మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… అన్నదాన మహిమ గొప్పది నీతికథ.
అన్నదాన మహిమ గొప్పది
(ఈ కథ అశ్వమేధ పర్వంలో ఉంది. వైశంపాయనునిచే జనమేజయునికి చెప్పబడింది.)
ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులూ, మహారథులూ ఎందరో కన్ను మూశారు. పద్దెనిమిది అక్షోహిణులసేనలో కురుపక్షంలో అశ్వత్థామ కృతవర్మ, కృపాచార్యులు మిగిలారు. ఇటు పాండవులయిదుగురు, కృష్ణుడూ, సాత్యకీ మిగిలారు.
ధర్మరాజుకి పట్టాభిషేకం జరిపించారు. అంపశయ్యమీద ఉన్న భీష్మపితామహుడు సర్వధర్మవిషయాలూ బోధించి ఉత్తరాయణ పుణ్య కాలం ప్రవేశించగానే యోగమార్గాన దివ్యలోకాలు చేరాడు. జరిగిన సంగ్రామంలో ఆప్తులు, ఆత్మీయులూ అందరూ మరణిం చారనే బాధ ధర్మరాజు మనస్సుని వికలంచేస్తూనే ఉంది. ఈ మహా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించగా అశ్వమేధం సాగించ మని విద్వాంసులు సలహా యిచ్చారు.
వారి ఆదేశానుసారం అశ్వమేధయాగం ఆరంభించాడు. దేశ దేశాలనుంచి చక్రవర్తులూ, విద్వాంసులూ ఎందరో వచ్చారు. వివిధ నగరాలనుంచి, జనపదాల నుంచి లక్షలాది ప్రజలు ఆ యాగం తిల కించడానికి వస్తున్నారు. చూడవచ్చిన వారందరికీ వస్త్రదానంతోపాటు నిర్విరామంగా అన్న దానం గూడా జరిపించాడు. యోగ్యులై నవారికి సువర్ణ, మణి, రత్నదానాలు చేశాడు. అక్కడకు వచ్చినవారిలో సంతృప్తిపడకుండా ఉన్నవాడు ఒకడూ లేడు. అలా సర్వజన సంతృ ప్తికలిగించిన అశ్వమేధయాగం చూచిన దేవ తలు పూలవాన కురిపించి ధర్మరాజుని అభినందించారు.
అలా ఆనందించే సమయంలో ఆ యాగశాల సమీపానికి ఒక ముంగిన వచ్చింది. వారందరూ ఈ శాలలోకి ముంగిన ఎలా వచ్చిందా? అని ఆశ్చర్యంతో చూస్తున్నారు.
అప్పుడా ముంగిస నవ్వుతూ ‘దేవతలు కూడా అభినందించే యాగమా యిది’ అంది. తెల్లబోయారు అందరూ. దాని శరీరంలో ఒకభాగం బంగారు కాంతులీనుతోంది. రెండవ భాగం మామూలు చర్మంతో ఉంది.
‘సక్తుప్రస్థుడి ధర్మ బుద్ధితో పోలిస్తే యీ యాగశాలలో జరిగిన దానం ఏమాత్రం’? అంది.
అందరూ తెల్లబోయారు. దానినిచూస్తూ : ‘ఎవరా మహనీయుడు । ఏవిటాయన కథ’ అన్నారు. అలా వారు ఆతురతతో అడుగగా : ‘సావధానంగా వినండి’ అని ఇలా చెప్పింది ముంగిస.
‘ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో చాలాకాలం క్రితం సత్తు ప్రస్థుడనే పేరుగల గృహయజమాని ఉండేవాడు. ఆయనకు ఒకే కుమారు డుండేవాడు. ఆ అబ్బాయికి కూడా వివాహం అయింది. వారు నలుగురూ సర్వభూత కోటిని దయతోచూస్తూ, కామ క్రోధాలు విడిచి తపస్సు చేసుకుంటున్నారు. కొడుకూ, కోడలూ ఆ వృద్ధులను సేవిస్తూ ఉండేవారు. ఎవ్వరికీ హానిచేయకుండా ఏ పూటకు ఆ పూట దొరికినదాన్ని తిని తృప్తిగా జీవితం గడుపుతున్నారు.
