Ayodhya Kanda Sarga 95 In Telugu – అయోధ్యాకాండ పంచనవతితమః సర్గః

అయోధ్యాకాండం పంచనవతితమ (95వ) సర్గలో, భరతుడు రాముని పాదుకలు తీసుకుని, అవి రాముని ప్రతీకగా సింహాసనంపై ఉంచి పాలన చేయాలనుకుంటాడు. ఈ సర్గలో, భరతుడు తన తల్లి కైకేయిని క్షమించి, ఆమెను ఆత్మీయంగా అంగీకరిస్తాడు. ప్రజలు భరతుని ధర్మ నిష్ఠను మెచ్చుకుంటారు. తరువాత, భరతుడు వశిష్ఠుడితో కలిసి సర్పసముద్రం అనే ప్రాంతానికి వెళ్ళి రాముని పాదుకలను గౌరవంగా తీసుకుని వస్తాడు. భరతుడు, రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి, రాముడు తిరిగి రాకముందు వరకు తాను పాలనను పర్యవేక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ సర్గ భరతుని విధి నిష్ఠను, రాముడిపై ప్రేమను ప్రతిబింబిస్తుంది.

మందాకినీవర్ణనా

అథ శైలాద్వినిష్క్రమ్య మైథిలీం కోసలేశ్వరః |
అదర్శయచ్ఛుభజలాం రమ్యాం మందాకినీం నదీమ్ || ౧ ||

అబ్రవీచ్చ వరారోహాం చారుచంద్రనిభాననామ్ |
విదేహరాజస్య సుతాం రామో రాజీవలోచనః || ౨ ||

విచిత్రపులినాం రమ్యాం హంససారససేవితామ్ |
కమలైరుపసంపన్నాం పశ్య మందాకినీం నదీమ్ || ౩ ||

నానావిధైస్తీరరుహైర్వృతాం పుష్పఫలద్రుమైః |
రాజంతీం రాజరాజస్య నలినీమివ సర్వతః || ౪ ||

మృగయూథనిపీతాని కలుషాంభాంసి సాంప్రతమ్ |
తీర్థాని రమణీయాని రతిం సంజనయంతి మే || ౫ ||

జటాజినధరాః కాలే వల్కలోత్తరవాససః |
ఋషయస్త్వవగాహంతే నదీం మందాకినీం ప్రియే || ౬ ||

ఆదిత్యముపతిష్ఠంతే నియమాదూర్ధ్వబాహవః |
ఏతే పరే విశాలాక్షి మునయః సంశితవ్రతాః || ౭ ||

మారుతోద్ధూతశిఖరైః ప్రనృత్త ఇవ పర్వతః |
పాదపైః పత్రపుష్పాణి సృజద్భిరభితో నదీమ్ || ౮ ||

క్వచిన్మణినికాశోదాం క్వచిత్పులినశాలినీమ్ |
క్వచిత్సిద్ధజనాకీర్ణాం పశ్య మందాకినీం నదీమ్ || ౯ ||

నిర్ధూతాన్ వాయునా పశ్య వితతాన్పుష్పసంచయాన్ |
పోప్లూయమానానపరాన్ పశ్య త్వం జలమధ్యగాన్ || ౧౦ ||

తాంశ్చాతివల్గువచసో రథాంగాహ్వయనా ద్విజాః |
అధిరోహంతి కళ్యాణి వికూజంతః శుభా గిరః || ౧౧ ||

దర్శనం చిత్రకూటస్య మందాకిన్యాశ్చ శోభనే |
అధికం పురవాసాచ్చ మన్యే చ తవ దర్శనాత్ || ౧౨ ||

విధూతకలుషైః సిద్ధైస్తపోదమశమాన్వితైః |
నిత్యవిక్షోభితజలాం విగాహస్వ మయా సహ || ౧౩ ||

సఖీవచ్చ విగాహస్వ సీతే మందాకినీం నదీమ్ |
కమలాన్యవమజ్జంతీ పుష్కరాణి చ భామిని || ౧౪ ||

త్వం పౌరజనవద్వ్యాలానయోధ్యామివ పర్వతమ్ |
మన్యస్వ వనితే నిత్యం సరయూవదిమాం నదీమ్ || ౧౫ ||

లక్ష్మణశ్చాపి ధర్మాత్మా మన్నిదేశే వ్యవస్థితః |
త్వం చానుకూలా వైదేహి ప్రీతిం జనయథో మమ || ౧౬ ||

ఉపస్పృశంస్త్రిషవణం మధుమూలఫలాశనః |
నాయోధ్యాయై న రాజ్యాయ స్పృహయేఽద్య త్వయా సహ || ౧౭ ||

