మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ఏకవింశః సర్గలో, రాముడు, సీతమ్మ మరియు లక్ష్మణులు పంచవటి ప్రాంతంలో నివాసం ప్రారంభిస్తారు. పంచవటిలో వాతావరణం అందంగా ఉంటుంది. అక్కడ వారు చిన్న ఆశ్రమాన్ని నిర్మించి నివసిస్తారు. ఈ సుందర వాతావరణంలో సీతమ్మ పూలతో అలంకరణలు చేస్తూ సంతోషంగా గడుపుతుంది.
ఖరసంధుక్షణమ్
స పునః పతితాం దృష్ట్వా క్రోధాచ్ఛూర్పణఖాం ఖరః |
ఉవాచ వ్యక్తయా వాచా తామనర్థార్థమాగతామ్ ||
1
మయా త్విదానీం శూరాస్తే రాక్షసా రుధిరాశనః |
త్వత్ప్రియార్థం వినిర్దిష్టాః కిమర్థం రుద్యతే పునః ||
2
భక్తాశ్చైవానురక్తాశ్చ హితాశ్చ మమ నిత్యశః |
ఘ్నంతోఽపి న నిహంతవ్యా న న కుర్యుర్వచో మమ ||
3
కిమేతచ్ఛ్రోతుమిచ్ఛామి కారణం యత్కృతే పునః |
హా నాథేతి వినర్దంతీ సర్పవల్లుఠసి క్షితౌ ||
4
అనాథవద్విలపసి నాథే తు మయి సంస్థితే |
ఉత్తిష్ఠోత్తిష్ఠ మా భైషీర్వైక్లబ్యం త్యజ్యతామిహ ||
5
ఇత్యేవముక్తా దుర్ధర్షా ఖరేణ పరిసాంత్వితా |
విమృజ్య నయనే సాస్రే ఖరం భ్రాతరమబ్రవీత్ ||
6
అస్మీదానీమహం ప్రాప్తా హృతశ్రవణనాసికా |
శోణితౌఘపరిక్లిన్నా త్వయా చ పరిసాంత్వితా ||
7
ప్రేషితాశ్చ త్వయా వీర రాక్షసాస్తే చతుర్దశ |
నిహంతుం రాఘవం క్రోధాన్మత్ప్రియార్థం సలక్ష్మణమ్ ||
8
తే తు రామేణ సామర్షాః శూలపట్టిశపాణయః |
సమరే నిహతాః సర్వే సాయకైర్మర్మభేదిభిః ||
9
తాన్ దృష్ట్వా పతితాన్భూమౌ క్షణేనైవ మహాబలాన్ |
రామస్య చ మహత్కర్మ మహాంస్త్రాసోఽభవన్మమ ||
10
అహమస్మి సముద్విగ్నా విషణ్ణా చ నిశాచర |
శరణం త్వాం పునః ప్రాప్తా సర్వతోభయదర్శినీ ||
11
విషాదనక్రాధ్యుషితే పరిత్రాసోర్మిమాలిని |
కిం మాం న త్రాయసే మగ్నాం విపులే శోకసాగరే ||
12
ఏతే చ నిహతా భూమౌ రామేణ నిశితైః శరైః |
యేఽపి మే పదవీం ప్రాప్తా రాక్షసాః పిశితాశనాః ||
13
మయి తే యద్యనుక్రోశో యది రక్షస్సు తేషు చ |
రామేణ యది తే శక్తిస్తేజో వాఽస్తి నిశాచర ||
14
దండకారణ్యనిలయం జహి రాక్షసకంటకమ్ |
యది రామం మమామిత్రం న త్వమద్య వధిష్యసి ||
15
తవ చైవాగ్రతః ప్రాణాంస్త్యక్ష్యామి నిరపత్రపా |
బుద్ధ్యాఽహమనుపశ్యామి న త్వం రామస్య సంయుగే ||
16
స్థాతుం ప్రతిముఖే శక్తః సబలశ్చ మహాత్మనః |
శూరమానీ న శూరస్త్వం మిథ్యారోపితవిక్రమః ||
17
మానుషౌ యౌ న శక్నోషి హంతుం తౌ రామలక్ష్మణౌ |
రామేణ యది తే శక్తిస్తేజో వాఽస్తి నిశాచర ||
18
దండకారణ్యనిలయం జహి తం కులపాంసన |
నిఃసత్త్వస్యాల్పవీర్యస్య వాసస్తే కీదృశస్త్విహ ||
19
అపయాహి జనస్థానాత్త్వరితః సహబాంధవః |
రామతేజోఽభిభూతో హి త్వం క్షిప్రం వినశిష్యసి ||
20
స హి తేజః సమాయుక్తో రామో దశరథాత్మజః |
భ్రాతా చాస్య మహావీర్యో యేన చాస్మి విరూపితా ||
21
ఏవం విలప్య బహుశో రాక్షసీ వితతోదరీ |
భ్రాతుః సమీపే దుఃఖార్తా నష్టసంజ్ఞా బభూవ హ |
కరాభ్యాముదరం హత్వా రురోద భృశదుఃఖితా ||
22
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ఏకవింశః సర్గః ||
Aranya Kanda Sarga 21 Meaning In Telugu
పదునాలుగు మంది రాక్షస వీరులను వెంటబెట్టుకొని వెళ్లిన శూర్పణఖ వెంటనే ఒంటరిగా రావడం చూచి ఆశ్చర్యపోయాడు ఖరుడు.
