విద్యార్థులకు నీతి సూక్తులు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు, మన పెద్దవాళ్ళు తెలుగులో నేటి తరానికి అందించిన సూక్తులు మీ అందరికోసం… ఈ బ్లాగ్ లో వున్నా సూక్తులు మీ భవిష్యత్తుకి ఉపయోగపడతాయని ఆసిస్తూ… మీ భక్తివేద్.కం.

సూక్తులు

 • సమాజంలో మంచి మార్పు తేవాలని పాపమాతడు ఎంత ప్రయత్నిస్తున్నాడో కానీ చుట్టూవున్న కోతులు కొండ ముచ్చులు అతని చిలుక పలుకులు వింటాయా.
 • జీవించినంతకాలం నాపై రాళ్ళు వేసిన యీ ప్రపంచం కళ్ళ కద్దుకుంటున్నది నా మృతదేహాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తున్నది నా శవాన్ని!
 • వచ్చేటప్పుడు గోచీ లేకుండా వచ్చి పోయేటపుడు అడ్రసు లేకుండా పోయే మనిషి మధ్యకాలంలో ఎంత హంగామా చేస్తున్నాడు ఎంతమందికి ఎన్ని సమస్యలు సృష్టి స్తున్నాడు!
 • భార్యకు కొన్ని విషయాలు చెప్పాలి పిల్లలకు కొన్ని విషయాలు చెప్పాలి స్నేహితులకు మరికొన్ని చెప్పాలి అందరికీ అన్నీ చెప్పాద్దు.
 • అద్దాల మేడలు – రంగు రంగుల గోడలు దేశాభివృద్ధికి కావు గీటు రాళ్ళు మనిషిలో నైతిక విలువలు, సమాజంలో సుఖశాంతులే అసలు సిసలైన గీటు రాళ్లు.
 • జీవితమనే పరుగు పందెంలో బోల్తాపదేలా పరుగెత్తకు ఎంత దూరం పరిగెత్తినా చివరి పరుగు సమాధివరకే !
 • నీవొక మొద్దు సన్నాసివి నీకు చస్తే చదువురాదని నిరుత్సాహపరిచే అధ్యాపకుడు ఎంత బుద్దిమంతుడో చెప్పండి.
 • ప్రభుత్వ యంత్రాంగంలో పని చేసే ప్రతి సోదరుడు చెట్టుకు వేరులాంటి వాడు ఇంటికి పునాది లొంటి వాడు.
 • బండ రాయిని పగలగొట్టే వాణ్ణి చూడండి ఎంత నిబ్బరంతో ఎన్ని దెబ్బలు కొడ్తున్నాడు నూరు దెబ్బలకు పగలని రాయినీ నూట ఒక్క దెబ్బకు పగులగొట్టి చూపిస్తాడు.

నీతి సూక్తులు

 • కండలు కరిగేలా కష్టించు కొండలను పిండి కొట్టే శక్తి సంపాదించు కాలం ఎదురు తిరిగినా కండలను కొండలుగా పెంచి నీ కార్యం సాధించు.
 • తలచిన పని తలచినట్టుగా కాలేదని తలపట్టుకొని కూర్చుంటే అవుతుందా? తల తాకట్టు పెట్టో తలనీలాలిచ్చో సాధించాలి నీ ధ్యేయం.
 • కష్టాలెన్ని వచ్చినా క పా నష్టాలెన్నో భరించినా కన్నీళ్ళు తుడ్చే ఆప్తుడు కనీసం ఒకడుంటే చాలు.
 • పదిమంది నడచిన రహదారిలో నడిస్తే నీ ప్రత్యేకతేమున్నది నీదైన ఒక దారిలో నడిచి నీ దారిని రహదారిగా మార్చు.
 • ప్రజలకు కావల్సింది నీ తెలివితేటలు కాదు నీ సిరిసపందలు కావు నీలోని మంచితనం.
 • ఆడుతూ ప్రారంభించిన పని పాడుతూ పూర్తిచేశాడు అన్నిటికీ అనుమానపడే పక్షి ఏమీ సాధించలేక పోయాడు.
 • పనిలో ప్రతికూలత వచ్చిందని ఆ పనికి తిలోదకాలిస్తే ఎలా? గాలి ప్రతికూలంగా వున్నపుడే కదా గాలిపటం ఎగిరేది అలా అలా !
 • ఏ దిశకు అంధకారం ఆపరిస్తుందో ఆ దిశనుండే ఆశాకిరణం ఉదయిస్తున్నది ఎక్కడ తారలు అస్తమిస్తున్నవో అక్కడి నుండే సూర్యుడుదయిస్తున్నాడు.
 • తీర్పు చెప్పేవాడికి నేర్పు అవసరం పాఠం చెప్పేవాడికి ఓర్పు అవసరం.
 • శారీరక బడలిక వల్ల రాదు జబ్బు మానసిక రుగ్మతవల్ల వస్తుంది ఎన్ని మైళ్ళు నడిచినా ఎన్ని గంటలు పని చేసినా అనుకున్న పని అయితే అలసటెక్కడిది?
 • లక్షలు సంపాదించే లక్షాధికారీ జీవితంలో ఏదో కొరవడిందని బాధపడుతున్నావా నీవు కోరుకునే తృప్తి కిళ్ళీకొట్టు వాడి కళ్లలో కనిపిస్తుంది చూడు!
 • జైలు జీవితమనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలలో ఒకడు కటకటాల వెనుక కఠిన బాధలు తలుచుకొని కన్నీరు కారుస్తుంటే మరొకడు అనంతాకాశంలోని తారలను చూసి ఆనందించాడట!
 • ఎదుటివాడి బాగుచూసి అసూయపడకు నీకూ అవకాశమొస్తుంది నిరాశపడకు.
 • కష్టాల కడలిలో కన్నీళ్ళు త్రాగడం నేర్పుకో నిరాశా నిస్పృహల నివారణకు ఆత్మధైర్యం పెంచుకో యీ ప్రపంచంలో నీవనుకున్నది సాధించాలనుకుంటే ప్రాణభీతిని విడిచి పరిస్థితులతో పోరాడటం నేర్చుకో.
 • నీ జీవితాన్ని తూచి చూడు నీవు పనిచేసే త్రాసులో ఎంతకాలం పని చేశావనేది కాదు ఎంత సాధించావనేది ముఖ్యం !
 • నీవు నాటిన కొమ్మ వటవృక్షంగా మారి వందమందికి నీడనిస్తుంది నీవు నిర్మించిన ఆకాశహర్మ్యం పంద కుటుంబాలకు ఆశ్రయమిస్తుంది నీవు నాటిన విషబీజం సమాజంలో చిచ్చుపెట్టి వందలమంది ప్రాణాలు తీస్తుంది.

మరిన్ని సూక్తులు మీకోసం:

Leave a Comment