ఇమాం హి రమ్యాం మృగయూథశాలినీం
నిపీతతోయాం గజసింహవానరైః |
సుపుష్పితైః పుష్పధరైరలంకృతాం
న సోఽస్తి యః స్యాదగతక్లమః సుఖీ || ౧౮ ||

ఇతీవ రామో బహుసంగతం వచః
ప్రియాసహాయః సరితం ప్రతి బ్రువన్ |
చచార రమ్యం నయనాంజనప్రభమ్
స చిత్రకూటం రఘువంశవర్ధనః || ౧౯ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచనవతితమః సర్గః || ౯౫ ||

Ayodhya Kanda Sarga 95 Meaning In Telugu

రాముడు సీతతో కలిసి మందాకినీ నదీ తీరంలో విహరిస్తున్నాడు.
“సీతా! ఈ మందాకినీ నదీతీరము చూడు. ఎంత సుందరముగా ఉన్నదో! ఆఇసుక తిన్నెలు, నదీజలములలో ఈదుచున్న హంసలు, పైన ఎగురుచున్న సారస పక్షులు, జలముల మీద తేలుచున్న పద్మములు ఎంత శోభాయమానముగా ఉన్నవో చూడు! అదుగో ఆ లేళ్ల గుంపులు నదీజలములు తాగుటకు ఎలా వస్తున్నాయోచూడు! ఆవల తీరమున ఋషులు మందాకినీ నదిలో స్నానం చేస్తున్నారు. మరికొందరు సూర్యోపాసన చేస్తున్నారు. సీతా! ఆ చక్రవాక పక్షులు ఎంత మధురంగా కూయుచున్నవో.

ఇంతటి మనోహరముగా ఉన్న ఈ నదీప్రాంతమును విడిచి వెళ్లుటకు మనసు రాకున్నది. అయోధ్య కన్నా ఇక్కడే బాగుంది కదూ! సీతా నీవు కూడా ఈ నదిలో దిగి జలక్రీడలు ఆడుతావా! ఈ చిత్రకూట పర్వతమే అయోధ్య అనుకో. ఈ మందాకినీ నది సరయూనది. హాయిగా నదిలో దిగి జలకాలాడు. నీవు, లక్ష్మణుడు, తోడుగా ఉండగా ఇంతటిసుందర ప్రదేశములలో విహరిస్తూ నేను అయోధ్యనే మరిచిపోతున్నాను. ప్రస్తుతము నాకు అయోధ్య మీద కాని, ఆ రాజ్యము మీద కానీ ఆసక్తి లేదు. ఇక్కడే ఉండాలని ఉంది.” అని అన్నాడు రాముడు.

(ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. రాముడి గురించి వారి వనవిహారము గురించి వాల్మీకి ఇంతగా రాయాల్సిన పనిలేదు. దీని వెనక ఏదో చెప్పాలని ఆయన తాపత్రయం. ఈరోజుల్లో ఉన్న ఊరి నుండి మరో ఊరికి ట్రాన్సఫర్ అయితే చాలు ప్రపంచం మొత్తం మునిగిపోయినట్టు బాధపడుతుంటారు కొందరు. ఉన్న ఊరు వదలడానికి తెగ బాధపడిపోతుంటారు. మరి కొంతమందికి ఏ ఊరిలో ఎన్ని సౌకర్యాలు ఉన్నా తృప్తి ఉండదు. ఏం ఊరు వెధవ ఊరు అని తిడుతూ ఉంటారు. అటువంటి వారికి రాముని వనవాసము ఒక గుణపాఠము.

రాముడు అయోధ్యకు యువరాజు. పుట్టినప్పటినుండి ఎన్నో రాజభోగములు అనుభవించాడు. విధివశాత్తు అరణ్యవాసం చెయ్యాల్సివచ్చింది. సంతోషంగా అడవులకు వచ్చాడు. అరణ్యములోనే సుఖాలను వెతుక్కుంటున్నాడు. అరణ్యమునే అయోధ్యగా మార్చుకున్నాడు. పైగా అరణ్యములోనే ఎక్కువసుఖం ఉందని మనసుకు నచ్చచెప్పుకుంటున్నాడు. ఉన్నదానినతో తృప్తి చెందుతున్నాడు. నిరాశకు నిస్పృహకు చోటు ఇవ్వలేదు.

‘బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్’ అని ఒక సినీ కవి అన్నట్టు, బాధలలో కూడా సుఖాలను వెతుక్కోవడం మానవులకు అలవడాలి. అప్పుడే జీవితం సుఖమయమవుతుంది. ఈ జీవితసత్యాన్ని రాముడు తాను అనుభవించి మనకు తెలియజేస్తున్నాడు. అని నా భావన. అందుకే రాముడు దేవుడు అయ్యాడు.)

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత

అయోధ్యాకాండ షణ్ణవతితమః సర్గః (96)

Leave a Comment