రామాయణంలోని అయోధ్యాకాండ ద్వినవతితమ (92వ) సర్గలో, మంత్రుడు భరతుని వద్దకు చేరి, దశరథ మహారాజు మరణాన్ని, రాముని అరణ్యవాసాన్ని తెలిపాడు. భరతుడు, ఈ వార్త విని గుండె పగిలినట్టు బాధపడతాడు. ఆతరువాత భరతుడు, సతీమణి మాండవితో కలసి అయోధ్యకు ప్రయాణిస్తాడు. అక్కడ, రాజభవనం వదలి సుమంత్రుడు, వసిష్ఠుడు మరియు ఇతర మంత్రులు భరతుని స్వాగతం పలుకుతారు. భరతుడు, కైకేయిని చూడగానే, ఆమె కృత్యాన్ని ధిక్కరిస్తాడు. వసిష్ఠుడు, భరతుని రాముని పిలవడానికి, సింహాసనం పైకి తీసుకురావడానికి సూచిస్తాడు. ఈ సర్గ భరతుని ధర్మబద్ధత, రామునిపై ప్రేమను, అయోధ్య ప్రజల దుఃఖాన్ని తెలుపుతుంది.
భరద్వాజామంత్రణమ్
తతస్తాం రజనీం వ్యుష్య భరతః సపరిచ్ఛదః |
కృతాతిథ్యో భరద్వాజం కామాదభిజగామ హ || ౧ ||
తమృషిః పురుషవ్యాఘ్రం ప్రాంజలిం ప్రేక్ష్య చాగతమ్ |
హుతాగ్నిహోత్రో భరతం భరద్వాజోఽభ్యభాషత || ౨ ||
కచ్చిదత్ర సుఖా రాత్రిస్తవాస్మద్విషయే గతా |
సమగ్రస్తే జనః కచ్చిదాతిథ్యే శంస మేఽనఘ || ౩ ||
తమువాచాంజలిం కృత్వా భరతోఽభిప్రణమ్య చ |
ఆశ్రమాదభినిష్క్రాంతమృషిముత్తమతేజసమ్ || ౪ ||
సుఖోషితోఽస్మి భగవన్ సమగ్రబలవాహనః |
తర్పితః సర్వకామైశ్చ సామాత్యో బలవత్త్వయా || ౫ ||
అపేతక్లమసంతాపాః సుభిక్షాః సుప్రతిశ్రయాః |
అపి ప్రేష్యానుపాదాయ సర్వే స్మ సుసుఖోషితాః || ౬ ||
ఆమంత్రయేఽహం భగవన్ కామం త్వామృషిసత్తమః |
సమీపం ప్రస్థితం భ్రాతుర్మైత్రేణేక్షస్వ చక్షుషా || ౭ ||
ఆశ్రమం తస్య ధర్మజ్ఞ ధార్మికస్య మహాత్మనః |
ఆచక్ష్వ కతమో మార్గః కియానితి చ శంస మే || ౮ ||
ఇతి పృష్టస్తు భరతం భ్రాతృదర్శనలాలసమ్ |
ప్రత్యువాచ మహాతేజాః భరద్వాజో మహాతపాః || ౯ ||
భరతార్ధతృతీయేషు యోజనేష్వజనే వనే |
చిత్రకూటో గిరిస్తత్ర రమ్యనిర్దరకాననః || ౧౦ ||
ఉత్తరం పార్శ్వమాసాద్య తస్య మందాకినీ నదీ |
పుషిపతద్రుమసంఛన్నా రమ్యపుష్పితకాననా || ౧౧ ||
అనంతరం తత్సరితశ్చిత్రకూటశ్చ పర్వతః |
తయోః పర్ణకుటీ తాత తత్ర తౌ వసతో ధ్రువమ్ || ౧౨ ||
దక్షిణేనైవ మార్గేణ సవ్యదక్షిణమేవ వా |
గజవాజిరథాకీర్ణాం వాహినీం వాహినీపతే || ౧౩ ||
వాహయస్వ మహాభాగ తతో ద్రక్ష్యసి రాఘవమ్ |
ప్రయాణమితి తచ్ఛ్రుత్వా రాజరాజస్య యోషితః || ౧౪ ||
హిత్వా యానాని యానార్హాః బ్రాహ్మణం పర్యవారయన్ |
వేపమానా కృశా దీనా సహ దేవ్యా సుమిత్రయా || ౧౫ ||
కౌసల్యా తత్ర జగ్రాహ కరాభ్యాం చరణౌ మునేః |
అసమృద్ధేన కామేన సర్వలోకస్య గర్హితా || ౧౬ ||
కైకేయీ తస్య జగ్రాహ చరణౌ సవ్యపత్రపా |
తం ప్రదక్షిణమాగమ్య భగవంతం మహామునిమ్ || ౧౭ ||
అదూరాద్భరతస్యైవ తస్థౌ దీనమనాస్తదా |
తతః పప్రచ్ఛ భరతం భరద్వాజో దృఢవ్రతః || ౧౮ ||
విశేషం జ్ఞాతుమిచ్ఛామి మాతౄణాం తవ రాఘవ |
