మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” సప్తదశః సర్గలో, శూర్పణఖ, రామాయణంలోని సమస్య రాక్షసత్వం ఇక్కడ ప్రవేశిస్తుంది. ఆమె రాముడి కుటీరానికి చేరుకుని రాముడికి తన భార్యను అందజేస్తుంది. ఆమె రావణుడి సోదరి మరియు ఆమె భర్త విద్యుత్ జిహ్వాను రావణుడు ఒంటరిగా చంపాడు, అతని స్వంత సోదరిని వితంతువుగా మార్చాడు. పాత రాక్షసి అయిన ఆమె సీతను విడిచిపెట్టి రాముడు తనను వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది.
శూర్పణఖాభావావిష్కరణమ్
కృతాభిషేకో రామస్తు సీతా సౌమిత్రిరేవ చ |
తస్మాద్గోదావరీతీరాత్తతో జగ్ముః స్వమాశ్రమమ్ ||
1
ఆశ్రమం తముపాగమ్య రాఘవః సహలక్ష్మణః |
కృత్వా పౌర్వాహ్ణికం కర్మ పర్ణశాలాముపాగమత్ ||
2
ఉవాస సుఖితస్తత్ర పూజ్యమానో మహర్షిభిః |
లక్ష్మణేన సహ భ్రాత్రా చకార వివిధాః కథాః ||
3
స రామః పర్ణశాలాయామాసీనః సహ సీతయా |
విరరాజ మహాబాహుశ్చిత్రయా చంద్రమా ఇవ ||
4
తథాసీనస్య రామస్య కథాసంసక్తచేతసః |
తం దేశం రాక్షసీ కాచిదాజగామ యదృచ్ఛయా ||
5
సా తు శూర్పణఖా నామ దశగ్రీవస్య రక్షసః |
భగినీ రామమాసాద్య దదర్శ త్రిదశోపమమ్ ||
6
సింహోరస్కం మహాబాహుం పద్మపత్రనిభేక్షణమ్ |
ఆజానుబాహుం దీప్తాస్యమతీవ ప్రియదర్శనమ్ ||
7
గజవిక్రాంతగమనం జటామండలధారిణమ్ |
సుకుమారం మహాసత్త్వం పార్థివవ్యంజనాన్వితమ్ ||
8
రామమిందీవరశ్యామం కందర్పసదృశప్రభమ్ |
బభూవేంద్రోపమం దృష్ట్వా రాక్షసీ కామమోహితా ||
9
సుముఖం దుర్ముఖీ రామం వృత్తమధ్యం మహోదరీ |
విశాలాక్షం విరూపాక్షీ సుకేశం తామ్రమూర్ధజా ||
10
ప్రీతిరూపం విరూపా సా సుస్వరం భైరవస్వరా |
తరుణం దారుణా వృద్ధా దక్షిణం వామభాషిణీ ||
11
న్యాయవృత్తం సుదుర్వృత్తా ప్రియమప్రియదర్శనా |
శరీరజసమావిష్టా రాక్షసీ వాక్యమబ్రవీత్ ||
12
జటీ తాపసరూపేణ సభార్యః శరచాపధృత్ |
ఆగతస్త్వమిమం దేశం కథం రాక్షససేవితమ్ ||
13
కిమాగమనకృత్యం తే తత్త్వమాఖ్యాతుమర్హసి |
ఏవముక్తస్తు రాక్షస్యా శూర్పణఖ్యా పరంతపః ||
14
ఋజుబుద్ధితయా సర్వమాఖ్యాతుముపచక్రమే |
అనృతం న హి రామస్య కదాచిదపి సమ్మతమ్ ||
15
విశేషేణాశ్రమస్థస్య సమీపే స్త్రీజనస్య చ |
ఆసీద్దశరథో నామ రాజా త్రిదశవిక్రమః ||
16
తస్యాహమగ్రజః పుత్రో రామో నామ జనైః శ్రుతః |
భ్రాతాయం లక్ష్మణో నామ యవీయాన్ మామనువ్రతః ||
17
ఇయం భార్యా చ వైదేహీ మమ సీతేతి విశ్రుతా |
నియోగాత్తు నరేంద్రస్య పితుర్మాతుశ్చ యంత్రితః ||
18
ధర్మార్థం ధర్మకాంక్షీ చ వనం వస్తుమిహాగతః |
త్వాం తు వేదితుమిచ్ఛామి కథ్యతాం కాఽసి కస్య వా ||
19
న హి తావన్మనోజ్ఞాంగీ రాక్షసీ ప్రతిభాసి మే |
ఇహ వా కిం నిమిత్తం త్వమాగతా బ్రూహి తత్త్వతః ||
20
సాఽబ్రవీద్వచనం శ్రుత్వా రాక్షసీ మదనార్దితా |
శ్రూయతాం రామ వక్ష్యామి తత్త్వార్థం వచనం మమ ||
21
అహం శూర్పణఖా నామ రాక్షసీ కామరూపిణీ |
అరణ్యం విచరామీదమేకా సర్వభయంకరా ||
22
రావణో నామ మే భ్రాతా బలీయాన్ రాక్షసేశ్వరః |
వీరో విశ్రవసః పుత్రో యది తే శ్రోత్రమాగతః ||
23
ప్రవృద్ధనిద్రశ్చ సదా కుంభకర్ణో మహాబలః |
విభీషణస్తు ధర్మాత్మా న తు రాక్షసచేష్టితః ||
24
ప్రఖ్యాతవీర్యౌ చ రణే భ్రాతరౌ ఖరదూషణౌ |
తానహం సమతిక్రాంతా రామ త్వాపూర్వదర్శనాత్ ||
25
సముపేతాఽస్మి భావేన భర్తారం పురుషోత్తమమ్ |
అహం ప్రభావసంపన్నా స్వచ్ఛందబలగామినీ ||
26
చిరాయ భవ మే భర్తా సీతయా కిం కరిష్యసి |
వికృతా చ విరూపా చ న చేయం సదృశీ తవ ||
27
అహమేవానురూపా తే భార్యారూపేణ పశ్య మామ్ |
ఇమాం విరూపామసతీం కరాలాం నిర్ణతోదరీమ్ ||
28
అనేన తే సహ భ్రాత్రా భక్షయిష్యామి మానుషీమ్ |
తతః పర్వతశృంగాణి వనాని వివిధాని చ ||
29
పశ్యన్సహ మయా కాంత దండకాన్విచరిష్యసి |
ఇత్యేవముక్తః కాకుత్స్థః ప్రహస్య మదిరేక్షణామ్ ||
30
ఇదం వచనమారేభే వక్తుం వాక్యవిశారదః ||
31
Aranya Kanda Sarga 17 In Telugu Pdf Download
రాముడు ఆశ్రమానికి వచ్చిన తరువాత అగ్నిహోత్రము మొదలగు కార్యములు నిర్వర్తించాడు. సీతతో, లక్ష్మణునితోనూ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆశ్రమము బయట కూర్చుని ఉన్నాడు. ఇంతలో జటాయువు వారి వద్దకు వచ్చాడు.
“రామా! నేను ఇక్కడకు వచ్చి చాలాకాలము అయినది. నాకు నా బంధువులను, మిత్రులను చూడవలెనని కోరికగా ఉన్నది. నేను పోయి నా బంధుమిత్రులను చూచి వెంటనే వస్తాను. అనుజ్ఞ ఇవ్వండి.” అని అడిగాడు. రాముడు సంతోషంతో సమ్మతించాడు. జటాయువు వెళ్లిపోయాడు.
కొంత సేపు తరువాత ఒక రాక్షస స్త్రీ ఆ ప్రదేశమునకు వచ్చింది. ఆమె పేరు శూర్పణఖ. రావణుని చెల్లెలు. ఆమె అక్కడకు వచ్చి రాముని చూచింది. బలిష్టమైన బాహువులతో, సింహము వక్షస్థలము వలె విశాలమైన వక్షస్థలముతో, తామర రేకుల వంటి కన్నులతో, ఆజానుబాహుడైన రాముని చూచింది. జగన్మోహనాకారుడైన రాముని చూచి శూర్పణఖ మోహపరవశురాలయింది. మన్మధుడు ఆమె మీద పుష్పబాణములు ప్రయోగించాడు.
రాముని మొహం చాలా అందంగా ఉంటే, శూర్పణఖ ముఖం వికృతంగా ఉంది. రాముని నడుము సన్నగా ఉంటే, ఆమెది బానపొట్ట. రాముని కళ్లు విశాలంగా ఉంటే, ఆమె కళ్లు వికృతంగా ఉన్నాయి. రాముని జుట్టు అందంగా ఉంటే ఆమె జుట్టు ఎర్రగా వికారంగా ఉంది. రామునిది మోహనాకారమైతే ఆమెది వికారరూపము.
రాముని కంఠస్వరము మధురంగా ఉంటే ఆమె కంఠధ్వని గార్ధభమును తలపిస్తూ ఉంది. రాముడు నవయౌవనుడు. ఆమె వయసుమళ్లిన స్త్రీ. రాముని మాటలు మృదువుగా ఉంటే ఆమె భాష గ్రామ్యంగా కఠోరంగా ఉంది. రాముని ప్రవర్తన ధర్మపరంగా ఉంటే ఆమెది అధర్మ ప్రవర్తన.
రాముని చూస్తే ఆనందం కలిగితే ఆమెను చూస్తే ఏహ్యభావము కలుగుతూఉంది. ఇలా హస్తిమశకాంతర వైవిధ్యము ఉన్న శూర్పణఖ రాముని చూచి మోహించింది.
తన సహజరూపంతో పోతే రాముడు తనను వరించడని, వెంటనే తన రూపంమార్చింది. నవయౌవన వతిగా తయారయింది. రాముని సమీపించింది.
