Aranya Kanda Sarga 20 In Telugu – అరణ్యకాండ వింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” వింశః సర్గలో, పద్నాలుగు రాక్షసులు శూర్పణఖచే మార్గనిర్దేశం చేయబడిన రాముని కుటీరానికి చేరుకుంటారు మరియు వారు రాముడితో యుద్ధం చేస్తారు, అందులో రాముడు వారి ఆయుధాలన్నింటినీ నాశనం చేస్తాడు మరియు వారందరినీ నాశనం చేస్తాడు. ఈ ఓటమిని చూసిన శూర్పణఖ ఓటమిని నివేదించడానికి తన సోదరుడి వద్దకు తిరిగి వెళుతుంది.

చతుర్దశరక్షోవధః

తతః శూర్పణఖా ఘోరా రాఘవాశ్రమమాగతా |
రక్షసామాచచక్షే తౌ భ్రాతరౌ సహ సీతయా ||

1

తే రామం పర్ణశాలాయాముపవిష్టం మహాబలమ్ |
దదృశుః సీతయా సార్ధం వైదేహ్యా లక్ష్మణేన చ ||

2

తాన్ దృష్ట్వా రాఘవః శ్రీమానాగతాం తాం చ రాక్షసీమ్ |
అబ్రవీద్భ్రాతరం రామో లక్ష్మణం దీప్తతేజసమ్ ||

3

ముహూర్తం భవ సౌమిత్రే సీతాయాః ప్రత్యనంతరః |
ఇమానస్యా వధిష్యామి పదవీమాగతానిహ ||

4

వాక్యమేతత్తతః శ్రుత్వా రామస్య విదితాత్మనః |
తథేతి లక్ష్మణో వాక్యం రామస్య ప్రత్యపూజయత్ ||

5

రాఘవోఽపి మహచ్చాపం చామీకరవిభూషితమ్ |
చకార సజ్యం ధర్మాత్మా తాని రక్షాంసి చాబ్రవీత్ ||

6

పుత్రౌ దశరథస్యావాం భ్రాతరౌ రామలక్ష్మణౌ |
ప్రవిష్టౌ సీతయా సార్ధం దుశ్చరం దండకావనమ్ ||

7

ఫలమూలాశనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ |
వసంతౌ దండకారణ్యే కిమర్థముపహింసథ ||

8

యుష్మాన్పాపాత్మకాన్ హంతుం విప్రకారాన్ మహాహవే |
ఋషీణాం తు నియోగేన ప్రాప్తోఽహం సశరాయుధః ||

9

తిష్ఠతైవాత్ర సంతుష్టా నోపావర్తితుమర్హథ |
యది ప్రాణైరిహార్థో వా నివర్తధ్వం నిశాచరాః ||

10

తస్య తద్వచనం శ్రుత్వా రాక్షసాస్తే చతుర్దశ |
ఊచుర్వాచం సుసంక్రుద్ధా బ్రహ్మఘ్నాః శూలపాణయః ||

11

సంరక్తనయనా ఘోరా రామం సంరక్తలోచనమ్ |
పరుషం మధురాభాషం హృష్టా దృష్టపరాక్రమమ్ ||

12

క్రోధముత్పాద్య నో భర్తుః ఖరస్య సుమహాత్మనః |
త్వమేవ హాస్యసే ప్రాణానద్యాస్మాభిర్హతో యుధి ||

13

కా హి తే శక్తిరేకస్య బహూనాం రణమూర్ధని |
అస్మాకమగ్రతః స్థాతుం కిం పునర్యోద్ధుమాహవే ||

14

ఏహి బాహుప్రయుక్తైర్నః పరిఘైః శూలపట్టిశైః |
ప్రాణాంస్త్యక్ష్యసి వీర్యం చ ధనుశ్చ కరపీడితమ్ ||

15

ఇత్యేవముక్త్వా సంక్రుద్ధా రాక్షసాస్తే చతుర్దశ |
ఉద్యతాయుధనిస్త్రింశా రామమేవాభిదుద్రువుః ||

16

చిక్షిపుస్తాని శూలాని రాఘవం ప్రతి దుర్జయమ్ |
తాని శూలాని కాకుత్స్థః సమస్తాని చతుర్దశ ||

17

తావద్భిరేవ చిచ్ఛేద శరైః కాంచనభూషణైః |
తతః పశ్చాన్మహాతేజా నారాచాన్ సూర్యసన్నిభాన్ ||

18

జగ్రాహ పరమక్రుద్ధశ్చతుర్దశ శిలాశితాన్ |
గృహీత్వా ధనురాయమ్య లక్ష్యానుద్దిశ్య రాక్షసాన్ ||

19

ముమోచ రాఘవో బాణాన్ వజ్రానివ శతక్రతుః |
రుక్మపుంఖాశ్చ విశిఖా దీప్తా హేమవిభూషితాః ||

20

తే భిత్త్వా రక్షసాం వేగాద్వక్షాంసి రుధిరాప్లుతాః |
వినిష్పేతుస్తదా భూమౌ న్యమజ్జంతాశనిస్వనాః ||

21

తే భిన్నహృదయా భూమౌ ఛిన్నమూలా ఇవ ద్రుమాః |
నిపేతుః శోణితార్ద్రాంగా వికృతా విగతాసవః ||

22

తాన్ దృష్ట్వా పతితాన్ భూమౌ రాక్షసీ క్రోధమూర్ఛితా |
పరిత్రస్తా పునస్తత్ర వ్యసృజద్భైరవస్వనాన్ ||

23

సా నదంతీ మహానాదం జవాచ్ఛూర్పణఖా పునః |
ఉపగమ్య ఖరం సా తు కించిత్సంశుష్కశోణితా ||

24

పపాత పునరేవార్తా సనిర్యాసేవ సల్లకీ |
భ్రాతుః సమీపే శోకార్తా ససర్జ నినదం మహుః |
సస్వరం ముమోచే బాష్పం విషణ్ణవదనా తదా ||

25

నిపాతితాన్ దృష్య రణే తు రాక్షసాన్
ప్రధావితా శూర్పణఖా పునస్తతః |
వధం చ తేషాం నిఖిలేన రక్షసాం
శశంస సర్వం భగినీ ఖరస్య సా ||

26

Aranya Kanda Sarga 20 In Telugu Pdf Download

శూర్పణఖ ఆ పదునాలుగు మంది రాక్షస వీరులను రాముని పర్ణశాలకు తీసుకొని వెళ్లింది. పర్ణశాల ముందు కూర్చుని ఉన్న రామలక్ష్మణులను వారికి చూపించింది. ఆ రాక్షసులు బలవంతులైన రామలక్ష్మణులను, సౌందర్యరాసి అయిన సీతను చూచారు.

రాముడు కూడా శూర్పణఖ వెంట వచ్చిన రాక్షసులను చూచాడు. లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! నేను వెళ్లి ఆ రాక్షసులను సంహరించి వస్తాను. నీవు ఇక్కడే ఉండి సీతను రక్షిస్తూ ఉండు.” అని అన్నాడు.

లక్ష్మణుడు సరే అని సీత రక్షణ బాధ్యతను స్వీకరించాడు. రాముడు తన ధనుస్సుకు నారిని సంధించాడు. ఆ రాక్షసులను చూచి ఇలా అన్నాడు.

“ఓ రాక్షసులారా! నా పేరు రాముడు. నా తమ్ముడి పేరు లక్ష్మణుడు. ఆమె నా భార్య సీత. మేము వనవాసము నిమిత్తము ఈ దండకారణ్యములో ప్రవేశించాము. మేము ముని వృత్తిలో ఉన్నాము. కందమూలములు, ఫలములు తింటూ కాలక్షేపము చేస్తున్నాము. మేము గానీ, మా లాంటి తాపసులు కానీ మీకు ఎలాంటి అపకారము చెయ్యలేదు. మీరు ఎందుకు మాబోటి తాపసులను బాధిస్తున్నారు. చంపుతున్నారు. మీలాంటి దుర్మార్గులను చంపడానికే మేము ధనుర్బాణములను ధరించాము. మీకు ప్రాణముల మీద ఆశ ఉంటే వెనక్కు తిరిగి వెళ్లిపోండి. లేకపోతే ఇక్కడే ఉండి మీ ప్రాణాలు పోగొట్టుకోండి.” అని అన్నాడు రాముడు.

ఆ మాటలు విన్న రాక్షస వీరులు కోపంతో ఊగిపోయారు. ఇప్పటి దాకా వారిని చూచి భయపడ్డవారే గానీ, వారిని ఎదిరించి భయపెట్టిన వారు లేరు. అలాంటిది వీళ్లు ఎదిరిస్తున్నారు అంటే కోపం ఆపుకోలేకపోయారు.

“మా ప్రభువు ఖరుడు. నీవు ఆయన చెల్లెలు ముక్కు చెవులు కోసి, అవమానించి, ఆయనకు కోపం తెప్పించావు. నీవు ఇంక బతకడం కల్ల. ఎందుకంటే మేము 14 మంది ఉన్నాము. నీవు ఒక్కడివి. మమ్ములను ఎలా ఎదుర్కొంటావు? మేము కనక మా చేతిలో ఉన్న శూలములు మొదలగు ఆయుధములు నీ మీద ప్రయోగిస్తే నీవు నీ ధనుస్సు వదిలిపారిపోతావు. కాచుకో!” అంటూ ఆ 14 మంది రాక్షసులు రాముని మీదికి తమ తమ ఆయుధములను విసిరారు.

రాముడు ఒక్కొక్క ఆయుధమును ఒక్కొక్కబాణంతో ముక్కలు చేసాడు. తరువాత రాముడు 14 నారాచములను వారి మీద ప్రయోగించాడు. ఆ బాణములు సూటిగా వచ్చి ఆ రాక్షసుల గుండెలను చీల్చివేసాయి. వారి శరీరములు రక్తముతో తడిసి ముద్ద అయినాయి. వారి గుండెలు చీలడంతో, ఆ 14 మంది రాక్షసులు నేల మీద పడి ప్రాణాలు వదిలారు.

శూర్పణఖ ఆశ్చర్యంలో ఆ రాక్షసుల వంక చూచింది. రామలక్ష్మణుల వంక చూచింది. శూర్పణఖకు కోపము, భయము, ఒక్కసారిగా ఆవహించాయి. పెద్దగా అరవడం మొదలు పెట్టింది. అక్కడి నుండి పరుగెత్తింది. ఖరుని వద్దకు పరుగుపరుగున వచ్చింది. ఖరుని ముందు నేల మీద పడి భోరు భోరున ఏడుస్తూ ఉంది.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ ఏకవింశః సర్గః (21) >>

Leave a Comment