ఏవముక్తస్తు భరతో భరద్వాజేన ధార్మికః || ౧౯ ||
ఉవాచ ప్రాంజలిర్భూత్వా వాక్యం వచనకోవిదః |
యామిమాం భగవన్ దీనాం శోకానశనకర్శితామ్ || ౨౦ ||
పితుర్హి మహిషీం దేవీం దేవతామివ పశ్యసి |
ఏషా తం పురుషవ్యాఘ్రం సింహవిక్రాంతగామినమ్ || ౨౧ ||
కౌసల్యా సుషువే రామం ధాతారమదితిర్యథా |
అస్యావామభుజం శ్లిష్టా యైషా తిష్ఠతి దుర్మనాః || ౨౨ ||
కర్ణికారస్య శాఖేవ శీర్ణపుష్పా వనాంతరే |
ఏతస్యాస్తు సుతౌ దేవ్యాః కుమారౌ దేవవర్ణినౌ || ౨౩ ||
ఉభౌ లక్ష్మణశత్రుఘ్నౌ వీరౌ సత్యపరాక్రమౌ |
యస్యాః కృతే నరవ్యాఘ్రౌ జీవనాశమితో గతౌ || ౨౪ ||
రాజపుత్రవిహీనశ్చ స్వర్గం దశరథో గతః |
క్రోధనామకృతప్రజ్ఞాం దృప్తాం సుభగమానినీమ్ || ౨౫ ||
ఐశ్వర్యకామాం కైకేయీమనార్యామార్యరూపిణీమ్ |
మమైతాం మాతరం విద్ధి నృశంసాం పాపనిశ్చయామ్ || ౨౬ ||
యతోమూలం హి పశ్యామి వ్యసనం మహదాత్మనః |
ఇత్యుక్త్వా నరశార్దూలో బాష్పగద్గదయా గిరా || ౨౭ ||
స నిశశ్వాస తామ్రాక్షో నాగః క్రుద్ధ ఇవ శ్వసన్ |
భరద్వాజో మహర్షిస్తం బ్రువంతం భరతం తథా || ౨౮ ||
ప్రత్యువాచ మహాబుద్ధిరిదం వచనమర్థవత్ |
న దోషేణావగంతవ్యా కైకేయీ భరత త్వయా || ౨౯ ||
రామప్రవ్రాజనం హ్యేతత్ సుఖోదర్కం భవిష్యతి |
దేవానాం దానవానాం చ ఋషీణాం భావితాత్మనామ్ || ౩౦ ||
హితమేవ భవిష్యద్ధి రామప్రవ్రాజనాదిహ |
అభివాద్య తు సంసిద్ధః కృత్వా చైనం ప్రదక్షిణమ్ || ౩౧ ||
ఆమంత్ర్య భరతః సైన్యం యుజ్యతామిత్యచోదయత్ |
తతో వాజిరథాన్యుక్త్వా దివ్యాన్హేమపరిష్కృతాన్ || ౩౨ ||
అధ్యారోహత్ప్రయాణార్థీ బహూన్బహువిధో జనః |
గజకన్యా గజాశ్చైవ హేమకక్ష్యాః పతాకినః || ౩౩ ||
జీమూతా ఇవ ఘర్మాంతే సఘోషాః సంప్రతస్థిరే |
వివిధాన్యపి యానాని మహాంతి చ లఘూని చ || ౩౪ ||
ప్రయయుః సుమహార్హాణి పాదైరేవ పదాతయః |
అథ యానప్రవేకైస్తు కౌసల్యాప్రముఖాః స్త్రియః || ౩౫ ||
రామదర్శనకాంక్షిణ్యః ప్రయయుర్ముదితాస్తదా |
చంద్రార్కతరుణాభాసాం నియుక్తాం శిబికాం శుభామ్ || ౩౬ ||
ఆస్థాయ ప్రయయౌ శ్రీమాన్ భరతః సపరిచ్ఛదః |
సా ప్రయాతా మహాసేనా గజవాజిరథాకులా || ౩౭ ||
దక్షిణాం దిశమావృత్య మహామేఘ ఇవోత్థితః |
వనాని తు వ్యతిక్రమ్య జుష్టాని మృగపక్షిభిః |
గంగాయాః పరవేలాయాం గిరిష్వపి నదీషు చ || ౩౮ ||
సా సంప్రహృష్టద్విజవాజియోధా
విత్రాసయంతీ మృగపక్షిసంఘాన్ |
మహద్వనం తత్ప్రతిగాహమానా
రరాజ సేనా భరతస్య తత్ర || ౩౯ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్వినవతితమః సర్గః || ౯౨ ||
Ayodhya Kanda Sarga 92 Meaning In Telugu
మరునాడు తెల్లవారింది. భరతుడు భరద్వాజుని వద్దకు పోయి రాముని వద్దకు పోవుటకు ఆయన అనుమతి కోరాడు. అప్పుడే అగ్నికార్యము ముగించుకొని కూర్చుని ఉన్న భరద్వాజుని ఎదుట చేతులు జోడించి నిలబడ్డాడు భరతుడు.