“ఓ సుందరాకారా! నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు? ఈమె నీ భార్య అనుకుంటాను. భార్యాసమేతంగా భయంకరమైన ఈ అడవిలో ఎందుకు ఉన్నావు. నీ వాలకం చూస్తుంటే నీవు గృహస్తులా లేవే. జటాజూటములు ధరించి ముని కుమారుని వలె ఉన్నావు. నీ చేతిలో ఉన్న ధనుర్బాణములను బట్టి నీవు క్షత్రియుడవు అని తెలుస్తూ ఉంది. ఇంతకూ నీవు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏ పనిమీద వచ్చావు? నిజం చెప్పు.” అని నిలదీసింది శూర్పణఖ.
అప్పుడు రాముడు ఆమెతో ఇలా అన్నాడు. “ఓ తరుణీ! నా పేరు రాముడు. నేను అయోధ్యాధీశుడు దశరథుని కుమారుడను. ఈమె నాభార్య సీత. అతను నా తమ్ముడు లక్ష్మణుడు. మీము మా తండ్రిగారి ఆజ్ఞమేరకు వనవాసము చేస్తున్నాము. ఇంతకూ నీవు ఎవరు? నీ నివాసము ఎక్కడ? నీ భర్తపేరు ఏమిటి?” అని అడిగాడు రాముడు. దానికి శూర్పణఖ ఇలా బదులు చెప్పింది.
“ఓరామా! నేను ఒక రాక్షస స్త్రీని. నా పేరు శూర్పణఖ. నేను రాక్షస స్త్రీని అయినా నేను కామరూపము ధరించు శక్తి కలదానను. ఈ అరణ్యమే నా నివాసము. విశ్రవసుని కుమారుడు రావణుడు నా అన్న. మహా పరాక్రమ వంతుడు. నీవు ఆయన గురించి వినేవుంటావు. ఆయన తమ్ముడు, మహాబలవంతుడైన కుంభకర్ణుడు.
ఎల్లప్పుడూ నిద్రాదేవిని సేవిస్తుంటాడు. రాక్షస వంశములో తప్పపుట్టిన వాడు విభీషణుడు. ఆయన కూడా నా సోదరుడే. ఇక్కడే జనస్థానములో నివాసము ఏర్పరచుకున్న ఖరుడు, దూషణుడు కూడా నా సోదరులే. నేనువారి వద్దనే ఉంటున్నాను.
తొలిసారిగా అతిలోకమన్మధాకారుడవైన నిన్ను చూచాను. నీ మోహంలో పడ్డాను. నిన్ను ప్రేమించాను. నా మనసులో నువ్వే నా భర్తవు అని అనుకొన్నాను. దానికి తిరుగులేదు. ఈమె నీ భార్య అంటున్నావు. నేను ఉన్నానుగా. ఇంకా ఈమెతో నీకు ఏం పని. నా అందంతో పోలిస్తే ఈసీత వికారంగా ఉంది కదూ! ఈమెను వదిలెయ్యి.
నువ్వు ఊ అంటే నేను ఈమెను నీ తమ్ముని విరుచుకొని తింటాను. తరువాత మనం ఇద్దరం ఈ అరణ్యములో, పర్వతశిఖరములలో ఆనందంగా విహరిద్దాము. నాతో వచ్చెయ్యి” అని పలికింది శూర్పణఖ.
(శూర్పణఖ మాటలు వింటుంటే మీకు ఏమనిపిస్తూ ఉంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్స్టెట్ శూర్పణఖతోనే మొదలయిందా అనిపించడం లేదూ!
ఇంకా చూడండి….ఈ కాలం కుర్రాళ్లు అనేమాట….. “నేను నిన్ను చూడగానే ఫిక్స్ అయ్యాను. ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమించాలి, నేను ఫిక్స్ అయ్యానుగా….. తప్పదు. లేకుంటే ఆసిడ్ పోస్తా, బ్లేడుతో గొంతుకోస్తా. నాకు దక్కనిది వేరే ఎవరికీ దక్కడానికి వీలులేదు. అడ్డం వచ్చిన వాళ్లని నరుకుతా” ఇవే కదా నేటి డైలాగులు.
ఈ తరహా ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి. ఇది శూర్పణఖతోనే మొదలయినట్టుంది. ఈ నాటిదాకా కొనసాగుతూ ఉంది. నాడు శూర్పణఖ కూడా తాను రాముడికి ఇష్టమా లేదా అని ఆలోచించలేదు. ఈ నాడు కూడా కుర్రాళ్లు తనంటే ఆ అమ్మాయికి ఇష్టమా లేదా అని ఆలోచించరు.
ఏదో ఒక లాగ లైన్ లో పెట్టడానికీ, బుట్టలో వేసుకోడానికి ప్రయత్నిస్తారు. లేకపోతే ఉందిగా అంటారు. అదీకాకపోతే చంపడం, చావడం. దీనికి ప్రతీక శూర్పణఖ కామం. దీనిని లవ్ అనరు. కామం(లస్ట్) అంటారు. అది తెలుసుకోవాలి.)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదిహేడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
అరణ్యకాండ అష్టాదశః సర్గః (18) >>