Sri Ramadasu Keerthanalu 41-50 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

Sri Ramadasu Keerthanalu 41-50 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

ఈ పోస్ట్ లో శ్రీ రామదాసు గారి కీర్తనలు వేదములో అనేక సంగీత పారంపర్యాలు ఉన్నాయి.

41. నాదనామక్రియ ఏకతాళం

పల్లవి : తానీషా : ఏ దేశమున నుండువారు మీరలెందుండి యిట వచ్చినారు
రామ : తొలుత గోదావరియందు మా స్థలమది భద్రాచలమందు
తానీషా : ఎవరి జవానులు మీరు మిమ్మెవరు బంపక వచ్చినారు
రామ :దాసజవానులు మేము రామదాసు పంపగ వచ్చినాము
తానీషా : ఏ కులమువారు మీరు మీరిద్దరు నే వరుసవారు
రామ : ఇనవంశమున బుట్టినాము మేమిద్దర మన్నదమ్ములము
తానీషా : ఏమి నామము గలవారు మీరేమి నియమము గలవారు
రామ : రామోజీ లక్ష్మోజినామం వహ్వా రామానుజ మతమువారం
తానీషా : ఎన్నిదినములనుండి మీరు వారిసన్నిధి కొలువై యున్నారు
రామ : తాతముత్తాతలు మేము మూడుతరములనుండి యున్నాము
తానీషా : ఏమి జీతమిచ్చెదరు మీకు ఏమి జీవనమిచ్చెదరు
రామ : సమ్మతిలేని జీతము ప్రసాదమునకే కుదిరినాము
తానీషా : ఎందుకు పంపించినారు మీరేమి పనిగ వచ్చినారు.
రామ : సర్కార్బాకీ పైకము మాచేత బంపగ వచ్చినాము
తానీషా : అర్థమంతయు దెచ్చినారా లేక వ్యర్థముగ వచ్చినారా
రామ : వ్యర్థులముగ మేము రాము మీయర్థమంత దెచ్చినాము
తానీషా : బైఠోజి బైరోజి మీ మాటలు చూడగ వేరు
రామ : బైఠోజి వారముగాము మీ భేటికి వచ్చినాము
తానీషా : లక్షలారును దెచ్చినారా యింకా శిక్షలో నుండమన్నారా
రామ : లక్షలారునియ్యగలము మూడు లక్షలు మేమియ్యగలము
తానీషా : పంపిన పైకము తెండి యాపయిన తమాషా చూడండి
రామ : పదివేలు తెచ్చినామండి యాపయిన మాచేత లేదండి
తానీషా : మగురూర్మాటలు మీతో మాతో మరలించుచున్నారు.
రామ : మగురూరి వారితో మేము మాట్లాడువారము కాము
తానీషా : ధనము మాచేతికియ్యండి యావెనుక ఖైదులోకి పొండి
రామ : ఖైదులోకి మేము పోము మీ ఖజాన పైకమిచ్చేము
తానీషా : చెల్లింతురా ద్రవ్యమంత రసీదు నడుగుట కడువింత
రామ : ఉంగరంబులీడెమందు నుప్పొంగుచు తొడదట్టెయందు
తానీషా : మొహరువేసినంతను మోహనాంగుడు సంతసమునను

42. మధ్యమావతి చాపుతాళం

పల్లవి : ఏదేశము మీది యెవ్వరు బంపిరి యెందుకై వచ్చితిరి
భేదమొందక యతి భీతి నొందక మాకు
ఖ్యాతిగ జెప్పిన గాచేము మిమ్మిపుడు
అజునికైన నలవికాదిచటికి రాగ అర్థరాత్రియందున
గజ సింహములనైన ఖండించు భటులెంతో
కావలియుండగ గడిచివచ్చితి రెట్లు
అర్థమంతయు జూడ నాశ్చర్యమాయేను
అటు భారమెటు దెస్తిరి
భద్రేభములకైన బరువైతోచు నీ యర్థము
మీరెచట నార్జించి తొ చ్చితిరి

॥ఏదేశము॥

మీ రూపు మీ సొగసు మీ చక్కదన మెన్నలేరు
ఈ ధరయందున
మాయావేషముల గారడి మాయమీరు
నెరవుతో బన్నివారనితోచెను
ఇంత రాత్రివేల నీ యర్థమిప్పుడు
ఎంతని పరికింపను
రంతు సేయక రేపంతయు చెల్లింపుడు

॥ఏదేశము॥

అంతదనుక ఖైదులోనుండు డనెనపుడు

||ఏదేశము ||

43. ఆనందభైరవి ఆదితాళం

పల్లవి : ఏమిటిది దయరాదు శ్రీరాములు
నన్ను నేమిటికి రక్షింప శ్రీ రాములు
పరులను వేడబోను శ్రీరాములు
నీకే కరములు చాచి యున్నాను శ్రీరాములు
పండ్రెండేండ్లాయె నేమి శ్రీరాములు
బందిఖానాలో నేనుండినాను శ్రీరాములు

||ఏమిటిది||

అర్థము తెమ్మనుచునన్ను శ్రీరాములు
ఇప్పుడరికట్టనెంచినారు శ్రీరాములు

||ఏమిటిది||

తానీషాగారి జవానులు నన్ను
తహసీలు చేయుచున్నారు శ్రీరాములు

||ఏమిటిది||

ముచ్చటైన యాడతేన శ్రీరాములు
నీవు యిచ్చే యర్థము లియ్యనేడు శ్రీరాములు

||ఏమిటిది||

నీచేగాకున్న నింకను శ్రీరాములు
మాతల్లి సీతమ్మలేదా శ్రీరాములు

||ఏమిటిది||

మాతల్లి సీతమ్మకైన శ్రీరాములు
నేను మనవి చెప్పుకొందునయ్య శ్రీరాములు

||ఏమిటిది||

ఆశించియుండిన దాసుని శ్రీరాములు
నీకు పోషి భారము లేదా శ్రీరాములు

||ఏమిటిది॥

నిన్ను నమ్మినానయ్య శ్రీరాములు
నేను గట్టిగా నా మదిలో శ్రీరాములు

॥ఏమిటిది ||

ఇల్లు వదలిటురావదేమి శ్రీరాములు
మీకు విడిది భద్రాచలమాయెనో శ్రీరాములు

॥ఏమిటిది ||

వాసిగభద్రాద్రి వెలిసిన శ్రీరాములు
రామదాసుని రక్షింపరాదా శ్రీరాములు

॥ఏమిటిది ||

44. నాదనామక్రియ ఆదితాళం

పల్లవి : ఏమిరా రామా నావల్ల నేరమేమిరా రామ
ఏమి రామ యీలాగుకష్టము నీ మహిమో నా ప్రారబ్ధమో
కుండలి శయనా వేదండరక్ష కాఖండతేజ నాయండ నుండవే

||ఏమిరా||

పంకజలోచన శంకరసుత సంకటములు మాన్పవే పొంకముతోను

||ఏమిరా||

సుందరధర నీ సుందర పదములు ఇందిరేశ కనుగొందుచూపవే

||ఏమిరా||

దినమొక యేడుగ ఘనమున గడిపెద తనయుని మీదను దయలేదయ్యయ్యో

||ఏమిరా||

సదయాహృదయ నీ మృదుపదములు నా హృదయ కమలమున వదలక నిల్పెద
రామరామ భద్రాచల సీతారామదాసుని ప్రేమతో నేలవే

||ఏమిరా॥

45. బేగడ ఏకతాళం

పల్లవి : ఎలాగు తాళుదు నేమి సేతు రామా
ఈ జాలిచేతను తాళజాలను రామా
దీనజనుల కెల్ల దిక్కు నీవే రామా
మనమున నిన్ను నేమరవనో రామా

||ఏలాగు||

పావనమూర్తి యో పట్టాభి రామా
కావవే యీవేళ కౌశల్య రామా

||ఏలాగు||

శరణుని నీ మరుగు జేరితి రామా
శరణంటే కాచేది బిరుదు రఘురామా

||ఏలాగు||

చెప్పరాని ప్రేమ నెంచు దాతుర రామా
ఆపన్న రక్షకుడ నాపాలి శ్రీరామా

||ఏలాగు||

నీ సొమ్మునే నటుల నిజమాయె రామా
నా దోషములనన్ని దొలగింపవె రామా

||ఏలాగు||

రాతికైన చెమట రంజిల్లునో రామా
ఆతీరు నీ మనసు నొందుదు శ్రీరామా

||ఏలాగు||

యమబాధ నొందగ నేరనో రామా
యమదండనలు లేక యెడబాపు రామా

||ఏలాగు||

వాసిగ రామకీర్తనలు జేసితి రామా
రామదాసునిమీద దయయుంచు శ్రీరామా

||ఏలాగు||

46. మధ్యమావతి ఆదితాళం

పల్లవి : ఓరఘు నీవాయని నే బిలిచిన
నోహో యనరాదా
సారెకు మరి వేసారి యన్యము
చేరదు నామది యేరా ధీరా
నీటజిక్కి కరి మాటికి వేసరి
నాకట ధర నీపాటల బాడగ
మేటి మకరి తలమీటి కాదు దయ
ఏనాటికి నాపై నేటికి రాదో

||ఓరగు||

మున్ను సభను నా పన్నత వేడుచు
మిమ్ము కృష్ణాయని యెన్నగ ద్రౌపది
కెన్నో వలువలిచ్చి మన్నన బ్రోచిన
వెన్నుడ నా మొర వింటివో లేదో

||ఓరగు||

బంటునైతినని యుంటే పరాకున
నుంటిని తెలిసి ముక్కంటి వినుత నా
జంట బాయకను వెంట రమ్మని వేడు
కొంటి భద్రగిరి రామదాస పోషక

||ఓరగు||

47. శంకరాభరణము రూపకతాళం

పల్లవి : కంటినేడు మా రాముల కనుగొంటి నేడు
కంటి నేడు భక్తగుణముల మాపాలి
మా జంటభద్రగిరి నంటియున్నవాని

॥కంటినేడు॥

చెలువొప్పుచున్నట్టి సీతాసమేతుడై
కొలువు తీరిన మా కోదండరామ

॥కంటినేడు॥

కమలాప్త తిలకము ఘన నీల గాత్రము
కరుణారసము గురియు కందోయి గలవాని

॥కంటినేడు॥

హుకుమంజి ముత్యాలసరములు మెరయగ
మురిపెంపు చిరునవ్వు మోము గలిగినవాని

॥కంటినేడు॥

ఘల్లుఘల్లుమని పైడి గజ్జెలందెలు మ్రోయు
తళుకు బెళుకు పాదతలము గలిగినవాని

॥కంటినేడు॥

కరకు బంగారుచేల కాంతిజగము గొప్ప
శరచాపములు కేల ధరియించు స్వామి

॥కంటినేడు॥

ధరణి శ్రీరామదాసుని రక్షించు
పరమపురుషుడైన భద్రగిరీశుని

॥కంటినేడు॥

48. కాంభోజి ఏకతాళం

పల్లవి : కటకట నీదు సంకల్పమెట్టిదో గాని
నేనెంతవాడనురా రామా
నిటలాక్షుడు తొల్లి నీ మాయ గనలేక
తటుకుపడి నీవల దగిలెను గనుక

॥కటకట॥

శరణన్న మునులను బిరబిర బ్రోచెడు
బిరుదుగల్గిన దొరవే ఓ రామా
పరిపరి విధముల మొరలిడ వినక
నన్నరమర చేసిన హరి నిన్నే మందు

॥కటకట॥

భావ జనక నా భావ మెరుగవే
వేగమున రాగదే దేవా
దేవాదిదేవా దీనశరణ్య
నీవే దిక్కని నిక్కము నమ్మితి

॥కటకట॥

గీర్వాణసుత భద్రగిరివాసా
సర్వయోగీశ్వర రామా
సర్వాత్మ రామదాస హృదయాబ్జ నిలయా
సర్వాధారా పరాకేల రామా

॥కటకట॥

49. సౌరాష్ట్ర ఆదితాళం

పల్లవి : కరుణించి దైవలరామ అహో
పరమపావననామ పట్టాభిరామా

||కరుణించి||

అన్న వస్త్రము లిత్తుమనుచు దొరలన్నారు మన్నించెదవనుచు
ఆయురన్నం ప్రయచ్ఛతి యనుచు మారకున్నను నీవే మాకున్నావనుచు

||కరుణించి||

మరియింత కాలమ్ముదనుకా మమ్ము మరచితివని ఒప్పుకొనర
మమ్ము దరిజేర్చినంతదనుకా మీది శరణాగత త్రాణ బిరుదటు కనుక

||కరుణించి||

నరులను గొలచుటకన్నా భద్రగిరిరాఘవుని వేడుకొన్నా
ఇహపరము లిలగలవని విన్నా నేను దరహాసము నా రామదాస ప్రసన్నా

||కరుణించి||

50. కన్నడ ఆదితాళం

పల్లవి : కలనిజమాయె కలికిరో వినవే
కలనిజమాయెనే
చూపున బాలారే సొగసైన రౌతులే
రేపనరాదే యో రమామణి నమ్మలేదు

||కల||

నా మదిలో నిన్ను నరులని గాన లే
నీ మహిలో నేనెరుగనివారే

||కల||

పురుషులు చూడగ పురాణపురుషులే
మర్యాదలేదే మహానుభావులే

||కల||

దాస జవానులే జాతి కబీరులే
వాసవిసుతులే వారిజనేత్రులే

||కల||

భద్రాద్రి వాసులే భవ్య యశోద్భష్ణాలే
భద్రాద్రి రామదాసపాలిట చిద్విరాసులే

||కల||

మరిన్ని కీర్తనలు:

Leave a Comment