“ఏంటి శూర్పణఖా! ఏమయింది. నీవు కోరితేనేకదా నీ వెంట 14 మంది రాక్షస వీరులను పంపాను. మరలా ఏడుస్తూ వచ్చావెందుకు. ఊరికే అలా భయపడితే ఎలాగా! నేను ఉన్నాగా నీకెందుకు భయం. ఏం జరిగిందో చెప్పు” అన్నాడు ఖరుడు.
ఖరుని చూచి వ్యంగ్యంగా ఇలా అంది శూర్పణఖ. “ముక్కు, చెవులూ కోయించుకొని రక్తంకారుకుంటూ ఏడ్చుకుంటూ నీదగ్గరకు వచ్చానా! నీవు నన్ను ఓదార్చావు కదా! రామలక్ష్మణులను చంపడానికి 14 మంది రాక్షస వీరులను పంపావు కదా! మహావీరుల మాదిరి శూలాలు ధరించి ఆ 14మంది నా వెంట వచ్చారు కదా! క్షణకాలంలో రాముడిచేతిలో గుండెలు పగిలి చచ్చారు. ఇదీ మనవాళ్ల ప్రతాపం. ఇంక భయపడక చస్తానా! వాళ్లందరూ అలా క్షణకాలంలో నేలమీద పడగానే నాకు వణుకు పుట్టింది. పరుగెత్తుకుంటూ వచ్చాను.
ఓ ఖరా! నాకు భయంగా ఉంది. రామలక్ష్మణులు ఏవైపు నుంచి అన్నా రావచ్చు. నిన్ను, నన్ను చంపవచ్చు నీకు నా మీద జాలి దయ ఉంటే, ఆ రామలక్ష్మణులను ఎదిరించే శక్తి, బలము ఉంటే, దండకారణ్యములో నివాసమేర్పరచుకొన్న ఆ రామలక్ష్మణులను వెంటనే చంపు. వాళ్లు సామాన్యులు కాదు. రాక్షసులను చంపడానికి వచ్చిన దేవతలు. నీవు కనక రాముడిని చంపకపోతే నేను నీ ఎదుటనే ఆత్మహత్య చేసుకొని చస్తాను.
అయినా నీకు ఇంత సైన్యము, ఇంత బలము, పరాక్రమములు ఉండి ఏం ప్రయోజనం. ఇద్దరిని చంపలేకపోయావు. అసలు నువ్వు అయినా రాముని ఎదుట నిలిచి యుద్ధం చెయ్యగలవా అని నా అనుమానము.
ఖరా! వాళ్లు సామాన్య మానవులు. నీ సైన్యము ఆ మానవులను చంపలేకపోయాయి. నీవేదో పెద్ద పరాక్రమవంతుడవని డంబాలు పలుకుతున్నావు. నీ పరాక్రమము శూరత్వము ఎందుకు తగలపెట్టనా! నా మాటవిని ఈ జనస్థానము వదిలి ఎక్కడికన్నా వెళ్లి బతుకు పో! నువ్వు రాక్షసకులంలో చెడ బుట్టావు. అందుకే మానవులకు భయపడుతున్నావు.
ఓ ఖరా! ఆఖరుసారిగా చెబుతున్నాను విను. నీకు రాముని ఎదిరించే వీరత్వము ఉంటే, నీ సైన్యంతో వెళ్లి రామలక్ష్మణులను చంపు. లేకపోతే, నీ బంధుమిత్రులతో ఈ జనస్థానము వదిలి పారిపో! అదే ఉత్తమము. రాముని తేజస్సు ముందు నీవు నిలువలేవు. అందుకే నా ముక్కు చెవులు కోసినా ఇంకా రామలక్ష్మణులు బతికే ఉన్నారు.” అని సూటిపోటీ మాటలతో ఖరుని రెచ్చగొట్టింది శూర్పణఖ.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓతత్సత్.
అరణ్యకాండ ద్వావింశః సర్గః (22) >>