“ఓ భరతా! నీవు నీ పరివారమూ రాత్రి సుఖంగా గడిపారా! మీకు మా ఆతిథ్యము సంతోషాన్ని కలిగించిందా! మీరు మా ఆతిథ్యముతో తృప్తి చెందారా!” అని అడిగాడు భరద్వాజుడు.
“మహర్షీ! తమరు మాకు ఇచ్చిన ఆతిథ్యము మాకు మా పరివారమునకు ఎంతో సంతోషము కలిగించింది. మా వారందరూ
హాయిగా భుజించి నిద్రించారు. నేను నా రాముని వద్దకు పోవడానికి తమరి అనుమతి కోరుతున్నాను. రాముడు ఎక్కడ ఆశ్రమము నిర్మించుకున్నాడో, అది ఇక్కడికి ఎంత దూరం ఉన్నదో, అక్కడకు పోవడానికి మార్గము ఏమిటో తెలియజేయవలసినదిగా కోరుతున్నాను.” అని అడిగాడు భరతుడు.
“ఓ భరతా! ఇక్కడికి మూడున్నర క్రోసుల దూరములో చిత్రకూటము అనే పర్వతము ఉంది. అక్కడే మందాకినీ నది ప్రహిస్తూ ఉంది. అక్కడ ఒక నిర్జన ప్రదేశములో రాముడు పర్ణశాలను నిర్మించుకొని నివసిస్తున్నాడు. నీవు ఇక్కడినుండి నీ సేనలతో, పరివారముతో, దక్షిణముగా గానీ, నైఋతి దిశగా గానీ ప్రయాణం చేస్తే రాముని పర్ణశాలకు చేరుకుంటావు.” అని చెప్పాడు భరద్వాజుడు.
ఇంతలో దశరథుని భార్యలు అక్కడకు చేరుకున్నారు. అందరూ భరద్వాజుని కాళ్లకు నమస్కరించారు. “భరతా!నీ తల్లులను నాకు పరిచయం చెయ్యి” అని అడిగాడు భరద్వాజుడు.
“ఓ మహర్షీ! దీనంగా ఉండి ఉపవాసములతో శరీరం శుష్కింప చేసుకున్న ఈమె దశరథమహారాజు పట్టమహిషి కౌసల్యాదేవి. రాముని కన్న పుణ్యమూర్తి. ఆమెకు ఎడమ పక్కగా నిలబడి ఉన్న ఆమె లక్ష్మణ, శత్రుఘ్నుల తల్లి సుమిత్ర. వారి పక్కనే తలవంచుకొని ఉన్న ఆమె నా తల్లి కైకేయి. కోపస్వభావురాలు. ఏ మాత్రమూ వివేచన లేనిది. గర్విష్ఠి. అందము, ఐశ్యర్యము, అధికారమునకే ప్రాధాన్యం ఇస్తూ వాటి కోసరం ఏమి చెయ్యడానికైనా వెనుకాడని వ్యక్తి. ఈమె కారణంగానే నా అన్న రాముడు అడవుల పాలయ్యాడు. నా తండ్రి అకాలమృత్యువు వాత పడ్డాడు. నేను ఈనాడు పడుతున్న ఇన్ని బాధలకు ఈమెయే మూలకారణము.” అని అన్నాడు భరతుడు.
భరతుని మాటలు సావధానముగా విన్న భరద్వాజుడు ఇలాఅన్నాడు. “ఓ భరతా! అలా మాట్లాడకూడదు. ఇందులో నీ తల్లి దోషము ఏమాత్రమూ లేదు. రాముని అరణ్యవాసము భవిష్యత్తులో ఎన్నో శుభములకు సూచన మాత్రమే. నీ కైక కేవలము నిమిత్త మాత్రురాలు. రాముడు అరణ్యములకు రావడం వలన ఇక్కడ ఉన్న మునులకు, ఋషులకు, దేవతలకు హితము చేకూరుతుంది.’ అని పలికాడు భరద్వాజుడు.
తరువాత భరతుడు ఆయనకు నమస్కరించి ప్రయాణము నకు సిద్ధం కమ్మని తన సైన్యమునకు ఆదేశాలు ఇచ్చాడు. అందరూ తమ తమ రథములను ఎక్కారు. సైన్యం కదిలింది. వారు దక్షిణ దిక్కుగా ప్రయాణం సాగించారు. కొండలు గుట్టలుదాటిప్రయాణము చేస్తున్నారు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.