Ahankaram Vivasa Hetuvu In Telugu – అహంకారం వివాశహేతువు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… అహంకారం వివాశహేతువు నీతికథ.

అహంకారం వివాశహేతువు

(ఉద్యోగపర్వంలో కథ యిది. కృష్ణుడు రాయబారానికివచ్చి తను చెప్పవలసిన హితవు చెప్పాడు. అనంతరం ఆ సభలో ఉన్న మహర్షి పరశురాముడు చేసిన హితబోధ)

నాయనా! దుర్యోధనా !
నీకూ, నీ వారికి సర్వప్రపంచానికి మేలుకలిగే విషయం చెపు తున్నాను. ఆవేశపడకుండా సావధానంగా విను.

చాలారోజుల క్రితంమాట.

దంభోద్భవుడు అనే పేరుగల రాజు ఉండేవాడు. ఆయన ఈ భూమండలం అంతనూ పాలించేవాడు. భుజబలంలో పరాక్రమంలో ఆయనకు సాటివచ్చేవారు లేరు ఆ రోజుల్లో. అంతటి మహాయోధు

ఆయనరోజూ ఉదయంలేచి, కాలకృత్యాలు పూర్తికాగానే బాగా అలంకరించుకొని రత్న కిరీటం ధరించి, కోడెత్రాచువంటి కరవాలంచేత బట్టి సభాభవనానికి వచ్చి బంగారుసింహాసనం అధివసించేవాడు.

వంది మాగధులు ఆయన బలపరాక్రమాలను గానం చేస్తూంటే, కోరమీసం మెలి త్రిప్పుతూ ఆనందించేవాడు.

అనంతరం తన కొలువులో ఉన్న వారందరినీ చూస్తూ:

ఈ భూలోకంలో ఎవడయినా నాతో యుద్ధం చేయగల మహావీరు డున్నాడా ! గదా, ఖడ్గ ప్రాసాది ఆయుధాలతోకాని, ఆగ్నేయ, వారుణ, వాయవ్యాది అస్త్రాలతోకాని నన్ను ఎదుర్కోగల వీరుడుంటే చెప్పండి. అంతేకాదు మల్లయుద్ధం చేయగల వీరుడు ఉన్న వాడిని క్షణంలో కడ తేరుస్తాను.

అని గర్వంగా నవ్వుతూ భుజాలు ఎగురవేసేవాడు.
ఆయన బలపరాక్రమాలెరిగిన వారెవరూ యుద్ధానికి దిగేవారు కారు.

అంతతో ఆయన అహంకారం నానాటికీ పెరుగుతూ వచ్చింది. నా అంతవాడు లేడనే గర్వంతో అయిన విర్రవీగుతూ తిరుగు తున్నారు.

అటువంటి అహంకారం ఉన్న రాజుకి అనుచరులుకూడా అటువంటి దొరుకుతారుకదా!

వారు రోజూ ఆయన బలపరాక్రమాలను పొగుడుతూ ఉండేవారు.

అలా ఉండగా ఒకనాడు ఆయనను చూడడానికి సభాభవనానికి వచ్చిన దూరదేశీయులైన విప్రులు –
మహారాజా! మీరు నిజంగా మహావీరులే. బలవరా తమ సంపన్నులే.
అయితే
గంధమాదనపర్వతంమీద వర నారాయణులని ఇద్దరు తీవ్రనిష్ఠతో తపస్సు చేస్తున్నారు. వారిని జయించగల వీరులు మూడులోకాలలో లేరని విన్నాము. తమకు కోరికఉంటే వారితో యుద్ధం చేయవచ్చు అన్నారు.

ఆ మాట వినడంతో ఆయన ఆగ్రహంతో కత్తి జళిపించి నేలమీద పాదంతో తొక్కి

ఎంతకావరం ! నన్నుమించిన యోధులా వారు, అంటూ సేనలు సన్నద్ధం చేసి ధనుర్బాణాలు తీసుకుని బయలుదేరాడు. గంధమాడన పర్వతం చేరాడు.

ప్రశాంతంగా ఉన్న వనంలో వారు తపస్సు చేసుకుంటున్నారు. వారిని చూస్తూనే తొడగొట్టి యుద్ధానికి పిలిచి, నవ్వుతూ కోరమీసం త్రిప్పాడు.

నర నారాయణులు తమ ఆశ్రమానికి వచ్చిన మహారాజుకి అతిథి సత్కారాలు జరుపబోగా :

ఇవన్నీ అనవసరం, యుద్ధం, యుద్ధం అని అట్టహాసం చేశాడు.
అప్పుడు వారు:

ఎవరితోనూ సంబంధంలేకుండా కళ్ళుమూసుకుని యీ ప్రశాంత ప్రదేశంలో తపస్సు చేసుకునే ముములం. మాతో యుద్ధం చేయాలనే కోరిక ఎందుకు కలిగింది మీకు, అన్నారు.

వినలేదు మహారాజు.
యుద్ధం చెయ్యకతప్పదు, అన్నాడు.
అంటూనే బాణం తొడుగుతూంటే చూచిన నరుడు నవ్వుతూ ఒక దర్భపుల్ల తీసి

ఇదిగో ఈ గడ్డిపరక నీ సేనను నిలబెడుతుంది అని వదిలాడు.

ఆరాజు బాణవర్షం కురిపించాడు. ఆ గడ్డిపరక అన్ని బాణాలనూ ముక్కలు ముక్కలు చేసింది.

ఈలోగా సేనలోని వారందరూ ముక్కులూ, చెవులూ ఊడిపోయి రోదనం ఆరంభించారు.

రాజుకి తల తిరిగింది.
సేవలు పలాయనం చేస్తున్నాయి
చూసిన రాజుకి గుండె జారింది.
ఆయుధాలన్నీ క్రింద పెట్టి, తలవంచి నర నారాయణుల పాదాల మీద వ్రాలి:

ఆర్యా ! నన్ను క్షమించి అనుగ్రహించండి. నా గర్వానికి ప్రాయ శ్చిత్తం అయింది, అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు వారు నవ్వుతూ ! మహారాజా

సిరి సంపదలు కలవారు పేద సాదలకు దాన ధర్మాలు చేసి గొప్ప వారు కావాలి.
అలాగే బల పరాక్రమాలు ఉన్నవారు దుర్మార్గుల బారినుండి పజ్జను లను రక్షించడానికి తమశక్తిని వినియోగించాలి. అంతేకాని, అహం కారంతో తిరగరాదు.

ఇరుగు పొరుగులకు ఉపకారం చేయని వాడి జన్మవ్యర్థం- అన్నారు.

మహారాజు వారి బోధవిని, ఆనాటినుంచీ అహంకారం విడిచి, అందరి శ్రేయస్సూ దృష్టిలో ఉంచుకొని తన సంపదలను బీదలకు దానం చేస్తూ, తన బలంతో దుర్మార్గులనూ, క్రూరులనూ శిక్షించి, న్యాయమార్గాన సజ్జనసేవచేసి పేరు ప్రఖ్యాతులు పొందాడు.

కనక, దుర్యోధనా !
అహంకారం, బలగర్వం ఎప్పుడూ పనికిరావు. అవి ఎవరికి ఉంటాయో వారినే నాశనం చేస్తాయి, అన్నాడు పరశురాముడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Leave a Comment