పరబ్రహ్మమీదనే మనస్సునిలిపి జీవితం సాగించడానికే ఆహారం తీసుకునేవారు. ఆ జీవితంకూడా వరమేశ్వరధ్యానానికే అర్పించేవారు.
అలా ఉండగా ఒకనాడు :
వారు తమ పరిసర ప్రాంతాలలోని చేలలో తిరిగి, అక్కడ రాలిన ధాన్యపుగింజలు ఏరి తెచ్చుకుని, దంచి, పండిచేసి, వండుకుని నలుగురూ సమంగా పంచుకున్నారు. తినడానికి సిద్ధమవుతున్నారు. అటువంటి సమయంలో, ఒక వృద్ధుడు వచ్చాడు. ఆయనకళ్ళు లోతుకు పోయాయి. ఎముకలు బయట పడుతున్నాయి. డొక్కలు మాడి ఉన్నాయి. ఆకలి, ఆకలి అని నీరసంగా అడిగాడు.
ఆయనను ఆదరంగా తీసుకునివచ్చి, తన పక్క కూర్చో పెట్టుకుని ఆర్యా ! తమరు కుశలమే కవ! మా ఆతిథ్యం స్వీకరించి, అనుగ్ర హించండి. ఏ ప్రాణికీ హాని కలుగకుండా, ఏ పాపానికి ఒడిగట్టకుండా మేంతెచ్చుకున్న ధాన్యపుగింజల పిండితో వండిన ఆహారం యిది. దీనితో మీ ఆకలిబాధ నివారించుకోండి అని గృహయజమాని తపభాగం ఆయ ఐకు వడ్డించాడు.
అది ఆరగించి తనకింకా ఆకలిగా ఉంది అన్నాడు. ఆ మాట వింటూనే ఆయనభార్య తనభాగం యిచ్చింది. ఇంకా ఆ వృద్ధుని ఆకలిబాధ తీరలేదని తెలిసి కొడుకూ, కోడలూ కూడా వారి ఆహారం ఆయనకు పెట్టారు. అంతా ఆరగించి, ఆయన ఆనందంతో ‘నాయనా మీ అతిథిసత్కారం, అన్నదానం నాకు తృప్తి కలి గించాయి. నీతోపాటు నీకుటుంబంలోని వారంతా ఎంతో ఆకలితో బాధ పడుతూకూడా మీరు తినబోయే ఆహారం దానంచేసి, పుణ్యం సాధించారు. మీ దానబుద్ధిని సర్వలోకాలు మెచ్చుకుంటాయి.
ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికైనా ఒడి గడతాడు. అన్నంకోసం ఎన్నో దారుణాలు చేస్తాడు మానవుడు. అటువంటి దశలో మీ దానబుద్ధి ఎంత గొప్పదో దేవతలు కూడా గ్రహించారు దయగలగుండె కలవారే ఆశకు దూరం అవుతారు. ఈ రెండూవున్న మీకు దివ్యలోకాలు లభిస్తాయి. ఆకలితో అలమటించే ప్రాణికి యింత అన్నం పెట్టడంకంటే ఏ దానమూ గొప్పదికాదు. అటువంటి అన్న దానం చేసిన పుణ్యాత్ములు మీరు ‘ అంటూండగా దేవవిమానం వచ్చింది. వారందరూ ఆ విమానం ఎక్కి వెళ్ళారు.
ఇదంతా వింటూ చూసిననేను వారు వెళ్ళిన అనంతరం ఆ ప్రాంత ములో ఆ అతిథిపాదాలు కడిగినచోట తిరిగాను. తిరిగినప్రక్క ఆ పాదాలు కడిగిన నీటితడి తగిలిన నా దేహంలో ఈ భాగం బంగారు మయమయింది.
అనంతరం ఎన్నెన్నో దాన, ధర్మాలు సాగే ప్రదేశాలు తిరిగినా ఈ రెండపప్రక్క దేహం యిలానే ఉండిపోయింది. ఇక్కడకూడా అంతే. నవ్వుతూ వెళ్ళిపోయింది ముంగివ.
మరిన్ని నీతికథలు మీకోసం: