మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు, మన పెద్దవాళ్ళు తెలుగులో నేటి తరానికి అందించిన సూక్తులు మీ అందరికోసం… ఈ బ్లాగ్ లో వున్నా సూక్తులు మీ భవిష్యత్తుకి ఉపయోగపడతాయని ఆసిస్తూ… మీ భక్తివేద్.కం.
సూక్తులు
- తనకోసం బ్రతికేవాడు స్వార్ధపూరిత మనిషి భార్యా పిల్లల కొరకు బ్రతికేవాడు సాదాసీదా మనిషి పది మంది శ్రేయస్సు కోరేవాడు మంచిమనిషి సర్వజనుల శ్రేయస్సు కోరేవాడు మహా మనీషి.
- గతమంతా నాస్తికాదు అది నీ అనుభవాల ఆస్తి వర్తమానం ఒక వరం భవిష్యత్ ఓ కల-వరం.
- అసత్యం నుండి సత్యమార్గంలో పయనించు చీకటి నుండి వెలుగులోకి వెళ్ళు మృత్యుభయం విడిచి ముందుకునడు అప్పుడు నీకు అపజయమనేది వుండదు.
- పనిలో నిమగ్నమై పట్టుదలతో పనులు చేసేవారికి ఆరోగ్యం చెడిపోదు ముసలితనం రాదు.
- లోకం నన్ను గుర్తించలేదని వూరికే బాధపడేకన్నా లోకాన్ని నేను అర్థం చేసుకున్నానా అని ఆలోచించడం మిన్న !
- దష్టులు భయానికి లొంగుతారు శిష్టులు ప్రియానికి లొంగుతారు లోభులు డబ్బుకు లొంగుతారు ప్రశంసలకు అందరూ లొంగుతారు.
- సిరులు వెదజల్లు ఒక చిరునవ్వు తేనెలొలుకు ఒక చిన్న పలుకు మురిపించు నెంత ముభావినైనా కరిగించునెంత కఠినాత్మునైనా !
- కాకీ పక్షే – కోయిలా పక్షే నోరువిప్పితే తెలుస్తుంది ఏది ఏదో! రాముడూ మనిషే – రంగడూ మనిషే మాట్లాడితే తెలుస్తుంది ఎవరేమిటో!
- విద్యాలయాల్లో విద్య నేర్చుకోవాలని లేదు కార్యాలయాల్లో పని చేయాలని లేదు సంసార జీవితంలో సఖ్యత కోరుకోడం లేదు అన్నీ తెలుసుననే అహంభావంతో ఏదీ నేర్చుకోడం లేదు.
- భయభక్తుల్లేకుండా త్రాగి జజారులో నాట్యంచేసే బ్రదర్ కారునడిపే మరో సోదరుడు నీలాగే త్రాగిన మైకంలో వుంటే నీ ఎముకలు పిండి కాగలవు నీ భార్యా పిల్లల బ్రతుకులు బండలు కాగలవు.
- మనిషి మనస్తత్వం మహా విచిత్రమైనది కార్యం సాధిస్తే తన కార్యదీక్షే కారణ మంటాడు అందులో అపజయం కలిగితే ఆ దయామయుడి దయ మాత్రం లేదంటాడు.
- తప్పొకరు చేస్తున్నారు – శిక్ష మరొకరు అనుభవిస్తున్నారు యీ ప్రపంచ రీతి అర్ధం కాదు తప్పు చేసిన వాడు తప్పించు కుంటున్నాడు అమాయకుడేమో బలి అయిపోతున్నాడు!
- భూమికన్నా ఓర్పుగలది తల్లి ఆకాశం కన్నా ఉన్నతుడు తండ్రి తండ్రి కన్నా ఉన్నతుడు గురువు అన్నిటికన్నా గొప్పది ఆత్మశక్తి.
- ఒక చెంప మీద కొట్టినపుడు మరో చెంప చూపమన్నారు పెద్దలు ఆ సూత్రం పనిచేయనపుడు కొట్టినవాడి రెండు చెంపలు వాయగొట్టడమే న్యాయం !
- నీ విద్యుక్తధర్మాన్ని నిర్యక్ష్యం చేస్తే నీ పనివారే నిన్ను లెక్కబెట్టరు నీ బంధుమిత్రులే నిన్ను ఖాతరుచేయరు నీ భార్యా బిడ్డలే చిన్నచూపు చూస్తారు!
- నేను వీరుణ్ణి శూరుణ్ణి అని విర్రవీగకు కరెంటులేని రాత్రి నాల్గు దోమలు చాలు తెల్లవారే సరికి నీ భరతంపట్టి నీ అవతారాన్నే మార్చివేయడానికి !
- సగం కడుపుకు తినాలి కంటి నిండా నిద్రపోవాలి రెట్టింపు నీరు త్రాగాలి నాలుగు రెట్లు నవ్వాలి.
- కడుపుబ్బునటుల లడ్డూలు తిని కడుపు నొప్పితో బాధపడుతున్న భోజన ప్రియుడికి డాక్టరుగారొక మందు గోలివ్వగా గోలిపట్టే ఖాళీవుంటే మరో లడ్డు పట్టించే వాణ్ని అన్నాడట!
- డబ్బుంటే పవర్ కావాలి పవర్ కావాలంటే పాలిటిక్స్ లో చేరాలి డబ్బుండి పవర్ లేకపోతే అన్నం రుచిండదు పవరుండి డబ్బు రాకపోతే నిద్రపట్టడు.
- బీదవాడి గుడిసె గాలివానకు ఎగిరి పోతుందేమోననే భయం ధనవంతుడి భవనం ఇన్కంటాక్సు బాకీలకింద పోతుందేమోననే భయం.
మరిన్ని సూక్తులు మీకోసం: