యకీర్తే! = సమత్వము చేత గల్గిన మితిలేని శ్రేష్ఠు మగు కీర్తి గలవాడవును ఆగు; శ్రీ వీర దేశిక విభో ఓ వీరబ్రహ్మ గురూ! తవ = నీకు; సుత్రభాతమ్ = సుప్రభాతము అగుగాక.
తా. ఉపనిషద్వాక్యములచే నెఱుఁగఁ దగినవాడవుకు, పూజనీ యగుణములుగలవాఁడవుకు, ధ్యానమార్గముచేఁ బొందఁ దగినవాడవుకు, పురుషులలో శ్రేష్ఠుఁడవుకు, హృదయ మనుపురమున వసించుపరమాత్ముఁడవును, యోగ్యముగు నడవడిగలవాఁడవును, యోగీశ్వరులచే నుతింపఁబడు వాడవును, సమతాయోగ ప్రచారముచేత గొప్ప కీర్తి నార్జించినవాడవును నగు వీర గురూత్తమా! నీకు సుప్రభాత మగుగాక.
ఏవం విధాతిమధురార్థ గభీర సత్యం
శ్రీ బ్రహ్మ దేశిక విభో ర్వర సుప్రభాతమ్,
యే భక్తి పూర్ణహృదయా నిరతం పఠన్తి
తేషాం భవే దిహ పరత్ర చ శర్మ ముక్తిః,
టీక. ఏవంవిధ, అతిమధుర, అర్థ, గభీర, సత్యమ్ = ఈవిధమైన మధురార్థ ములు, గంభీరసత్యములు కల; శ్రీ బ్రహ్మ దేశికవిభోః = శ్రీ వీర బ్రహ్మగురునాధునియొక్క; వర సుప్రభాతమ్ = శ్రేష్ఠమగు నుప్ర ‘భాతమును; యే = ఎవరు; భక్తి పూర్ణ హృదయాః = భక్తి తో నిండిన హృదయములు గలవారై ; నిరతమ్ = ఎల్లప్పుడు; పఠన్తి = చదువు చుందురో; తేషామ్ = అట్టివారికి; ఇహ = ఈలోకమున; పరత్ర = పరలోకమున; శర్మ = సౌఖ్యము; ముక్తిః, చ = అంత్యకా కాలము న మోక్షమును; భవేత్ = కలుగును.
తా. ఈ విధమైన మధురార్థములతోడను, గంభీరమైన సత్య ములతోడను కూడిన వీర బ్రహ్మేశ్వరస్వామి సుప్రభాత మును భక్తి భరిత చిత్తులై పఠించువారికి ఇహపరలోకములందు సౌఖ్యమును, అంత్య కాలమున మోక్షమును సంప్రాప్త మగును.
శ్రీ వీరబ్రహ్మ సుప్రభాతమ్ సమాప్తమ్
మరిన్ని సుప్రభాతములు